తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం టికెట్‌ కావాలంటే, దగ్గరలోని టీటీడీ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేదు. మొబైల్‌ ఫోన్‌ నుంచే తిరుమల శ్రీవారి రూ.300 దర్శన టికెట్లు, గదుల బుకింగ్, ఈ-హుండీ, ఈ-డొనేషన్‌ సౌకర్యాలు పొందేలా, టీసీఎస్‌ సౌజన్యంతో, టీటీడీ మొబైల్‌ యాప్‌ రూపొందించింది. టీటీడీ–గోవిందా మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు.. మీకు నచ్చిన సమయంలో దర్శనం వివరాలు తెలుసుకోవచ్చు. ఖాళీ ఉంటే వెంటనే ఫోన్‌లోనే బుక్‌ చేసుకోవచ్చు. అదెలాగంటే..

టీటీడీ యాప్‌ను ‘https://play.google.com/store/apps/details?id=com.ttdapp’ ఈ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్‌ చేసుకున్నాక మీ మొబైల్‌కు యాప్‌ ఇన్‌స్టాల్‌ అవుతుంది. యాప్‌ను ఓపెన్‌ చేశాక రిజిస్ట్రేషన్‌కు తగిన వివరాలు అందించాలి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఈ–మెయిల్, ఫోన్‌ నంబరు, ఉంటున్న ప్రదేశం, గుర్తింపు వివరాలు నమోదు చేయాలి.

దర్శనం టికెట్లు బుక్ చెయ్యాలి అంటే..
దర్శన్‌ ఆప్షన్‌లో మీరు ఎంచుకున్న తేదీ, సమయం, భక్తుల సమాచారం అందించాలి. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ అయిన వ్యక్తితో పాటు మరో 9 మంది వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. అయితే, ప్రతి భక్తుడి ఆధార్‌ నంబరు, మరేదైనా గుర్తింపుకార్డు నంబరు అందించాల్సి ఉంటుంది. దర్శనానికి సంబంధించిన వివిధ సమయాలు, ఆ సమయంలో భక్తుల రద్దీ డిస్‌ప్లే అవుతుంది. రద్దీని బట్టీ వారి సమయాన్ని కేటాయించుకోవచ్చు. దర్శనంతోపాటు ప్రత్యేక పూజల వివరాలు కూడా ఉంటాయి. ఆ సమాచారం యాప్‌ ద్వారా తెలుసుకుని దర్శనంతో పాటు పూజలు కూడా నిర్వహించవచ్చు. దర్శనం/పూజ అనంతరం ప్రతి ఒక్కరికీ రెండు అదనపు లడ్డూల చొప్పున యాప్‌ ద్వారానే బుక్‌ చేసుకోవచ్చు. ప్రతి లడ్డూకు రూ.25 అదనంగా చెల్లించాలి.

చెల్లింపుల విధానం: ఆన్‌లైన్‌/యాప్‌ ద్వారా దర్శనం టికెట్‌ రూ.300 ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లేదా క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు జరపాలి. దీనికి సంబంధించి దేశంలోని 44 అంతర్జాతీయ, జాతీయ, కార్పొరేషన్‌ బ్యాంకులతో టీటీడీ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆయా బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి

యాప్‌ వినియోగంలో సమస్యలు వస్తే టీడీటీ 1800245333333, 18002454141 నంబర్లలో లేదా This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

అదేంటి కృష్ణా జిల్లా నుంచి ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు కదా అనుకుంటున్నారా, ఇది చదవండి... పశ్చిమ గోదావరి జల్లా కొవ్వూరు ఎమ్మెల్యే కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్ కు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కింది. అయితే ఆయన స్వగ్రామం, కృష్ణా జిల్లా తిరువూరు మండలం గానుగపాడు. జవహర్ తల్లిదండ్రులు కొత్తపల్లి అమృతం, దానమ్మ కనుమూరుడు. గానుగపాడు, జి.కొతూరు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. తండ్రి అమృతం 2014 ఎన్నికలకు ముందు కన్నుమూశారు. ప్రస్తుతం తల్లి గానుగపాడులో జవహర్ అన్న రవీంద్రనాథ్ వద్ద నివసిస్తున్నారు. కొత్తపల్లి జవహర్ అయిదుగురు అన్నదమ్ముల్లో చివరివాడు. జవహర్ సతీమణి ఉషారాణి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు.

కొత్తపల్లి శ్యామ్యూల్ జవహర్ ఒకటి నుంచి రెండో తరగతి వరకు గానుగపాడు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో, 3 నుంచి 5వ తరగతి వరకు ఖమ్మం, 6వ తరగతి కనుమూరు, 7 నుంచి 10 వరకు గంపలగూడెం మండలం అమ్మిరెడ్డి గూడెం, గుంటూరు ఆంద్రా క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదువుకున్నారు. బీఈడీ విజయవాడ సిద్దార్ధ కళాశాల, హైదరాబాద్లో ఏపీ టూరిజంలో డిప్లోమా పూర్తి చేశారు. 1994లో కొవ్వూరు వెళ్లి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, 1997లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా తన ప్రస్తానం ప్రారంభించారు. నందమూరు పాఠశాలలో పనిచేస్తున్న ఆయనకు 2014లో సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా ఎమ్మెల్యే సీటు కేటాయించగా విజయం సాధించి ప్రస్తుతం మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

వైసీపీ అధినేత జగన్‌ పై మరోసారి ఈడీ కొరడా ఝళిపించింది. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో 100 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. జగన్‌కు చెందిన సూట్‌కేస్‌ కంపెనీల్లో తనిఖీలు చేసింది. ముంబైలో ఒకే అడ్రస్‌తో 700 సూట్‌కేస్‌ కంపెనీలను గుర్తించింది. అలాగే 20 మంది డమ్మీ డైరెక్టర్లుని కూడా గుర్తించింది.

జగన్ సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా రాజేశ్వర్‌ ఎక్స్‌పోర్టు అనే కంపెనీకి డబ్బు వెళ్లినట్టు ఈడీ గుర్తించింది. రాజెశ్వర్ ఎక్స్‌పోర్టు ద్వారా నోట్ల రద్దు టైంలో 1478 కోట్లు హంకాంగ్ మల్లించినట్టు ఈడీ గుర్తించింది. సూట్‌కేస్‌ కంపెనీలతో జగన్‎కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తుంది. త్వరలో ఈ విషయంలో కూడా, జగన్ కు సమన్లు ఇచ్చే అవకాసం ఉంది. ఈ విషయం పై, ఈడీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఇప్పటికే ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జగన్ కు సంబంధించిన వేలాది కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే... జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఇటీవల పిల్ దాఖలైన విషయం కూడా తెలిసిందే..

jagan 14042017 1

ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఉత్సవాలను ఆంగరంగ వైభవంగా న్విహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రూ.550 కోట్లు కేటాయించింది. ఏప్రిల్ 4 నుంచి 14 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కోదండరాముడి కల్యాణం 10న జరగనుంది.

ఒంటిమిట్ల విశిష్టతలెన్నో
సాంఘిక దురాచారాలను రూపుమాపేలా, సమాజంలో అసమానతలు తొలిగేలా దళితులు సైతం గర్భగుడిలో అనాదిగా పూజలు చేస్తున్న గొప్పతనం ఒంటిమిట్ట ఆలయానిది. ప్రతి శుక్రవారం ముస్లింలు కూడా ఈ ఆలయంలో పూజలు చేయడం ప్రత్యేకత. ఏకశిలపై రాముడు, సీత, లక్ష్మణుడు కొలువుదీరి దర్శనమివ్వడం కూడా ఇక్కడ ఒక విశేషం. ఇంకొక విశేషం ఇక్కడ గర్భగుడిలో ఆంజనేయస్వామి వుండరు. ఒక మిట్టమీద నిర్మింపబడ్డ రామాలయం అవటంవల్ల ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది.

11వ శతాబ్దంలో నిర్మించిన అత్యంత పురాతన దేవాలయం కావడం వంటి అనేక విస్థిష్టతలు ఉన్నందునే చంద్రబాబు ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు చేస్తున్నారు. నవమి నాడు ఒంటిమిట్టలో సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రామచంద్రునికి సమర్పిస్తారు.

ఏప్రిల్ ఫస్ట్ వచ్చింది అంటే, పక్కవాళ్ళని ఆట పట్టించి, "ఏప్రిల్ ఫూల్" అంటాం. అల ఎందుకు అంటామో, దాని చరిత్ర ఏంటో తెలుసుకోవాలి అంటే, యూరప్ గురించి చెప్పాలి. 1582వ సంవత్సరం దాక యూరప్ లో నూతన సంవత్సర వేడుకలను మార్చి 25 నుంచి ఏప్రిల్ మొదటి తేదీ వరకు, పది రోజుల పాటు గ్రాండ్ గా జరుపుకునే వారు. 1582లో అప్పటి ఫ్రాన్స్ రాజు తొమ్మిదో ఛార్లెస్ అప్పటి వరకు ఫాలో అయిన క్యాలెండర్ ను మార్చేసి, గ్రెగేరియన్ క్యాలెండర్ ను ఆమోదించాడు.

ఈ క్యాలెండర్ కు అనుగుణంగా జనవరి ఒకటో తేదీన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు. కొంతమంది ప్రజలకి రాజుగారి ఆదేశం చేరలేదు. ఈలోగా మళ్లీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజు ఆదేశం ప్రకారం చాలా మంది ప్రజలు జనవరి ఫస్ట్ రోజున కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు. రాజుగారి ఆదేశం తెలియని వాళ్లు పాత పద్ధతిలో ఏప్రిల్ ఫస్ట్ వరకు ఆగి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

న్యూ ఇయర్ గా జనవరి ఫస్ట్ న వేడుకలు చేసుకున్న వాళ్లు, ఏప్రిల్ ఫస్ట్ ను సెలబ్రేషన్స్ చేసుకున్న వాళ్లను ఫూల్స్ అంటూఆటపట్టించారు. పేపర్తో చేప బొమ్మలు తయారుచేసి వాళ్ల వెనక భాగాన కట్టి ఆటపట్టించేవాళ్లు. గేలానికి దొరికే చేపలకింద జమ కట్టేవాళ్లు. ఏప్రిల్ ఫిష్ అంటూ ఆటపట్టించేవాళ్లు. ఇదే కాలక్రమంలో ఏప్రిల్ ఫూల్స్ డే గా మారిపోయింది. ఇలా ఆటపట్టించే విధానం తరువాత ప్రపంచం అంతా పాకింది. ఇదీ ఏప్రిల్ ఫూల్స్ డే హిస్టరీ.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read