తిరుమల శ్రీవారి రూ.౩౦౦ దర్శన టిక్కెట్లను ఇకపై మరింత సులువుగా బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసంTTD ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు కేవలం TTD వెబ్ సైట్ లో మాత్రమే టిక్కెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కాని, ఇకపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని ఏటీపీ కేంద్రాల్లో శ్రీవారి రూ.౩౦౦ దర్శన టిక్కెట్లను అందుబాటులోకి తెస్తున్నామని TTD ఈవో సాంబశివరావు పేర్కొన్నారు.

తక్కువ చార్జీతో రూ.300 టిక్కెట్ ను బుక్ చేసుకోవచ్చని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో సుమారు  ఏటీపీ సెంటర్లు ఉన్నాయని, వీటితో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం వారికి శాఖలు ఉన్నాయన్నారు. ఆయా  ఏటీపీ సెంటర్ల ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్న సాంబశివరావు, ప్రైవేటు ఇంటర్నెట్ నిర్వాహకులు భక్తుల నుంచి ఎక్కువ సొమ్ము వసూలు చేస్తున్న నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజే, కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి పై భారం మోపింది. వంట గ్యాస్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బారీగా పెరిగిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. అన్ని గ్యాస్‌ కంపెనీలకు పెరిగిన ధరలు వర్తిస్తాయి.

గృహావసరాలకు సంబంధించిన వంట గ్యాస్‌ 14.2 కిలోల సిలిండర్‌ (డొమెస్టిక్‌)పై రూ. 71.5 కాగా కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.110.5 వరకు పెరిగింది. రూ. 663.00 ఉన్న గ్యాస్, 734.50 పెరగటంతో, ఒకే సారి రూ. 71.5 పెరగటంతో వినియోగదారులపై భారం పడనుంది.

ప్రభుత్వం వసూలు చేసే వివిధ పన్నుల నుండి ఆంధ్రప్రదేశ్ కు 29,138.82 కోట్లు లభించాయి. గత ఏడాది కేంద్రం పన్నుల నుండి ఏ.పీకి లభించిన పన్నుల వాటాతో పోలిస్తే ఇది 2,874.94 కోట్ల అధికం. కేంద్రం మొత్తం పన్నుల్లో రాష్ట్రానికి 4.305 శాతం వాటా లభిస్తుంది. కార్పోరేషన్ పన్ను వాటా కింద 8,538.74 కోట్ల ఆదాయం, పన్ను వాటా కింద 7,504.42 కోట్ల, ఆస్తి పన్ను వాటా కింద 0.27 కోట్లు, కస్టమ్స్ పన్నుల వాటా కింద 4,096.97 కోట్ల, కేంద్ర ఎక్సైజ్ పన్నుల వాటా కింద 4,282.50 కోట్లు, ఇతర పన్నుల వాటా 0.01 కోట్ల సర్వీస్ పన్నుల వాటా కింద 4,671.47 కోట్ల రూపాయలు కేటాయించారు.

పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించే అంశాన్ని నాబార్డ్ రుణంతో ముడిపెట్టడం వలన బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులూ చేయలేదు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ''మీరు చేసిన త్యాగానికి ఏం చేసినా తక్కువే'' అమరావతికి భూములు ఇచ్చిన ప్రజలనుద్దేశించి ఎప్పుడూ చేసే వ్యాఖ్య ఇది. ప్రతి విషయంలోనూ, రాజధాని ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటూ, అండగా ఉంటూ, వాళ్ళ త్యాగానికి సరైన గుర్తింపు ఇచ్చి, వారికి భరోసా ఇస్తూనే ఉన్నారు. ఆ కోవలోనే, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన గ్రామాలకు చెందిన యువతకు ప్రభుత్వం వివిధ రంగాల్లో వృత్తి విద్యలో శిక్షణ ఇస్తుంది. అమరావతి నగర పరిధిలోని 27 రెవెన్యూ గ్రామాల్లోని యువతీ యువకుల్లో నైపుణ్యాభివృద్ధి (స్కిల్‌ డెవల్‌పమెంట్‌)ను పెంచేందుకు ఆంధ్రప్రదేశ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీఆర్డీఏ సంయుక్తంగా ఈ శిక్షణ ఇప్పిస్తుండడం, ఇప్పటికే దీనికింద వివిధ కోర్సుల్లో పలువురు శిక్షణ పొంది, జీవనోపాదికి బాటలు వేసుకోవడం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి లభిస్తున్న స్పందన దృష్ట్యా మలిదశ శిక్షణకు అధికారులు సంకల్పించారు. మంగళగిరి మండలంలోని నవులూరులో ఏర్పాటు చేసిన అమరావతి స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ఇనస్టిట్యూట్‌లో ఈ శిక్షణ ఇస్తారు. పూర్తి ఉచితంగా ఇచ్చే ఈ శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఎటువంటి స్టైపండ్‌ చెల్లించబోమని, ఈ శిక్షణ రాజధాని నగర పరిధిలోని 27 గ్రామాలకు చెందిన యువతీ యువకులకు మాత్రమేనని సీఆర్డీయే కమిషనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తమ గ్రామాల్లోని సీఆర్డీయే కాంపిటెంట్‌ అథారిటీ కార్యాలయంలో లేదా గ్రామ ఫెసిలిటేటర్‌ లేదా 95057 19172, 97000 25833 ఫోన నెంబర్లలో కానీ సంప్రదించవచ్చునన్నారు. శిక్షణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. అన్ని కోర్సులకూ వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 40గా నిర్ణయించారు. అయితే వాటి కాలవ్యవధి, విద్యార్హతలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి.

కోర్సులు ఇవీ...

  • కోర్సుల్లో విద్యార్హతలతో నిమిత్తం లేకుండా ఆసక్తి ఉన్న రాజధాని వాసులెవరైనా శిక్షణ పొందవచ్చు
  • మొబైల్‌ టెక్నీషియన (45 రోజులు)
  • ఏసీ టెక్నీషియన (2 నెలలు)
  • కారు డ్రైవర్‌ (20 రోజులు)
  • బ్యుటీషియన (30 రోజులు)
  • స్కూటర్‌ మెకానిక్‌ (3 నెలలు)

4 నెలలపాటు శిక్షణ కొనసాగే ల్యాండ్‌ సర్వేయర్‌ కోర్సుకు 10వ తరగతి, ఆపైన చదివి ఉండాలన్న అర్హత విధించారు
3 నెలలు ట్రైనింగ్‌ జరిగే ల్యాబ్‌ టెక్నీషియన కోర్సు అభ్యసించేందుకు ఇంటర్‌ (బైపీసీ) చదివిన వారు అర్హులు
శిక్షణ కాలం 2 నెలలుండే అకౌంటెన్సీలో ఇంటర్‌ (సీఈసీ), బీకాం, ఎంకాం, ఎంబీఏ (ఫైనల్‌) చదివిన వారు చేరవచ్చు

కనీవిని ఎరుగని రీతిలో విశ్వంలో చరిత్ర సృష్టించటానికి, సరికొత్త సవాల్ స్వీకరించిన ఇస్రో... నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఒక్క రాకెట్ దూసుకెళ్తేనే నిబిడాశ్చర్యంతో చూస్తాం.. మరి అలాంటిది ఒక్కసారే 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తే.. ఇక ఆ ఆనందానికి ఆకాశమే హద్దవుతుందేమో..! ఈ మహత్తర ఘట్టం మన దేశంలో జరుగుతోందంటే అంతకంటే గర్వ కారణం మరొకటి ఉంటుందా..! ప్రపంచం మొత్తం మన వైపు చూసే ఈ అద్భుత ఘట్టం మరి కొన్ని రోజుల్లో జరగబోతోంది. ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపి ప్రపంచానికే సవాల్ విసరబోతోంది. ఇంతటి అద్భుతానికి వేదిక శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం షార్.

వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో బాహుబలి అవతారమెత్తబోతోంది. మంగళయాన్, చంద్రయాన్1 వంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతం చేసిన ఆత్మ విశ్వాసంతో మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 15వ తేదీన 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఘనత ఏ దేశానికి లేదు. అది మన దేశానికి మాత్రమే దక్కబోతున్న అరుదైన గౌరవం.

తొలి సారిగా ఆ ఖ్యాతి మనకే దక్క బోతోంది.
60వ రాకెట్ ప్రయోగం ద్వారా 104 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ వాహన నౌక ద్వారా నింగిలోకి చేర్చేందుకు రంగం సిద్ధమవుతోంది . సీ 37 వాహన నౌక ద్వారా 3స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. 2016లో పీఎస్ఎల్వీ-34 రాకెట్ ద్వారా 20 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టి షార్ విజయం సాధించింది. ఈ రికార్డును అధిగమించేందుకు ఏకంగా 83 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు షార్ ప్రణాళిక రూపొందించింది.

 

More Articles ...

Advertisements

Latest Articles

Most Read