ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 13 కేసులు నమోదు కాగా... ఈ రోజు మరో మూడు కేసులు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు చెప్పారు. కర్నూలు జిల్లాలో ఉంటున్న రాజస్థాన్​ యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం అతను ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నాడు.... ఎక్కడెక్కడ తిరిగాడనే వివరాలను సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఆ గ్రామం 3 కిలోమీటర్ల చుట్టూ కరోనా జోన్​గా ప్రకటించారు. ఏపీలో మరో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నిర్ధరణ అయిందని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.

సంజామల మండలం నొసం గ్రామంలో ఉంటున్న 23 ఏళ్ల రాజస్థాన్ యువకుడికి కరోనా సోకినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. అంతేకాకుండా నొసం గ్రామం 3 కిలోమీటర్ల చుట్టూ కరోనా జోన్​గా.... 7 కిలోమీటర్ల చుట్టూ కొవిడ్- 19 బఫర్ జోన్​గా ప్రకటించారు. రాకపోకలను బంద్ చేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా చీరాలలో దంపతులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 12న ఢిల్లీలో దంపతులిద్దరు మతపరమైన కార్యక్రమానికి వెళ్లి 18న ఒంగోలుకు వెళ్లినట్లు గుర్తించారు. వీరిని ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16కు చేరింది.

నొసం గ్రామానికి ఈనెల 23న రాజస్థాన్‌ నుంచి నలుగురు వచ్చారు. వారిలో ప్రస్తుత బాధితుడు ఒకరు. వారు నంద్యాల నుంచి నొస్సం మీదుగా కడప జిల్లా ఎర్రగుంట్లకు వెళ్లే రైల్వే రహదారి నిర్వహణ పనులు పర్యవేక్షిస్తున్నారు. రాజస్థాన్‌ నుంచి వచ్చిన మొత్తం 22 మంది ఈ పనులను చేస్తున్నారు. ఈనెల 25న బాధితుడు విపరీతమైన జ్వరంతో కర్నూలు సర్వజన వైద్యశాలలోని అత్యవసర విభాగంలో రాత్రి 11 గంటలకు చేరాడు. అతడిని వైద్యులు ఆస్పత్రిలోని మూడో వార్డులో చేర్పించారు. అతని నమూనాలు తీసి ల్యాబ్​కు పంపగా అతనికి కరోనా ఉందని ఇవాళ నిర్ధరణ అయింది. ప్రస్తుతం బాధితుడిని ఐసోలేటెడ్‌ వార్డుకు తరలించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అతనికి చికిత్స చేసిన మూడో యూనిట్‌లో ఇప్పటికే కొందరు రోగులు డిశ్చారి అయి వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరందరినీ అదుపులోకి తీసుకోనున్నారు. బాధితుడితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు.

COVID-19 వ్యాప్తిని నియంత్రించడానికి విధించిన లాక్డౌన్ మధ్య , ఎనిమిదేళ్ల కుమారుడు సకాలంలో వైద్య చికిత్స పొందలేక మరణించాడు. అనంతపూర్ జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్లాలో ఈ సంఘటన జరిగింది. మనోహర్ తన కుటుంబంతో కలిసి, గోరంట్లలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో గుడారంలో జీవిస్తున్నారు. తుక్కు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ముగ్గురు కుమారులలో పెద్దవాడు, దేవా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. COVID-19 దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించినందున, అతనికి పనులు లేవు, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. మనోహర్, అతని భార్య మొదట దేవాను గోరంట్ల పిహెచ్‌సికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మార్చి 22 న హిందూపూర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

బాలుడిని పరీక్షించిన తరువాత, మెరుగైన చికిత్స కోసం అనంతపూర్ జిజిహెచ్ లేదా కర్నూలు జిజిహెచ్ వద్దకు తీసుకెళ్లాలని హిందూపూర్ జిజిహెచ్ వైద్యులు మనోహర్‌కు సూచించారు. కానీ అతను, డబ్బులు లేక, అలా చేయలేకపోయాడు. ఇంతలో, బాలుడు హిందూపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. హృదయ విదారక, మనోహర్ తన కొడుకు మృతదేహాన్ని ఇంటికి తిరిగి తీసుకెళ్లాలని అనుకున్నాడు కాని తగినంత డబ్బు లేదు. అతను ప్రజలను వేడుకున్నాడు. మృతదేహాన్ని తిరిగి గోరంట్లాకు తీసుకెళ్లడానికి ఒక ప్రైవేట్ అంబులెన్స్‌ మాట్లాడటానికి, డబ్బును సేకరించాడు.

వైద్యం కోసం రూ.6వేలు ఖర్చుచేశానని, రూ.1700తో ప్రైవేట్‌ ఆంబులెన్స్‌లో కుమారుడి మృతదేహాన్ని గోరంట్లకు తీసుకొచ్చినట్లు తెలిపారు. అసలే లాక్‌డౌన్‌ ప్రభావం. పైగా చేతిలో చిల్లిగవ్వలేక పోవడంతో కుమారుడి శవాన్ని చేతులపై ఎత్తుకుని సమీపంలోని చిత్రావతి ఒడ్డున ఖననం చేశాడు. హిందూపూర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కేసవులు మాట్లాడుతూ, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అతను భారీ టాన్సిల్స్ మరియు న్యుమోనియాతో బాధపడ్డాడు. "మేము వారిని ఉన్నత ఆసుపత్రికి సూచించినప్పటికీ, వారు సంశయించారు," అని డాక్టర్ చెప్పారు. గొంతులో టాన్సిల్స్ పేలడంతో బాలుడు మరణించాడు. గురువారం, తన కొడుకు యొక్క చివరి కర్మలు కూడా చేయటానికి డబ్బు లేని మనోహర్, మృతదేహాన్ని తన చేతుల్లోకి తీసుకువెళ్ళి, శ్మశాన వాటిక వరకు నడిచాడు. COVID-19 లాక్‌డౌన్ మనోహర్ వంటి వ్యక్తుల దుస్థితిని మరింత దిగజార్చింది.

విశాఖపట్నంలో, 70 వేల కోట్లతో, వచ్చే డేటా సెంటర్ పై ఆదానీ వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో, భారీ ప్రాజెక్ట్ నుంచి కూడా అదనీ వైదొలిగింది. శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలంలో నిర్మించతలపెట్టిన భావనపాడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టు పనుల నుంచి కూడా అదానీ తప్పుకున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం, టెండర్లు రద్దు చేసుకుంది. 2300 ఎకరాల్లో భావనపాడు పోర్టు నిర్మాణానికి అదానీ కంపెనీ, సెజ్ లిమిటెడ్ గతంలో టెండర్లు దక్కించుకున్నాయి. షేర్ల పై 2018 మార్చి 27న లెటర్ ఆఫ్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నాయి. పీపీపీ ద్వారా 33 ఏళ్లు కలిసి పనిచేసేందుకు ఈ రెండూ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఒప్పందం ప్రకారం, అవసరమైన భూ సేకరణ చేపట్టాలని గత ప్రభుత్వం కలెక్టర్‌కు ఆదేశించింది. ఒప్పందం ప్రకారం, మర్రిపాడు, భావనపాడు, దేవునళ్తాడ గ్రామాల పరిధిలోని భూ సేకరణకు చర్యలు చేపట్టారు. పోర్టు నిర్మాణానికి అవసరమైన 2300 ఎకరాల భూమికి రూ.1202 కోట్లు అవసరమని కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

అయితే ప్రభుత్వం మారటంతో, కాకినాడ డైరెక్టర్ ఆఫ్ పోర్ట్స్ గత ఏడాది సెప్టెంబర్‌ 27న తాము రూ.500 కోట్లు మాత్రమే భూములకు చెల్లించగలమని, మిగిలిన రూ.702 కోట్లు తము సాధ్యం కాదని ప్రకటించింది. అయితే దీనికి అదానీ కంపెనీ ఏకీభవించలేదు. తాము అగ్రిమెంట్ రద్దు చేసుకుంటామని, ఇప్పటి వరకు చెల్లించిన ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫీజు, బ్యాంక్ గ్యారెంటీ తిరిగి చెల్లించాలని కోరింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఈవో పోర్టు ట్రస్ట్ ఈ విషయాన్ని పరిశీలించి అదానీ కంపెనీ టెండర్ల రద్దుకే మెగ్గుచూపింది. ఈ మేరకు ప్రభుత్వం ఒప్పందం రద్దు చేస్తూ, జిఒ నంబరు 17ని విడుదల చేసింది. పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి అదానీ పోర్ట్సు తప్పుకోవడంతో కొత్త సంస్థకు అప్పగించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచనకు, ఇప్పుడు మార్గం సుగుమం అయ్యింది.

కరోనా మన దేశంలో వస్తుంది అంటే, అదే విదేశీ ప్రయాణికులు వల్ల. మన దేశంలో, గత రెండు నెలల్లో, 15 లక్షల మంది, విదేశాల నుంచి వచ్చారని కేంద్రం చెప్పింది. ఇక మన రాష్ట్రానికి వస్తే, ఇప్పటికీ ఎంత మంది వచ్చారు అనే దాని పై క్లారిటీ లేదు. ఈ సమస్య గురించి ఏపి ప్రభుత్వం స్పందించటం మొదలు పెట్టిన సమయంలో, 11 వేల మంది విదేశాల నుంచి వచ్చారని ప్రభుత్వం చెప్పింది. తరువాత వాలంటీర్లు ద్వారా సర్వే చేసామని, ఈ సంఖ్య 12 వేలు అని అన్నారు. ఇక ఆ తరువాత, ప్రెస్ మీట్లలో, 13 వేలు అని, 14 వేలు అని, ఇలా రోజుకి ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు. ఇక తాజాగా, మొన్న జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో, ఆ సంఖ్యను అమాంతం పెంచేసి, 26 వేలు చేసారు. ఈ రోజు ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ బులిటెన్ లో, ఈ సంఖ్య, 29 వేలుకి పెరిగిపోయింది.

అయితే, ఈ సంఖ్య ఎందుకు ఇలా పెరిగిపోతూ వస్తుంది ? వీళ్ళు ఏమైనా చొరబాటుదారులా, వారి మీద ట్రాకింగ్ లేకుండా ఉండటానికి ? కాదు కదా. వీరు ఎయిర్ పోర్ట్ లు లో నుంచే వస్తారు. ఎంత మంది వచ్చారు, వారు ఏ రాష్ట్రం వారు అనేది, కచ్చితమైన సమాచారం కేంద్రం వద్ద ఉంటుంది. కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అడిగితే, పాస్ పోర్ట్ నెంబర్లు, అడ్డ్రెస్లతో సహా ఇస్తారు. ఇచ్చాం అని కూడా కేంద్రం చెప్తుంది. మరి, ఇంకా ఎందుకు ఈ కన్ఫ్యూషన్ ? ప్రతిపక్షాలు కాని, ప్రజలు కాని, ఇదే విషయం పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఎందుకుంటే, వీరి వల్లే కరోనా వ్యాప్తి చెందేది.

ఈ రోజు కూడా డీజీపీ మాట్లాడుతూ, ఇంకా కొంత మంది విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రేస్ చెయ్యలేదు అని, వారు వెంటనే మా ముందుకు రావాలి అంటున్నారు. ఇంత కన్ఫ్యూషన్ మధ్యన, ప్రభుత్వం ఈ విషయం పై స్పందించింది. మంత్రి పేర్ని నాని స్పందిస్తూ, ఈ విషయం పై క్లారిటీ ఇచ్చినా, అది సంతృప్తిగా లేదు అని చెప్పాలి. మంత్రిగారు మాట్లాడుతూ, మొదటి విడతలో చేసిన సర్వేలో, 12 వేలు వచ్చారని, తరువాత, లాక్ డౌన్ ప్రకటించటంతో, విమానాలు ఆగిపోవటంతో, అందరూ ఒకేసారి విదేశాల నుంచి రావటంతో, రెండో సారి వాలంటీర్లు చేసిన సర్వేలో ఆ సంఖ్య పెరిగింది అని చెప్పారు. అయితే, మంత్రి కాని, ప్రభుత్వం కాని, వాలంటీర్ల సర్వే పై కాకుండా, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే, ఇమిగ్రేషన్ నుంచి, కచ్చితమైన సమాచారం వస్తుంది కదా ? మరి ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు మాట్లాడటం లేదు, అనేది మాత్రం అర్ధం కావటం లేదు. కేవలం వాలంటీర్ల సర్వే ప్రతాపదికిన, విదేశాల నుంచి వచ్చే వారిని ట్రేస్ చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read