తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై గత రెండు రోజులుగా, సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలు, అలాగే గతంలో ఉండవల్లి శ్రీదేవికి సన్నిహితంగా ఉండే ఇద్దరు, రెండు రోజుల్లు క్రితం, ఎమ్మెల్యే శ్రీదేవి అలాగే ఎంపీ సురేష్ పై ప్రెస్ మీట్ పెట్టి, అవినీతి చేస్తున్నారు అంటూ కొన్ని ఆధారాలు బయట పెట్టారు. అలాగే తమను వాడుకుని వదిలేసారని, డబ్బులు తీసుకుని ఇవ్వటం లేదు అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడేమో తమ పై కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటూ, ప్రెస్ మీట్ లో వాపోయారు. అయితే దీని పై స్పందించిన ఉండవల్లి శ్రీదేవి వారు తన పై అనవసరంగా అల్లరి చేస్తున్నారని, వారి వళ్ల తన ప్రా-ణా-ని-కి కూడా ముప్పు ఉందని, వారి పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే నిన్నటి వరకు ఈ వ్యవహరం ఇలా ఉండగా, ఈ రోజు మరో మలుపు తిరిగింది. సందీప్ అనే వ్యక్తి ఒక సేల్ఫీ వీడియో విడుదల చేసి, జరిగినది మొత్తం జగన్ కు విన్నవించుకుంటూ తమను కాపాడాలని కోరారు. సేల్ఫీ వీడియోలో తన బాధ చెప్పుకున్నారు. ఈ వీడియో అన్ని టీవీ చానల్స్ లో వచ్చింది. అయితే మరి కొద్ది సేపటికి గతంలో ఉండవల్లి శ్రీదేవితో ఆటను మాట్లాడిన ఆడియో విడుదల చేసి, మరో సేల్ఫీ వీడియో విడుదల చేసారు. తన పై అనవసరంగా శ్రీదేవి అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని, ఆమె పెకాటి ఆదిద్దాం అంటూ చెప్పింది అంటూ, ఒక ఆడియో విడుదల చేసారు. అయితే ఇది ఫేక్ అని ఉండవల్లి శ్రీదేవి ఒక టీవీ ఛానల్ లో చెప్పారు.

undaalli 07112020 2

ఇక మరో పక్క ఈ అంశం పై తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు, వంగలపూడి అనిత స్పందించారు. ఉండవల్లి శ్రీదేవి పై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలని డిమాండ్ చేసారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పోటా పోటీగా పేకాట క్లబ్ లు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని జూదాంద్రప్రదేశ్ గా మారుస్తున్నారని ఆరోపించారు. కర్నూలులో మంత్రి గుమ్మనూరు వ్యవహారం మర్చిపోక ముందే ఇప్పుడు సొంత పార్టీ నేతలే, ఉండవల్లి శ్రీదేవి పేకాట క్లబ్ లో భాగోతం ఆధారాలతో బయట పెట్టారని ఆరోపించారు. ఆధారాలు ఇంత స్పష్టంగా ఉన్నాయని, ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉండటానికి అర్హులు కాదని, మీడియాలో వస్తున్న ఆడియో టేప్ లో పై విచారణ చేపించి, ఆమెను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసారు. స్వయంగా ఎమ్మెల్యేనే పేకాట నిర్వహించాలని చెప్తుంటే, ముఖ్యమంత్రి ఈ విషయం ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. ప్రజలు వీరికి సమస్యలు తీర్చటం కోసం ఎమ్మెల్యేలను చేస్తే, వీళ్ళు అవేమీ పట్టించుకోకుండా పేకాటలో బిజీగా ఉన్నారని వాపోయారు. ప్రభుత్వం, పోలీసులు ఈ అంశం పై సీరియస్ గా దృష్టి పెట్టాలని, చట్ట ప్రకారం వ్యవహరించి, ఉండవల్లి శ్రీదేవి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జస్టిస్ రాకేష్ కుమార్ నేతృత్వం వహిస్తున్న బెంచ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై, సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెద్ద ఎత్తున హెబియస్ కార్పస్ పిటిషన్లు నమోదు అయ్యాయి. ఆ హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఈ రోజు విచారణ సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన జరుగుతుందా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. అంటే ఆర్టికల్ 356 ఉపయోగించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఏమో అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజు విజయవాడకు చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లంటి లోచిని అనే వ్యక్తుల హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేస్తూ, ఈ రాష్ట్రంలో చాలా పరిణామాలు మేము గమనిస్తున్నాం, అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పాలన సాగుతుందా లేదో అని చర్చించి, విచారణ చేసి, ఏమైనా ఉత్తర్వులను, న్యాయస్థానాలు ఇచ్చే అవకాసం ఉందో లేదో చెప్పాలి అంటూ, దీనికి సంబంధించి అన్ని న్యాయపరమైన అంశాలు పరిశీలించాలని, కోర్టుకు ఎంత వరకు ఈ విషయంలో వెళ్లేందుకు పరిమితులు ఉంటాయో చెప్పాలని, తమకు దీనికి సంబంధించి మొత్తం సమాచారం ఇవ్వాలని, పిటీషనర్ తరుపు న్యాయవాదిగా ఉన్న రవి తేజ అనే లాయర్ ను, గౌరవ హైకోర్టు ఆదేశించింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగపరంగా పాలన చేయటం లేదు కాబట్టి, కోర్టులు ఏమి చేయగలవో, చట్టాలు చూసి చెప్పాలని కోరింది.

hc 06112020 2

అంతే కాకుండా కోర్టు, కొన్ని విషయాలు ప్రస్తావన కూడా చేసింది. ముఖ్యంగా అమరావతిని మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకున్న బిల్లు, అసెంబ్లీలో ఆమోదం పొందిన తరువాత, అది శాసనమండలిలో తిరస్కరణకు గురి అయితే, శాసనమండలినే రద్దు చేయాలనే నిర్ణయం తీసుకోవటం, మేము గమనించామని చెప్పింది. అలాగే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నమోదు అవుతున్న హెబియస్ కార్పస్ పిటిషన్ల పై కూడా, మేము గమనిస్తున్నాం అని కోర్టు చెప్పింది. ఇప్పటికే ఈ విషయం పై , పోలీసుల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక అదే విధంగా, సోషల్ మీడియాలో న్యాయమూర్తుల పై , కోర్టుల పై చేస్తున్న వ్యాఖ్యలపై, చర్యలు తీసుకోండని, కోర్టు చెప్పినా, ఏ చర్య తీసుకొని పరిస్థితిని కు మేము గమనించామని, ఇలా పలు సందర్భాలను కోర్టు గుర్తు చేసింది. ఇలాంటి అనేక అంశాల పై అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతుందా లేదా అనేది పరిశీలించాల్సి ఉందని, మీరు కూడా ఈ విషయం పై అఫిడవిట్ దాఖలు చేయండి అంటూ, కోర్టు ఆదేశించింది. మొత్తంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పనుల పై , ఇప్పటి వరకు పలు కామెంట్ లు చేస్తూ, హెచ్చరిస్తూ వచ్చిన కోర్టు, ఇక తొందరలోనే చర్యలకు కూడా దిగుతాం అనే సంకేతాలు ఇచ్చింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం, ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, క-రో-నాలో దేశంలోనే రెండో స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. చిన్న రాష్ట్రం అయినా, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మెట్రో సిటీలు లేకపోయినా, అతలాకుతలం చేసింది. అయితే ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది. ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంటుంది. ఒక్కోటి అన్ లాక్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఏది చేయకూడదో అదే చేసారు. స్కూల్స్ తెరుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గత నాలుగు రోజులుగా వస్తున్న సంఖ్య చూసి విశ్లేషకులు షాక్ అవుతున్నా, ప్రభుత్వం మాత్రం, ఇది కేవలం ఒక్క శాతం మాత్రమే కదా అంటుంది. అంతే కాదు, అవి అంతకు ముందు ఉన్న కేసులు, ఇప్పుడు వచ్చినవి కావు అంటుంది. అంతకు ముందు వచ్చినా, ఇప్పుడు వచ్చిన వారు స్కూల్స్ కి వస్తుంటే, వేరే వారికి అంటుతుంది కదా ? గత నాలుగు రోజులుగా, 829 మంది ఉపాధ్యాయులు, 575 మంది పిల్లలు క-రో-నా బారిన పాడ్డారు. ఇంకా కొన్ని చోట్ల మధ్యన భోజనం వడ్డించే వారికి, వండే వారికి కూడా వైరస్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అధికారికంగానే ఇంత ఫిగర్ అంటే, అనధికారికంగా ఇంకా ఎక్కువ ఉంటుందని కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి. దీనికి ఉదాహరణగా, విద్యాశాఖ విడుదల చేసే లెక్కలకు, క్షేత్రస్థాయిలో వచ్చే లెక్కలకు చాలా తేడా ఉందని చెప్తున్నారు. ఈ జిల్లా, ఆ జిల్లా అని లేకుండా, అన్ని జిల్లాల్లో ఈ సంఖ్య నమోదు అవుతుంది. ఈ రోజు ఈ సంఖ్య పెరిగే అవకాసం ఉంది.

ap 06112020 2

అయితే పిల్లల విషయంలో రిస్క్ వద్దని, వెంటనే స్కూల్స్ మూసేయాలని , వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల విషయంలో కరోనా అని చెప్తున్న ప్రభుత్వం, ఇన్నాళ్ళు స్కూల్స్ లేకుండానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు ఇంత హడావిడి అని ప్రశ్నిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో స్కూల్స్ తెరవలేదని గుర్తు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి మాత్రం స్కూల్స్ కొనసాగుతాయి అనే విధంగానే స్పందిస్తున్నారు. విద్యా సంవత్సరం నష్టపోతారని, అందుకే పెడుతున్నామని, ఇప్పుడు వచ్చేవి అన్నీ, ఇది వరుకే వైరస్ సోకిన వారని, ఇవి కూడా చాలా తక్కువ కేసులు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, ప్రభుత్వం అందరి దగ్గర ఒక ఫారం పై సంతకం చేపించుకుంటుంది. ఆ ఫారంలో, ఒక వేళ వైరస్ సోకినా మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఉంది. దీని పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా, ఇంత రిస్క్ అనుకున్నప్పుడు, ఎందుకు పిల్లల పై ఈ భారం అని వాపోతున్నాయి. అయితే ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు వెళ్ళేలా కనిపించటం లేదు. సెకండ్ వేవ్ వస్తే, పరిస్థితి చేయి దాటిపోతే, అప్పుడు మేల్కొని కూడా లాభం ఉండదని, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.

సుప్రీం కోర్టు జస్టిస్ పై, అలాగే హైకోర్టు జస్టిస్ ల పై ఆరోపణలు చేస్తూ, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు లేఖ రాసి, తరువాత ఆ లేఖను మీడియాకు విడుదల చేసి, న్యాయమూర్తులను అల్లరి చేసిన విషయం పై, దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి, జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు వచ్చాయి. అయితే దీని పై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుంది అనే విషయం పై అందరికీ సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే నెల రోజులు అయిపోవటంతో, అసలు సుప్రీం కోర్టు ఈ విషయం పై స్పందిస్తుందా లేదా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఇక మరో పక్క, జగన్ రాసిన లేఖ, దాన్ని మీడియాకు విడుదల చేయటం తప్పుబడుతూ, కొంత మంది సుప్రీం కోర్టులో పిటీషన్ లు కూడా వేసారు. అయితే ఇప్పటి వరకు దీని పై సుప్రీం కోర్టు నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఇప్పుడు ఈ మూడు పిటీషన్ల పై విచారణ చేయనున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ నెల 16న జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలు అయిన మూడు పిటీషన్ల పై విచారణ జరగబోతుంది. జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ రవీంద్ర భట్ జడ్జిలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ మూడు పిటీషన్లు వస్తున్నాయి. వీరు ఈ మూడు పిటీషన్లను విచారణ చేయనున్నారు. జడ్జిల పై ఆరోపణలు చేస్తూ వారిని అల్లరి చేయటం, అలాగే ఆ లేఖను బహిర్గతం చేయటం పై కూడా ఈ మూడు పిటీషన్లు దాఖలు అయ్యాయి. పిటీషన్ వేసిన వారు న్యాయవాదులు. జీఎస్ మణి, ప్రదీప్ కుమార్, సునీల్ కుమార్ సింగ్ అనే ముగ్గురూ వేరు వేరు పిటీషన్లు వేసారు.

sc 06112020 2

యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కూడా మరో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్లు ఈ నెల 16న విచారణకు రాబోతున్నాయి. ఈ పిటీషన్ లో ప్రధానంగా, జగన్ మోహన్ రెడ్డిని సియం పదవి నుంచి తొలగించాలని, ఆయన రాజ్యాంగా హద్దులు మీరారని, ఆ స్థానంలో ఉండటానికి అనర్హుడని వారు తెలిపారు. అలాగే మరో పిటీషన్ లో, షోకాజ్ నోటీస్ ఇవ్వాలని, కోర్టు ధిక్కరణ నోటీస్ ఇవ్వాలని కూడా పిటీషన్ లో పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు కోసం, ఆధారాలు లేకుండా విషం చిమ్మారని, భవిష్యత్తులో ఎవరూ ఇలా చేయకుండా, సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని కూడా మరొక పిటీషన్ లో కోరారు. దేశ అత్యున్నత న్యాయస్థానం యొక్క ప్రతిష్టను జగన్ మోహన్ రెడ్డి దిగజార్చే ప్రయత్నం చేసారని, వివక్షపూరితంగా అవినీతి ఆరోపణలు చేయటం రాజ్యాంగానికి కూడా విరుద్ధం అని తెలిపారు. మరో పక్క, ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ, రెండు సార్లు అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌కు లేఖ రాసి, జగన్ పై కోర్టు ధిక్కరణ కేసు పెట్టటానికి అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. అయితే మొదటి సారి ఇది చీఫ్ జస్టిస్ పరిధిలో ఉందని సమాధనం చెప్పిన విషయం తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read