తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వారి పై, జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వారిని వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూనే ఉంది, మరో పక్క ప్రతి రోజు ఇలాంటి ఘటన ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకుల పై ఏదో ఒక రకంగా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం, ఇప్పుడు తాజగా అనంతపురం మాజీ ఎంపీ, సీనియర్ నేత జేసీ దివాకర్‌ రెడ్డికి షాక్ ఇచ్చింది. జేసీ దివాకర్ రెడ్డి దూకుడుగా జగన్ పై ఆరోపణలు చేస్తూ ఉంటారు. మా వాడు మా వాడు అంటూ, చురకలు అంటిస్తూ ఉంటారు. అయితే జేసీ మాటలకు జగన్ పార్టీ మాత్రం హర్ట్ అవుతూ ఉండేది. ఇప్పుడు అధికారంలోకి రావటంతో, జేసీ దివాకర్ రెడ్డి వ్యాపారాలను టార్గెట్ చేసారు. ముఖ్యంగా ఆయనకు ట్రావెల్స్ బస్సులు ఉండటంతో, వాటి పై ఫోకస్ చేసారు. నిన్న రవాణా శాఖ ఆధ్వర్యంలో, అనంతపురంలో ఒకేసారి బస్సుల పై రైడ్ చేసారు.

diwakar 17102019 2

అన్ని పత్రాలు అడిగి, ఏవైతే తేడా ఉన్నాయో, వాటి పై ఆక్షన్ తీసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయి అంటూ, 9 బస్సులను సీజ్ చేశారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేశారు. నిబంధనలను అతిక్రమించినందుకే బస్సులు సీజ్ చేసి, కేసులు పెట్టమని, విచారణ కొనసాగుతుందని రవాణా శాఖ కమిషనర్‌ సీతారామాంజనేయులు వెల్లడించారు. అయితే దివాకర్ ట్రావెల్స్ మాత్రం, ఈ చర్యను ఖండించింది. అన్ని అనుమతులు ఉన్నాయని, చట్ట పరంగా తేల్చుకుంటామని అంటుంది. 30 ఏళ్ళుగా ఈ రంగంలో ఉన్నామని, ప్రతిది పక్కగా చేసుకుంటున్నామని, మాకు ఈ వేధింపులు కొత్త కాదని, చట్ట పరంగా తేల్చుకుంటామని అంటున్నారు.

diwakar 17102019 3

అయితే దీనికి ఒక్క రోజు ముందే, దివాకర్ రెడ్డి జగన్ పై ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఏపీలో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం వెనుక మాత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తంత్రం వుందని చెప్పారు. వైసీపీకి చెందిన అభ్యర్ధులు స్వల్ప మెజారిటీతో విజయం సాధించలేదన్నారు. ఒక్కో అభ్యర్ధి వేలాది ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం వెనుక మోడీ తంత్రం ఉందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లు మంచి వ్యూహాకర్తలుగా జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కూడ ఇదే కోవలోకి వస్తారని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందులో జగన్ గొప్ప ఏమి లేదని, అనుకుంటున్నానని అన్నారు.

ఎవరి ప్రాధాన్యత ఏమిటి అని చెప్పే చక్కటి ఉదాహరణ ఇది. గతంలో పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయని, ఎలాగైనా పోలవరం పూర్తి చేసి, రాష్ట్రంలో ప్రతి మూలకు నీళ్ళు తీసుకువెళ్ళి, పోలవరం పూర్తీ చెయ్యాలని, ఇప్పుడు ఉన్న కాంట్రాక్టర్ వల్ల కాదని, కేంద్రంతో పోరాడి, నవయుగ కంపెనీని తీసుకువచ్చారు చంద్రబాబు. నవయుగ రావటంతోనే, పోలవరం పనులు పరుగులు పెట్టాయి. కాంక్రీట్ పనుల్లో చైనా రికార్డు ని కూడా తిరగరాసి, పోలవరం ప్రాజెక్ట్ ను గిన్నిస్ బుక్ లో ఎక్కించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది అనే నమ్మకం కలిగించారు. అసలు అవ్వదు ఎనుకున్న పోలవరం, 73 శాతం పూర్తయింది అంటే, చంద్రబాబు ఆనాడు, నవయుగని తీసుకు రావటమే కారణం. కేంద్రం కూడా నవయుగ స్పీడ్ ని మెచ్చుకుంది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో, మొత్తం తారు మారు అయ్యింది.

navayuga 17102019 2

గత నాలుగు నెలలుగా, పోలవరం ప్రాజెక్ట్ లో ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేదు. పైగా చంద్రబాబు తీసుకొచ్చిన నవయుగ కంపెనీ మాకు వద్దు, వాళ్ళు అవినీతి చేసారు, మేము రివర్స్ టెండరింగ్ వేసి, నిజాయితీకి మారు పేరైన, మేఘా కంపెనీని తీసుకోవచ్చాం అని జగన్ ప్రభుత్వం చెప్పింది. అయితే కేంద్ర ప్రభుత్వ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మాత్రం, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఒప్పుకోలేదు. ఇది ఇలా సాగుతూ ఉండగానే, జగన్ ప్రభుత్వం తీసుకోచ్చిన, నిజాయతీకి మారు పేరైన మేఘా కంపెనీ పై, గత వారం రోజులుగా ఐటి దాడులు జరుగుతున్నాయి. ఇన్ని రోజుల పాటు, ఒక కంపెనీలో, ఒక ఇంట్లో ఐటి దాడులు జరుగుతున్నాయి అంటే, ఎన్ని లొసుగులు ఉండకపోతే జరుగుతాయి ?

navayuga 17102019 3

ఒక పక్క మేఘా పై ఐటి దాడులు జరుగుతుంటే, మరో పక్క ఇదే పోలవరం ప్రాజెక్ట్ సూపర్ స్పీడ్ లో చేసినందుకు, నిన్న నవయుగ కంపెనీకి ప్రతిష్టాత్మిక అవార్డు వచ్చింది. Construction World Global Awards-2019 ఇచ్చిన అవార్డుల్లో, బెస్ట్ కనస్ట్రక్షన్ కంపెనిగా, పోలవరం ప్రాజెక్ట్ కి గాను, నవయుగ కంపెనీ ఎంపిక అయ్యింది. ఈ అవార్డులు నిన్న ఢిల్లీలో ఇచ్చారు. నవయుగ ఎండీ శ్రీధర్, ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా, నవయుగ యాజమాన్యం, తన కార్మికులు అందరికీ ఈ అవార్డును అంకితం చేసింది. అయితే, ఎవరు ఎలా ఉన్నా, మన పోలవరం విషయంలో మాత్రం, ఇలా అవార్డులు వచ్చిన కంపెనీని కాదాని, వారం రోజులుగా ఐటి దాడులు చేస్తున్న కంపెనీకి పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇస్తుందో, ప్రజలే అర్ధం చేసుకోవాలి.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, వైసిపీ వేధింపుల పై ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల పై దాడులు చెయ్యటం, వేధించటం, పంటలు ధ్వంసం చెయ్యటం, ఇళ్ళల్లోకి వెళ్ళకుండా గోడలు కట్టటం, రోడ్లు తవ్వేయటం, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అరెస్ట్ లు చెయ్యటం, ఇలా అనేక విధాలుగా హింస పెడుతున్నారని, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే, ఇప్పుడు మరోసారి, మరో తెలుగుదేశం నేతకు, ఇలాంటి అనుభవమే ఎదురైంది. ప్రెస్ మీట్ పెట్టి, ఏమైంది అని అడుగుతూ, కొన్ని సందేహాలు లేవనెత్తినందుకు, ఆయనకు నోటీసులు ఇచ్చి, విచారణకు హాజరుకావాలని పోలీసులు కోరటం సంచలంగా మారింది. మాట్లాడితే కూడా నోటీస్ లు పంపిస్తాం అనే సంకేతం ఇస్తున్నారా అని టిడిపి ప్రశ్నిస్తుంది.

varla 16102019 2

సియం గారి బాబాయ్ అయిన వి--వే--కా--నంద రెడ్డి కేసు విషయంలో, వార్ల రామయ్య విచారణను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసారని చెప్తూ, ఆయనకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ నోటీసులు పంపింది. ఆయన ఈ కేసు పై చేసిన వ్యాఖ్యలతో, సాక్ష్యాలతో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆయన వ్యాఖ్యలతో కేసు దర్యాప్తు పక్కదారిపట్టే అవకాశం ఉందని, సాక్ష్యాధారాలుంటే తెలియజేస్తే ఆ మేరకు విచారణ చేస్తామని చెబుతూ సిట్‌ ఎదుట హాజరుకావాలని నోటీసు పంపారు. అయితే అసలు ఈ కేసు మొదలైందే వైసిపీ నేతలు, సాక్షి టీవీ తప్పుదోవ పట్టించి, గుండె నొప్పితో పోయారు అని చిత్రీకరించటం పై అని, ముందుగా వారికి నోటీసులు ఇవ్వాలి కాని, ప్రశ్నించిన ప్రతిపక్షం పై, ఈ దౌర్జన్యం ఏంటని టిడిపి ఆరోపిస్తుంది.

varla 16102019 3

"ఒక సీనియర్‌ రాజకీయ నేత, మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుని మరణం పి నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో వర్ల రామయ్య ప్రశ్నిస్తే తప్పేంటి.? విచారణపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాద్యత దర్యాప్తు చేస్తున్న సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ ఈ విషయంలో పోలీసుల సంక్షేమం కోసం మాత్రమే ఏర్పాటైన పోలీసు అధికారుల సంఘం స్పందించాల్సిన అవసరం ఏమిటి.? పోలీసు అధికారుల సంఘం ఏర్పడింది పోలీసుల కోసమా.. లేక రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థగా వ్యవహరించడం కోసమా.? ఈ వ్యవహారంలో పోలీసు అధికారుల సంఘం ఎందుకు అత్యుత్సాహం చూపిస్తోంది.? వర్ల రామయ్యపై అనుచిత వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలి. నోటీసులు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలి " అని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు.

మా వంశం మాట తప్పదు, మడం తిప్పదు, మేము మాటంటే మాటే అని చెప్పే జగన్, ప్రతి రోజు ఏదో ఒక మాట తప్పుతూనే ఉన్నారు. మొన్నటి దాకా 85 లక్షల మందికి రైతు భరోసా అని చెప్పి, ఇప్పుడు కేవలం 40 లక్షల మందికే కుదించిన సంగతిలో విమర్శలు పాలు అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి, తాను చెప్పిన మాట తప్పారు జగన్. "ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రభుత్వ ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లకూడదు" అని చెప్పిన జగన్, ఇప్పుడు మాట తప్పారు. ఇది వరకు పదే పదే చంద్రబాబు ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్ళారని, విమర్శలు చేసిన జగన్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలుకే ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లారు. ఆర్భాటంగా ప్రకటించిన రైతు భరోసా పధకానికి డబ్బులు లేకపోవటంతో పటు ఇతర ఖర్చులకు, ఓడీకి వెళ్లి రూ.800 కోట్లు తెచ్చుకున్నారు. ఆర్థికంగా అత్యవసరమై, అష్టకష్టాలు పడుతూ, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఓడీకి వెళతారు.

jagan 16102019 2

అయితే గతంలో చంద్రబాబు ఓడీకి వెళ్ళిన ప్రతిసారి, జగన్ మోహన్ రెడ్డి, ఆయన పత్రిక తీవ్ర విమర్శలు చేసే వారు. దీంతో అదే తను చేస్తే, తనకు ఇబ్బంది అవుతుందని, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత, "ఎట్టి పరిస్థితుల్లోనూ మన ప్రభుత్వ ఓవర్‌ డ్రాఫ్ట్‌కు వెళ్లకూడదు" అని చెప్పారు. కాని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా పడిపోవటం, ఖర్చులు పెరిగిపోవటంతో, తప్పని పరిస్థితుల్లో, మాట తప్పి, మడం తిప్పల్సి వచ్చింది. ముఖ్యంగా రైతు భరోసా కోసం, డబ్బులు సర్దాల్సిన పరిస్థితి వచ్చింది. మంగళవారం రూ.800 కోట్లు ఆర్‌బీఐ నుంచి ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వినియోగించుకుని తెచ్చారు. అలాగే, ఆర్‌బీఐలో బాండ్ల వేలం ద్వారా రూ.వెయ్యి కోట్లు సాధించారు.

jagan 16102019 3

ఈ బండ్ల పై వడ్డీ 7.17 శాతం నమోదైంది. వేస్‌ అండ్‌ మీన్స్‌ ద్వారా రూ.1510 కోట్లు తెచ్చుకున్నారు. ఓవర్‌ డ్రాఫ్ట్‌ నిధులు రూ.800 కోట్లతో కలిపి మంగళవారం రైతు భరోసా కోసం ఆర్థిక శాఖ రూ.3000 కోట్లను ఆర్టీజీకి విడుదల చేశారు. మరో పక్క, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ప్రకారం, మన రాష్ట్రం రూ.32,000 కోట్ల రుణాలను తెచ్చుకోవచ్చు. 32 వేల కోట్లలో, రూ.29,000 కోట్ల సమీకరణకు కేంద్రం అనుమతించింది. అయితే ఇప్పటికే మన ప్రభుత్వం రూ.23 వేల కోట్ల అప్పు చేసింది. ఈ ఏడాదికి ఇంకా 6 వేల కోట్లు మాత్రమే ఉంది. మరో పక్క గత సంవత్సరంతో పోలిస్తే, ఆదాయం భారీగా తగ్గిపోయింది. దేశమంతా ఆర్ధిక సంక్షోభం ఉంటే, మన రాష్ట్రంలో మాత్రం, ఇది ఇంకా కొంచెం ఎక్కువే ఉంది. ముఖ్యంగా ఇసుక లేకపోవటంతో, ఎక్కడివి అక్కడ ఆగిపోయాయి.

Advertisements

Latest Articles

Most Read