ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టుల్లోనే కాదు, కేంద్రం వద్ద, గవర్నర్ వద్ద కూడా బిల్లులు ఆగిపోతున్నాయి. బిల్లులు చట్టబద్ధంగా ఉండటం లేదు అంటూ, కొందరు కోర్టుకు వస్తుంటే, కోర్టు వాటిని పరిశీలించి, చట్ట విరుద్ధంగా ఉంది అని నమ్మితే, వాటికి బ్రేకులు వేస్తుంది. అయితే కోర్టులు తమ పై కక్ష కట్టారు అని ప్రచారం చేసారు. అయితే కోర్టు పరిశీలనకు వెళ్ళని బిల్లులు కొన్ని, చట్టానికి లోబడి లేకపోతే గవర్నర్ వద్ద కానీ, కేంద్రం వద్ద కానీ బ్రేక్ పడుతుంది. గత వారం గవర్నర్ వీసి నియామక ఫైల్స్ ని వెనక్కు పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కేంద్రం కూడా బిల్లుని వెనక్కు పంపి రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. ఇప్పటికే దిశా బిల్లుని మూడు సార్లు వెనక్కు పంపిన కేంద్రం, ఇప్పుడు మరో బిల్లు విషయంలో కూడా ఇదే చేసింది. జగన్ ప్రభుత్వం, ల్యాండ్‌ టైటిల్‌ బిల్లు-2019 అనే బిల్లుని తీసుకు వచ్చి, దాన్ని శాసనసభలో ఆమోదించి, గవర్నర్ వద్దకు పంపి, అక్కడ కూడా ఆమోదించుకుని, రాష్ట్రపతి వద్దకు ఫైల్ పంపించింది. అయితే ఈ బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్ళకుండానే, కేంద్రం వద్దే ఆగిపోయింది. కేంద్ర చట్టాలు కాలరాసే విధంగా ఈ బిల్లు ఉంది అంటూ కేంద్రం అభ్యంతరం చెప్పింది. కేంద్ర చట్టాలను ఉల్లంఘించే విధంగా, ఈ చట్టం ఎలా రూపొందించారు అంటూ, కేంద్ర హోం శాఖ కొంచెం ఘాటుగానే అధికారులను ప్రశ్నించినట్టు తెలుస్తుంది.

jagan 26112020 2

ఏకంగా సివిల్ కోర్టు అధికారాలు రద్దు చేస్తూ ఎలా చట్టం చేస్తారు అంటూ, కొన్ని ప్రశ్నలు వేసి, వాటికి సమాధనం చెప్పాలి అంటూ రాష్ట్ర అధికారులను కోరింది. వీటి పై ఇటీవల అధికారులు సమాధానాలు ఇచ్చినా, కేంద్రం వాటికి సంతృప్తి పడలేదని, తమ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుని, బిల్లులలోని కొన్ని క్లాజులు పూర్తిగా మార్చలాని, అప్పుడే బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దాదాపుగా 16 నెలలు తరువాత బిల్లు వెనక్కు రావటంతో ఏపి ప్రభుత్వం షాక్ అయ్యింది. మొదటి అసెంబ్లీ సెషన్ లోనే బిల్లు అసెంబ్లీలో ఆమోదించినా, ఇప్పటి వరకు కేంద్రం ఆమోదించకుండా, ఇప్పుడు తిప్పి పంపింది. అయితే ఇప్పుడు మళ్ళీ క్లాజులు అన్నీ మార్చి, మళ్ళీ సవరించిన బిల్లు అసెంబ్లీ, శాసనమండలి ఆమోదం పొందాలి. ఇక్కడ అయిన తరువాత, మళ్ళీ గవర్నర్ ఆమోదం పొందిన తరువాత, కేంద్రం వద్దకు మళ్ళీ వెళ్ళాలి. బిల్లు రూపొందించిన సమయంలోనే, తగు జాగ్రత్తలు, తగు న్యాయ సలహాలు తీసుకుని ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

జమిలి ఎన్నికలు 2021, 2022లో వచ్చేస్తాయి అంటూ, గతంలో అనేక వార్తలు వచ్చాయి. అయితే క-రో-నా కారణంగా ఈ చర్చ మరుగున పడింది. అయితే నెల రోజులు క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తనకున్న సమాచారం మేరకు జమిలి ఎన్నికలు వచ్చే అవకాసం ఉందని, ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని, జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపు ఇచ్చారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ, ఏపి బీజేపీ నేతలు ఖండించారు. చంద్రబాబు క్యాడర్ ని కాపాడుకోవటం కోసం, ఇలా చెప్తున్నారు అంటూ, ఎన్నికలు ఇప్పట్లో రావని కౌంటర్ ఇచ్చారు. ఈ చర్చ మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం గత కొన్ని రోజులుగా నడుస్తుంది. ఒకే దేశం, ఒకే ఎన్నికలు పేరిట, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. 2022 చివర్లో ఎన్నికలు పెడితే, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు లేట్ గా జరిపి, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ముందుకు జరపాలని అనుకున్నారు. అయితే ఇదంతా చర్చ మాత్రమే. ఎక్కడా అధికారికంగా ఎవరూ ఈ విషయం చెప్పలేదు. అయితే జమిలి ఎన్నికల పై, ఈ రోజు ఏకంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయటంతో, ఇది పెద్ద వార్త అయ్యింది. ఈ రోజు గుజరాత్ లో జరిగిన రాజ్యాంగా దినోత్సవంలో మోడీ పల్గుని, ఈ వ్యాఖ్యలు చేసారు.

modi 26112020 2

జమిలి ఎన్నికలు అనేది కేవలం చర్చించి వదిలేసే విషయం కాదని, మన దేశానికి జమిలి ఎన్నికలు ఎంతో అవసరం అని ప్రధాని అన్నారు. మన దేశంలో మాటి మాటికి, కొన్ని నెలల వ్యవధిలోనే న్నికలు వస్తూ ఉంటే, ప్రతి సారి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని మోడీ అన్నారు. అందుకే ఒకేసారి ఎన్నికలు జరిపితే మనకు ఎంతో మేలని ప్రధాని అన్నారు. ఖర్చు పరంగా కూడా దేశానికీ ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అలాగే వివిధ ఎన్నికలకు వివిధ ఓటర్ లిస్టు లు ఉన్నాయని, వీటి వల్ల వ్యయం, సమయం కూడా వృధా అవుతుందని మోడి అన్నారు. మన దేశంలో లోక్ సభ, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ఒకేసారి రావాలని, దీని పై అధ్యయనం చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. దీంతో జమిలి ఎన్నికల పై మరో సారి చర్చ జరుగుతుంది. సాక్షాత్తు ప్రధాని నోట్లో నుంచి ఈ మాట వచ్చింది అంటే, కేంద్రం జమిలి ఎన్నికలకు రెడీ అవుతునట్టే అనే సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది. నెల రోజుల క్రితం చంద్రబాబు చెప్పిన మాటలు నిజం అవుతాయా అనిపిస్తుంది. ఇది రాజకీయంగా బీజేపీ వేస్తున్న ఎత్తు అయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జమిలి ఎన్నికల పై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

ఆంధ్రర్పదేశ్ ప్రభుత్వానికి ఈ రోజు సుప్రీం కోర్టులో కోరుకున్న రిలీఫ్ దొరకలేదు. కానీ ఒక చిన్న విషయంలో మాత్రం ఊరట లభించినా, దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి. అమరావతిలో భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి, ఏసిబి చేస్తున్న దర్యాప్తును తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. అంతే కాకుండా, ఏసిబి విచారణ నిలిపివేస్తూ హైకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చిందో, ఆ ఆదేశాల పై స్టే ఇవ్వటానికి కూడా సుప్రీం కోర్టు నిరాకరించింది. ఏపి హైకోర్టు ఏసిబి విచారణ పై ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ, సుప్రీం కోర్టులో ఏపి ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో ఏపి హైకోర్టు రెండు ఆదేశాలు ఇచ్చింది. ఒకటి అమరావతి భూముల కొనుగోలు పై ఏసిబి చేస్తున్న దర్యాప్తును నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఏసిబి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను బహిర్గతం చేయకుండా, మీడియాలో ప్రచురించకుండా ఒక గ్యాగ్ ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ రెండు ఆదేశాలను సవాల్ చేస్తూ, సుప్రీం కోర్టులో ఏపి ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. ఈ రోజు ఈ కేసు పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఏపి ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది రాజీవ్ దావన్ హాజరు అయ్యారు. అలాగే దమ్మాలపాటి తరుపున సీనియర్ న్యాయవాదులు ముకుల్, హారీష్ సాల్వే హాజరు అయ్యి, తమ వాదనలు వినిపించారు. హారీష్ సాల్వే, ముకుల్ ఇద్దరూ గతంలో ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన వారు, ఈ సారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించటం విశేషం. అయితే ఈ రోజు వాదనలు వాడిగా వేడిగా వాదనలు జరిగాయి. హైకోర్టు దర్యాప్తు ఎలా నిలిపివేస్తుంది అంటూ ప్రభుత్వం తరుపున రాజీవ్ ధావన్ వాదించారు. గత సంప్రదాయాలకు విరుద్ధం అని వాదించారు.

ఇక దమ్మాలపాటి తరుపున వాదించిన ముకుల్, ఇది కక్ష సాధింపు చర్య అని, గతంలో జగన్ కు వ్యతిరేకంగా వాదించారు, అందుకే కక్షతో ఈ కేసు నమోదు చేసారని వాదించారు. 30 ఏళ్ళ పాటు న్యాయవాది వృత్తిలో ఉన్న వారిని అపఖ్యాతి చేయటానికి, ఇతరులపై బురద చల్లటానికి దీన్ని వాడుకుంటున్నారని వాదించారు. సిబిఐకి ప్రభుత్వం లేఖ రాసినా పట్టించుకోలేదని గుర్తు చేసారు. కేసు ఫైల్ చేయక ముందే, ఐటి రిటర్న్స్ కోసం ఎందుకు ప్రభుత్వం పురమాయించిందని, ఇది కచ్చితంగా కక్ష సాధింపు అని అన్నారు. ఇక హరీష్ సాల్వే, ఇది హైకోర్టు మీద నో కాన్ఫిడెన్సు గా అభివర్ణించారు. ఇది హైకోర్టులో తేల్చుకోవాల్సిన అంశం అని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని అన్నారు. భుములు కొనటం తప్పు కాదని, పలానా చోటు ప్రాజెక్ట్ వస్తుంది అనేది అందరికీ తెలిసే విషయమే అని, తెలిసే భూములు కొంటారని అన్నారు. ఇరువరి వాదనలు విన్న కోర్టు గ్యాగ్ ఆర్డర్ పై మాత్రం స్టే విధిస్తూ, ఏసిబి విచారణ పై మాత్రం హైకోర్టు ఉత్తర్వుల పై ఎలాంటి స్టే ఇవ్వలేదు. జనవరి చివరికి ఈ కేసు వాయిదా వేసి, అప్పటి వరకు, ఎలాంటి విచారణ చేయవద్దని ఆదేశించింది. ఇక ఈ కేసులో ప్రభుత్వానికి అయితే ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే గ్యాగ్ ఆర్డర్ పై స్టే ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి వచ్చేది ఏమి లేదు. ఇప్పటికే చేయాల్సిన అల్లరి అంతా ఈ కేసులో చేసారు. కాబట్టి, దీని వల్ల పెద్దగా ఏమి ఉండదు. ఏసిబి విచారణ పై హైకోర్టు ఇచ్చిన స్టే మాత్రం అలాగే ఉంది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా, లోకేష్ గుంటూరు ఎస్పీ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. రెండు రోజుల క్రితం, పొన్నూరులో, ఒక వైసీపీ ఎమ్మెల్యే ప్రహరీ గోడ ఓపెనింగ్ అంటూ ఒక వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో తీసింది, మణిరత్నం అనే ఒక వ్యక్తి. అతనిది దళిత సామజికవర్గం. అయితే ఆయన ప్రహరీ గోడ ఓపెనింగ్ అంటూ, ఉన్న ఫ్లెక్స్ వీడియో తీయటం, అలాగే ఆ గోడ మరో పక్క ఏమి లేకపోవటం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్త వైరల్ అయ్యింది. సోషల్ మీడియా మొత్తం అదే వీడియో రెండు రోజులు తిరిగింది. వైసీపీ ఎమ్మెల్యే పై ట్రోల్స్ వచ్చాయి. కియా, హీరో, అపోలో వంటి కంపెనీ ప్రారంభోత్సవాలు చూసిన ఏపి ప్రజలు, ఇలా ప్రహరీ గోడలు, బోరింగ్ పంపులు ఓపెనింగ్ లు చూస్తున్నారు అంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే నిన్న ఉదయం ఆ వీడియో పోస్ట్ చేసిన మణి రత్నం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు అంటూ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అలాగే నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, పోలీసుల విఖరి ని ఖండించారు. కేవలం పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారా, అతను చేసిన తప్పు ఏమిటి అంటూ పోలీసుల వైఖరిని కూడా తప్పుబడుతూ పోస్ట్ చేసారు. అలాగే ఆ మణిరత్నం అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నేతలు విడిపించుకుని తీసుకుని వచ్చారు.

ln 26112020 2

అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా, గుంటూరు ఎస్పీ ట్విట్టర్ ఎకౌంటు నుంచి, చంద్రబాబు,లోకేష్ పోస్ట్ చేసిన పోస్ట్ లకు రిప్లై ఇస్తూ, ఇది తప్పుడు సమాచారం అని, ఫేక్ ప్రచారం చేస్తున్నారని, మేము ఎవరినీ అరెస్ట్ చేయలేదని, తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటాం అంటూ, పోస్ట్ చేసారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. సహజంగా ఒక అధికారి నుంచి, ప్రతిపక్ష నేతకు ఇలాంటి రిప్లై రాదు. ఏదో రాజకీయ పార్టీ లాగా,అధికారులు ఇలా రిప్లై ఇవ్వటం పై అందరూ ఆశ్చర్యపోయారు. అయితే దీని పై లోకేష్ మళ్ళీ రిప్లై ఇస్తూ, ఎప్సీ గారు మీకు నిజంగా గడ్స్ ఉంటే పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో సీసీ ఫుటేజ్ బయట పెట్టండి అంటూ సవాల్ విసిరారు. అంతే కాదు, మళ్ళీ బాధితుడి వీడియో కూడా పోస్ట్ చేసారు. నిన్న ఎస్పీ గారు ఫేక్ అన్నారు అని, ఈ రోజు కేవలం ప్రశ్నించటానికి పిలిచామని చెప్పారని, సోషల్ మీడియా పోస్ట్ చేస్తే, పోలీసులు ప్రశ్నిస్తారా అని పోస్ట్ చేస్తూ, మీ లిమిట్ లో మీరు ఉండాలని, మీరు డ్యూటీ చేయాల్సింది ఈ రాష్ట్రానికి, ప్రజలకు అని మర్చిపోకండి అంటూ, ట్వీట్ చేసారు. దీని పై ఇంకా ఎలాంటి స్పందన, గుంటూరు ఎస్పీ నుంచి రాలేదు. మరి ఈ విషయం ఎటు దారి తీస్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read