ఆంధ్రప్రదేశ్ సిఐడి పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక యూట్యూబ్ ఛానల్ పై సిఐడి అధికారులు ప్రవర్తించిన తీరు విషయంలో, హైకోర్టు తీవ్ర అభ్యంతరం చెప్పింది. మీరు ఉన్నది ప్రజల రక్షణ కోసం కానీ, అధికార పార్టీ మెప్పు పొందటానికి కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలుగు వన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై, రెండు నెలల క్రిందట సిఐడి పోలీసులు హైదరాబాద్ వెళ్లి, అక్కడ సర్వర్ లు అన్నీ స్వాధీన పరుచుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా తెలుగు వన్ అధినేత రవిశంకర్ పై కూడా కేసు నమోదు చేసారు. తన పై నమోదు అయిన కేసు విషయం పై రవి శంకర్ ఏపి హైకోర్టు లో క్వ్యాష్ పిటీషన్ వేసారు. తన పై వేసిన కేసు కొట్టేయాలని హైకోర్టుని కోరారు. ఈ విషయం పై సిఐడి పోలీసులను తప్పు పడుతూ, గత నెల 26న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాల పూర్తి కాపీ నిన్న బయటకు వచ్చింది. ఇందులో అనేక అంశాలు, కోర్టు సిఐడి పై చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. మనం ఉన్నది డెమోక్రసీ, కనీ మీ తీరు చూస్తుంటే ఖాకిస్టోక్రసీలో జీవిస్తున్నాం అనే భావన కలుగుతుంది అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

ఖాకిస్టోక్రసీ అంటే, పోలీస్ రాజ్యం అనే విధంగా హైకోర్టు స్పందించింది. ఈ కేసు విషయంలో, కేసు నమోదు దగ్గర నుంచి, కంప్యూటర్లు, సర్వర్లు తీసుకురావటం, దర్యాప్తు తీరు, అన్నీ చూస్తుంటే సిఐడి పోలీసుల అత్యుత్సాహం కనపడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది అరాచకత్వానికి దారి తీసే విధంగా ఉందని, సరైన ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసి, దర్యాప్తు పేరుతొ వేధించటం అన్యాయం అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలకు బ్రేక్ వెయ్యకపోతే, ప్రజలకు జీవించే హక్కు కానీ, స్వేఛ్చ కానీ లేకుండా, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగితే తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయని కోర్టు హెచ్చించింది. సిఐడి పోలీసులు అధికారాన్ దుర్వినియోగానికి పాల్పడ్డారని, పెట్టిన సెక్షన్లకు, చేస్తున్న అబియోగాలకు సంబంధం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. శాంతిభద్రతలు కాపాడటం సిఐడి ప్రాధమిక విధి అని కోర్టు గుర్తు చేసింది. అంతే కాకుండా కేసు కొట్టేసి, సిఐడి స్వాధీన పరుచుకున్న పరికరాలు అన్నీ తిరిగి వారికి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది.

వైఎస్ వివేక హత్య కేసు, హైకోర్టు ద్వారా సిబిఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంలో సిబిఐ కొన్ని రోజులు విచారణ చేసి, ఢిల్లీ వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ 40 రోజులు తరువాత, సిబిఐ ఢిల్లీ నుంచి పులివెందుల చేరుకొని, రెండో విడత విచారణ మొదలు పెట్టింది. జూలై నెలలోని మొదటి వారంలో, దాదపుగా 15 రోజులు పాటు, కడపలో, అలాగే పులివెందులలో కూడా చాలా మందిని సిబిఐ విచారించింది. గతంలో సిట్ చేసిన విచారణ వివరాలు మొత్తం సిబిఐ తీసుకుని, చాలా మంది సాక్ష్యులని, హత్య జరిగిన సమయంలో అక్కడ ఉన్న వారిని, ముందుగా ఘటనా స్థాలానికి వచ్చిన పోలీసులను, వివేక కూతురుని, ఇలా అనేక మందిని, దాదాపుగా 15 రోజులు పాటు సిబిఐ విచారణ జరిపింది. అయితే ఉన్నట్టు ఉండి సిబిఐ ఢిల్లీ వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చే వారం వస్తారని అందరూ భావించినా, సిబిఐ మళ్ళీ తిరిగి రాలేదు. నెల రోజులు గడుస్తున్నా సిబిఐ రాకపోవటంతో, విచారణ ఏమైందా అనే వ్యాఖ్యలు వస్తున్న వేళ, దాదాపుగా 40 రోజులు తరువాత మళ్ళీ సిబిఐ తిరిగి వచ్చింది.

ఢిల్లీ నుంచి నేరుగా పులివెందుల చేరుకున్న సిబిఐ బృందం, ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ లో బస చేసారు. విచారణ జరిగిన తీరు, తరువాత ఎవరిని విచారించాలి, విచారణ తీరు ఎలా సాగాలి అనే దాని పై చర్చించారు. ఈ సారి విచారణలో, రాజకీయ ప్రముఖులని విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ కేసులో వైఎస్ ఫ్యామిలీ ప్రముఖులు, కొంత మంది ప్రజా ప్రతినిధుల పేర్లు వినపడుతున్న సమయంలో, వారిని ఈ సారి విచారణకు పిలిచే అవకాసం ఉంది. మరి ఈ సారి విడతలో విచారణ పూర్తి చేస్తారా ? లేదా విచారణ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది ? ఇప్పటికే సిబిఐ ఒక అంచనాకు వచ్చిందా ? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇంకా సస్పెన్స్ లోనే ఉన్నాయి. కేసు విచారణ, హైకోర్టు ద్వారా, సిబిఐకి రావటంతో, సిబిఐ విచారణ మొత్తం, హైకోర్టుకే ఇచ్చే అవకాసం ఉంది. ఎప్పటికి విచారణ పూర్తి అవుతుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క-రో-నా కట్టడిలో విఫలం అయ్యిందని అందరికీ తెలిసిందే. నమోదు అవుతున్న సంఖ్య చూస్తూనే ఆ విషయం అర్ధం అవుతుంది. ఇప్పటికే దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర తరువాత స్థానం మనదే. అయితే మనకు ఇప్పుడు కేసులు 5 లక్షలు ఉన్నాయి. 5 లక్షలకే అమ్మో అని అనుకుంటున్నాం. అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, పెద్ద సిటీలు లేవు, అయినా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు క-రో-నా పాకేసింది. ఇక మరణాల్లో కూడా మనది 5 వ స్థానం. ఇలా ఏది చూసుకున్నా, ఏపిలో క-రో-నా అధికంగా ఉందని ప్రజలు భయపడే పరిస్థితి. అయితే తాజాగా వచ్చిన సర్వే వివరాలు చూస్తూ, అవాక్కవ్వల్సిందే. ఒక పక్క షాక్ అవుతూనే, మరో పక్క ఈ వైరస్ ఇంత ప్రమాదం కాదా అనుకునే సందేహం కూడా మానదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిరో సర్వైలెన్స్‌ నిర్వహించిన సర్వేలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19.7 శాతం మందికి క-రో-నా వచ్చి వెళ్లిపోయినట్టు తేలింది. 9 జిల్లాల్లో చేసిన సర్వేలో ఈ విషయం బయట పడింది.

అంటే మన రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే 19.7 శాతం అంటే, దాదాపుగా కోటి మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే వారికి కూడా వారు ఈ వైరస్ బారిన పడినట్టు తెలియదు. అంతే కాదు క-రో-నా లక్ష్యనాలు కూడా అతి తక్కువ మందికి మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు క-రో-నా టెస్టులు చేయించుకోని వారిని ఎంపిక చేసి ఈ సర్వే చేసారు. నెల రోజులు క్రితం మూడు జిల్లాల్లో ఈ సర్వే చెయ్యగా, 15.7 శాతం మందికి క-రో-నా విచ్చి వెళ్లిందని తేలింది, తాజగా మిగతా తొమ్మిది జిల్లాల్లో కూడా సర్వే చేసారు. రక్తంలో ఉండే యాంటీ బాడీస్‌ ఆధారంగా, ఈ నిర్ధారణకు వచ్చారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో, 30.6 శాతం మందికి క-రో-నా వచ్చి వెళ్లినట్టు తేలింది. ఈ సంస్థ అంచనా ప్రకారం, రాబోయే రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో, ఇంకా ఎక్కువ కేసులు వచ్చే అవకాసం ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఇంత మందికి క-రో-నా వచ్చి వెళ్ళింది అనేది భయపెట్టే విషయం అయితే, అంత మందికీ కనీసం వైరస్ సోకినట్టు కూడా తెలియకుండానే, తగ్గిపోయింది అనేది ఊరటను ఇచ్చే విషయం.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొరకరాని కొయ్యగా, ప్రతి రోజు తన ప్రెస్ మీట్లతో, ప్రతిపక్షం కంటే ఎక్కువగా ప్రజా సమస్యలు చెప్తూ, ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెస్తూ, అలాగే ప్రభుత్వంలో పని చేస్తూ, కొంత మంది వ్యక్తులు చేస్తున్న పనులు, కొంత మంది మంత్రులు, ఎమ్మెల్యే చేస్తున్న పనులను బహిరంగంగా విమర్శిస్తూ, వైసీపీని ప్రతి రోజు ఇబ్బంది పెడుతున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, వైసీపీ పార్టీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాను చేసిన చాలెంజ్ కు ఒకే అంటే రాజీనామాకు రెడీ అని చెప్పారు. రఘురామకృష్ణం రాజుని ఎలాగైనా వదిలించుకోవాలని, వైసిపీ పార్టీ అనేక ప్లాన్లు వేసింది. ఆయనకు షోకాజ్ నోటీస్ పంపించగా, ఏకంగా పార్టీ పేరు మీదే పంచాయతీ పెట్టిన రాజు గారు, చివరకు పేరు పై ఢిల్లీ హైకోర్టులో కేసు వేసే దాకా ఇష్యూ ని తీసుకు వెళ్లారు షోకాజ్ నోటీస్ ఫెయిల్ అవ్వటంతో, రఘురామ కృష్ణం రాజు ఎంపీ పదవికి అనర్హత వేటు వెయ్యాలి అంటూ, పార్లమెంట్ స్పీకర్ కు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ వెళ్లి ఫిర్యాదు చేసారు. అయితే రఘురామ రాజు మాత్రం, ఇక్కడ కూడా ట్విస్ట్ ఇచ్చారు.

తాను ఎక్కడైనా జగన్ గారిని కానీ, పార్టీని కానీ విమర్శించినట్టు ఉందా అని ప్రశ్నించారు. పార్టీ, ప్రభుత్వం వేరు అని, ప్రభుత్వం తప్పు చేస్తుంటే, సరిదిద్దే బాధ్యత రాజ్యాంగ కల్పించిన హక్కు అని అన్నారు. ఇక ఇది కూడా ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. దీంతో ఆయన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. రాజీనామా చెయ్యాలి అంటూ ప్రతి రోజు విసిగిస్తున్నారు. ఈ రోజు కూడా మంత్రి బాలినేని రఘురామ రాజు రాజీనామా చెయ్యాలని, డిమాండ్ చేసారు. అయితే మొన్నటి దాకా నేను రాజీనామా చెయ్యను అని చెప్పిన రఘురామరాజు, ఈ రోజు వైసీపీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. బాలినేని డిమాండ్ చేసినట్టు నేను రాజీనామాకు రెడీ అని, కాకపొతే నేను రాజీనామా చేసి, అమరావతి రిఫరెండంతో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానాని, నేను మళ్ళీ గెలిస్తే అమరావతి ఇక్కడ నుంచి కదలదు అని జగన్ గారి చేత చెప్పించండి, నేను రాజీనామా చేస్తే, ఎన్నికలకు వెళ్లి అమరావతి రిఫరెండంతో ఓట్లు అడుగుదాం అంటూ, అదిరిపోయే సవాల్ విసిరారు. మరి జగన్ గారు కానీ, 151 మంది ఉన్న వైసీపీ పార్టీ కానీ, ఒక్కడు వదిలిన ఛాలెంజ్ కు రెడీ అంటారా ?

Advertisements

Latest Articles

Most Read