ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్ కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో ద‌ళిత యువ‌త‌కు స‌బ్సిడీపై 222 క్యాబ్‌లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పంపిణి చేశారు. అమరావతి సచివాలయంలోని త‌న‌ కార్యాలయం వద్ద దళిత యువతకు ఉపాధి కల్పనలో భాగంగా వాహనాల పంపిణీని సీఎం ప్రారంభించారు. ఈసందర్భంగా రూ.20లక్షల విలువ చేసి ఇన్నోవా క్రిష్ట ను రూ.16లక్షలకే ప్రభుత్వం ఇప్పిస్తుందని చంద్రబాబు తెలిపారు. రూ.16 లక్షల్లోనూ రూ. 7లక్షల సబ్సిడీని ప్రభుత్వం భరించనుంద‌న్నారు. రూ. 30 కోట్ల పెట్టుబడితో ఈ వాహనాలను పంపిణి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఎప్పటికప్పుడు డ్రైవింగ్ శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు. ఓలా, ఉబర్ లాంటి సంస్థలతో ఈ యువతను అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. ఒక్కో వాహనం ద్వారా నెల‌కు రూ. 12 వేలు నుంచి రూ.22 వేలు వరకు ఆదాయం లభిస్తుందన్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్నారు. ఈ ఏడాది చివరిలోనే 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, ఏపీ షెడ్యూల్‌ కులాల ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్‌ జూపూడి ప్రభాకర్‌, ముఖ్యకార్యదర్శి రావత్‌, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నివాసం వద్ద కొండచిలువ కలకలం రేపింది. ప్రకాశం బ్యారేజీ దాటాక కరకట్ట మీద నుంచి సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో దీన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించే మార్గంలో రోజూ బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేస్తుంటాయి. ఈ ఉదయం కూడా కరకట్టకు ఇరువైపులా భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తున్నప్పుడు ఆరడుగుల కొండచిలువను వీరు గుర్తించారు. ఆరడుగుల కొండచిలువ అప్పటికే, ఒక కోడిని పట్టింది.

సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది కొండచిలువను పట్టుకుని మంగళగిరి కొండప్రాంతానికి తరలించారు. ఇదే మార్గంలో మరో 10 అడుగుల కొండచిలువ కూడా తిరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.

రాజధాని అమరావతి ప్రాంతంలో, మరో సాఫ్ట్-వేర్ కంపెనీ ఏర్పాటకు సన్నాహాలు జరుగుతున్నాయి. మంగళగిరిలోని ఏపీఐఐసీ ఐటీ పార్క్ లో, వీసాఫ్ట్ టెక్నాలజీస్, డెవలప్-మెంట్ సెంటర్ ఏర్పాటు చేయ్యనుంది. "వీ-సాఫ్ట్ టెక్నాలజీస్" సంస్థ, ప్రపంచ స్థాయిలో ఆర్ధిక సంస్థల ఖాతాదారులకు తమ సాఫ్ట్ వేర్ ద్వారా సాంకేతిక సేవలు అందించే సంస్థ.

స్థానికంగా 400 మంది పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఈ మేరకు, వీసాఫ్ట్ టెక్నాలజీస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. నెల రోజులలో వీసాఫ్ట్ సంస్థ మంగళగిరిలోని ఏపీఐఐసీ ఐటీ పార్క్ 1,882 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యకలాపాలు ప్రారంబించనుంది. స్తానికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ యువతకే, మొత్తం 400 ఉద్యోగాలను ఈ సంస్థ కల్పించనుంది. మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్న తమ సంస్థలో ఉద్యోగాల కోసం 9866699119 నెంబర్ సంప్రదించవలసిందిగా ఆ సంస్థ చైర్మన్ మూర్తి వీరఘంట సూచించారు. మరిన్ని వివరాలకు www.vsoft.co.in వెబ్ సైట్ నుంచి తెలుసుకోవచ్చన్నారు.

వీసాఫ్ట్ టెక్నాలజీస్ చైర్మన్ మూర్తి వీరఘంట మాట్లాడుతూ 20 సంవత్సరాలు కిందట తమ సంస్థను నెలకొల్పామన్నారు. అమెరికాలో తమ సంస్థకు సంబంధించిన డెవలప్-మెంట్ సెంటర్ ఉందని, హైదరాబాద్, రాజమండ్రిలో కూడా తమ డెవలప్-మెంట్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. మంగళగిరిలో ఏర్పాటు చేయబోయే సాఫ్ట్-వేర్ డెవలప్-మెంట్ సెంటర్ భారతదేశంతో పాటు, అమెరికా, ఆఫ్రికా వంటి విదేశాలలో ఉన్న తమ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఖాతాదారులకు సాంకేతిక సేవలు, పరిష్కారాలు అందించటం ద్వారా మరింత విస్తరించనున్నట్లు చెప్పారు. బ్యాంకింగ్ సాఫ్ట్ వేర్ డెవలప్-మెంట్ చేయటానికి, సహకార బ్యాంకుల కార్యకలాపాలకు రానున్న రోజులలో సేవలు అందిస్తామని తెలిపారు.

ప్రధానమంత్రి లక్కీ లక్కీగ్రాహక్ యోజనలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించే లక్కీ డ్రాలో కృష్ణాజిల్లా వత్సవాయి మండలం తళ్ళురు గ్రామానికి చెందిన వృద్దాప్య పెన్షన్ దారు కంచర్ల పుల్లమ్మ నగదు రహిత లావాదేవీలు నిర్వహించినందుకు తన బ్యాంక్ ఖాతాలో లక్ష రూపాయలు జమ అయ్యాయని జిల్లా కలెక్టర్ బాబు ఎ ఆధికారుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. నగదు రహిత లావాదేవీలు జిల్లాలో పెరిగే విధంగా ప్రజలందరూ స్వచ్ఛంధంగా జరిపేందుకు ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. ఇప్పటివరకు జిల్లాకు సంబంధించి కోటి 60 లక్షలు నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన లబ్దిదారులకు లక్కీ డ్రాలో నగదు గెలుపోందారన్నారు. జిల్లాలో లక్ష రూపాయలు నగదు బహుమతి పొందిన వారిలో పుల్లమ్మ రెండవ వారని కలెక్టర్ తెలిపారు.

పౌరసరఫరాల కమీషనర్ వి.రాజశేఖర్ డిజిటల్ లావాదేవీల పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ బాబు ఎ ను జిల్లా వాసి లక్ష రూపాయల నగదు బహుమతి గెలుపొందడం పై ప్రత్యేకంగా ప్రసంశించారు. డిజిటల్ లావాదేవీలలో కృష్ణాజిల్లా దేశానికే ఆదర్శవంతంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని, ఆధికారులు కూడా తమ వంతుగా ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని పౌరసరఫరాల కమీషనర్ వి.రాజశేఖర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు.

వెలగపూడి సచివాలయంలో, ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ సమావేశం ముగిసింది. కాబినెట్ మీటింగ్ లో, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్టుకు 'ఎన్టీఆర్‌ అమరావతి' పేరు పెట్టాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. తిరుపతి ఎయిర్‌పోర్టుకు 'శ్రీ వెంకటేశ్వర ఎయిర్‌పోర్టు'గా నామకరణం చేయాలని కాబినెట్ నిర్ణయించింది.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read