తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకి ఫోన్ మెసేజ్ ద్వారా బెదిరింవులు పాల్పడుతున్న సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గతంలో ఆ వ్యక్తి పలు వురు నేతలకు ఫోన్ కాల్స్ ద్వారా అలాగే మెసేజ్ ల ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇందులో టిడిపి నాయకులతో పాటు తెలంగాణ రాష్ట్రాన్రికి చెందిన నాయకులను కూడా సదరు వ్యక్తి బెదిరించినట్లు తేలింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడడును, ఆ వ్యక్తి గుర్తు తెలియని నంబర్ నుంచి మెసేజ్ చేస్తూ బెదిరించడం జరి గింది. దీనిపై స్పందించిన అయ్యన్న పాత్రుడుతనను బెదిరించిన సదరు వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు విచారణ చేపట్టగా బుచ్చయ్య పేట మండలం, కె.పి.అగ్రహారం కు చెందిన వియ్యపు తాతారావు అయ్యన్న పాత్రుడుని ఫోన్ ద్వారా బెదిరించడం జరిగిందని వెల్లడైంది. దీంతో తాతారావు ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిం చారు. వియ్యపు తాతారావు గతంలోనూ కూడా ఇలాంటి మెసేజ్లను అలాగే ఫోన్ కాల్స్ చేస్తూ పలువురు పార్టీ నాయ కులను బెదిరిస్తూ ఉండేవాడు. గతంలో కూడా కొందరు నాయకులు తమకు బెదిరిస్తూ మెసేజ్ లు వచ్చా యని మీడి యా ముందు వెల్లడించడం జరిగింది అలాగే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.

ఆంధ్రాలోనే ఎక్కు వగా టిడిపి నాయకులను టార్గెట్ చేస్తూ సదరు వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు.ఇందులో ఉత్తరాంధ్రకు చెందిన టిడిపి సీనియర్ నేతలే ఎక్కువగా ఉన్నారు. ఇది వరకు తెలంగాణలో కూడా అలాగే అక్కడి నేతలను బెదిరిస్తూ ఫోన్ కాల్స్, మెసేజ్ లు చేశాడు.అయితే తెలంగాణ పోలీసులు ఈ బెదిరింపులు కేసును సీరియస్ గా తీసుకుని అతన్ని కటకటాల పాలు చేశారు. ఆంధ్రాలో అయ్య న్న పాత్రుడుతో పాటు టిడిపి నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస రావు, యనమల రామకృష్ణ లకు ఫోన్ చేసి అలాగే మెసేజ్ చేసి బెదిరించినట్లు పోలీసు పేర్కొంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్రికి చెందిన టిఆర్ఎస్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి లను కూడా సదరు తాతారావు బెదిరించినట్లు తెలిపారు.రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో గల మారెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా వియ్యపు తాతారావు పై కేసు నమోదు చేసి ఇదివరకే అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు వెల్లడించారు.

అమరావతికి వ్యతిరేకంగా నిన్న కొంత మంది వేరే ప్రాంతం వారు, ఆటల్లో వచ్చి, అమరావతిలో ధర్నా కార్యక్రమం చేస్తున్న క్రమంలో, అమరావతి రైతులు, మహిళలు వారిని అడ్డుకుని, మీరు ఎవరు ? మా ఊరు వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నారు ? మిమ్మల్ని ఎవరు ఆటోల్లో తోలోకోస్తున్నారు, అంటూ వారిని అడ్డుకున్న సంగతి తెలిసిందే. నిన్న మరో పక్క ఒక వీడియో కూడా, వీరికి ఏమి మాట్లాడాలో ట్రైనింగ్ ఇస్తున్న వీడియో బయట పడటంతో, వీళ్ళు పైడ్ బ్యాచ్ అని తేలిపోయింది. ఇక మరో పక్క నిన్న కృష్ణాయపాలెంలో వీరిని అడ్డుకున్న వారి పై, ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ 11 మందిలో కొంత మంది దళితులు కాగా, మరి కొంత మంది బీసిలు. అమరావతి రైతులను అరెస్ట్ చేయటంతో, పెద్ద ఎత్తున దళిత సంఘాలు, అమరావతి రైతులు, పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. బయట నుంచి మా ప్రాంతంలో అల్లర్లు చేయాలనీ చూస్తున్న వారిని కాకుండా, మా పై కేసులు పెట్టటం ఏమిటి అంటూ, ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీరికి తెలుగుదేశం పార్టీ కూడా అండగా నిలిచింది. స్థానిక నాయకులు వారికి మద్దతు తెలిపారు. రైతుల పై అక్రమంగా కేసు పెట్టటం పై, నిరసన తెలిపారు. డీఎస్పీ వాహనానికి కూడా అడ్డు తగిలి, దళిత సంఘాలు నిరసన తెలిపాయి. అయితే ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు పెట్టిన ఈపూరి రవి అనే వ్యక్తీ పోలీస్ స్టేషన్ కు వచ్చి, తాను కేసు వెనక్కు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈపూరి రవి అనే వ్యక్తి కూడా కృష్ణాయపాలెంకు చెందిన వ్యక్తే. అయితే తాను కేసు వెనక్కు తీసుకుంటున్నానని ఆయన ముందుకు వచ్చారు. తాను ఫిర్యాదులో కూడా, ఆటోలను ఆపారు అని, వారి పై చర్యలు తీసుకోండి అని మాత్రమే తాను ఫిర్యాదు చేసానని, ఎక్కడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టమని కోరలేదని, పోలీసులే నమోదు చేసారని, అందుకే ఈ కేసు అనవసరంగా పక్కదోవ పడుతుందని కాబట్టి, తాను వెనక్కు తీసుకుంటానని కోరారు. సాధారణంగా అటోలను ఆపారు అని మాత్రమే కంప్లైంట్ ఇచ్చానని, తెలిపారు. ఇదే విషయం ఆయన లేఖ రాసి, పోలీసులకు ఇచ్చారు. అయితే పోలీసులు మాత్రం ఈ విషయం పై, స్పందించటం లేదు. మీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఇప్పటికే కేసు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేసామని, ఇక మేము కేసు వెనక్కు తీసుకునేది ఉండదని, మీరు ఇరు వర్గాలు వెళ్లి కోర్టులో తేల్చుకోండి అంటూ పోలీసులు తేల్చి చెప్పారు. అయితే తానూ ఎస్సి, ఎస్టీ కేసు పెట్టమని తాను కోరలేదని, మీరు కేసు పెట్టారు కాబట్టి, తాను వెనక్కు తీసుకుంటాను అని చెప్పినా, పోలీసులు మాత్రం కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పారు. పోలీసులు ఇలా చేయటంతో, మంగళగిరి అంబేడ్కర్ విగ్రహం వద్ద, పోలీసుల తీరుకు నిరసనగా దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. మరి ఈ కేసు ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.

దసరా ప్రయాణం పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రయాసగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు పునరుద్దరణ కాలేదు. దీంతో ప్రైవేటు ట్రావెల కు విపరీతమై డిమాండ్ పెరిగింది. శుక్రవారం నుంచి హైదరాబాద్ టు విజయవాడ రాకపోకలు సాగించే వారి సంఖ్య పెరిగింది. దీంతో పాటే టిక్కెట్ ధర అమాంతం రూ.3వేలకు చేరింది. కరోనా కారణంగా గడిచిన ఆరు నెలలుగా ఆంధ్రా, తెలంగాణ మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడవడం లేదు. అలాక్ ప్రక్రియ మొదలైనప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడిపేందుకు సాగిన చర్చలు విఫలమయ్యాయి. దసరా సమయంలో ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయాణాలు చేస్తుంటారు. దీన్ని ప్రైవేటు ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నియంత్రణ చర్యలు లేకపోవడంతో టిక్కెట్ ధరలు ఐదు రెట్లు పెంచేసి ప్రయాణీకుల్ని దోచుకుంటున్నాయి. రానుపోను ఒక • ఫ్యామిలీ (నలుగురు కుటుంబసభ్యులు) వచ్చి వెళ్ళాలంటే టిక్కెట్లకే రూ.25,000 ఖర్చయ్యే పరిస్థితి. ఆర్థిక పరిస్థితి అనుకూలించక పలువురు ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పుడు రాలేంలే అని కుటుంబసభ్యులకు సరి చెప్పుకుంటున్నారు. ఇద్దరు సభ్యలే ఉంటే బైక్ పై జర్నీకి ప్రాధాన్యత ఇస్తున్నారు.

లాక్ డౌన్ ప్రక్రియ ప్రారంభం కాకముందు వరకు నిత్యం 150 బస్సులు విజయవాడ టూ హైదరాబాద్ వెళ్లేవి. తద్వారా రూ.38 లక్షల రూపాయల మేర ఆదాయం వచ్చింది. దసర సమయంలో ప్రత్యేక సర్వీసుల పేరుతో 400కు పైగా బస్సు సర్వీసులు నడిచేవి. పండగ రద్దీని పురస్కరించుకొని ఆర్టీసీ అదనపు ఛార్జీ వసూలు చేసేది. అయినా బస్సులు ప్రయాణీకులతో కిక్కిరిసేవి.. విజయవాడ టూ హైదరాబాద్ రూటులో బస్సు సర్వీసులకు మంచి డిమాండ్ ఉంటుంది. కృష్ణా రీజియన్‌ ఆదాయం రోజుకు రూ.1.50 కోట్లు కాగా ఇందులో రూ.38 లక్షల ఆదాయం విజయవాడ టూ హైదరాబాద్ బస్సు సర్వీసుల నుంచి లభించేది. దసర, సంక్రాంతి పండుగ సీజన్లలో రూ.3 నుంచి రూ.4 కోట్ల ఆర్టీసీ ఆదాయానికి గండిపడట్లే. కృష్ణా రీజియన్లో ప్రస్తుతం 1,450 బస్సులు తిరుగుతున్నాయి. పండుగ రద్దీని పురస్కరించుకొని 450 స్పెషల్ బస్సుల్ని ఏర్పాటు చేశారు. తిరుపతి, కడప, వైజాగ్ ప్రాంతాలకు వీటిని నడుపుతున్నారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి నెలకొంది. హైకోర్టులో ఈ విషయం పై గతంలో పడిన కేసు విచారణకు రావటం, ఎన్నికల నిర్వహణ పై తమ అభిప్రాయం చెప్పాలి అంటూ ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం, ఎన్నికల కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయం తీసుకునేందుకు, 28న సమావేశం ఏర్పాటు చేయటం తెలిసిందే. అయితే ఈ పరిణామం కంటే ముందే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో జరిగే ఎన్నికల పై సమీక్ష చేస్తున్నాం అంటూ, దానికి హాజరు కావాలి అంటూ, ఈ రోజు ప్రభుత్వం వైపు నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఒక సందేశం వెళ్ళింది. సోమవారం నాడు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద ఈ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశానికి హాజరు కావాలి అంటూ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమీషనర్, రాజ్యాంగబద్ద హోదాలో ఉంటారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు, హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉంటారు. పైగా ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పని చేసి, పదవి విరమణ చేసిన హోదా కూడా ఉంది. అటువంటి హోదాలు, రాజ్యాంగాబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, సియం ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ నుంచి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను, సోమవారం ఉదయం సచివాలయంలో జరిగే సమావేశానికి హాజరు కావాలి అంటూ, మెసేజ్ పంపటం అనేది, తీవ్రమైన అధికార ఉల్లంఘన కింద పరిగణించారు.

ఈ నేపధంలోనే, నిమ్మగడ రాష్ట్ర ఎన్నికల సంఘం అడిషనల్ సెక్రటరీ నుంచి, మళ్ళీ తిరిగి సియం ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ కు తిరిగి మరో మెసేజ్ పంపించారు. హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని, ఈ విధంగా మెసేజ్ ఇవ్వటం అనేది, న్యాయ సమ్మతం కాదు, చట్ట విరుద్ధం అని కూడా పేర్కొంటూ, ఇటువంటి ప్రయత్నాలు అనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఒక బ్లేటంట్ అటెంప్ట్ చేస్తున్నారు అంటూ తీవ్రమైన పదజాలంలో మెసేజ్ పంపించారు. ఇప్పటికే ఈ అంశం కోర్టులో ఉండగా, ఇలా చేయటం పై, తాము ఈ విషయం పై కోర్టుకు కూడా చెప్తామని ఆ మెసేజ్ లో తెలిపారు. ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణి మోహన్ ని కూడా, ఆ సమావేశానికి తన అనుమతి లేకుండా వెళ్ళవద్దు అంటూ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మెసేజ్ పంపించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో పాటు, ఈ నెల 26 నుంచి తాను, విజయవాడ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, తననుతో చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని, ఆయన మెసేజ్ పంపించారు. దీంతో, ఇప్పుడు ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య జరుగుతున్న ఈ మెసేజ్ ల యుద్ధం పై, ఆసక్తి నెలకొంది.

Advertisements

Latest Articles

Most Read