తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, విజయనగరంలో జరిగే ప్రజా చైతన్య యాత్రలో భాగంగా, విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాల కోసమంటూ పెందుర్తి మండలం పినగాడి పంచాయతీ పరిధిలోని కోట్నివానిపాలెం సమీపంలో 90 ఎకరాల విస్తీర్ణంలో పెంటవాని చెరువు ఆక్రమించుకోవటం, పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో గల వీర్రాజు చెరువుని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ కబ్జా చేస్తున్నారు అంటూ, ఈ రెండు ఘటనల పై, విశాఖలో కూడా పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు ఆ చెరువును చేరుకోనివ్వకుండా, రాత్రికి రాత్రి, చెరువుకి అరకిలోమీటర్ ముందు గొయ్యి తవ్వారు. ఇది ఇలా ఉంటే, ఈ పర్యటన కోసం, తెలుగుదేశం పార్టీ, పోలీస్ పర్మిషన్ కూడా తీసుకుంది. పోలీసులు కూడా షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే విశాఖలో చంద్రబాబు దిగే సరికి, 500 మందికి పైగా వైసీపీ పోగేసిన అల్లరి మూకలు ఎయిర్ పోర్ట్ లోకి వచ్చాయి. 50 మందికి మించి టిడిపి నాయకులు చంద్రబాబుకు స్వాగతం పలకకూడదు అని చెప్పిన పోలీసులు, ఇంత మందిని ఎలా రానిచ్చారు అనేది తెలుగుదేశం ప్రశ్న.

nsg 02032020 1

ఈ వైసీపీ అల్లరి మూకల చేతిల్లో రాళ్ళు, గుడ్లు ఉన్నాయి. వీటిని ఒక అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లోపలకి ఎలా అనుమతి ఇచ్చారు ? ఎయిర్ పోర్ట్ బయట, కేవలం 500 మంది వైసీపీ మూకలు, చంద్రబాబుని 5 గంటలు పాటు కదల నివ్వకుండా ఉంటే, పోలీసులు ఆ అల్లరి మూకలను ఎందుకు క్లియర్ చెయ్యలేదు ? జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న వ్యక్తిని, 5 గంటల పాటు, అల్లరి మూకల మధ్య ఎలా ఉంచారు ? ఇక చివరగా, వైసీపీ అల్లరి మూకలను అరెస్ట్ చెయ్యకుండా, చంద్రబాబుని అరెస్ట్ చెయ్యటం పై, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ మొత్తం వ్యవహారం, పై, చంద్రబాబుకు రక్షణగా ఉన్న, కేంద్ర బలగాలు అయిన, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌, కేంద్రానికి నివేదిక సమర్పించినట్టు తెలుస్తుంది.

nsg 02032020 1

చంద్రబాబుకి రక్షణగా ఉండే, ఎన్‌ఎస్‌జీ కమాండర్, ఈ మొత్తం వ్యవహరం పై, కేంద్ర హోమ శాఖకు ఒక నివేదిక పంపించారు. ఆ నివేదికలో, రాష్ట్ర పోలీసులు పై సంచలన ఆరోపణలు చేసారని తెలుస్తుంది. చంద్రబాబు విశాఖపట్నం పర్యటనలో, పోలీసులు, ఆయనకు కనీస రక్షణ కూడా కల్పించ లేదని, ఎక్కువ మంది నిరసనకారులు దూసుకు వచ్చినా, వారిని ఆపలేదని, రాళ్ళు, గుడ్లు, టమాటాలు, తీసుకు వచ్చి, ఆయన పై వెయ్యటానికి ప్రయత్నం చేసినా, నిర్లిప్తంగా వ్యవహరించారని, పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇదంతా జరిగినట్టు, కేంద్ర హోం శాఖకు, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ బృందం నివేదిక పంపించింది. దీనికి సంబంధించిన, వీడియో ఎవిడెన్స్, ఫోటోలు కూడా కేంద్రానికి పంపినట్టు సమాచారం. మరో పక్క ఇప్పటికే కోర్ట్, ఈ విషయం పై సీరియస్ అయిన విషయం తెలిసిందే.

రాజకీయంలో అధికారమదం తలెకెక్కిన తర్వాత బందువుల్ని, రక్త సంబందీకుల్ని, స్నేహితుల్ని మరచిపోతారనేదానికి ముఖ్యమంత్రి జగనే ప్రత్యక్ష నిదర్శనం అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖేష్ అంబానితో ముఖ్యమంత్రి జగన్ భేటీ అందరకీ ఆశ్చర్యం కల్గిస్తోంది. నిన్న భేటీలో అంబానీని, ఆయన కుమారుడ్ని జగన్ కల్మషం లేని నవ్వుతో ఆప్యాయంగా ఆహ్వానించిన తీరు, ఖరీదైన శాలువ కప్పడం, ఆయన వారి పట్ల చూపించిన అభిమానం అందరికీ ఆశ్చర్యం కల్గించింది., నాడు వైయస్ మరణం వెనుక రిలయన్స్ సంస్ధ కుట్ర ఉందంటూ ఉమ్మడి రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో రిలయన్స్ సంస్ధలపై జగన్ దా-డు-లు చేయించి వి-ద్వం-స కాండ సృషించారు. వైయస్ హ-త్య వెనుక రిలయన్స్ హస్తముందని జగన్ అన్న మాటలు నిజమే అయితే నేడు ముఖేష్ అంబానీని ఆప్యాయంగా జగన్ నవ్వుతూ స్వాగతించటం ఏంటి? తండ్రి శ-వం ఇంటికి చేరకముందే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేశారనే అపవాదు జగన్ పై ఉంది.

నాడు రిలయన్స్ సంస్ధలపై జగన్ దా-డు-లు చేయించటం వాస్తవం కాదా? జగన్ కి అత్యంత సన్నిహితుడు కాంగ్రెస్ పార్టీ విధ్యార్ది నాయకుడు వంశీచందర్ రెడ్డి రిలయన్స్ పై దా-డు-ల-కు పురిగొల్పుతూ మెసేజ్ లు పెట్టింది వాస్తవం కాదా? ఉమ్మడి రాష్ర్టంలోని అన్ని జిల్లాల్లో రియలన్స్ సంస్ధలపై జరిగిన దా-డు-ల-కు కారణం జగన్ కాదా? అంటూ ప్రశ్నించారు. ఆ దా-డు-ల-కు సంబందించిన ప్రతికల్లో వచ్చిన పోటోలను మీడియా ముందు ప్రదర్శించారు. నాడు జగన్ ఇచ్చిన పిలుపుతో రిలయన్స్ సంస్దలపై దా-డు-లు చేసిన వేలాదిమంది అమాయకులు ఇప్పటికీ జైళ్లలో ఉన్నారు, మరికొంత మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, వేలాది మంది పోలీసుల చేత బూటు దెబ్బలు తిన్నారు, వారి బంగారు భవిష్యత్ ని నాశనం చేసుకున్నారు, కానీ నేడు అంబానీనీ ఆప్యాయంగా హత్తుకున్న జగన్ వారి కుటుంబ సభ్యులకు ఏం సమాధానం చెప్తారు? నాడు రిలయన్స్ సంస్ధల్ని ద్వం-సం చేయండి అన్న జగన్ నేడు అదే రిలయన్స్ అధినేతతో భేటీ అవటం ఏంటి? మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ దీనికి ఏం సమాధానం చెప్తారు. రిలయన్స్ సంస్ధ మరియు సోనియా గాంధీ కుటుంబం కుమ్మక్కై వైయస్ రాజశేఖర్ రెడ్డిని హ-త్య చేయించారని వైయస్ కుటుంబానికి సన్నిహితుడైన భూమణ కరుణాకర్ రెడ్డి నాడు చెప్పలేదా?

వైయస్ మరణం వెనుక రిలయన్స్ హస్తముందన్న జగన్ నేడు అదే రిలయన్స్ అధినేతతో ఎలా సమావేశమయ్యారు? ముఖ్యమంత్రి ఇంట్లో మంత్రాంగం జరుగుతోందని రాష్ర్ట ప్రజలు భావిస్తున్నారు, వారిద్దరి భేటీలో జరిగిన క్విడ్ ప్రోకో బప్పందాలను జగన్ ప్రజలకు చెప్పాలి. వారికి రాజ్యసభ ఇస్తామన్నారా? అసలు ఇద్దరి మద్య జరిగిన ఒప్పందాలు ఏంటి? వారి బేటీ అంశాలను బయటికి చెప్పకుండా రహస్యంగా ఎందుకు ఉంచారు? పరిపాలనలో అంతా పారదర్శకంగా ఉండాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎవరితో భేటీ అయినా వెంటనే మీడియాకు వెల్లడించేవారు. కానీ జగన్ ఎందుకు వారి భేటీ అంశాలను బయటికి చెప్పటం లేదు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన భాద్యత ముఖ్యమంత్రిగా జగన్ పై ఉంది. నీతి మాటలు చెప్పే నైతిక ‍హక్కు జగన్ కి లేదు. జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు పర్యటనను అడ్డకున్న దానిపై జగన్ కి కోర్టు మొట్టికాయలు వేసినా ఆయన తీరు మారలేదు. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్యుల సలహాలు కూడా పాటించారు. కానీ జగన్ ఎవరి సలహాలు స్వీకరించే స్ధితిలో లేరు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా మౌనం వీడి ముఖేష్ అంబానీతో బేటీలో చర్చించిన అంశాలను ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో పని చేస్తున్న సీనియర్ ఏపీఎస్ అధికారి, అడిషనల్ డీజీ బాలసుబ్రహ్మణ్యం లాంగ్ లీవ్‌ లో వెళ్ళటం పై, అధికార వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఆయన అమెరికా వెళ్లేందుకు, ఏడాదిపైనే సుధీర్ఘంగా సెలవు కావాలని, ప్రభుత్వానికి లేఖ రాసారు. 2020 మార్చి 4 నుంచి వచ్చే 2021 జూలై 31 వరకు అంటే 515 రోజులు లాంగ్ లీవ్ అడిగారు. తాను వ్యక్తిగత పనుల మీద అమెరికా వెళ్లాలని, లీవ్ కావాలని అంటూ ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీని ప్రభుత్వం కూడా వెంటనే లాంగ్ లీవ్‌కు అనుమతి ఇచ్చింది. ఈ పరిణామం సచివాలయం అధికార వర్గాల్లో, చర్చకు దారి తీసింది. ఏకంగా ఏడాదన్నర పాటు ఆయన లాంగ్ లీవ్ కావాలని అడగటం, ప్రభుత్వం కూడా వెంటనే ఆ లాంగ్ లీవ్ కు అనుమతి ఇవ్వటం పై, అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేసాయి. సహజంగా ఎవరైనా, నెలా రెండు నెలలు లీవె తీసుకుంటేనే, దాన్ని లాంగ్ లీవ్ అంటూ ఉంటారు. దానికి కూడా ప్రభుత్వాలు అన్నీ చూసి అనుమతులు ఇస్తాయి. మరి ఇక్కడ మాత్రం, ఏకంగా 515 రోజులు లీవ్ ఇచ్చారు.

bala 01032020 2

ఇక్కడ రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి. ఆయనకు ఇక్కడ పని చెయ్యటం ఇష్టం లేదు, అలాగే ప్రభుత్వానికి పెద్దగా ఆయన పై ఆసక్తి లేదు అనే విషయం, ఈ ఎపిసోడ్ చూస్తే అర్ధం అవుతుంది. చంద్రబాబు హయంలో, అడిషనల్ డీజీ బాలసుబ్రహ్మణ్యం రవాణా శాఖ కమిషనర్‌గా పని చేసారు. అప్పట్లో, తెలుగుదేశం నేతలు ఆయన పై దురుసుగా ప్రవర్తించారని, వార్తలు రావటంతో, చంద్రబాబు ఆ నేతలను మందలించి, బాలసుబ్రహ్మణ్యం దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పమని కోరారు కూడా. అప్పట్లో ఈ సంఘటన ఒక సెన్సేషన్ అయ్యింది. అయితే, చంద్రబాబు సూచన మేరకు, క్షమాపణ చెప్పటంతో, అప్పట్లో ఆ వివాదం ముగిసింది. ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ, వనజాక్షి ఇష్యూ లా చెయ్యాలి అని చూసినా, కుదరలేదు.

bala 01032020 3

ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, రవాణా శాఖ కమిషనర్‌గా పనిచేసిన బాలసుబ్రహ్మణ్యాన్ని, రైల్వే డీజీగా నియమించారు. అయితే, ఎంతో సీనియర్ అయిన నాకు, ఇది ఏ మాత్రం, ప్రాధాన్యం లేని పోస్టు అంటూ, ఆయన అసంతృప్తిలో ఉన్నారని, అందుకే ఆయన లాంగ్ లీవ్‌ పై, వెళ్తున్నారు అనే సమాచారం, సచివాలయంలో వినిపిస్తుంది. ఆయన అడిగిన వెంటనే, ప్రభుత్వం కూడా లీవ్ ఆమోదించటం, ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మొన్నటి దాక చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా లాంగ్ లీవ్‌లో ఉన్నారు. ఆయన్ను చీఫ్ సెక్రటరీ నుంచి, బాపట్ల ఎన్‌హెచ్‌ఆర్డీఐకి బదిలీ చెయ్యటంతో, ఆయన అసంతృప్తిలో ఉన్నారు. ఇక సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర రావు, సీనియర్ ఐఆర్ఎస్ జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ వ్యవహారం కూడా తెలిసిందే. మొత్తానికి, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి అననటంలో సందేహం లేదు.

ముఖ్యమంత్రి జగన్ 10 నెలల పాలనలోనే రాష్ట్ర ఆర్దిక వ్యవస్ధను చిన్నాభిన్నం చేయటమే కాక ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని టీడీపీ రాష్ర్ట అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మండి పడ్డారు. ఆదివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వైసీపీ ప్రభుత్వం నిత్యవసరాల ధరలు పెంచి పేదలపై భారం మోపుతోంది. నిన్న పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ జీవో 68 విడుదల చేశారు. జీవోలు మార్చి నెల రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు రెండు సార్లు పెంచారు. జగన తీసుకునే నిర్ణయాలు తుగ్లక్ ని మరిపిస్తున్నాయి. ఏ1, ఏ2 లకు పాలన చేతకాక ధరలు పెంచి తడిగుడ్డతో పేద ప్రజల గొంతు కోస్తున్నారు. అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు తగ్గుతున్నాయని సీఎన్ ఢీసీ చెప్తుంటే రాష్ర్టంలో వాటి ధరలు పెంచటం తుగ్లక్ పాలనకు నిదర్శనం. పోరుగు రాష్ట్రాల కంటే మన రాష్ర్టంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. 2019-20 బడ్జెట్ లో లక్షా 78 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఈ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ వచ్చిన ఆదాయం కేవలం రూ. 85 వేల కోట్లు మాత్రమే. జీఎస్టీ ద్వారా రూ. 37 వేల కోట్లు ఆదాయం వస్తుందని బుగ్గన అంచనా వేస్తే .. వచ్చింది కేవలం రూ. 22 వేల 900 కోట్లు మాత్రమే.

చంద్రబాబు పాలనలో టార్గెట్ ని మించి 119 శాతం జీఎస్టీ వసూళ్లు వచ్చాయి, రెండెంకెల వృద్ది రేటు సాధించాం. ఈ 10 నెలల కాలంలో రాష్ట్ర ఆధాయం 50 శాతం పడిపోయింది, రూ. 46 వేల కోట్ల అప్పు భారం పెరిగింది. కేంద్రం నుంచి నిధులు తీసుకురావటంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. కేంద్రం నుంచి రూ. 66 వేల కోట్లు తీసుకురావాల్సి ఉండగా... కేవలం రూ. 18 వేల కోట్లు మాత్రమే తీసుకు వచ్చారు. పీపీఏల విషయంలో కేంద్రంతో ఘర్షణ వాతావరణం ఏర్పరచుకుంది. వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే కేంద్రం రాష్ర్టానికి నిధులివ్వటం లేదు, కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దారి మళ్లిస్తున్నారు. జగన్ తన తప్పుడు నిర్ణయాలతో అంతర్జాతీయంగా రాష్ర్ట ప్రతిష్ట దెబ్బతీసి పెట్టుబడులు రాకుండా చేస్తున్నారు. ఇప్పటికే రాష్ర్టం నుంచి అనేక పరిశ్రమలు తరిమేసి యువతను రోడ్డున పడేశారు. ఇచ్చిన హామీల్లో కోతలు విధించి జగన్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. విధ్యార్డులకు మెస్ చార్జీలు, స్కాలర్ షిప్పులు ఇవ్వలేదు, రైతు భరోసా పూర్తిగా ఇవ్వకుండా రైతుల్ని మోసం చేశారు. చంద్రబాబు సంపద సృష్టించి పేదలకు పంచితే, జగన్ పేదల సంపద దోచుకుని వారిని రోడ్డున పడేస్తున్నారు.

ఇల్ల పట్టాల పేరుతో పేద ప్రజల భూముల్ని బలవంతంగా లాక్కుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం నిత్యసరాల ధరలు పెంచి ఓ వైపు, మరో వైపు అసైండ్ భూములు లాక్కుంటూ పేదల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ డబ్బుతో భూమి కొనుగోలు చేసి చంద్రబాబు నాయుడు 5 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. కానీ జగన్ బలవంతంగా పేదల భూములు లాక్కుంటున్నారు . విశాఖలో చంద్రబాబు పై రౌడీ మూకలతో జగన్ దాడి చేయించారు. . చంద్రబాబు నాయుడుకి సీఆర్పీ సెక్షన్ 151 కింద ఎలా నోటీసులిస్తారని పోలీసులకు కోర్టు మెట్టికాయలు వేసింది. ఇప్పడు అధికారులు ఏం సమాధానం చెప్తారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు, తప్పు చేసినవారందర్నీ కోర్టుకీడుకిస్తాం. త్వరలో ప్రజా చైతన్య యాత్ర విశాఖ నుంచే ప్రారంభిస్తాం, పేదలకు అండగా నిలబడి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read