మరో సారి రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, విచ్చల విడిగా రెచ్చిపోతున్న అధికార పార్టీకి, అదిరిపోయే జర్క్ ఇచ్చారు. ఇప్పటికే నామినేషన్ల సమయంలో, వైసీపీ చేసిన అరాచకం గురించి, దాని పై ఎన్నికల కమీషనర్ స్పందించిన తీరు తెలిసిందే. అలాగే, కరోనా మహమ్మారి భారీగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో, ఎన్నికలు పెట్టటం సరి కాదని, ఎన్నికలు వాయిదా వేసి, 5 కోట్ల మంది ప్రాణాలు కాపాడిన దేవుడిగా, నిమ్మగడ్డను ప్రసంసిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పై, జగన్ మోహన్ రెడ్డి అండ్ కో, కుల ముద్ర వేసి విచక్షణ లేకుండా, మాట్లాడిన తీరు అందరికీ తెలిసిందే. చివరకు సుప్రీం కోర్ట్ కూడా, రమేష్ కుమార్ నిర్ణయానికి జై కొట్టింది. అయితే, కరోనా సహాయం పేరుతొ, ఇంటింటికీ వెయ్యి రూపాయాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, స్థానిక సంస్థల్లో పోటీ చేసే అభ్యర్ధులు, వారే ప్రతి ఇల్లు తిరిగి, వెయ్యి రూపాయలు పంచుతూ, చివరికీ వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తిరిగి పంచుతూ, ఫ్యాన్ గుర్తుకు ఓటు వెయ్యండి అని చెప్పిన వీడియోలు నెట్ లో తిరిగాయి. దీని పై ఫిర్యాదు చెయ్యటంతో, ఈ రోజు ఈసీ స్పందించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల నేపథ్యంలో స్వయంసేవకులతో కూడి ఆర్ధిక ప్రయోజనం అందజేయడం , స్వప్రయోజనాల కై ప్రజల మద్దతు కోరడం వంటివి జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎం. రమేష్ కుమార్ అన్నారు. ఈ విషయం పై బిజిపి అధ్యక్షుడు, సిపిఐ కార్యదర్శి వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారని, 13 జిల్లాల జిల్లా ఎన్నికల పరిశీలకులు / జిల్లా కలెక్టర్లు లకు సోమవారం లేఖ వ్రాయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు. కరోనా పరిస్థితి సమయంలో ప్రజలకు ప్రయోజనాల చేకూర్చే పంపిణీ కొత్త పథకం ఎన్నికల ఉల్లంఘన కింద రాదని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ వాడుకలో లేదని తెలిపారు. ఏది ఏమయినప్పటికీ, ఈ సంధి కాలంలో ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతుందని తెలియ చేస్తున్నామన్నారు.

పోటీ చేసే అభ్యర్థులు వారి స్వయ ప్రయోజనం కోసం ప్రచారం చెయ్యడం, ఓటర్లు ను ప్రభావితం చెయ్యడం ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. కావున అటువంటి సంఘటన పై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి, నిజానిజాలను విచారించి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని రావాలన్నారు. సంబంధిత అధికారులందరూ పర్యవేక్షణ ద్వారా అటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్. రమేష్ కుమార్ వారి లేఖలో పేర్కొన్నారు. మరి ఇప్పుడు వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పుడు కూడా, ఆయనకు కులం అంట గుడుతూ, జగన్ వచ్చి ప్రెస్ మీట్ పెడతారో, లేక తమ పార్టీ వారితో, ఇది వరకు పెట్టించినట్టు, 70 ప్రెస్ మీట్లు పెట్టి, ఆయన్ను తిట్టిస్తారో చూడాలి.

కరోనా వైరస్ నియంత్రణకు దేశ ప్రధాని మోడీ పిలుపుతో యావత్ దేశం మొత్తం ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్లోకి వెళ్లి పోయింది. దీంతో లక్షాలాది రూపాయల ఖర్చుతో రైతులు పండించిన పంటలు చేతి కోచ్చే సమయానికి నేలపాలు అవుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం రైతు కూలీలకు అనుమతి ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేటుగా ఆదేశాలు వచ్చాయి. అయినా, బయటకు వచ్చే వారు లేదు. దీంతో పంటలకు తీవ్ర నష్టం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుత పరిస్థితులల్లో రైతులు పంట పొలాల్లోకి వెళ్లి పరిస్థితి లేదు. ఒకవేళ అన్ని ఇబ్బందులను అధిగ మించి పొలాలకు వెళ్లినా, పండించిన పంటలను ట్రాక్టర్, ఇతర రవాణా వాహనాల ద్వారా మార్కెట్లోకి తీసుకొచ్చి వాటిని విక్రయించే పరిస్థితి లేదు. దీంతో రైతులు పండిన పంటను పొలాల్లోనే ఉంచడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో చేతి కొచ్చిన పంట మొత్తం దాదాపు నేలపాలవుతోంది. పంట దిగుడికోసం పెట్టిన లక్షాలాది రూపాయిల పెట్టుబడి మొత్తం వృధా అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

చివరికి రైతు పండించిన పంట నేలపాలు అవటంగాని, లేక సరైన గిట్టుబాటు - ధరలేక పోవటంతో రైతులు అప్పుల పాలవుతు న్నారు. ముఖ్యంగా పూలు, పండ్లు, కూరగాయలు, మిర్చి, పసుపుతోపాటు సీజన్ పండ్లు అయిన మామిడి, సపోటా, కమలాలు, పుచ్చకాయలతో సహా అనేక రకాల పంటలు పండించే రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా మామిడి, పుచ్చకాయ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి ముఖ్యకారణం లాక్ డౌన్లో ఎక్కడి రవణా ఆక్కడ స్తంభించిపోవడం. దేశంలోని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి ఆలాగే రాష్ట్రాల్లో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర సేవలు, నిత్యావసర సరకుల కోసం మాత్రమే ప్రజలు ఇంటి బయటకి వచ్చి నిర్ణీత సమయంలో వాటిని కొనుగోలు చేసుకొని తిరిగి ఇంటికి వెళ్లి పోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

రైతులు పండించిన పంటను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు అనేక సమస్యలను రైతులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు అవసరమైన, నిత్యవసరాలైన కూరగాయలు, పండ్లులను మార్కెట్లోకి రైతులు తీసుకోచ్చెటప్పుడు వారికి ఏవిధమైన ఆటంకాలు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, అవసరం అయితే ప్రభుత్వమే , ఈ పండ్లు, కూరగాయలు కొని, ప్రజల వద్దకే మొబైల్ రైతు బజార్లు పెట్టి అమ్మాలని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అలాగే మిగతా పంటలకు కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని కోరారు. నిత్యవసరాలైన పూలు, పండ్లు, కూరగాయ లతోపాటు సీజనల్ పండ్లు పండించే రైతులకు కూడా ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే నష్టం జరిగిపోయింది అని, ఇప్పటికైనా మేల్కొని, ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు కోరుతున్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 252గా నిర్ధరణ అయింది. కేవలం 20 గంటల్లో 60 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 60 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొంది. అత్యధికంగా ఇవాళ కర్నూలు జిల్లాలో 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో దిల్లీలోని సభకు హాజరై వచ్చినవారు, వారి సన్నిహితులే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది. అంతేకాకుండా వారి సంబంధీకులు ఆరుగురికి ఈ వైరస్ సోకింది. వీరితో పాటు వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన మరో ఆరుగురు వ్యక్తులకు పాజిటివ్​గా తేలిందని హెల్త్​ బులెటిన్​లో పేర్కొన్నారు. మొత్తం బాధితుల్లో ఐదుగురు వ్యక్తులు కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు మృతి చెందారు. ఇక మరణాల సంఖ్య కూడా మూడుకు చేరింది. విజయవాడ, హిందూపురం, మచిలీపట్టణంలో ఈ మరణాలు ఉన్నాయి.

కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి గుంటూరులో లాక్ డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రకటించారు. జిల్లాలో 30 కేసులు నమోదు కాగా... వాటిలో 15 కేసులు గుంటూరు నగరంలోనే నమోదయ్యాయని తెలిపారు. రేపు ఉదయం నుంచి గుంటూరు మీదుగా ఇతర ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిషేధించినట్లు ఆనంద్​ కుమార్ వెల్లడించారు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో కలిసి జీజీహెచ్​ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సిబ్బందికి మాస్కులు, గ్లౌజులను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పంపిణీ చేశారు. వైద్యసిబ్బందికి 2వేల పీపీఈ కిట్లను విజ్ఞాన్ సంస్థల తరపున జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడికి అందించారు.

గుంటూరులో లాక్ డౌన్​కు సహకరించాలని ప్రజలను కలెక్టర్ కోరారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులను తామే అందజేస్తామన్నపాలనాధికారి.. ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. వైద్యసేవలన్నీ ఎస్మా చట్టం పరిధిలోకి వచ్చినందున ప్రైవేటు వైద్యసిబ్బంది సైతం సహకరించాలని ఆదేశించారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి అన్ని ఏర్పాట్లు చేశామని.. ఎవరూ దుష్ప్రచారం చేయవద్దని కోరారు. మరో పక్క, తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన వైద్యులు రూ.3.35లక్షలను సీఎం సహాయనిధికి అందించారు. చెక్కు రూపంలో ఈ మొత్తాన్ని స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి అందజేశారు

పాలకొల్లు నుంచి ఏలూరు వరకు తెదేపాఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్ పై కలక్టర్ ఆఫీస్ కు బయలేదారు. రైతుల సమస్యలపై ఫోన్‌లో మాట్లాడదామంటే కలెక్టర్‌, ఎస్పీ, తదితర జిల్లా అధికారులు అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు. ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్​ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు, బకాయిలు, సాగునీరు అందించాలని పాలకొల్లు నుంచి సైకిల్​పై ఏలూరు వెళ్లి కలెక్టర్​కు వినతిపత్రం అందచేయనున్నట్లు తెలిపారు. ఆక్వా వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు. వారినుంచి స్పందన రాని కారణంగానే రైతుల కష్టాలను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపించేందుకు సైకిల్‌పై ఏలూరు వెళ్తున్నట్లు చెప్పారు. ఆక్వా వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి గట్టెక్కించడానికి ఎన్ని రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో రైతుల వ్యదను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపించడానికి వెళ్తున్నట్టు చెప్పారు.

ఆయన మాట్లాడుతూ, "నా ఇంట్లో నా 4 గురు సభ్యులే నా కుటుంబం అనుకోవడం లేదు , నా నియోజక వర్గ ప్రజలు అందరు నా కుటుంబంగా భావిస్తున్నాను. సమస్యలపై మాట్లాదామంటే కలెక్టర్ , SP , వంటి జిల్లా అధికారులు కనీసం ఫోన్ లో అందుబాటులో ఉండటం లేదు. ప్రజా ప్రతినిధితో మాట్లాడం కంటే ఇంకా ఎక్కువ ముఖ్యమైన పనులు కలెక్టర్ , SP లకు ఎమున్నాయో నాకు తెలియడం లేదు. కలెక్టర్ , SP వంటి జిల్లా అధికారులు అందుబాటులోకి లేకపోవడంతోనే కరోనను ప్రక్కన పెట్టి ఏలూరు వెళ్లవలసి వస్తుంది. ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి, ఆక్వా వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి గట్టెక్కించడానికి ఎన్ని రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో రైతుల వ్యదను ప్రభుత్వానికి మరింత గట్టిగా వినిపించడానికి సైకిల్ పై వెళ్తున్నాను"

"ఆక్వా ఉత్పత్తులను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. వ్యవసాయ రంగంలో మంత్రుల ప్రకటన ధరలకు క్షేత్ర స్థాయిలో ఉన్న ధరలకు పొంతనలేదు. ఆక్వా రైతులను ఆదుకునే విధంగా ఆక్వా ఉత్పత్తులకు ధరల స్థిరికరణ నిధి నుండి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలి. ఆక్వా రైతులను ఆదుకోవడానికి ఒక కేజీ ఆక్వా ఉత్పత్తికి రు. 50 లు ప్రభుత్వం మద్దతు ధర అందించాలి. దాళ్వా పంటకు ఎకరాలకు 30 వేలు పెట్టుబడి పెట్టి సాగు నీరు లేక పంట కోల్పోయిన రైతులకు పెట్టుబడి నష్టం ప్రభుత్వం చెల్లించాలి. వరి, మిర్చి , పసుపు, బొప్పాయి, అరటి , ఇలా వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి" అంటూ ఆయన డిమాండ్ చేసారు. అయితే, రామానాయడుని పోలీసులు ఏలూరు వద్ద అడ్డుకున్నారు. పర్మిషన్ లేదని చెప్పారు. అయితే వైసీపీ నేతలు హడావిడి చేస్తూ గుంపులు గుంపులుగా వెళ్తున్నారని, తాను ప్రజా సమస్యల పై, ఒక్కడినే, సైకిల్ మీద వెళ్తుంటే, ఎందుకు ఆపుతున్నారని, మీరు పెళ్ళాం బిడ్డలని వదిలేసి ఎలా ప్రజా సేవ చేస్తున్నారో, నేను కూడా నన్ను ఎన్నుకున్న ప్రజల కోసం, వారి సమస్యల కోసమే, ఒక్కడినే, అదీ సైకిల్ పై వెళ్తున్నాని, రామానాయడు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read