ఆంధ్రప్రదేశ్ లో కేబుల్ ఆపరేటర్లకు ప్రభుత్వం వైపు నుంచి వార్నింగ్ ఇచ్చారా ? తాము చెప్పినట్టు చెయ్యాల్సిందే, లేకపోతే కేబుల్ పీకి, ఏపి ఫైబర్ నెట్ అన్ని ఇళ్ళకు ఇస్తాం అని వార్నింగ్ ఇచ్చారా ? అవును అని చెప్తుంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంచలన కధనం. మంత్రులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, కలిసి కేబుల్ ఆపరేటర్లకి వార్నింగ్ ఇచ్చారని, ఇద్దరు మంత్రులు కేబుల్ ఆపరేటర్లతో సమావేశమైన వీడియో ప్రసారం చేసింది ఏబీఎన్. ఈ సమావేశం పెర్ని నాని కార్యాలయంలో జరిగిందని, ఆ కధనంలో పెర్కుంది. అక్కడ సమావేశానికి వచ్చిన ఎంఎస్ఓ లను కూడా వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. మంత్రులు ఇద్దరూ, లోపల ఏమి చెప్పారో చెప్తూ, కధనం ప్రసారం చేసింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై వ్యతిరేక కధనాలు వేసే ఏ ఛానెల్ కూడా మీరు ప్రసారం చెయ్యకూడదు అంటూ, కేబుల్ ఆపరేటర్లకి మంత్రులు హుకం జారీ చేసారని ఆ కధనం సారంశం.

abn 13092019 2

అయితే మంత్రుల ఆదేశాలకు కొంత మంది ఎమ్మెస్వోలకు అది కుదరదు అని తేల్చి చెప్తూ, ట్రాయ్ తీసుకు వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారుడు కోరుకున్న చానల్ ను అందించాల్సి ఉంటుందని, అందులో ఫ్రీ చానల్ విషయంలో ఇవ్వాల్సిందే అని నిబంధనలు చెప్తున్నాయని, ఏబీఎన్ ఫ్రీ ఛానెల్ అని, దాన్ని బ్యాన్ చేస్తే చట్ట విరుద్ధమవుతుందని ఎమ్మెస్వోలు, మంత్రులకు చెప్పగా, వారి సమాధానంపై మంత్రులు సీరియస్ అయినట్లుగా ఆ కధనంలో ఏబీఎన్ చెప్పింది. అయితే దానికి మంత్రులు స్పందిస్తూ, ఆ చట్టాలు, నిబంధనల కాదు, తాము చెప్పిన టీవీ చానళ్లు మీ కేబుల్ లో రాకూడదు, కుదరదు అంటే చెప్పండి, మీ కేబుల్ తీసి అన్ని ఇళ్ళకు ఫైబర్ నెట్ వచ్చేలా చేస్తాం అంటూ, వారిని బెదిరించినట్టు ఆ కధనంలో ఏబీఎన్ పేర్కొంది.

abn 13092019 3

అయితే ప్రభుత్వం ఇలా చెయ్యటం పై, అందరూ మండి పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా, మీడియా స్వేఛ్చ అంటూ, తన సాక్షి పై పాఠాలు చెప్పిన జగన్, ఇప్పుడు ఇలా చెయ్యటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి అంత చేసినా, ఆయన ఎదుర్కున్నారు కాని, ఇలా బ్యాన్ చెయ్యలేదని గుర్తు చేస్తున్నారు. ఈ విషయం పై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు స్పందిస్తూ, న్యూస్‌ చానెళ్ల ప్రసారాలను నిలిపేయాలని మంత్రులే బెదిరించడమేంటని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మా గొంతు నొక్కేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎవరైనా వ్యతిరేకంగా పెడితే, వారిని అరెస్ట్ చేస్తున్నారు, ఇప్పడు ఏకంగా ఛానెల్స్ నే బ్యాన్ చేసారు అంటూ చంద్రబాబు మండి పడ్డారు. 72 గంటల్లో ఎంఎస్‌వోలు స్పందించకపోతే ట్రాయ్‌కు ఫిర్యాదు చేయాలని, ప్రజలను చంద్రబాబు కోరారు.

జగన్ మోహన్ రెడ్డి పై, అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు సంచలన ఆరోపణలు చేసారు. ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పారని, ఇప్పటి వరకు ఏది నెరవేర్చలేదని, చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు. అంతే కాదు, అసలు జగన్ మమ్మల్ని కలవటానికి ఇష్టపడటం లేదని, తమకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వటం లేదని సంచలన ఆరోపణలు చేసారు. దీంతో మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ వివాదం మళ్ళీ రేగెంది. పాదయాత్ర సమయంలో ఊరు ఊరు తిరిగి, అగ్రిగోల్ద్ బాధితులను దగ్గరకు తీసిన జగన్, ఇప్పుడు అధికారంలోకి రాగానే, వారికి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వటం లేదని అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం అధ్యక్షుడు చేసిన ఆరోపణలు, దుమారం రేపాయి.

agrigold 13092019 2

అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముంది అగ్రిగోల్డ బాధితులకు జగన్ మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని వెంటనే అమలు చెయ్యాలని డిమాండ్ చ్ద్సారు. జగన్ మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్ మీటింగ్ లోనే, 1150 కోట్లు మంజూరు చేస్తున్నామని, 20 వేల లోపు డిపాజిట్లు ఉన్న వారికి చెల్లింపులు చేస్తాం అని చెప్పారని, కాని అవి మాటల వరకే పరిమితం అయ్యాయని అన్నారు. ఇప్పటి వరకు మూడు నెలలు పైగా గడిచినా, ఈ ఆదేశాలకు సంబంధించి జీవో మాత్రం ఇవ్వలేదని అన్నారు. అలాగే గతంలో చంద్రబాబు ప్రభుత్వం 10 వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రూ.200 కోట్లు మంజూరు చేసిందని, కనీసం ఆ నిధులనైనా విడుదల చెయ్యాలని, జగన్ ప్రభుత్వాని కోరారు.

agrigold 13092019 3

చంద్రబాబు కేటాయించిన 200 కోట్లు అయినా ఇస్తే, 4 లక్షల మందికి న్యాయంజరుగుతుందని, కనీసం అదైనా చెయ్యాలని కోరారు. అలాగే చనిపోయిన వారికీ 10 లక్షలు ఇస్తామని జగన్ అన్నారని, ఆ హామీ కూడా ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని అన్నారు. జగన్ మొహన్ రెడ్డి గారు మాకు హామీ ఇస్తూ, గ్రామ, వార్డు వాలంటీర్లు అగ్రిగోల్డ్ బాధితుల ఇళ్లకు వెళ్లి రశీదులు అందజేస్తారని చెప్పారని, కాని ఇప్పటి వరకు అలాంటిది ఏమి జరగలేదని అన్నారు. ఎన్నికల ముందు అన్ని మాటలు చెప్పి, ఇప్పటికి అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా, నేటికీ అగ్రిగోల్డ్‌ బాధితులకు ఒక్క రూపాయి కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 20 లక్షల మంది బాధితుల తరుపున పోరాటం చేస్తున్న మాకు జగన్‌ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. బాధితులు అందరికీ న్యాయం జరిగే వరకు, మేము పోరాటం చేస్తామని అన్నారు.

వైఎస్ఆర్ వారసుడిని అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ తెగువ మాత్రం చూపించలేక పోతున్నారు. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి తమ ప్రభుత్వం పై ఎక్కి తొక్కుతున్నాయని, వాటిని కాంగ్రెస్ పార్టీ వారు ఎవరూ చూడద్దు అని చెప్పారు కాని, ఏ రోజు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వాటిని బ్యాన్ చెయ్యటానికి చూడలేదు. తన సాక్షి ఛానల్ స్థాపించుకుని, కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అనుకున్నది చెప్పేవారు. అదే సమయంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పై రాజకీయంగా విమర్శలు చేస్తూ ఎదుర్కునే వారు. అయితే ఇప్పుడు ఆయన కొడకు జగన్ మోహన్ రెడ్డి మాత్రం అందుకు బిన్నం. తన చేతిలో ఒక టీవీ, ఛానల్ ఉన్నా, దానితో ప్రతిపక్షం పై, ప్రతి రోజు విషం చిమ్ముతున్నా సరే, మిగతా ఛానెల్స్ విషయంలో జగన్ తట్టుకోలేకపోతున్నారు. తన ప్రభుత్వం పై చిన్న చిన్న విమర్శలు చేసే సోషల్ మీడియా వ్యక్తులను కూడా ఉపెక్షించలేని స్థితిలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి,

jagan 130892019 2

ఇప్పుడు తన ప్రభుత్వం పై వ్యతిరేక కధనాలు, తన ప్రభుత్వ లోపాలు ఎత్తి చూపే ఛానెల్స్ పై కక్ష తీర్చుకునే పనిలో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి ధైర్యంగా ఎదుర్కుంటే, జగన్ మాత్రం వాళ్ళని ఎదుర్కోలేక, ఆ ఛానెల్స్ ని బ్యాన్ చేసారు. తాజాగా జరిగిన చలో ఆత్మకూరు ఘటన, ప్రభుత్వానికి విపరీతమైన చెడ్డ పేరు తెచ్చి పెట్టింది. చివరకు ప్రత్యర్ధులు తమ ఇంటికి వెళ్ళకుండా గోడ కట్టారు అంటే, ఆ చిన్న గోడ కూడా తీపించలేని వ్యవస్థలో మనం ఉన్నాం అంటూ ఆ టీవీ ఛానెల్స్ ప్రచారం చేసాయి. అలాగే వైసిపీ మనుషులే కొట్టి, మళ్ళీ బాదితుల పై కేసులు పెట్టటాన్ని కూడా ఈ ఛానెల్స్ బాగా చూపించాయి. చలో ఆత్మకూరు సందర్భంగా, హోం మంత్రి బాధితులను పైడ్ ఆర్టిస్ట్ లు అనటం, అలాగే చంద్రబాబు ఇంటికి తాళ్ళు కట్టటం, ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లి, ప్రభుత్వం ఎంత భయపడుతుందో అనే అభిప్రాయాన్ని కలిగించాయి. చివరకు ప్రభుత్వం దిగి వచ్చి, ఆ బాధితులు నిజమే అని ఒప్పుకోవాల్సిన పరిస్థితి కలిగింది.

jagan 130892019 3

దీంతో ఇక ఆ ఛానెల్స్ పని పట్టటానికి సిద్ధం అయ్యారు. ముందుగా తన పై పూర్తీ ఫోకస్ పెట్టిన ఏబీఎస్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానెల్స్ ను రెండు రోజుల నుంచి బ్యాన్ చేసారు. అలాగే ఏపి ఫైబర్ నెట్ లో కూడా వీటిని తొలగించారు. జగన్ అధికారంలోకి రాగానే, ఏబీఎన్ ఛానెల్ ని, 651 నెంబర్ కి మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా బ్యాన్ చేసారు. అయితే, రెండు రోజుల ముందు, మంత్రులు, కేబుల్ ఆపరేటర్లకు ఆదేశాలు ఇచ్చి, ఆ రెండు ఛానెల్స్ ఆపేయమని చెప్పటంతో, చాలా మంది ఆపేశారు. అలా చేస్తే ఇబ్బందులు వస్తాయి, ట్రాయ్ నిబంధనలు అడ్డు వస్తాయి అని కొంత మంది చెప్పగా, నీ కేబుల్ లో నుంచి రేపటి నుంచి, ఏపి ఫైబర్ నెట్ వస్తుంది అంటూ బెదిరించారు. దీంతో, వారు కూడా బ్యాన్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి, జగన్ మోహన్ రెడ్డి యువకుడు, ధీటుగా ఎదుర్కుని సమాధానం చెప్తాడు అనుకుంటే, సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిన చిన్న పిల్లకాయలను నుంచి ఛానెల్స్ వరకు బ్యాన్ చేసుకుంటూ వెళ్తూ, తన వైఖరిని తానే బయట పెట్టుకుంటున్నాడు. రాను రాను ప్రశ్నించే గొంతుని, పాలకులు తట్టుకేలక పోతున్నారు.

సహజంగా ప్రభుత్వాలు, ప్రతిపక్షాల మాట వినటం చాలా అరుదు. వారి డిమాండ్స్ కి తలొగ్గే పరిస్థితి ఏ ప్రభుత్వం అంత సామాన్యంగా చెయ్యదు. ఇక జగన్, చంద్రబాబు లాంటి వైరం ఉన్న నేతల సంగతి అయితే చెప్పే పనే ఉండదు. అదే రాజకీయ కక్షల విషయంలో కూడా తగ్గాల్సిన పరిస్థితి అసలే ఉండదు. అలాంటిది ఇప్పుడు జగన్ ప్రభుత్వం, చంద్రబాబు చేసిన పోరాటానికి తగ్గింది. మూడు నెలల్లోనే ఇది ప్రతిపక్షం, ప్రభుత్వం పై సాధించిన విజయం. జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నేతలను వెంటాడి వెంటాడి దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో 8 మంది చనిపోయారు కూడా. 500 పైగా దాడులు జరిగాయి. అంతే కాదు తోటలు నరకటం, పొలాలు లాక్కోవటం, ఇంటికి వెళ్ళకుండా గోడలు కట్టటం, ఇలాంటి వికృత పనులు కూడా చేస్తున్నారు.

cbn 13092019 2

వీటి పై రెండు నెలల క్రిందటే చంద్రబాబు మొదటిసారిగా ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఉద్రిక్తతలు సహజం అని, నెల రోజులు అయినా ఈ సమస్య పరిష్కారం కాలేదని, చంద్రబాబు పల్నాడు పర్యటన చేసారు. అక్కడ ఒక మహిళను చంపేస్తే, ఆమె కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వాన్ని, పోలీసులను ఈ దాడులు అదుపు చెయ్యాలని కోరారు. తరువాత కొన్ని రోజులుగా, దాడులు తగ్గక పోవటంతో, తెలుగుదేశం పార్టీ తరుపున, స్వయంగా డీజీపీని కలిసి, సమస్యను వివరించి, ఈ దాడులు జరగకుండా చూడాలని, ప్రజలు ఊళ్ళు వదిలి వెళ్ళిపోతున్నారని అన్నారు. అయినా దాడులు ఆగలేదు. దీంతో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. దాడులు వల్ల, ఊరు వదిలి వెళ్ళిపోయాన వారికి ఆశ్రయం కల్పిస్తూ, స్వయంగా పార్టీ తరుపున శిబిరం నడిపారు.

cbn 13092019 3

దాదపుగా 10 రోజులు ఈ శిబిరం నడిపి, పోలీసులు వచ్చి స్వయంగా వీరిని ఊళ్ళకు తీసుకు వెళ్ళాలని అన్నారు. 10 రోజులు గడువు ఇచ్చి, లేకపోతె మేమే స్వయంగా తీసుకు వెళ్తాం అని అన్నారు. అయితే ప్రభుత్వం తరుపున హోం మంత్రి స్పందిస్తూ, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పైడ్ ఆర్టిస్ట్ లు అంటూ చెప్పారు. దీంతో చంద్రబాబు చలో పల్నాడు పిలుపు ఇచ్చారు. ఈ విషయం బాగా పెద్దది అయ్యింది. అక్కడ బాధితులు చేత మాట్లాడించిన మాటలు, మీడియాలో ప్రముఖంగా వచ్చాయి, దీంతో ఇక ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. పైడ్ ఆర్టిస్ట్ లు అన్న వారినే, దగ్గరుండి, వారిని సొంత ఊరిలో పోలీసులు దింపారు. అక్కడ ఉన్న వైరి వర్గానికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు ఏదైతే కోరారో అది నెరవేరింది. ప్రభుత్వం చేతే వారిని సొంత ఊళ్ళకు పంపించటంలో చంద్రబాబు పోరాటం సక్సెస్ అయ్యింది. చంద్రబాబు బుధవారం ఆ ఊరు వెళ్లి వారిని పరామర్శించనున్నారు. ఈ విధంగా, మూడు నెలలకు పైగా మొండి వైఖరితో ఉన్న ప్రభుత్వాన్ని, తమ పోరాటంతో దిగి వచ్చేలా చేసి, వారి చేతే వారి తప్పు ఒప్పించేలా చెయ్యటంలో చంద్రబాబు, జగన్ ప్రభుత్వం పై పోరాడి మొదటి విజయం సాధించారు.

Advertisements

Latest Articles

Most Read