విపత్తులు అనేవి సర్వ సహజం. ఏ రాష్ట్రానికైనా, ఏ ప్రాంతానికైనా అది తప్పదు. కానీ ఆ విపత్తులు చూసి నవ్వితే, ఏదో ఒక రోజు మనకీ అదే పరిస్థితి వస్తుందని గ్రహించాలి. సరిగ్గా ఇప్పుడు ఇదే పరిస్థితి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మరీ ముఖ్యంగా అమరావతి వాసులు. కేసీఆర్ తెలంగాణా ముఖ్యమంత్రి అయ్యి 7 ఏళ్ళు అవుతుంది. హైదరాబాద్ లో ఇప్పటికీ చిన్న వర్షం పడినా, పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తున్నాం. అలాంటిది రెండు మూడు రోజులు వర్షం అయితే చెప్పే పనే లేదు. ఇప్పుడు హైదరాబాద్ అదే పరిస్థతి ఎదుర్కుంటుంది. విశ్వనగరం కాస్త, విశ్వ నరకం అయ్యింది. చాలా కాలనీలు వారం రోజులకు పైగా వరదలోనే ఉన్నాయి. సరిగ్గా నీటి పారుదల లేక, ఈ పరిస్థితి. ప్రతి ఏడు ఇదే పరిస్థితి. కాకపొతే ఈ ఏడాది మరి కొంచెం ఎక్కువ. సాటి తెలుగు రాష్ట్రం, అందులో ఆంధ్రప్రదేశ్ లో చాలా కుటుంబాలకు హైదరాబాద్ తో అనుభంధం ఉంటుంది కాబట్టి, ఈ పరిణామాలు బాధ వేస్తున్నాయి. హైదరాబాద్ త్వరగా కోలుకోవలాని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఈ సందర్భంలోనే కేసీఆర్, కేటీఆర్ గేలి చేసిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైజాగ్ కి హుద్ హూద్ వచ్చిన సమయంలో, కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ కు అలాంటి పరిస్థితి లేదని, ఐటి కంపెనీలకు ఇక్కడే సేఫ్టీ అని ఒక ప్రకటన చేసారు. ఇక కేసీఆర్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని థర్డ్ క్లాస్ రాష్ట్రము అని, అమరావతిని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటూ హేళన చేసిన మాటలు ఇప్పుడు గుర్తుతెచ్చుకుంటున్నారు. ఇంత పెద్ద వరద వచ్చినా అమరావతి మునగలేదని, గుర్తు చేసుకుంటూ, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులు ఒక ప్రాంతాన్ని తక్కవ చేసి మాట్లాడాలని, లేకపోతే, కర్మ సిద్ధాంతం తన పని తాను చేసుకుపోతుందని గుర్తు చేస్తున్నారు.

ఒక్కో ప్రభుత్వానికి, ఒక్కో పాలసీ ఉంటుంది. అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ అభివృద్ధి, సంక్షేమం సమంగా జరిగినప్పుడే ఆ రాష్ట్రం ముందుకు వెళ్తుంది. ఈ మౌళిక సూత్రానికి లోబడే, పరిపాలన సాగిస్తూ ఉంటారు. అయితే గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మౌళిక సదుపాయాలు, పెట్టుబడులు పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. అదే సమయంలో సంక్షేమం కూడా ఎక్కడా తక్కువ చేయలేదు. రెండు సమానంగా జరిగాయి. అనంతపురం జిల్లా స్వరూపం మార్చేసే కియా లాంటి కంపెనీ వచ్చింది. ఇలా చెప్పుకొంటూ పొతే ఎన్నో ఉంటాయి. కానీ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం, పెట్టుబడులు పై పెద్దగా శ్రద్ద పెట్టటం లేదని అంకెలు చూస్తే అర్ధం అవుతున్నాయి. ఉచితాలు తెచ్చి, ప్రజలకు పంచటమే సరిపోతుంది. ఆ ఉచితాలు ఇవ్వాలి అంటే ఆదాయం ఉండాలి కదా ? కానీ అప్పులు చేసి మరీ ఉచితాలు పంచుతున్నారు. పోనీ ఆదాయం పెంచే మార్గాలు చూస్తున్నారా అంటే అదీ లేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విదేశీ పెట్టుబడులు తేవటంలో మహరాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తో పోటీ పాడేది. ఒక్క కియానే రూ.13 వేల కోట్లు పెట్టుబడి. ఇక ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత, అక్టోబర్ 2019 నుంచి జూన్ 2020 వరకు లెక్కలు తీస్తే, మనకు వచ్చిన విదేశీ పెట్టుబడులు 1652.31 కోట్లు. గతంలో దేశంలో మూడు నాలుగు స్థానంలో ఉండే మన రాష్ట్రము, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కంటే తక్కువగా 12 వ స్థానంలో ఉంది. పక్కన ఉన్న తెలంగాణా 9044.7 కోట్ల విదేశీ పెట్టుబడి తేగలిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికైనా, తమ ప్రాధాన్యాలు మార్చుకోక పొతే, రాబోయే రోజుల్లో తీవ్ర సంక్షోభం ఎదుర్కునే పరిస్థితి వస్తుంది. పాలకులు గ్రహించాలని కోరుకుందాం.

కలియుగ దైవం వెంకన్నను కూడా రాజకీయాల్లోకి లాగి ఆడుకున్న సంఘటనలు మన రాష్ట్రంలో తరుచూ చూస్తున్నాం. ముఖ్యంగా 2018 సమయంలో, ఒక వివాదం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కలిప్తాలు కల్పించిన కాలం అది. ఆ సమయంలో శ్రీవారిని కూడా ఈ కల్పితాలు వదలలేదు అందులో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబెర్ గా ఉన్న శేఖర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర భారీగా నగదు దొరకటం, ఆ శేఖర్ రెడ్డి చంద్రబాబు, లోకేష్ బినామీ అంటూ ప్రచారం చేసారు. చివరకు అధికారంలోకి రాగానే, అదే శేఖర్ రెడ్డికి పదవి ఇచ్చారు. ఇలా ఎందుకు చేసారో, ఏంటో ఆ వెంకన్నకే తెలియాలి. ఇక మరో ముఖ్యమైన అంశం పింక్‌ డైమండ్. శ్రీవారి పింక్‌ డైమండ్ కనిపించటం లేదు అంటూ, అప్పట్లో బహిష్కరణకు గురైన రమణదీక్షితులు చెప్పిన మాటలు అందరికీ గుర్తు ఉన్నాయి. రమణ దీక్షితులు అప్పట్లో ఈ విషయం పై చాలా హడావిడి చేసేవారు. పింక్‌ డైమండ్ అనేది ఉందని, దాన్ని నేనే అలంకరించానని, పింక్‌ డైమండ్ ను విదేశాల్లో 500 కోట్లకు అమ్మేసారు అంటూ, ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక దీన్ని అందిపుచుకున్న విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, ఆ పింక్‌ డైమండ్ సహా, శ్రీవారి నగలు అన్నీ, చంద్రబాబు నాయుడు ఇంట్లో నేలమాలిగల్లో ఉన్నాయని, తానూ వాటిని నిరూపిస్తాను అంటూ, విజయసాయి రెడ్డి చేసిన హంగామా, ఆయన ట్వీట్లు అందరికీ గుర్తున్నాయి. అయితే జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, రమణదీక్షితులు పదవి అయితే వచ్చింది కానీ, పింక్‌ డైమండ్ గురించి మాత్రం దీక్షితులు గారు మర్చిపోయారు.

పింక్‌ డైమండ్ ఏమైందో విచారణ చేయమని, ఇప్పటి తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అడగటంలో దీక్షితులు గారు మౌనంగా ఉన్నారు. అయితే ఇప్పుడు పింక్‌ డైమండ్ మరోసారి తెర పైకి వచ్చింది. తిరుపతికి చెందిన లాయర్, విద్యాసాగర్, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు ఈ విషయం పై లేఖ రాసారు. శ్రీవారి పింక్‌ డైమండ్ పై తేల్చాలని ఆ లేఖలో తెలిపారు. రమణదీక్షితులు పింక్‌ డైమండ్ ఉంది అంటూ హడావిడి చేసారని, అయితే వివిధ కమిషన్ లు ఎంక్వయిరీ చేసి, పింక్‌ డైమండ్ లేదు అనేది గతంలోనే తేల్చాయని, అయితే రమణ దీక్షితులు మాత్రం తానూ పింక్‌ డైమండ్ అలంకరించాను అంటూ చెప్పారని, ఏది నిజమో తేల్చాలని కోరారు. దీక్షితులు చెప్పినట్టు దేశం దాటి వెళ్ళిపోతే, ఏపి పోలీసులు ఎంక్వయిరీ చేయలేరు కాబట్టి, కేంద్ర దర్యాప్తు సంస్థలతో, ఈ విషయం పై ఎంక్వయిరీ చేసి నిజం ఏమిట్ తేల్చాలని ఆయన లేఖలో కోరారు. ఒక వేళ దీక్షితులు గారు చెప్పేది నిజం కాకపోతే, ఆయన ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసారు, ఎవరి ప్రోద్బలంతో ఆయన ఈ ఆరోపణలు చేసారో , అది కూడా తేల్చాలని, ఈ విషయం పై భక్తులకు, ప్రజలకు క్లారిటీ కావాల్సి ఉంది అంటూ, ఆయన కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు లేఖ రాసారు. మరి ఇప్పటికైనా ఈ విషయం పై క్లారిటీ వస్తుందా ? రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పై, ఎలాగూ ఏమి తేల్చటం లేదు కాబట్టి, కేంద్ర దర్యాప్తు సంస్థలు అయినా నిజం చెప్తాయా ? చూద్దాం.

మన నేతలు ప్రతిపక్షంలో ఉండగా, అధికారంలోకి రావటానికి అనేక మాటలు చెప్తారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత, అసలు ఆ ఊసే ఎత్తరు. అప్పుడు ఇలా చెప్పావు కదా అని అడుగుదాం అంటే ప్రజల మధ్య తిరగరు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, వరదలు వచ్చిన సమయంలో, అప్పట్లో తెలుగుదేశం పార్టీ కుటుంబానికి రూ.2 వేలు, బియ్యం, పప్పులు ఇస్తే, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి, వరద ప్రాంతాల్లో పర్యటన చేసి, ఇదేమిటి ఇవేమీ సరిపోతాయి, కనీసం రూ.5 వేల రూపాయలు కుటుంబానికి ఇవ్వాలి, ఇప్పటి వరకు వీరిని అధికార పార్టీ వాళ్ళు కలిసారా అంటూ ఆవేదనతో మాట్లాడిన వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎందుకంటే, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వరదలు ఉన్నాయి. దాదాపుగా 10 రోజులగా వరదలోనే అనేక గ్రామాలు ఉన్నాయి. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ పరిస్థితిలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వరద గ్రామాల్లో పర్యటన చేయలేదు. ఇక సహాయం ప్రకటించింది రూ.500. దీంతో గతంలో జగన్ మోహన్ రెడ్డి 5 వేలు ఇవ్వాలి అంటూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాటి మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న నారా లోకేష్ కూడా ఇదే విషయం ప్రస్తావిస్తూ, అప్పట్లో మేము చేసినంత సాయం కూడా చేయలేదని, 5 వేలు ఇవ్వాలని చెప్పిన మనిషి, 500 ఇస్తామని చేతులు దులుపుకున్నారని లోకేష్ విమర్శించారు.

Advertisements

Latest Articles

Most Read