వైసీపీ శైలి ప్ర‌మాద‌క‌ర ఎత్తుగ‌డ‌ల‌కి తెర‌తీసింది. ప్ర‌శాంతంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌ని సైతం అల్ల‌క‌ల్లోలం చేసే వ్యూహం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కి దారి తీస్తోంది. రాజ‌కీయ పార్టీలు ఎవ‌రికి వారు త‌మ కార్య‌క్ర‌మాలు చేసుకోవ‌డం ఆన‌వాయితీ. ప్ర‌భుత్వం తాము చేసింది ప్ర‌చారం చేసుకుంటుంది. ప్ర‌తిప‌క్షం స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతుంది. ఇవి వివిధ‌మార్గాల ద్వారా చేస్తారు. అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్ర‌జాస్వామ్యంలోనే చాలా డేంజ‌ర్ పోక‌డ‌ని మొద‌లుపెట్టింది. ప్ర‌జాధ‌నంతో ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి అందులో విప‌క్షాల‌పై ఆరోప‌ణలు గుప్పించ‌డంతో వార్‌కి తెర‌తీసింది. టిడిపి బీసీ స‌ద‌స్సు పెడితే, అంత‌కు ముందే బీసీల‌కి టిడిపి అన్యాయం చేసింద‌ని వాల్ రైటింగ్స్‌, ఫ్లెక్సీలు క‌ట్ట‌డం వైసీపీ న‌యా క‌న్నింగ్ పాలిటిక్స్. మ‌హానాడు కోసం టిడిపి అంగ‌రంగ వైభ‌వంగా ఏర్పాట్లు చేసుకుంటే..ప‌సుపు జెండాలు ఫ్లెక్సీల మ‌ద్య‌లో వైసీపీ ఫ్లెక్సీలు వేశారు. ఇప్పుడు మ‌రో అడుగు ముందుకేసి యువ‌గ‌ళం పాద‌యాత్రలో నారా లోకేష్‌ ఏ ఊరు వెళితే ఆ ఊరిలో పేద‌ల కోసం జ‌గ‌న్ రాక్ష‌సుల‌తో యుద్ధం చేస్తున్నాడంటూ రాముడి పోజులో జ‌గ‌న్ రెడ్డిని పెట్టి భారీ ఫ్లెక్సీలు క‌డుతున్నారు. చంద్ర‌బాబు నుంచి నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జి ప‌ర్య‌టించినా అక్క‌డ ఈ ఫ్లెక్సీల‌తో వైసీపీ క‌వ్విస్తోంది. టిడిపి కూడా ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు. ప్ర‌జాధ‌నం దోపిడీ చేసిన దొంగ‌పై చంద్ర‌న్న యుద్ధం, పేద‌ల‌పై పెత్తందారుడైన జ‌గ‌న్ చేస్తున్న దౌర్జ‌న్యాల‌ని అడ్డుకుంటామంటూ టిడిపి ఫ్లెక్సీలు వేస్తోంది. వైసీపీ ఫ్లెక్సీల జోలికెళ్ల‌ని పోలీసులు, టిడిపివి మాత్రం పీకేస్తున్నారు. దీంతో రాష్ట్ర‌మంతా ఉద్రిక్త‌త‌లు నెల‌కొంటున్నాయి. వైసీపీ క‌వ్వింపు చర్య‌లు, పోలీసుల ప‌క్ష‌పాత వైఖ‌రితో ఫ్లెక్సీ వార్ తీవ్రం అవుతోంది.

వైసీపీకి గ‌త ఎన్నిక‌ల్లో అత్య‌ధిక సీట్ల‌లో రావ‌డానికి బావ బ్ర‌ద‌ర్ అనిల్ కూడా ముఖ్య‌పాత్ర పోషించారు. చెల్లెలు ష‌ర్మిల‌కి ఆస్తులలో న్యాయంగా రావాల్సిన వాటాలు ఇవ్వ‌కుండా జ‌గ‌న్ థ్రెట్ ఇస్తుండడంతో వారు దూరం అయ్యారు. గ‌త ఎన్నిక‌ల్లో అన్న వ‌దిలిన బాణాన్ని అంటూ ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చిన ష‌ర్మిల‌, ఇప్పుడు అన్న‌పైకి వ‌దిలిన బాణంగా మారింది. జ‌గ‌న్ బావ బ్ర‌ద‌ర్ అనిల్ ఏపీలో ప‌ర్య‌టిస్తూ, వైసీపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసేలా త‌నకి ప‌ట్టున్న వ‌ర్గాల‌కి దిశానిర్దేశం చేస్తున్నారు. శ‌త్రువుకి శ‌త్రువు మిత్రుడు అనే సూత్రంని ఫాలో అవుతూ జ‌గ‌న్ రెడ్డి కొత్త మిత్రుడిని రంగంలోకి దింపాడు. అల్లుడు బ్ర‌ద‌ర్ అనిల్ కోసం మామ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విదేశాల నుంచి ఏపీలో మారుమూల ప‌ల్లెల‌వ‌ర‌కూ టార్గెట్ చేసి మ‌రీ కేఏ పాల్ ని ర‌క‌ర‌కాల కేసుల్లో ఇరికించేశారు. వేల‌కోట్ల ఆస్తులు సీజ్ చేశారు. చివ‌రికి కేఏ పాల్ మాన‌సిక స్థితిపై అనుమానాలు రేపి పిచ్చోడిని చేసి జ‌నాల్లోకి వ‌దిలేశారు. త‌న తండ్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి దెబ్బ‌కి పిచ్చోడు అయిన కేఏ పాల్ ని ఇప్పుడు వైఎస్ జ‌గ‌న్ రెడ్డి చేర‌దీస్తున్నాడు. బ్ర‌ద‌ర్ అనిల్ చేయ‌బోయే న‌ష్టాన్ని కేఏ పాల్ క‌వ‌ర్ చేస్తార‌నే ఆశ‌తో ఉన్నారు వైసీపీ వ్యూహ‌క‌ర్త‌లు. అయితే త‌న తండ్రి దెబ్బ‌కి జ‌నంలో కామెడీ పీస్ అయిన కేఏ పాల్ ని జ‌నం అంతా జోక‌ర్లా చూస్తున్నారు. అటువంటి కేఏ పాల్ ని దింపి టిడిపిని టార్గెట్ చేయాల‌నుకోవ‌డం హాస్యాస్ప‌ద‌మైన ఎత్తుగ‌డ అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు.

ఎన్ఆర్ఐల ట్ర‌స్టులు, ఫౌండేష‌న్లు అన్నీ డ్రామాలు అంటోన్న మాజీ మంత్రి పుల్లారావు వ్యాఖ్యలు ఆయనకే చుట్టుకున్నాయి. విడ‌ద‌ల ర‌జ‌నీ ఓ ఎన్ఆర్ఐ. ఆమె విరాళాలు, సేవ‌లు ప‌నికొస్తాయ‌ని తీసుకొచ్చి మ‌రీ టిడిపిలో చేర్చారు ప్ర‌త్తిపాటి పుల్లారావు. ఆమె టిడిపిలో చంద్ర‌బాబు పెట్టిన మొక్క‌నంటూ వ‌చ్చి, మానై ఎదిగి వైసీపీకి నీడ‌నిస్తోంది. త‌న‌దాకా వ‌స్తే కానీ త‌త్వం బోధ‌ప‌డ‌ద‌నేది సామెత‌. ఇప్పుడు ప్ర‌త్తిపాటి పుల్లారావు విష‌యంలోనూ అదే నిజ‌మైంది. ఎన్ఆర్ఐ అయిన విడ‌ద‌ల ర‌జినీని తీసుకొచ్చి టిడిపిలో చేరిస్తే  ఆమె అన‌తికాలంలోనే వైసీపీలో చేరి ఆయ‌న‌నే ఓడించింది. ప్ర‌త్తిపాటి వేసిన మొక్క ఇప్పుడు మానై వంగ‌డంలేదు, లొంగ‌డంలేదు. చిలకలూరిపేటలో ఇప్పుడు భాష్యం ప్ర‌వీణ్ టిడిపి కార్య‌క్ర‌మాల‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీకి అండ‌గా నిలుస్తున్నారు. అయితే పుల్లారావుకి త‌న‌లో తానే అభ‌ద్ర‌తాభావం ఫీలై చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టిడిపిలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. భాష్యం ప్ర‌వీణ్ పేరు ప్ర‌స్తావించ‌కుండానే ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే నేతలది ఎన్నిక‌ల హడావుడేనని, వారిని ఎంటర్ టైన్ చేస్తే ఎలా అంటూ మీడియాకెక్కారు. అక్కడో రూ. 10 వేలు.. ఇక్కడో రూ. 10 వేలు ఇచ్చి టిక్కెట్లు కావాలంటే ఇచ్చేస్తారా..? అంటూ నిల‌దీశారు. ఇప్పుడేదో ఓ రూ. కోటి ఖర్చు పెట్టి హడావుడి చేస్తారు.. ఆ తర్వాత చేతులెత్తేస్తారని ప్ర‌శ్నించారు. అదే ప్ర‌శ్న పుల్లారావుని నియోజ‌క‌వ‌ర్గంలో టిడిపి కేడ‌ర్ వేస్తే..స‌మాధానం ఏమిస్తారో మ‌రి. ఫౌండేషన్, ట్రస్టు పేర్లతో వచ్చే నేతలు ఎన్నికలు ముందొస్తారు.. ఎన్నికలవగానే వెళ్లిపోతార‌ని ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికో.. విదేశాల్లో ఎన్ఆర్ఐల దగ్గర షో చేయడానికో ఇలాంటి నేతలు వస్తూ పోతూ ఉంటార‌ని వ్యాఖ్యానించ‌డం ముమ్మాటికీ క‌డుపుమంట స్పంద‌న‌ని టిడిపిలో ఓ వ‌ర్గం మండిప‌డుతోంది.

వైసీపీ ఓట్లు పొందాలంటే కోడిక‌త్తి దాడి. సీట్లు ఇంకా ఎక్కువ రావాలంటే బాబాయ్‌పై గొడ్డ‌లి వేట్లు. ఇప్పుడు అధికారం అండ‌గా సాగిస్తున్న అవినీతి ప్ర‌శ్నించ‌కుండా రోజుకొక‌రిపై దాడులు. ఇదే వైకాపా గెలుపు మంత్రం. బెదిరింపు సూత్రం. విప‌క్షం ఏదైనా కానీయండి. ప్ర‌శ్నిస్తే ప్ర‌భుత్వం నుంచి దాడులే ఎదుర‌వుతున్నాయి. టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డిపై వైకాపా రౌడీమూక‌లు హ‌త్యాయ‌త్నానికి ఆయ‌న ఇంటిపైనే ఎటాక్ చేయ‌డం రాష్ట్రంలో ప‌రిస్థితుల‌కి అద్దం ప‌డుతోంది. అంత‌కు రెండురోజుల‌కి ముందే యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో లోకేష్‌పై ఎటాక్‌కి య‌త్నించారు. కోడిగుడ్లు విస‌ర‌డంతో లోకేష్ భ‌ద్ర‌తాసిబ్బంది అడ్డుగా నిలిచారు. టిడిపి జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిపై ఇప్ప‌టికే మూడుసార్ల‌కి పైగా హ‌త్యాయ‌త్నాల‌కి తెగ‌బ‌డ్డారు. పుంగ‌నూరులో ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేసే ర్యాలీకి దిగిన రామ‌చంద్ర‌యాద‌వ్ అనే నాయ‌కుడు ఇంటిని నామ‌రూపాల్లేకుండా ధ్వంసం చేశారు వైకాపా గూండాలు. మాచ‌ర్ల‌లో టిడిపి నేత జూల‌కంటి బ్ర‌హ్మారెడ్డిని అడ్డుకునేందుకు ఇప్ప‌టికే ఆయ‌న అనుచ‌రులు చాలా మందిని మ‌ట్టుబెట్టిన వైసీపీ, ఇటీవ‌ల టిడిపి నేత‌ల ఇళ్ల‌పై దాడుల‌కి దిగి,  టిడిపి కార్యాల‌యాన్ని త‌గుల‌బెట్టారు. గ‌న్న‌వ‌రంలో టిడిపి ఆఫీసుని ధ్వంసం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తీరోజూ రాష్ట్రంలో ఏదో ఒక మూల టిడిపి ల‌క్ష్యంగా వైసీపీ మూక‌లు విధ్వంసాల‌కి దిగుతూనే ఉన్నాయి.

Advertisements

Latest Articles

Most Read