వాన్పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ A3గా ఉన్న విషయం తెలిసిందే. A1గా జగన్ మోహన్ రెడ్డి, A2 గా విజయసాయి రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా సెర్బియా పర్యటనకు విహారయాత్రకు వెళ్ళిన నిమ్మగడ్డ ప్రసాద్ ను, సెర్బియా పోలీసులు అరెస్ట్ చేసారు. ఇంటర్ పోల్ సహయంతో, రస్ అల్ ఖైమా ఇచ్చిన ఫిర్యాదుతో, అరెస్ట్ చేసారు. అయితే అక్కడ కోర్ట్ బెయిల్ ఇచ్చింది కాని, నిమ్మగడ్డను సెర్బియ దేశం విడిచి వెళ్ళకూడదు అని షరతులు పెట్టింది. నిమ్మగడ్డ అరెస్ట్ నేపధ్యంలో, వైసీపీ ఎంపీలు 22 మంది కలిసి కేంద్రానికి లేఖ రాసారు. నిమ్మగడ్డ పై ఎటువంటి కేసులు లేవని, ఆయన్ను వెంటనే సెర్బియా దేశం నుంచి మన దేశానికి రప్పించాలని కేంద్ర ప్రభుత్వం చొరవక్ చూపాలని కోరారు. అయితే కేంద్రం మాత్రం, ఇలాంటి వాటిల్లో మేము జోక్యం చేసుకుము అని తెగేసి చెప్పింది.

దీంతో వైసీపీ ఎంపీలు చేతులు ఎత్తేసారు. అయితే నిమ్మగడ్డ లాయర్లు మాత్రం, ఆయన్ను మన దేశానికి తీసుకురావటానికి ఎన్నో పాట్లు పడుతున్నారు. మొన్న ఏకంగా సిబిఐ కోర్ట్ నే, నిమ్మగడ్డను ఇక్కడకు తీసుకు రావాలని కోరారు. అయితే సిబిఐ కోర్ట్ మాత్రం, కుదరదు అని చెప్పింది. దీంతో ఇప్పుడు నిమ్మగడ్డ లాయర్లు రూటు మార్చారు. ప్రతి శుక్రవారం ఈ బ్యాచ్ అంతా కోర్ట్ కు వెళ్ళాల్సిందే. అయితే నిమ్మగడ్డని సెర్బియలో అరెస్ట్ చేసారని, ఇందూ టెక్‌జోన్ కేసులో సిబిఐ కోర్ట్ కు తెలపలేదు. దీంతో నిమ్మగడ్డ విచారణ ఎగ్గొట్టినందుకు సిబిఐ కోర్ట్, నిమ్మగడ్డకు అరెస్ట్ వారెంట్ జరీ చేసింది. అయితే ఇది నిమ్మగడ్డ లాయర్ల ఎత్తుగడగా తెలుస్తుంది. నిమ్మగడ్డను సెర్బియా నుంచి ఇండియా రప్పించేందుకు, ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తుంది.

అందుకే, ఆయన తరఫు న్యాయవాదులు నిమ్మగడ్డ సెర్బియాలో ఉన్నా, ఇక్కడ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరలేదని తెలుస్తుంది. ఇలా చేస్తే సిబిఐ కోర్ట్ అరెస్ట్ వారెంట్ ఇస్తుందని, దాని ఆధారంగా భారత ప్రభుత్వాన్ని రంగంలోకి దించి, కేసు విచారణ నిమిత్తం అని చెప్పి, నిమ్మగడ్డను ఇండియా తీసుకురావచ్చనే ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. అందుట్లో సిబిఐ కోర్ట్, నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. నిమ్మగడ్డ లాయర్లు మాత్రం, హాజరు మినహాయింపు కింద పిటిషన్ దాఖలు చెయ్యాలనే సమాచారం మా వద్ద లేదని, న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు నివేదించారు. నిమ్మగడ్డను సెర్బియా పోలీసులు అరెస్టు చేసారనే విషయాన్నీ, మేము ఈడీ అధికారులకు ఇప్పటికే తెలియ చేసాం అంటూ, కోర్ట్ లో మేమో దాఖలు చేసారు.







