శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన షాక్ తో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, తీవ్ర ఇరకాటంలో పడింది. నిన్న అసెంబ్లీలో ఆమోదించిన మూడు రాజధానుల బిల్లుని, ఈ రోజు శాసనమండలిలో వైసీపీ ప్రవేశ పెట్టటం, వెంటనే, తెలుగుదేశం పార్టీ రూల్ 71 కింద నోటీస్ ఇవ్వటంతో, వైసీపీ విలవిలలాడుతుంది. రూల్ 71 ప్రకారం, ప్రభుత్వ పాలసీ డెసిషన్ ను వ్యతిరేకించవచ్చు. ఇది కనుక సభ ఆమోదం పొందితే, ఇక ఆ బిల్లు పెట్టటానికి, ప్రభుత్వానికి వీలు ఉండదు. ఎలా అయినా బిల్ టేబుల్ చేస్తే చాలు, డీమ్డ్ టు బీ పాస్ అని చెప్పుకుని, వెళ్లిపోవచ్చని ప్రభుత్వం భావించింది. అయితే, తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా, రూల్ 71 నోటీసు ఇవ్వటంతో, ప్రభుత్వానికి ఊపిరి ఆడటం లేదు. విజయసాయి రెడ్డి, కూడా శాసనమండలిలో ఉంటూ, మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం లాయర్లు కూడా ఈ విషయంలో ఏమి చెయ్యలేం అని చేతులు ఎత్తేసారు. చివరగా దీనికి ఒకటే పరిష్కారం అని ప్రభుత్వం భావిస్తుంది. అదే శాసనమండలి రద్దు.

assembly 21012020 2

ఈ రాత్రికి అత్యవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, రేపు శాసనమండలిని రద్దు చేస్తున్నామని, దీనికి సంబంధించి బిల్లుని, రేపు అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్నాం అంటూ వైసీపీ ప్రభుత్వం లీకులు ఇచ్చి, తెలుగుదేశం ఎమ్మెల్సీలను భయ పెట్టే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులో కూడా ప్రతిపక్షం నుంచి ఇలాంటి ఇబ్బందులే వస్తాయని, జగన్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకే శాసనమండలి రద్దు చేస్తాం అంటుంది. అయితే, ఇది టెక్నికల్ గా ఎంత వరకు సాధ్యం అనేది చూడాల్సి ఉంది. మరో పక్క, ఈ బెదిరింపుల పై శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల స్పందించారు. శాసనమండలిని రద్దు చేయడం అంత సులభం కాదని యనమల వ్యాఖ్యానించారు. శాసనమండలి రద్దు చెయ్యాలంటే, చాలా పెద్ద ప్రక్రియ అని అన్నారు.

assembly 21012020 3

కేవలం కేవలం పార్లమెంటు నిర్ణయంతోనే శాసనమండలి రద్దు సాధ్యమవుతుందని చెప్పారు. ఇదంతా పూర్తీ కావటానికి, మరో ఏడాది పడుతుందని అన్నారు. అలాగే నారా లోకేష్ స్పందిస్తూ, లాంటి బెదిరింపులకు భయపడం అని అన్నారు. మండలి రద్దుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ కేవలం తీర్మానం మాత్రమే చేయగలదని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా మండలిలో తాము కూడా తీర్మానం చేయగలమని తెలిపారు. అయితే దీనికి సంబంధించి టిడిపి ఒక మెసేజ్ న్ మీడియాకు ఇచ్చింది. "Who can abolish a legislative council? The power of abolition and creation of the State legislative council is vested in Parliament of India as per article 169. But again, to create or to abolish a state legislative council, the state legislative assembly must pass a resolution, which must be supported by majority of the strength of the house and 2/3rdmajority of the present and voting(Absolute  + Special Majority). When a legislative council is created or abolished, the Constitution of India is also changed. However, still, such type of law is not considered a Constitution Amendment Bill.  (Article 169). The resolution to create and abolish a state legislative council is to be assented by the President also."

నిన్న శాసనసభలో, వికేంద్రీకరణ బిల్లు పై జరిగిన చర్చలో, మంత్రులు, ఒక్కోక్కరు చంద్రబాబు పై ఎలా హేళన చేస్తూ మాట్లాడారో చూసాం. వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా, చంద్రబాబు మాత్రం ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా, అన్నీ భరించారు. ఎన్ని మాటలు అన్నా ప్రజల కోసం పడతాను అని చెప్పారు. అయితే, ఒక్క రోజులోనే సీన్ రివర్స్ అయ్యింది. నిన్న అలా హేళన చేస్తూ మాట్లాడిన మంత్రులు, ఈ రోజు ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. శాసనమండలిలో, 14 మంది మంత్రులు, శాసనమండలి చైర్మెన్ పోడియం వద్దకు వచ్చి నిరసన తెలుపుతూ, సభ జరగనివ్వకుండా చేయ్యాటంతో, ప్రభుత్వమే సభ నడవనివ్వకుండా చెయ్యటం సిగ్గు చేటు అంటూ, తెలుగుదేశం సభ్యులు షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేసారు. ఏకంగా మంత్రులే ఆందోళన చెయ్యటంతో, చైర్మెన్ సభను 10 నిమిషాలు వాయిదా వేసారు. ఈ రోజు శాసనమండలిలో, వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం తరుపున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు.

sasanamandali 21012020 2

అయితే వెంటనే అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ, రూల్‌ 71 మోషన్‌ కింద నోటీసు ఇచ్చింది. బిల్ కంటే ముందే ఈ నోటీస్ పై చర్చించాలని కోరింది. రూల్స్ అన్నీ చూసిన చైర్మెన్, రూల్ 71 నోటీసుపై చర్చకు అనుమతిచ్చారు. రూల్ 71 అంటే, ప్రభుత్వం తీసుకున్న పాలసీ డెసిషన్ పై, వ్యతిరేకత తెలపటం. ఈ రూల్ 71 పై చర్చ జరిగితే, ఇక ప్రభుత్వం, వికేంద్రీకరణ బిల్లు కాని, సీఆర్డీఏ రద్దు బిల్లు కాని ప్రవేశ పెట్టే అవకాసం ఉండదు. దీంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. శాసనమండలిలో బిల్ పెడితే చాలు, 14 రోజులు తరువాత డీమ్డ్ టు బి అప్రూవ్ కింద అయిపోతుందని, అందుకే శాసనమండలిలో బలం లేకపోయినా, తెలుగుదేశం పార్టీ తిరస్కరించినా, ఎలాగైనా బిల్ ని ఆమోదింపచేసుకోవచ్చు అం భావించారు.

sasanamandali 21012020 3

అయితే అనూహ్యంగా ఈ రోజు ఉదయం, తెలుగుదేశం పార్టీ రూల్‌ 71 మోషన్‌ కింద నోటీసు ఇవ్వటంతో, ప్రభుత్వానికి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో, ఇలా కుదరదు, ప్రభుత్వాలు ఇలా అయితే నడవవు అంటూ, ఆందోళన బాట పట్టారు. 14 మంది మంత్రులు కౌన్సిల్ చైర్మెన్ పోడియంని చుట్టు ముట్టి నినాదాలు చేసారు. దీనికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వమే ఇలా చెయ్యటం సిగ్గు చేటు, అంటూ షేమ్ షేమ్ అంటూ, నినాదాలు చేసింది. దీంతో, సభలో గందరగోళం ఏర్పడింది. తెలుగుదేశం ఇచ్చిన నోటీసు తో, వికేంద్రీకరణ బిల్లుకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. మండలిలో బిల్లు పెట్టి వీగిపోతే డీమ్డ్ టూ బీ పాస్డ్ కింద ప్రభుత్వానికి ఆమోదం చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు బిల్లే పెట్టకపోతే డీమ్డ్ టు బీ పాస్డ్ కష్టమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అసెంబ్లీ నుంచి తెదేపా సభ్యుల్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభలో సీఎం జగన్‌ మాట్లాడుతుండగా తెదేపా సభ్యులు పోడియం వద్దకు వచ్చి అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు. దీంతో సీఎం జగన్‌ స్పందిస్తూ ఉద్దేశపూర్వకంగానే తెదేపా సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారని.. ఆ పార్టీ సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేయాలని స్పీకర్‌కు సూచించారు. దీంతో సభా వ్యవహారాల మంత్రి బుగ్గన లేచి సస్పెండ్‌ చేయాల్సిన సభ్యుల పేర్లు చదివి వినిపించారు. అనంతరం స్పీకర్‌ సభ నుంచి తెదేపా సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుకి మాట్లాడే అవకాసం ఇవ్వకుండా, పదే పదే అడ్డు పడుతూ, గంటన్నర మాట్లాడారు అంటూ అసత్యాలు చెప్పినందుకు, టిడిపి ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే, వారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చెయ్యటంతో, అసెంబ్లీ లాబీల్లో నేల పైన కూర్చుని, చంద్రబాబుతో సహా నిరసన.

suspend 20012020 2

నేల పైన కూర్చుని నిరసన తెలుపుతున్న చంద్రబాబు సహా, టిడిపి ఎమ్మెల్యేలు. ఇక్కడ ఉండ కూడదు అని లాగేసిన మార్షల్స్. టిడిఎల్పీ నుంచి కూడా వెళ్ళిపోవాలని, మార్షల్స్ దౌర్జన్యం. దీంతో బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు. సియం కాన్వాయ్ ను అడ్డుకునేందుకు అసెంబ్లీ ప్రాంగణం మెయిన్ గేట్ వద్దకు బయల్దేరిన టీడీపీ శాసనసభ్యుల బృందం. రాజధానికి భూములిచ్చిన రైతులు, మహిళలు, రైతుకూలీలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా చంద్రబాబు మౌనదీక్ష. శాసనసభ ప్రధానద్వారం వద్ద ఒక్కడే మెడలో నల్లకండువతో చంద్రబాబు. టీడీపీ ఎమ్మెల్లేలను నిరంకుశంగా సభనుంచి సస్పెండ్ చేయడంపై చంద్రబాబు నిరసన. సస్పెండ్ అయినా సభ్యులకు సంఘీభావంగా మెట్లపై చంద్రబాబు బైఠాయింపు. ఇరవై నిముషాలుగా చంద్రబాబు బైఠాయింపు.

suspend 20012020 13

అంతకు ముందు చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ ను చేతులు జోడించి వేడుకున్నారు. ‘‘అమరావతిని ఆపేశారు. పెట్టుబడులు తరలిపోతున్నాయి. హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ పెరిగింది. చిన్నవాడైనా ముఖ్యమంత్రికి రెండు చేతలెత్తి దండం పెడుతున్నా. రాజధానులపై పునరాలోచన చేయండి. తొందరపడొద్దు. మూడు రాజధానులు ప్రపంచంలో ఎక్కడా విజయవంతం కాలేదు. కడపకిచ్చినట్లు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కూడా నిధులు ఇస్తే మరింత సంతోషిస్తా. అంతే తప్ప రాజకీయంగా వెళితే మీకూ, రాష్ట్రానికి నష్టం. భూములిచ్చిన రైతులు గురించి ఆలోచించండి’’ అని చంద్రబాబు అన్నారు.

శాసనమండలిలో నిన్న అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులను, శాసనసభలో ప్రవేశపెట్టేందుకు, వైసీపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. శాసనమండలి ప్రారంభం కాగానే, మండలి చైర్మెన్ ఈ రెండు బిల్లుల పై అనౌన్స్ చేసారు. అయితే దాని కంటే, ముందుగానే, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, లెగిసి, రూల్ 71 కింద నోటీసు ఇచ్చి, చర్చకు పట్టు పట్టారు. ఆ నోటీస్ మీద ఓటింగ్ జరగాలి అని పట్టు పట్టారు. దీంతో మండలి స్పీకర్ షరీఫ్ ఆ నోటీస్ కు అనుకూలంగా ఉండే వాళ్ళు ఎవరూ అంటూ, అడగటంతో, తెలుగుదేశం సభ్యులు అందరూ నోటీస్ కి అనుకూలంగా చెప్పటం, 20 మంది కంటే, ఎక్కువ సభ్యులు ఒప్పుకోవటంతో, ఈ నోటీస్ స్వీకరిస్తున్నామని మండలి చైర్మెన్ చెప్పారు. అయితే ముందుగా బిల్లులు ప్రవేశ పెట్టాలని, తరువాత ఏదైనా అని మంత్రి బుగ్గన పట్టు పట్టారు. రూల్ 71 కింద ఇచ్చిన నోటీసు పై చర్చ జరపవద్దు అంటూ ప్రభుత్వం తరుపున కోరారు. అయితే, ఈ సందర్భంలో, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, మంత్రి బుగ్గన మధ్య వాదనలు జరిగాయి.

council 21012020 2

అయితే, బిల్లులు ప్రవేశపెట్టటానికి అవకాశం లేదు, నోటీస్ మీద చర్చ జరగాలి అని యనమల పట్టు బట్టారు. అయితే, ఈ సందర్భంలో, బొత్సా స్పందిస్తూ, యనమల పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో, గందరగోళం నెలకొంది. అయితే ఇదే సందర్భంలో, మండలి పై బొత్సా చేసిన వ్యాఖ్యలు యనమల సభ దృష్టికి తీసుకు వచ్చారు. శాసన మండలిలో బిల్ పాస్ కాక పొతే, శాసనమండలి బయట, లోపల ఏమి జరుగుతుందో చూస్తారు అంటూ బొత్సా చేసిన వ్యాఖ్యలు, సభ గౌరవాన్ని కించ పరిచేలా ఉన్నాయని, బొత్సా పై చర్యలు తీసుకువాలని కోరటంతో, ఇరు వర్గాలు వాదనలకు దిగాయి. బొత్సా క్షమాపణ చెప్పి, బిల్లులు ప్రవేశ పెట్టాలని కోరారు. అయితే, ఇదే విషయం పై, సభలో చర్చ జరుగుతుంది.

council 21012020 3

ముందుగా, ఏది చెప్పట్టాలి అనే విషయం పై, చైర్మెన్ కూడా, చర్చలు జరుపుతున్నారు. అయితే తెలుగుదేశం వ్యూహంతో ఖంగుతిన్న ప్రభుత్వం, వెంటనే లైవ్ ప్రసారాలు నిలిపివేసింది. అయితే లైవ్ ప్రసారాలు నిలిచి పోవటానికి, సాంకేతిక కారణాలు సాకుగా, అధికారులు చెప్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం, ఈ చర్యను తప్పు పడుతున్నాయి. లైవ్ ప్రసారాలు ఆపేసి, లోపలా ఏమి జరుగుతుందో తెలియకుండా, ప్రభుత్వం , ప్రతిపక్షాలు ఏమి చెప్తున్నారో ప్రజలు చూడకుండా చెయ్యటం అన్యాయం అని ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నా, ఇప్పటి వరకు , 11 గంటల వరకు అయితే, శాసన మండలి లైవ్ ఇవ్వలేదు. విభజన నాటి సమయంలో, ఆ నాటి ప్రభుత్వం కూడా, పార్లమెంట్ లో ఇలాగే చేసిందని, గుర్తు చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read