ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సు, CII సమ్మిట్ కు రెండోసారి ఆతిథ్యం ఇచ్చేందుకు, నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధాని విశాఖపట్నం సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు కోసం తూర్పు తీరంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన విశాఖపట్నం రెడీ అవుతుంది. గత ఏడాది జనవరిలో సదస్సును నిర్వహించిన ఎపిఐఐసి గ్రౌండ్స్‌లోనే ఈసారి కూడా 27, 28 తేదీల్లో సదస్సును నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా, 22 సార్లు ఈ భాగస్వామ్య సదస్సు జరిగితే, అందులో 5 సార్లు చంద్రబాబు నాయకత్వంలో జరిగాయి.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకి దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రత్దినిధులు, ఆర్ధిక నిపుణులు పాల్గుంటారు. 50 దేశాల ప్రతినిధులతో సహా దేశ విదేశాలకు చెందిన 2000 మంది ఇన్వెస్టర్లు, పారిశ్రామిక, వాణిజ్యరంగాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. 15 మంది కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన 30 మంది మంత్రులు సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సదస్సులో రాజధాని అమరావతి నగర నిర్మాణానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు .. ప్రాధాన్య రంగాలైన ఆటోమొబైల్‌ అండ్‌ ఆటోమొబైల్‌ కాంపోనెంట్స్‌, టెక్స్‌టైల్స్‌-అపెరల్‌ పార్కులు, బయోటెక్నాలజీ, ఏరోస్పే్‌స-డిఫెన్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పెట్రోలియం- పెట్రోకెమికల్స్‌ లో భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉపాధి కల్పనను పరిశ్రమల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార, పారిశ్రామిక అవకాశాలను షోకస్‌ చేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. సాధారణంగా భాగస్వామ్య సదస్సుల్లో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు రావడం ఆచరణలోకి వచ్చేసరికి అందులో 20-30 శాతం కూడా కార్యరూపం దాల్చకపోవడం రివాజుగా వస్తోంది. గతేడాది జనవరిలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ద్వారా, 328 కంపెనీలు 4.62 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో, 8.72 లక్షల మందికి ఉపాధి అవకాశాల కోసం MoU కుదుర్చుకున్నారు. అందులో, 93 కంపెనీలు, ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయి, మరో 43 కంపెనీలకు భూములు కేటాయింపు అయ్యింది, పని మొదలు పెట్టల్సి ఉంది. ఇలాంటి సదస్సుల్లో, MoU లు కుదుర్చుకున్న వాటిలో, 20-30 శాతం కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చెయ్యవు. అలాంటిది మనకు, పోయిన సారి 31 శాతం కార్యరూపం దాల్చాయి. మరో 10 శాతం క్షేత్ర స్థాయిలో మిషనారీ ఏర్పాటు, బిల్డింగ్ లు కట్టుకునే పనిలో ఉన్నారు. ఇంకా ఫాలో అప్స్ చేస్తున్నారు కాబట్టి, ఇది 50% దాటే అవకాశాలు ఉన్నాయి.

ఈ సారి పరిస్థితి ఇంకా ఆశాజనకంగా ఉన్నట్టు, అధికార వర్గాలు భావిస్తున్నాయి. క్రిందటి సంవత్సరంతో పోలిస్తే, మౌలిక సదుపాయాలు చాలా మెరుగుపడ్డాయి... కరెంటు, నీళ్ళు, భూమికి కొరత లేకపోవటం, మంచి రవాణా కనెక్టివిటీ, ముడి సరకు లభ్యత అన్నీ కలిసి వచ్చే అంశాలే. ఈ ఏడాది, 8 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలి అనేది లక్ష్యం.

అవును మీరు వింటున్నది నిజం... ఏంటి రా నిజం, ఎకరం 15 కోట్లు రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా, ఎంత జరీబు భూమి అయినా మహా అయితే 3-4 కోట్లు అంటారా... కాని మన ప్రతిపక్ష నాయకుడు, చెప్తున్నారు, రాజధాని గ్రామాల్లో ఎకరం 15 కోట్లు పలుకుతుంది అని. మీరు ఇంకో రెండేళ్ళు కాపాడుకోండి, తర్వాత నేనే సియం, మీ భూములు మీకు ఇచ్చేస్తా, ఎకరా 15 కోట్లు ఖరీదు చేసే భూమి నేను ఏర్పాటు చేసే ప్రభుత్వం తీసుకోదు అంటున్నారు, మన ప్రియతమ ప్రతిపక్ష నేత...

దీంతో ఈ మాట, ఆ నోట ఈ నోటా, పాకి, అమరావతి రాజధానిలోని అన్ని గ్రామాలకు పాకింది. ఇంకేముంది, రైతులు, స్పెషల్ బస్సులు వేసుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయుకుడు ఉండే, తెలంగాణా రాష్ట్రానికి బయలుదేరారు... అక్కడ లోటస్ పాండ్ లో, రియల్ ఎస్టేట్ కంపెనీ తెరిసారు అని, ఎకరాకు 15 కోట్లు వస్తాయి అని, ఆశతో పరుగులు పెడుతున్నారు. ఇక చంద్రబాబుకి ఇచ్చిన భూములు వెనక్కి తీసుకుంటామని, మాకు అమరావతి కంటే, లోటస్ పాండ్ మీద నమ్మకం ఎక్కువ అని, మా జీవితాలు మా యువ నాయకుడు మార్చేస్తాడు అని, సంబరాలు చేసుకుంటున్నారు...

మీరు ఏమి, అలా వెర్రి మాటలు నమ్మరని తెలుసు... ఇది నిజం అని నమ్మి వెళ్ళేరు... ఉన్నది కూడా ఉడ్చుకుపోయే చరిత్ర వాళ్ళది...

33 వేల ఎకరాలు, రాష్ట్ర భవిషత్తు కోసం, త్యాగం చేసిన రైతులని పట్టించుకోకుండా, భూములు ఇవ్వని 1300 ఎకరాలు కోసం, ప్రతిపక్ష నాయకుడు చేస్తున్న పోరాటంలో, చెప్తున్న అబద్ధాలు ఇవి.. ఎంత ఆత్రంగా ఉన్నారు అంటే, ఎలా అయినా, ఎన్ని అబద్ధాలు చెప్పి అయినా సరే, ప్రశాంత వాతావరణం చెడగొట్టాలి, రైతులని రేచ్చగొట్టాలి, అమరావతిని ఆపాలి అనే అజెండాతో, ఉన్న వాళ్ళు, ఇంతకంటే ఏమి దిగాజారగలరు.

ఆంధ్రప్రదేశ్‌కు, అమరావతికి ఆర్ధిక వనరులు, పెట్టుబడులు సమకూర్చడంలో ‘మెకెన్సీ గ్లోబల్’ముఖ్యభూమిక పోషించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అభిలషించారు. ఇందుకోసం సంస్థలోని ప్రతిభావంతులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, తమ రాష్ట్రానికి పెట్టుబడులు సమకూర్చే బాధ్యతను ఆ బృందానికి అప్పగించాలని ముఖ్యమంత్రి కోరారు.

దావోస్ ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో బుధవారం తనతో భేటీ అయిన ‘మెకెన్సీ గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్’ సంచాలకుడు జోనాథన్ ఓజల్ (Jonathan Woetzel)తో మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో పునాదులనుంచి నిర్మాణం అనివార్యమైందని, తమ ఈ కృషిలో ’మెకెన్సీ గ్లోబల్’ క్రియాశీలకపాత్ర పోషించాలని కోరారు.

జోనాథన్ వోజల్ (Jonathan Woetzel) మాట్లాడుతూ అంతర్జాతీయ వాణిజ్యంలో భవిష్యత్తు అంతా భారత్, చైనా దేశాలదేనన్నారు. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 25% ఈ రెండు దేశాల నుంచే వస్తుందని, సాంకేతికత కూడా ఈ ఉభయదేశాలదే ఉంటుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు చైనా పెట్టుబడుల రాకను సులభతరం చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు.

రానున్న మూడు మాసాలలో చైనా నుంచి 20 ప్రధాన వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను రాష్ట్రానికి తేవటంలో, పెట్టుబడి దారులు రావటంలో తాము తోడ్పడతామని జోనాథన్ వోజల్ (Jonathan Woetzel) వివరించారు.

ఏపీ సీఎంతో జేపీ మోర్గాన్ ఛేస్ వాణిజ్య వ్యూహ విభాగ అధిపతి భేటీ
ఆర్ధిక, సాంకేతికాంశాలలో సహకరించాలని కోరిన చంద్రబాబు
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో జేపీ మోర్గాన్ ఛేస్ (Jp Morgan Chase) వాణిజ్య వ్యూహ విభాగ అధిపతి మాక్స్ న్యూకిర్షెన్ (Max Neukirchen) సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పుష్కల సహజవనరులు, అపరిమిత అవకాశాలపై ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. ఆర్ధిక, సాంకేతికాంశాలలో తమ ప్రభుత్వానికి సహకరించాలని మాక్స్ న్యూకిర్షెన్ (Max Neukirchen) కు విజ్ఞప్తి చేశారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలలో ఐఓటి పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో చెబుతూ ‘కోర్ డ్యాష్ బోర్డు’ ప్రత్యేకతను వివరించారు. జేపీ మోర్గాన్ ఛేజ్ అధిపతి ఆసక్తిగా విన్నారు. సంస్థకు ఉన్న అంతర్జాతీయ కార్యవ్యవస్థ ద్వారా అమరావతి అభివృద్ధికి పెట్టుబడులు వచ్చేలా చూడాలని కోరారు.

భారత్‌ దిశగా టీజిన్ (TEIJIN LTD) అడుగులు
ఆంధ్రప్రదేశ్ వైపు చూపులు
ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సపోర్టింగ్ షీట్ల తయారీలో ప్రసిద్ధి చెందిన టీజిన్ (TEIJIN LTD) టీజిన్ లిమిటెడ్ సంస్థ అధ్యక్షుడు జున్ సుజుకీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనేకరంగాల్లో ప్రసిద్ధి చెందిన టీజిన్ ఆంధ్రప్రదేశ్‌ను తన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జున్ సుజుకీకి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సుదీర్ఘ సముద్రతీరం, ఇతర మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి వివరించారు. పారిశ్రామికాభివద్ధి కోసం సింగిల్ డెస్క్ పాలసీని అనుసరిస్తున్నామని, అన్ని అనుమతులను మూడు వారాల్లో ఇస్తామన్నారు. కార్బన్, అల్యూమినియం, ఫైబర్స్ లో టీజీన్‌ రంగాలలో టీజిన్ కు అనుభవం వుంది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సపోర్టింగ్ షీట్స్ తయారీలో కూడా ప్రసిద్ధి చెందింది. ఈ సంస్థ తయారుచేసే ఉత్పత్తులకు భారత్ అతిపెద్ద దిగుమతిదారుగా వుంది. ఫైబర్స్, హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్ ప్రధాన వ్యాపారంగా చేసుకున్న ఈ సంస్థ కొరియా, జపాన్ దేశాలలో విస్తరించి వుంది. భారత్ లో అడుగులు వేయటానికి టీజిన్ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీజిన్ (TEIJIN LTD) టీజిన్ లిమిటెడ్ సంస్థ అధ్యక్షుడు జున్ సుజుకీని కోరారు.
తిరుపతి నగరాభివృద్ధికి కుమియుమి రెడీ

20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తెస్తానన్న సంస్థ
తగిన ప్రతిపాదనలు, ప్రణాళికలతో రావాలన్న ముఖ్యమంత్రి
ప్రపంచమంతా ప్రణమిల్లే తిరుమల శ్రీవారి సన్నిధికి ఆధ్యాత్మిక ముఖద్వారం తిరుపతి నగరం. అంతటి ప్రాముఖ్యమున్న తిరుపతి నగరాన్ని అభివృద్థి చేయటానికి జపాన్ కు చెందిన ‘కుమియుమి అస్సెట్స్ కంపెనీ’ ముందుకు వచ్చింది. బుధవారం దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కుమియుమి అస్సెట్స్ మేనేజిమెంట్ కంపెనీ ప్రెసిడెంట్ యసుయో యమజకి సమావేశమయ్యారు. ఇప్పటికే పుణ్యధామం వారణాసి నగరాభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నామని, తిరుపతి నగరాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు.

తమకు ఫండ్, టెక్నాలజీ, ప్రాజెక్టుమేనేజిమెంట్ రంగాలలో ఆసక్తి వుందని ఆయన తెలిపారు. గృహ నిర్మాణం, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ రంగాలలో జపనీస్ కంపెనీలతో కలిసి ఒక కన్సార్టియంగా ముందుకొచ్చి 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడిని తీసుకురాగలమని కుమియుమి ప్రెసిడెంట్ ప్రతిపాదించగా, స్పష్టమైన ప్రణాళికతో రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిస్కో చైర్మన్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ లో డిజిటలైజేషన్ దిశగా తీసుకుంటున్న చర్యలపై ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు సదస్సుల్లో ప్రస్తావనలు, ప్రశంసలు వచ్చాయని సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ తెలిపారు. బుధవారం దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయినప్పుడు వరల్డ్ బ్యాంక్ సదస్సు విశేషాలను వివరించారు. వివిధ రంగాల్లో రాష్ట్రాభివృద్ధిని సిస్కో చైర్మన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

ఇండియాలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధం
ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనరల్ అట్లాంటిక్ ఎండీ
భారత్‌లో తాము 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు జనరల్ అట్లాంటిక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ నాయక్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీలో ఈ అంశాన్ని వివరిస్తూ జనరల్ అట్లాంటిక్ సంస్థ 30 బిలియన్ డాలర్ల సామర్ధ్యం ఉందని, ఐటీ, హెల్త్ కేర్ వంటి ప్రధాన రంగాలలో పెట్టుబడులు పెడుతుందన్నారు. ఫస్టు జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్లు, స్టార్టప్స్‌కు పెట్టుబడులు సమకూర్చుతామని తెలిపారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి అల్పాహార విందు
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కలసి ముఖ్యమంత్రి అల్పాహార విందు తీసుకున్నారు. భోజనప్రియుడైన నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్ ఘుమఘుమలను, ప్రత్యేక వంటకాల రుచులను బుధవారం నాడే అడిగి తెలుసుకున్నారు. దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి బృందంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆంధ్ర్రపదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, ఇంధన వనరులు, ఐ అండ్ ఐ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈవో జాస్తి కృష్ణకిషోర్ వున్నారు.

దావోస్ ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ‘టెక్నాలజీస్ ఫర్ టుమారో’ అనే అంశంపై ప్రసంగించారు. అద్భుత ప్రగతికి ఆధునిక సాంకేతికతను తాము సోపానంగా మలుచుకున్నామని చెప్పారు. తానుకేవలం టెక్నాలజీలో తాను మేనేజర్ మాత్రమేనని, ప్రొఫెషనల్‌ని కానని చెబుతూనే ఒక ప్రొఫెషనల్ కంటే చక్కగా వివరించిన తీరు దావోస్ లో సదస్యులను ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి ప్రసంగ పాఠంలో ముఖ్యాంశాలిలా ఉన్నాయి:

‘ఇదో అద్భుతమైన ప్రదేశం. ప్రపంచ దిగ్గజాలంతా ఇక్కడ ఉన్నారు. ప్రపంచ దిగ్గజాలంతా ఇక్కడ ఉన్నారు. అందరం ఒకే చోట కలుసుకునేందుకు వీలయ్యింది. ‘నేను ప్రొఫెషనల్ ను కాను నేను మేనేజర్‌నే’. టెక్నాలజీ ఈ సమాజానికి , ముఖ్యంగా సామాన్యుడికి ఎలా ఉపయోగించాలా అనేదే నా తపన. ముప్ఫయ్ ఐదేళ్లనాడే టెక్నాలజీ ఉపయోగించాను. 1984-85..ఆ సమయంలో కంప్యూటర్లు ఉపయోగించాను. పార్టీ నిర్మాణంలో వివరాలు అందరికీ అందుబాటులో ఉండాలని, జవాబుదారీతనంకోసం కంప్యూటర్లు ఉపయోగించాం. ఆరోజుల్లో కంపెనీలు పరిమితంగానే ఉండేవి. పెద్ద పెద్ద మిషన్లుండేవి. ఈ కంప్యూటర్ల ఉంచడానికి ప్రజలకు ఏసీలు కూడా లేని సమయం. ఈరోజు పరిస్థితి గణనీయంగా, సంపూర్ణంగా మారిపోయింది. ఇంటరనెట్ రాకతో ప్రపంచం ఒక గ్లోబల్ విలేజిగా మారింది. ‘ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్’ తో ఇవాళ ఫోర్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ నడుస్తున్నది. బయోమెట్రిక్స్,సెన్సర్స్ , డివైసెస్, సీసీ కెమేరాలు, డ్రోన్స్, రొబొటిక్స్..అనూహ్య సాంకేతిక ఆవిష్కారాలు వచ్చాయి.

అయితే ఇవన్నీ రాకముందే మా రాష్ట్రంలో నేను అనేక ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించాను. ఐటీ కంపెనీలను ఆకర్షించటానికి ప్రపంచమంతా తిరిది ప్రత్యేక కృషిచేశాను. హైదరాబాద్ ఒక నాలెడ్జి హబ్ గా ఏర్పడటంలో ఆనాటి కృషిని తక్కువ అంచనావేయవద్దు. నేను సాధ్యమైనంత వరకు అన్ని టెక్నాలజీలు ఉపయోగిస్తాను. రాజకీయాల్లో కొన్ని నాటకీయ సంఘటనలు జరుగుతుంటాయి. పాలిటిక్స్ లో అనూహ్యంగా నాటకీయపరిణామాలు చోటుచేసుకున్నట్లే ఒకోసారి టెక్నాలజీలో కూడా చోటుచేసుకుంటాయి. భారత్ లో మా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు నల్లధనాన్ని అరికట్టడడానికి హఠాత్తుగా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.1000,రూ.500 నోట్లు రద్దు చేశారు. 86% లావాదేవీలు కరెన్సీ తోనే జరిగే మా దగ్గగర డీమోనిటైజేషన్ ప్రభావం పడింది. దీన్ని అవకాశంగా తీసుకున్నాం. మొబైల్ లావాదేవీలవైపు మళ్లాల్సి వచ్చింది. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా భారత్ ఒక సానుకూలాంశం ఉంది. అదే ఆధార్.

తొంభై శాతం మంది ప్రజలక ఆధార్ కార్డులున్నాయి. గత గత రెండేళ్లుగా ప్రజాపంపిణీ వ్యవస్థలో నేను ఈ-పోస్ ఉపయోగిస్తున్నాను. ఫింగర్ ప్రింట్స్ , లేదా ఐరిస్. ఇదే అథెంటికేషన్. ఇదే ఆధార్ కార్డును మేం డీమోనిటైజేషన్ సంక్షోభ కాలోం వినూత్నంగా ఉపయోగించుకున్నాం. వెంటనే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను సంప్రదించాం. వాళ్లొక యాప్ తయారు చేశారు. దాంతో అన్ని బ్యాంకులు ఒకే ఛత్రం కిందికి వచ్చాయి. ఇప్పుడు మా రాష్ట్రంలో స్మార్టుఫోన్లు కేవలం 30% మంది మాత్రమే వాడుతున్నారు. మరి డిజిటల్ లావాదేవీలు ఎలా జరుగుతాయి? అందుకే ఒక ఇన్నోవేటివ్ ఐడియా వచ్చింది. ఫింగర్ ప్రింట్, ఆధార్ కార్డు నెంబర్ తెలిస్తే ఒక ఖాతాదారు తాను కొన్న వస్తువులకు చేతిలో డబ్బులేకున్నా సొమ్ము చెల్లించే ఏర్పాట్లు చేశాం. మరో వైపు వ్యాపారులు స్మార్టు ఫోను, ఒక బయోమెట్రిక్ పరికరంతో (పరికరం ఖరీదు రూ.2,000) ఉంటే చాలు. అక్కడే ఒక మైక్రో ఏటీఎం ఉన్నట్లే. ఆటోమేటిక్ గా ఇది మైక్రో ఏటీఎంలా పనిచేసింది. అలా తేలిగ్గా లావాదేవీలు నిర్వహించేలా చేశాం. ఇక్కడ 100% విశ్వసనీయత కలిగిన టెక్నాలజీ ఇది.

నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఒక దశాబ్దం ముఖ్యమంత్రిగా, ఒక దశాబ్దం పాటు ప్రతిపక్ష నాయకుడగా పనిచేశా. ఇప్పుడు రాష్ట్రం రెండుగా విడిపోయింది. నేనిప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాను. కొత్త రాష్ట్రమయినా అది అద్భుతమైన రాష్ట్రం. ఇటువంటి రాష్ట్రాన్ని ఒక ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది నా తపన. నేనేం చేస్తున్నానో మీకో ఐడియా ఇవ్వదల్చాను. ఉదాహరణకు సీఎం డ్యాష్ బోర్డు. ఇది చూసి మీరు చెప్పండి. ఇంకా ఎలా మెరుగుపర్చుకోవచ్చో చెప్పండి. సిద్ధంగా ఉన్నాను. గత రెండేళ్లుగా మేం ప్రజాపంపిణీ వ్యవస్థలో, పెన్షన్ల పంపిణీకి ఈ పోస్ ఉపయోగించాం. ఇది సీఎం డ్యాష్ బోర్డు. మా రాష్ట్రంలో 4.47% జనాభా ఉంది. డ్యాష్ బోర్డులో ఈ ఫీచర్ చూడండి. ఇవి వీధిలైట్లు. రెండేళ్లక్రితం హుద్ హుద్ తుఫాను వచ్చింది. విశాఖ నగరంలో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. వారం రోజులలోనే సాధారణ పరిస్థితి తెచ్చాం. . అన్ని వీధి దీపాలు సర్వనాశనమయ్యాయి. నాకు అప్పుడో ఐడియా వచ్చింది. అన్ని వీధి దీపాలను ఎల్ ఈడీ బల్బులనే పెట్టాలని నిర్ణయించాం. అలా అన్నీ ఎల్ ఇడి బల్బులు పెట్టి 40% విద్యుత్తు ఆదా చేశాం.
అన్ని నగరాల్లో సెన్సర్లున్నాయి. 5.56 మిలియన్ బల్బులున్నాయి. ఇవన్నీ సెన్సార్ గేజ్డ్ బల్బులు.

బల్బులు పెట్టండి. మీరు సేవా ప్రమాణాలు పాటించాలని అడిగాను. సెన్సర్ గేజ్డ్ బల్బులు కాబట్టి మీ ఇంటిలో ఒక బల్బు వెలగకున్నా ఇక్కడ కనపడుతుంది. నా కంట్రోల్ రూమ్ నుంచి నేను పర్యవేక్షించగలను. మెకానిజం సరిచేయగలను. ఇది నేను చేశాను. గతంలో ఇండియాలో పగలే లైట్లు వెలిగేవి. కొన్నివెలిగి కావు. ఇప్పుడీ కష్టాలు లేవు. నేను కావాలనే వీధి దీపాలను గమనిస్తుంటాను. సీఎం ఆఫీసులో డ్యాష్ బోర్డు పెట్టాం. ఇది రియల్ టైమ్ మేనేజిమెంట్ వర్షపాతం ను చూస్తాను. వర్షపాతం లోటు 28 %గా కనపడుతోంది. ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైందో, ఎక్కడ ఎంత భూగర్భ జలాలున్నాయో, ఎంత చేరాయో తెలుసుకోగలను.

11.64 మీటర్ల వర్షపాతం రియల్ టైం.
సెన్సర్లు, పరికరాల ద్వారా నేను ఉపరితల జలాల పరిస్థితి, భూగర్భ జలాల పరిస్థితినీ అంచనా వేస్తాను. బయోమెట్రిక్ అథెంటికేషన్ తో మా విద్యార్ధుల హాజరు శాతం చూస్తున్నాం. ఏ విద్యార్ధి హాజరయ్యాడు, ఏ ఉద్యోగి హాజరయ్యాడు, ఎవరు హారు కాలేదో నేను తెలుసుకోగలుగుతున్నాను. అలా మానిటర్ చేసుకుంటాను. ప్రజలకోసం పైబర్ గ్రిడ్ అనే పెద్ద ప్రయోగం చేస్తున్నాం. భూగర్భ కేబుళ్లు వేస్తే రూ 5 వేల కోట్లవుతుంది. మా దగ్గర డబ్బు లేదు. వ్యయం తగ్గించాలి. ఇందుకోసం ఇప్పుడు ఉన్న కరెంటు స్తంభాలను ఎందుకు ఉపయోగించకూడదన్న వినూత్న ఆలోచన వచ్చింది. అన్ని ఇళ్లకు విద్యుత్తు ఇచ్చినట్లే కరెంటు స్తంభం ఆధారంగా ఫైబర్ వైరు వేశాం. సబ్ స్టేషన్లు కనెక్టు చేశాం. స్మార్టు మీటర్లిచ్చాం. 300 కోట్లతో చేశాం. పది లక్షల మందికి సెట్ టాప్ బాక్సులు ఇచ్చాం. కనెక్ట్ చేశాం. అన్ని ఛానెల్స్ టీవీలు చూడవచ్చు. విడియో, టెలిఫోన్..కేవలం 249 రూపాయలకు 15mbps కనెక్షన్లిచ్చాం.నెలకు ఈ మూడు ప్రయోజనాలు సమకూరుస్తున్నాం. ప్రతి ఇంటికీ కనక్షన్. వారి ఇంట్లో విద్య, ఆరోగ్యం ఇంకా అనేక ప్రభుత్వ పథకాలు ఎలా అమలు జరుగుతున్నయో విడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడగలను. మా ప్రభుత్వం పరిపాలనకు సంబంధిం వివరాలన్నింటినీ ఆన్ లైన్ లో ఉంచింది. అన్ని సింక్రజైన్ చేస్తున్నాం. వ్యవసాయం, సివిల్ సప్లయిస్, కమర్షియల్ టాక్సెస్,ఇంకా అనేక డిపార్డుమెంట్లను చూడండి. మేం ‘ఈ- ప్రోగ్రెస్’ ని అభివృద్ధి చేశాం.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మేం నెంబర్ వన్. గత ఏడాది ఏపీ గ్రోత్ రేట్ 10.99%. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటిదాకా వృద్ధిరేటు 12.23%, -28 % వర్షపాతం ఈ ఏడాది నమోదయ్యింది.

మా ప్రభుత్వంలో అన్నీ వివరాలు ఆన్ లైన్ లో ఉంచాం. అల్టిమేట్ గా రియల్‌ టైమ్ గవర్నెన్స్. నేనూ టెక్నాలజీ ద్వారా సమస్యలకు పరిష్కారాలు వెదుకుతున్నాను అందులో ఒకటి సాయిల్ టెస్టింగ్. సాయిల్ టెస్టింగ్ కు ఇప్పటిదాకా ఒక సమగ్రపరికరం లేదు. ఇంటర్ నెట్ ఆధారంగా ఎక్కడ సూక్ష్మ పోషకాలు తక్కువగా ఉన్నాయో, ఎక్కడ లేవో తెలిపే పరికరాలు రావాలి. మేం అభివృద్ధి చేసిందాంట్లో చెప్పుకోదగింది కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ను చెప్పుకోవాలి. మా రాష్ట్రంలో నిర్మిస్తున్న బహుళార్ధ సాధక నీటి పథకం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు. ఈరోజు 2017 జనవరి 19. ఇప్పుడు ఈ టైమ్ లో ఎంత పని అయ్యిందో నేను ఇక్కడ ఉండి చూడగలను. ఇదే రియల్ టైమ్.

కొన్నిసార్లు నేనే స్వయంగా వెళతాను. కొన్ని పర్యాయాలు వర్చువల్ గా ఇలా చూసి పర్యవేక్షిస్తాను. టెక్నాలజీని ఎలా ఉపయోగించవచ్చో మీరు చూశారు. నా ఐడియాలు చెప్పాను. మీతో భవిష్యత్తుకు సరిపోయేవి పంచుకుంటా. నేను ఒక నమూనాగా తీర్చిదిద్దుతాను.
నేను అన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తే దావోస్ లో ఉండి ఫైళ్లమీద సంతకాలు చేయవచ్చు. అక్కడ జరిగే వాటిపై నా కామెంట్స్ పంపవచ్చు. నాకు మీ సహకారం కావాలి ఐడియాలు ఇవ్వండి మేం ఒక ఆదర్శ రాజ్యంగా, నమూనాగా తీర్చిదిద్దుతాం.
భారత్ లో జనాభా యువజనాభా మా బలం. టెక్నాలజీలో మేం ఎంతో బలంగా ఉన్నాం. ఈ విధానాన్ని ఇంకా ఎలా మెరుగుపర్చుకోవచ్చో సూచనలివ్వండి. అమలుచేస్తాం. నమూనా రాష్ట్రంగా తీర్చిదిద్దుతా. నేను సాధించే ఐడియాలను మీముందు ఉంచాను. ఇందుకు సంతోషంగా ఉంది. ఇంకా ఎలా ముందుకెళ్లాలో చెప్పండి. ఇంతకంటే మెరుగైన పరిష్కారాలు ఎవరైనా చూపిస్తే సంతోషంగా స్వాగతిస్తాను’.

తెలుగునాట తన నట వైభవంతోను.. రాజకీయ ప్రాశస్త్యంతోను ఇక్కడి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినవారు నందమూరి తారకరామరావు. ఆయన సినీ జీవిత విశేషాలను, రాజకీయ గమనాన్ని ప్రతిబింబించేలా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇప్పుడో బృహత్ కార్యాన్ని చేపట్టబోతుంది. ప్రపంచ అగ్రశ్రేణి మ్యూజియంలకు ఏమాత్రం తీసిపోకుండా.. వీలైతే వాటిని మించి ఉండేలా.. ఎన్టీఆర్ మ్యూజియం, గ్రంథాలయం ఏర్పాటుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సన్నద్దమవుతోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ప్రపంచంలోని అగ్రశ్రేణి మ్యూజియంలను అధ్యయనం చేశాక, ఒక్క మ్యూజియంగా కంటే మ్యూజియం-గ్రంథాల‌యంగా తీర్చిదిద్దాల‌ని భావించారు. ఈ ఏడాదిలోనే మ్యూజియంకు శంకుస్థాప‌న చేసి మూడేళ్ల‌లో పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. కనీసం పదెకరాల స్థలంలో ఏర్పాటుచేస్తారు. స్థల ఎంపిక చేపట్టాల్సి ఉంది.

    • ఎన్టీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, సినీ, రాజకీయ రంగాలు, ఇతర అంశాలపై వేర్వేరు గ్యాలరీలుంటాయి.
  • ఎన్టీఆర్ గురించి ప్రభావంతంగా వివరించేందుకు ఫోటోలు, చిత్రాలు, రాతి శిల్పాలు, త్రీడీ బొమ్మలు ఏర్పాటుచేస్తారు
  • వివిధ భాషల్లో ఆడియో, వీడియో ప్రదర్శనలుంటాయి
  • కనీసం రెండు వేల మంది కూర్చునేంత ఆడిటోరియం నిర్మిస్తారు
  • క‌నీసం రెండువేల మంది కూర్చునేందుకు వీలుగా ఆడిటోరియం నిర్మించనున్నారు
  • ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏర్పాటుచేస్తారు

More Articles ...

Advertisements

Latest Articles

Most Read