ఆంధ్రప్రదేశ్ పోలీస్, టెక్నాలజీ బాట పడుతుంది... స్మార్ట్‌ పోలీస్‌స్టేషన్ల తో, ప్రజలకి మరిన్ని సేవలు అందించేదుకు సమాయత్తం అవుతుంది... ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా, డీజీపీ సాంబశివరావు, పోలీస్ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. చంద్రబాబు చెప్పిన "విజిబుల్‌ పోలీసింగ్‌ అండ్‌ ఇన్‌ విజిబుల్‌ పోలీస్‌" నినాదానికి అనుగుణంగా సాంబశివరావు గారు పని చేసారు. ఇందులో మొదటి అడుగులో భాగంగా, గుంటూరులోని నగరంపాలెం, పాత గుంటూరు ఆదర్శ పోలీసుస్టేషన్లను ఆదర్శ పోలీస్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ వీటిని ప్రారంభించనున్నారు.

ఇవి ఎలా పని చేస్తాయి ?
ఈ పోలీస్ స్టేషన్లు, మామూలు పోలీస్ స్టేషన్ల లాగా ఉండవు... బిల్డింగ్ లే కాదు, పోలీసుల విధుల నిర్వహణ తీరు కూడా భిన్నంగా. ప్రజలకి అడుగుఅడుగునా మర్యాదగా ఉంటాయి. స్టేషన్ లో అడుగు పెట్టగానే, ఆత్మీయ పలకరింపులతో, సమస్య అడిగి తెలుసుకుని, సంబంధిత విభాగాలకు పంపిస్తారు.

ఈ పోలీస్ స్టేషన్ ఖర్చు ఎంత ?
ఒక్కో స్టేషన్‌ నిర్మాణానికి రూ.1.10 కోట్లు వెచ్చించారు

పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది ?
ఫిర్యాదుదారులు పోలీసుస్టేషన్‌ లోపలికి అడుగుపెట్టగానే రిసెప్షన్‌ కేంద్రంలోని మహిళా కానిస్టేబుల్‌ వారిని ఆహ్వానిస్తారు.

కార్పొరేట్‌ కార్యాలయాలను తలదన్నేలా ఉంటాయి ఈ స్టేషన్ లు. స్టేషన్ మొత్తం ఏడు విభాగాలుగా ఉంటుంది. ప్రతి విభాగానికి ఒక్కో కానిస్టేబుల్‌కు బాధ్యతలు అప్పగిస్తారు. విభాగాల వారీగా డెస్కులు ఉంటాయి.

పోలీసుల ఆహార్యం కూడా, వినూత్నంగా
ఇక్కడ పోలీసులు కూడా వినూత్నంగా కనిపిస్తారు. ఎప్పుడూ వాడే ఖాకీ దుస్తులు ఇక్కడ వాడరు. లేత నీలంరంగు చొక్కా, ముదురు నీలంరంగు ఫ్యాంటు ఈ పోలీసుల యునిఫార్మ్. కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐ వరకు, ఈ డ్రెస్ లోనే ఉంటారు. బయటకు వెళ్ళేప్పుడు మాత్రం, ఖాకీ దుస్తులు ధరిస్తారు. ఇక్కడ పోలీస్ లు, ఖటువుగా ఉండరు, ప్రజలతో మమేకమై వారిలో భరోసా కలిపిస్తారు.

మరిన్ని ప్రత్యేకతలు

  • పోలీసుస్టేషన్‌ మొత్తం మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణం
  • పోలీసుస్టేషన్‌ మొత్తం సెంట్రల్ ఏసీ
  • పోలీసుస్టేషన్‌ ప్రాంగణం బయట, లోపల మొత్తం నిఘా కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది.
  • పోలీసుస్టేషన్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని డిజటలీకరిస్తారు.
  • కంప్యూటర్ సెక్షన్ కు మరో రూం
  • స్టేషన్‌ హౌస్‌ అధికారి, ఎస్సైల కోసం వేర్వేరుగా ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు.
  • స్టేషన్ రైటర్ కు ప్రత్యేక రూం
  • సిబ్బంది విశ్రాంతి కోసం ప్రత్యేకంగా డార్మటరీ ఉంటుంది.
  • కస్టడీ గదిని కూడా ఆధునికీకరంగా తీర్చిదిద్దారు. వాళ్ల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు.

"విజయవాడలో నేవీ షో"... ఈ మాట ఒక నెల రోజుల క్రిందట విన్న నగరవాసులు, నేవీ షో ఏంటి, కృష్ణా నదిలో ఏంటి, అని ఒకింత ఆశ్చర్యపోయారు. చంద్రబాబు ఏమి చెప్తున్నారో, ఆయనకైనా అర్ధం అవుతుందా అని ఎగతాళి చేశారు... కట్ చేస్తే, 3 రోజుల పాటు జరిగిన నేవీ షో గ్రాండ్ సక్సెస్ అయ్యింది... మరో సారి చంద్రబాబు తన అడ్మినిస్ట్రేషన్ స్కిల్ల్స్ ఏంటో నిరూపించుకున్నారు...

చంద్రబాబు విజనరీ అనేది అందుకే... ఆయన ఏమి చెప్తున్నారో, ఆయన ఏమి చేస్తున్నారో, ఏమి ప్రెజెంట్ చేస్తున్నారో, రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ ఎలా తేవాలో, ఆయనకి చాలా క్లారిటీ ఉంది... క్లారిటీ లేనిది, ఆయన చేసే ప్రతి పనిలో వక్ర భాష్యం వెతికే మనకే...

విజయవాడ వాసులకి, ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా... సెలవు వస్తే, సినిమా కి వెళ్ళటం తప్ప, సిటీ లో వేరే ఎంటర్టైన్మెంట్ లేదు... అలాంటిది, విజయవాడ లో, ఎదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.... ఆ ఈవెంట్ తోనే, అమరావతి బ్రాండ్ ఇమేజ్ ప్రమోట్ చేస్తున్నారు... మొన్న జరిగిన ఎయిర్ షో, ఇవాళ నేవీ షో... సముద్రంలో కాదు, కృష్ణా నదిలో... ఆయన కాన్ఫిడెన్సు అలాంటింది మరి... సంక్షోభంలో, అవకాశాలు వెతుక్కుంటాడు ఆయన, అందుకే అనేది "Where there is a will... There is a way.."

ఇక జరిగిన నేవీ షో గురించి మాట్లాడుకుందాం... వినోదపరంగా కేవలం సినిమాలకే పరిమితం అయిన నగరవాసులను, పున్నమి ఘాట్ లో తొలిసారిగా ఏర్పాటు చేసిన నేవీ విన్యాసాలు నగర ప్రజలు అమితంగా ఆకర్షించాయి. ఈ విన్యాసాలను ప్రారంభం నుంచి ముగిసే వరకు అద్యంతం ఉత్కంఠతతో, రెట్టించిన ఉత్సాహంతో కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు.

గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో నింగిలో యుద్ధ విమానాలు... రెక్కలతో గాలిని కోస్తూ దూసుకెళ్లిన చేతక్ హెలికాప్టర్...ఆధునిక ఆయుధాలతో కమెండోలు తుపాకీ గుళ్ళ వర్షం... బాంబుల మోత.... కనుల ముందు కనిపించిన యుద్ధ క్షేత్రం... సాక్షాత్కరించిన మన నౌకాదళ సామర్షం.. ఇవి నౌకాదళం ప్రదర్శించిన విన్యాసాల విశేషాలు.. శత్రువులకు సంబంధించిన ఓ ఆయిల్ రిగ్ను ధ్వంసం చేసే దృశ్యాలను ప్రతిఒక్కరూ కళ్లప్పగించి చూశారు. రిగ్ పై బాంబులు పడగానే. పెద్దశ బ్దంతో మంటలు, దట్టమైన పొగ వ్యాపించాయి. యుద్ధ దృశ్యాలు చూసిన జనం ఒళ్లు గగురొడ్ఛగా పడుతుండగానే, తూర్పు నావికా దళం మ్యూజిక్ బ్యాండ్ అందరినీ అలరించింది. తర్వాత జరిగిన బాణసంచా పేలుళ్ల మెరుపలు సందర్శకులను కట్టిపడేశాయి.

సాయం సంధ్యా సమయంలో... కృష్ణా నది ఒడ్డున కూర్చుని... చల్లని గాలి పీల్చుతూ... అద్భుతమైన విన్యాసాలు ప్రదర్శన తిలకించటంతో పాటు దేశ భక్తిని సైతం పెంపొందించుకునే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని తిలకించటం, విజయవాడ ప్రజలకు ఇది ఒక మధురమైన అనుభూతిని మిగిల్చింది.

విజయవాడలో నేవీ షో, ఎలా పెట్టారో, ఎందుకు పెట్టారో, నేవీ షో అయిపోయిన తరువాత కాని కొంత మందికి అర్ధం కాలేదు... చంద్రబాబు థింక్ బిగ్, అని ఎప్పుడూ ఎందుకు అంటారో, ఇప్పుడు అర్ధమైంది అని అంటున్నారు విజ్ఞులు....

దర్శకరత్న దాసరి నారాయణరావును, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్‌తో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాసరిని, చంద్రబాబు శుక్రువారం పరామర్శించారు. దాసరి ఆరోగ్య పరిస్థితిని కిమ్స్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

దాసరి ఆరోగ్యంగా ఉన్నారని, ఆప్యాయంగా పలకరించారని, రెండు రోజుల్లో దాసరి మామాలు స్థితికి వస్తారని చంద్రబాబు వెల్లడించారు. దాసరి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడాలని ఆకాంక్షించారు.

రాష్ట్రాన్ని పారిశ్రామికరంగం వౖపు పరుగులు తీయించడంతోపాటు రానున్న రోజుల్లో ప్రపంచంలోనే పరిశ్రమల ఏర్పాట్లో టాప్‌ 10లో ఆంధ్రప్రదేశ్‌ను ఉంచాలన్న లక్ష్యంతో పారిశ్రామికవేత్తలను స్వాగతిస్తూ వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఏర్పాటు చేసిన గమేశా గాలిమరల రెక్కల తయారీ పరిశ్రమను ప్రారంభించారు. ఈ పరిశ్రమ వల్ల సుమారు వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే పెద్ద ఎత్తున అర్భన్ పాపులేషన్ ఉండాలని అన్నారు. ఇంకొపక్క పరిశ్రమలు ఉండాలని, అప్పుడే సర్వీస్ సెక్టర్ అభివృద్ధి అవుతుందని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ చేసుకున్న గమేశా... ఏడాది తిరగక మునుపే రూ.500 కోట్లతో తొలి దశ పనులు పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించడం హర్షణీయమన్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, నగరాలు ఉన్నప్పుడే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని తెలిపారు.

రాష్ట్రాభివృద్ది పరిశ్రమల ఏర్పాటుతోనే సాధ్యమవుతుందని ఆ దిశగానే వారిని ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పేందుకు నిరంతరం కృషిచేస్తున్నామన్నారు. అందులో భాగంగానే విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు థర్మల్‌ కేంద్రాలను ప్రోత్సహించామని ఫలితంగానే రాష్ట్రానికి 24 గంటలు విద్యుత్‌ను సరఫరా చేయగలుగుతున్నామన్నారు. గతంతో పోలిస్తే విద్యుత్‌ లోటును కూడా అధిగమించామన్నారు. అలాగే విద్యుత్‌ ఆదాను కూడా చేయాలన్న పట్టుదలతో రాష్ట్రంలోని అన్నీ మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ బల్బులు అందించామన్నారు.

అధికారంలో వచ్చిన వెంటనే రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేకుండా చేశామని చంద్రబాబు తెలిపారు. ఉదయ్‌ పథకం కింద రూ. 8,256 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ నష్టాలను తగ్గించగలిగామన్నారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని, రాబోయే రోజుల్లో 18వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళుతున్నామని సీఎం తెలిపారు. ఈ ఏడాది పవన విద్యుత్‌ 2094 మెగావాట్లని, 974 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుందని, 9700 సోలార్‌ పంపుసెట్లు ప్రవేశపెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. విద్యుత్‌ ఆదాకు వినూత్న ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు.

ఆ కార్యక్రమంలో భాగంగానే వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో నెల్లూరు జిల్లాలో ఏర్పాటైన గమేస కంపెనీకి ప్రోత్సాహాన్ని ఇచ్చామని దీంతో ఆ కంపెనీ యాజమాన్యం ఆరు నెలల్లోనే రూ. 500 కోట్లతో తొలిదశ పనులను ప్రారంభించిందని ఆయన ఈ సందర్భంగా గమేస చైర్మెన్‌ రమేష్‌ కైమల్‌ను ప్రసంశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 175 పరిశ్రమలను నెలకొల్పి అన్నీ ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ది చేయాలని ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తున్న రైతులకు తగిన ప్రాధాన్యతను ఖచ్చితంగా ఇస్తామని అలాగే స్థానికులకే పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ రాష్ట్రాన్ని అన్నీరంగాల్లో అభివృద్ది చేయాలని ముందుకు సాగుతున్నామన్నారు.

కొద్ది రోజుల కిందట అస్వస్థతకు గురైన ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ బేగంపేటలోని ఆయన నివాసంలో పరామర్శించారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రామోజీ రావు, ఇటీవలే యశోదా ఆస్పత్రిలో చికిత్సి పొందారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక బేగంపేటలోని నివాసంలో ఉంటూ వైద్యం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రామోజీరావును కలిశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read