ఏప్రిల్ ఫస్ట్ వచ్చింది అంటే, పక్కవాళ్ళని ఆట పట్టించి, "ఏప్రిల్ ఫూల్" అంటాం. అల ఎందుకు అంటామో, దాని చరిత్ర ఏంటో తెలుసుకోవాలి అంటే, యూరప్ గురించి చెప్పాలి. 1582వ సంవత్సరం దాక యూరప్ లో నూతన సంవత్సర వేడుకలను మార్చి 25 నుంచి ఏప్రిల్ మొదటి తేదీ వరకు, పది రోజుల పాటు గ్రాండ్ గా జరుపుకునే వారు. 1582లో అప్పటి ఫ్రాన్స్ రాజు తొమ్మిదో ఛార్లెస్ అప్పటి వరకు ఫాలో అయిన క్యాలెండర్ ను మార్చేసి, గ్రెగేరియన్ క్యాలెండర్ ను ఆమోదించాడు.

ఈ క్యాలెండర్ కు అనుగుణంగా జనవరి ఒకటో తేదీన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని ప్రజలకు ఆదేశాలు ఇచ్చారు. కొంతమంది ప్రజలకి రాజుగారి ఆదేశం చేరలేదు. ఈలోగా మళ్లీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజు ఆదేశం ప్రకారం చాలా మంది ప్రజలు జనవరి ఫస్ట్ రోజున కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు. రాజుగారి ఆదేశం తెలియని వాళ్లు పాత పద్ధతిలో ఏప్రిల్ ఫస్ట్ వరకు ఆగి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

న్యూ ఇయర్ గా జనవరి ఫస్ట్ న వేడుకలు చేసుకున్న వాళ్లు, ఏప్రిల్ ఫస్ట్ ను సెలబ్రేషన్స్ చేసుకున్న వాళ్లను ఫూల్స్ అంటూఆటపట్టించారు. పేపర్తో చేప బొమ్మలు తయారుచేసి వాళ్ల వెనక భాగాన కట్టి ఆటపట్టించేవాళ్లు. గేలానికి దొరికే చేపలకింద జమ కట్టేవాళ్లు. ఏప్రిల్ ఫిష్ అంటూ ఆటపట్టించేవాళ్లు. ఇదే కాలక్రమంలో ఏప్రిల్ ఫూల్స్ డే గా మారిపోయింది. ఇలా ఆటపట్టించే విధానం తరువాత ప్రపంచం అంతా పాకింది. ఇదీ ఏప్రిల్ ఫూల్స్ డే హిస్టరీ.

ఐటీ అంటే హైదరాబాద్ అనే రోజులు పోయాయి... విభజన పుణ్యం, చంద్రబాబు పాలనా దక్షత, ఇప్పుడు ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు కూడా చూస్తున్నాయి. ఇప్పటికే వైజాగ్ లో ఐటీ కంపెనీలకు ఒక మంచి వాతావారణం ఉంది, విజయవాడ, గుంటూరు వైపు ఇప్పుడ ఇప్పుడే కంపెనీలు వస్తున్నాయి. గన్నవరంలో HCL లాంటి పెద్ద కంపనీ రాబోతుంది.

ఇది ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ వంటివి చాలా తక్కువ అనే భావన చాలా ఐటీ కంపెనీల్లో ఉంది. అందుకే హైదరాబాద్‌ నుంచి వచ్చే విద్యార్థుల్లో మాత్రమే ఇలాంటి లక్షణాలు ఉంటాయని ఐటీ దిగ్గజ కంపెనీలు భావిస్తూ వచ్చాయి. అయితే, ఇప్పుడు అభిప్రాయం మార్చుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో మైక్రోసాఫ్ట్‌ సంస్థ స్థాపించాలంటూ, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన విద్యార్థులు దొరకుతారని, ఏపీలో ఆ స్థాయిలో విద్యార్థులు ఉండరన్న వాదనను మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చింది. కాని రాష్ట్ర ప్రభుత్వం, వారి అభిప్రాయాన్ని విభేదించి, రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని మైక్రోసా్‌ఫ్టకు ప్రభుత్వం సూచించింది.

రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పర్యటించిన మైక్రోసా్‌ఫ్టకు.. రాష్ట్ర విద్యార్థుల్లో ప్రతిభా పాటవాలు తెలిసొచ్చాయి. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కు కాస్త పదును పెడితే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలకు ప్రధాన మానవ వనరుగా ఏపీ ఉంటుందని మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు భావించారు. ప్రభుత్వం, ఇప్పుడు విద్యార్ధుల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచటానికి పలు కార్యక్రామాలు రుపొందిస్తుంది.

ఎక్కు తొలిమెట్టు... కొండని కొట్టు ఢీకొట్టు... గట్టిగా పట్టే నువు పట్టు... గమ్యం చేరేట్టు... నువు పలుగే చేపట్టు... కొట్టు చెమటే చిందేట్టు... బండలు రెండుగ పగిలేట్టు... జీవితమంటే పోరాటం... పోరాటంతో ఉంది జయం...

ఈ పాట గుర్తుకువచ్చిందా ? రజనీకాంత్ నరసింహ సినిమాలోని పాట... ఇంచు మించు ఇలాగే, కొండల్లోని సున్నపురాయిని పగులగొట్టి.. కాల్చి సున్నం చేసి అమ్ముకునే చేతులతోనే ఇప్పుడు... అరటి పాదులను తీయడం కనిపిస్తుంది... సున్నపుబట్టీల్లో కమురేసుకుపోయిన వీరి బతుకుల్లోకి తొలిసారి పచ్చదనం తొంగిచూసింది... కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలోని బక్కన్నగారిపల్లె గ్రామంలో ఇప్పుడు ఈ దృశ్యమే కనిపిస్తుంది. కష్టం చేసే మనుషులకు ప్రభుత్వ సాయం తోడయ్యి, కొండని ఢీ కొట్టి, సాగుయోగ్యంగా మార్చుకున్నారు... బట్టీల్లోంచి అరటి తోటల్లోకి బక్కన్నగారిపల్లె పయనమైంది... ఇప్పుడు ఏకంగా ఇక్కడ నుంచి, ఢిల్లీ మార్కెట్‌కు అరటి గెలలు ఎగుమతి చేసుకునే స్థాయికి వచ్చారు.

పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి మండలం బక్కెనవారిపల్లి సుగాలీ కాలనీ.. ఇక్కడున్న 260 కుటుంబాలకు తరతరాలుగా సున్నపుబట్టీలే ప్రధాన వృత్తి. కొండల్లోని సున్నపురాయిని సేకరించడం.. బట్టీల్లో కాల్చడం..దాన్ని అమ్ముకుని జీవించడం. వారికి తెలిసిందిదే. మగవాళ్లంతా రాత్రింబవళ్లు బట్టీల్లో మాడిపోతుంటే, సున్నం బస్తాలతో ఆడవాళ్లు తిరిగి అమ్మేవారు.

పదిహేనేళ్ల క్రితం డీకేటీ భూములప్రతి కుటుంబానికీ ప్రభుత్వం భూమి ఇచ్చింది. కాకపోతే ఆ ప్రాంతమంతా కొండలు, గుట్టలతో నిండింది. కొన్నేళ్లుగా అలాగే వదిలేశారు. వీరిలోనే కొందరు కొండవాలును వ్యవసాయ యోగ్యంగా మార్చడంతో అందరిలోనూ ఆలోచన మొదలైంది. కొండలను సాగుయోగ్యంగా మార్చుకున్నారు. విషయం అధికారులకు తెలిసింది. దగ్గరుండి భూములను చదును చేయించారు. రాయితీలు అందాయి. ఉచిత విద్యుత లభించింది. డ్రిప్‌ తదితర సాంకేతిక ఆధునిక పరికరాలు నూరుశాతం సబ్సిడీతో సమకూరాయి. బ్యాంకులు వచ్చి రుణాలు అందించాయి. సాగు చేసిన పంట చేతికి రాగానే ప్రభుత్వం.. సబ్సిడీ ఇచ్చి ఆదుకొంది. 30 బోరుబావులు, విద్యుత కనెక్షన్లు, ట్రాన్స్ ఫార్మర్లు, 20 ప్యాక్‌ హౌస్ లను రాయితీతో రైతులు సమకూర్చుకున్నారు. ఇదే క్రమంలో ఊరికోసం చెక్‌డ్యామ్‌ని నిర్మించుకొన్నారు.

ఇప్పుడు కొండలు, గుట్టల్లోంచి మొలిచిన పచ్చనాకులా.. బక్కన్నగారిపల్లె కనిపిస్తుంది. పచ్చని అరటి గెలలతో తోటలు నిండుగా కనిపిస్తాయి. ఇక్కడి నుంచి అరటి గెలలు దిల్లీ మార్కెట్‌కు ఎగుమతవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా, ఈ గ్రామ ప్రజలని అభినందించారు. చంద్రబాబు ఎప్పుడూ అనే మాట నిజమైంది, రాయలసీమ రైతులకి సరిపడా నీరు ఇస్తే, రాతి నేలల్లో నిజంగానే బంగారం పండిస్తారు.

ప్రపంచంలో అతి పెద్ద సోలార్ పార్కగా కర్నూలు అవతరించబోతోంది. ఏప్రిల్ నాటికి పార్క సామర్ధ్యం మేర వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సౌరఫలకాల ఏర్పాటు పూర్తి కాబోతుంది. ఇప్పటికే 90% వరకు సౌర విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్ల పూర్తయ్యాయి.

తమిళనాడులోని రామనాధపురంలో అదానీ సంస్థ నిర్మించిన సోలార్ పార్కే(648 మెగావాట్లు) ఇప్పటి వరకూ ప్రపంచంలో అతి పెద్దదిగా భావిస్తున్నారు. కర్నూలు పార్క సామర్ధ్యం వెయ్యి మెగావాట్లు కావడంతో దాని కంటే పెద్దది కాబోతోంది.

కర్నూల్ సోలార్ పార్కులో సన్ ఎడిసన్ అనే సంస్థ 2015 నవంబరులో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి టెండరును దక్కించుకుంది. యూనిట్ విధ్యత్ కు రూ.4.64 ధరను ఆ సంస్థ కోట్ చేసింది. దేశంలోనే ఇప్పటి వరకు అదే తక్కువ ధర. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సన్ ఎడిసన్ సౌర విద్యుత్ యూనిట్ల నిర్మాణం చేపట్టలేకపోయింది. ఈ నేపథ్యంలోనే సన్ ఎడిసన్ నుంచి ఈ బాధ్యతను గ్రీన్ కో అనే సంస్థ తీసుకుంది.

సౌర విద్యుత్ యూనిట్ల పనులను ముమ్మరం చేసిన గ్రీన్ కో ఏప్రిల్ నాటికి 500 మెగావాట్ల స్థాపక సామర్థ్యాన్ని నెలకొల్పబోతోంది. 2015 డిసెంబరులో అదే ధర(యూనిట్ రూ. 4.64 పైసలు)కు సాఫ్ట్ బ్యాంకు కర్నూలు సౌర పార్కులోనే 350 మెగావాట్ల సౌర విద్యుత్ టెండరును చేజిక్కించుకుంది. టెండరు దక్ష్కించుకున్న దగ్గర నుంచీ దాన్ని ఎంత తొందరగా పూర్తి చేయాలన్న తపనతోనే ఫ్ట్ బ్యాంకు పని చేస్తూ వస్తోంది.

kurnool solar park 25032017 2

kurnool solar park 25032017 3

kurnool solar park 25032017 4

kurnool solar park 25032017 5

kurnool solar park 25032017 6

పాలనా బాధ్యతల్లో క్షణం తీరిక లేకుండా ఉండే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్రికెట్ బ్యాట్, బాల్ పట్టుకుని తమలోని ఆటకు పదును పెట్టారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ, ఆంద్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన మూలపాడులోని క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించనున్న లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ మ్యాచ్ లో పాల్గొనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రాక్టీసు మ్యాచ్లు జరుగుతున్నాయి.

చీఫ్ సెక్రటరీ ఎలెవన్, డీజీపీ ఎలెవన్ జట్ల మధ్య ఈ నెల 26న మూలపాడులోని ఏసీఏ క్రికెట్ మైదానంలో జరిగే 15 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. 50 మంది వరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ మ్యాచులు ఆడనున్నారు. ఐఏఎస్ టీంను అజయ్ కల్లం, ఐపీఎస్ టీంను డిజిపి సాంబశివరావు కెప్టన్లుగా వ్యవహరిస్తారు.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read