అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రెండో రోజు మన దేశంలో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోని, రాష్ట్రపతి భవన్ లో, కొంత మంది ముఖ్యమంత్రులతో కలిసి, సాయంత్రం రాష్ట్రపతి భావన్ లో విందు ఇవ్వనున్నారు. అయితే ఈ విందుకు, దక్షిణభారత దేశంలో కేరళా, ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. కర్ణాటక, తెలంగాణా, తమిళనాడు, ఒరిస్సా ముఖ్యమంత్రులు, ఈ విందుకు వెళ్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం జగన్ కు ఆహ్వానం అందలేదు. దీని పై అనేక వాదనలు నడుస్తున్నాయి. గతంలో చంద్రబాబు హయంలో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా, మన రాష్ట్రంలో పర్యటిస్తే, ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరినీ పిలిచి మన ముఖ్యమంత్రిని ఎందుకు పిలవలేదో అర్ధం కాలేదు. అయితే దీని పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన, ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదని చంద్రబాబు అన్నారు.

trump 25022020 2

ప్రశాంత వాతావరణానికి మారుపేరైన కుప్పంలో దౌర్జన్యాలు, రౌడీయిజం చేయాలని చూస్తే సహించేది లేదని, తానే స్వయంగా కుప్పంలో వచ్చి కూర్చుంటానని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కుప్పంలో వైకాపా నాయకులు దౌర్జన్యాల ద్వారా రాజకీయాలు చేయవచ్చునని అనుకుంటే అవి ఏమాత్రం పని చేయవన్నారు. కుప్పం పట్టణాన్ని అత్యంత సుందరీకరణతోపాటు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రూ.100 కోట్లతో రూర్బన్ పథకాన్ని తీసుకొస్తే వైకాపా నాయకులు కుప్పంను మున్సిపాలిటీ చేసి, ఆ నిధులను వెనక్కి పంపించారన్నారు. మున్సిపాలిటీ ద్వారా కుప్పంను అభివృద్ధి చేసుకోలేమన్నారు. కేవలం మున్సిపాలిటీ నిధులతోనే అభివృద్ధి చేసుకోవాలని, అదే పంచాయతీగా ఉంటే నరేగా నిధులు, ఇతర నిధులను పూర్తిగా వినియోగించి అభివృద్ధి చేసుకోవచ్చుననే ఆలోచనను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

trump 25022020 3

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పథకాన్ని అయినా ఏ పార్టీ కార్యక్రమం అయినా కుప్పం నుండే ప్రారంభించి దిగ్విజయంగా అమలు చేశానని, ఇప్పుడు తమ ప్రభుత్వం లేకపోయినా సరే కుప్పంను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాన్నారు. 35 సంవత్సరాలుగా తనను ఆదరిస్తున్న కుప్పం ప్రజలకు రుణం తీర్చుకొనేందుకు అన్ని విధాలుగా పనిచేస్తానని తెలిపారు. కుప్పంకు కొందరు వలస పక్షులు వచ్చారని, మీ పనులు మీరు చూసుకొని వెళ్లాలే గానీ ఇక్కడి వాతారవణాన్ని కలుషితం చేస్తే ఊరుకొనేది లేదని హెచ్చరించారు. ఆస్తుల విషయాల్లో విచారణలు చేయడం, భయాంబ్రాంతులకు గురి చేయాలనుకుంటే ఎవరూ భయపడేది లేదన్నారు. రాయలసీమకు సాగునీటి కోసం 64వేల కోట్లు ఖర్చు చేశామని, ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయి, అగ్రికల్చర్, హర్టికల్చర్‌ను పూర్తిగా నాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పర్యవసానాలు చూడకుండా, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్న జగన్ కు, కోర్టుల్లో, వివిధ ట్రిబ్యునల్స్ లో, ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అవగాహనా రాహిత్యమో లేక వ్యక్తిగత పగతో వెళ్తూ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవటమో కాని, ప్రతి విషయంలో జగన్ కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే విద్యుత్ పీపీఏల విషయంలో, అటు ట్రిబ్యునల్ లోను, ఇటు కోర్టుల్లోనూ మొట్టికాయలు పడ్డాయి. ఆ తరువాత పోలవరం విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. రంగులు వేసే విషయంలో కూడా కోర్ట్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు సీనియర్ అధికారుల సస్పెన్షన్ వ్యవహారంలో క్యాట్ చేతిలో, జగన్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓగా, గతంలో జాస్తి కృష్ణ కిషోర్ పని చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు అంటూ, జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.

cat 25022020 2

జాస్తి కృష్ణ కిషోర్ కేంద్రం నుంచి మన రాష్ట్రానికి డెప్యుటేషన్ పై వచ్చారు. చంద్రబాబు హయంలో ఆయన రాష్ట్రానికి పెట్టుబులు తేవటానికి ఎంతో కృషి చేసారు. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓగా, ఆయన పని చేసారు. అయితే, ఆయన చంద్రబాబుకు బాగా సన్నిహితంగా ఉండే వారనే కారణంతో, ఆయన పై ప్రభుత్వం వ్యక్తిగత కక్ష పెంచుకుంది అనే వాదన కూడా ఉంది. ఒక సీనియర్ అధికారి, అది కూడా రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన అధికారి పై ఇలా సస్పెన్షన్ వేటు వెయ్యటం పై అందరూ ఆశ్చర్య పోయారు. అది కాక, జగన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కృష్ణ కిషోర్ కు జీతం కూడా ఇవ్వలేదు. దీంతో, ఈ విషయం పై జాస్తి కృష్ణ కిషోర్, ఏపి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, క్యాట్ కు వెళ్లారు.

cat 25022020 3

దీని పై, నెల రెండు నెలల నుంచి విచారణ జరిపిన క్యాట్, ఈ రోజు తుది తీర్పు ఇచ్చింది. జాస్తి కృష్ణ కిషోర్ సస్పెన్షన్ రద్దు చేస్తూ, సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వానికి అదిరిపోయే షాక్ తగిలింది. కృష్ణ కిషోర్ కేంద్ర సర్వీసులకు వెళ్ళటానికి, మార్గం సుగుమం అయ్యింది. కావాలంటే, ఆయన పై కేసులు పెట్టుకుని, చట్ట ప్రకారం వెళ్ళండి అంటూ, క్యాట్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. గతంలో విచారణ సందర్భంగా కూడా క్యాట్ ప్రభుత్వాన్ని, తప్పుబట్టిన సంగతి తెలిసిందే. కృష్ణ కిషోర్ కు జీతం ఎందుకు ఇవ్వలేదు అంటూ, క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు ఉన్నా, ఎందుకు జీతం చెల్లించలేదు అంటూ, చీఫ్ సెక్రటరీని పిలిపిస్తాం అని, వార్నింగ్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో పక్క ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కూడా క్యాట్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై, వచ్చే నెల 6 కు, క్యాట్ వాయిదా వేసింది.

అధికారంలోకి రాకముందు విద్యార్థులను, యువతను మోసగించిన జగన్, అధికారంలోకి వచ్చాక వారికి ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చకుండా, ఆయా వర్గాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరింత నయవంచనకు గురిచేస్తున్నాడని, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన, టీఎన్ఎస్ఎఫ్ నేతలతో కలిసి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు, వివిధ సందర్భాలలో విద్యార్థులకు అన్నివేళలా అండగా ఉంటానని, వారి చదువులకు అవసరమైన సమస్త సౌకర్యాలను అందిస్తానని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక ఆ హామీలన్నీ తుంగలో తొక్కాడన్నారు. పేద విద్యార్థినీ, విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు ఇస్తానని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదన్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ముగియడానికి ఇంకా నెలరోజులే సమయమున్నా, జగన్ ఇచ్చినహామీ ప్రకారం ఏ ఒక్క విద్యార్థికి డబ్బులు అందలేదన్నారు. ప్రతిఏటా ఒక్కో విద్యార్థికి రూ. 1,50,000 ఇస్తానన్న జగన్, నేడు వసతి దీవెన కార్యక్రమం పేరుతో, అరకొరగా రూ.7,500 ఇవ్వడం, ఆ కొద్దిమొత్తం కూడా అతితక్కువ మందికే ఇవ్వడం ఎంతవరకు సమంజసమో, ముఖ్యమంత్రే చెప్పాలని రవీంద్ర డిమాండ్ చేశారు.

ఇప్పటివరకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, మెస్ బిల్లులు చెల్లించలేదని, అవి అందక విద్యార్థిలోకం నానా అగచాట్లు పడుతున్నా జగన్ ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. మేనిఫెస్టోలో పేదవిద్యార్థుల చదువులకు ఎంతఖర్చయితే, అంత మొత్తం తమ ప్రభుత్వం భరిస్తుందని, కాస్మొటిక్ ఛార్జీల కింద అదనంగా ఏటా రూ.20వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడెందుకు ఇలా కప్పదాటు వైఖరి అవలంభిస్తున్నాడని రవీంద్ర దుయ్యబట్టారు. రూ.లక్షన్నరపైగానీ, అదనంగా ఇస్తానన్న రూ.20వేలపైగానీ, ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పష్టమైన ప్రకటన లేదని, అసలుకి, కొసరకు ఎసరుపెట్ట్టిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడన్నారు. విద్యా సంవత్సరం ముగింపుదశకు వచ్చాక, అరకొర చెల్లింపులు చేస్తూ, వసతిదీవెన పేరుతో జగన్, తనకుతానే డబ్బాలు కొట్టుకోవడం సిగ్గుచేటన్నారు. గతంలో చంద్రబాబునాయుడు ఐటీఐ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించే 16లక్షల మంది విద్యార్థులకు సకాలంలో ఉపకారవేతనాలు అందచేస్తే, జగన్ వచ్చాక ఆ సంఖ్యని 11 లక్షలకు కుదించాడన్నారు. జగన్ నిర్ణయం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులకు నష్టం చేకూరుతోందని, అమ్మఒడి పథకాన్ని కూడా డిగ్రీ, ఇతర అనుబంధ, వృత్తి విద్యా కోర్సులు అవలసంభిస్తున్న విద్యార్థులకు ముడిపెట్టి, కుటుంబంలో ఒక్కరికే న్యాయం చేస్తాననడం జగన్ చౌకబారుతనా నికి నిదర్శనమన్నారు.

గతంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను రూ.35వేల నుంచి రూ.40 వేలకు చంద్రబాబు ప్రభుత్వం పెంచితే, దాన్ని ఎంతమొత్తమైతే అంతమొత్తం ఏకకాలంలో చెల్లిస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడెందుకు దాన్ని రూ.45వేలకే పరిమితం చేసి, విద్యార్థుల సంఖ్యను ఎందుకు తగ్గించాడో సమాధానం చెప్పాలన్నారు. ఈ విధంగా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను నయవంచనకు గురిచేయడం ద్వారా జగన్ సర్కారు జగనన్న వసతిదీవెన పేరుతో నయా మోసానికి తెరలేపిందన్నారు. జగన్ చర్యల వల్ల అటు విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నాయని, పరీక్షలు దగ్గర పడుతుండటంతో ఫీజులు చెల్లిస్తేనే, హాల్ టిక్కెట్లు, సర్టిఫికెట్లు ఇస్తామని, కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. మెస్ బిల్లులను రూ. 1450పెంచుతామని చెప్పిన జగన్, 9నెలలైనా కూడా ఒక్క విద్యార్థికి కూడా పెంపుతో సంబంధంలేకుండా పాతమొత్తాలతో కలిపికూడా ఆబిల్లులు చెల్లించలేదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు నిలిపివేయడం, మెస్ బిల్లులు చెల్లించకపోవడం, కాస్మొటిక్ ఛార్జీలు ఆపేయడం, తమ్ముడికో, చెల్లిలికో అమ్మఒడి డబ్బులిస్తే, పెద్దచదువులు చదివే వారి అన్నయ్యలకు, అక్కలకు డబ్బులివ్వకపోవడం వంటి చర్యలతో, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థిలోకాన్ని నిలువునా మోసగించడన్నారు.

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజనం పథకాన్ని ఆపివేయడంద్వారా, కళాశాల విద్య ఆరంభంలోనే జగన్ డ్రాపవుట్స్ సంఖ్య పెరిగేలా చేశాడన్నారు. అదేవిదంగా విదేశీ విద్యకోసం గత ప్రభుత్వం, అన్ని వర్గాల వారికి సాయం చేసిందని, ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యాపథకం, విదేశీ విద్యాదరణ పథకాల కింద రూ. 10లక్షల వరకు సాయం చేసిందన్నారు. ఆయా పథకాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు విద్యార్థులు లబ్దిపొందారని, గత ప్రభుత్వంలో ఆయాపథకాల ద్వారా విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లినవారికి కూడా జగన్ సర్కారు సాయాన్ని నిలిపివేసిందన్నారు. గ్రూప్2, సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచితంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ ప్రభుత్వం, ఆయా విద్యార్థులకు రూ.10వేలవరకు స్టయిఫండ్ ఇవ్వడంతోపాటు, కోచింగ్ కేంద్రాలకు ఒక్కో విద్యార్థికి రూ.లక్ష వరకు అందచేస్తే, జగన్ వచ్చాక ఆ పథకమే మరుగున పడిందన్నారు. నైపుణ్యాభివృద్ధి పథకం ధ్వారా టీడీపీ ప్రభుత్వం, 1,75,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించిందని, జగన్ వచ్చాక దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడన్నారు. నిరుద్యోగ భృతి కింద, టీడీపీ ప్రభుత్వం 6లక్షల మందికి నెలనెలా భృతిని అందచేస్తే, జగన్ అధికారంలోకి వచ్చాక, నిరుద్యోగులను రోడ్డున పడేశాడన్నారు. 9వ తగరతి చదివే విద్యార్థులకు సైకిళ్లు అందచేయడం, ప్రతిఏటా మెగాడిస్సీ నిర్వహించడం వంటి పనులన్నీ, చంద్రబాబు ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగిస్తే, జగన్ సీఎం అయ్యాక, వాటన్నింటినీ అటకెక్కించడాని రవీంద్ర మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ నేత, చేసిన ట్వీట్ ఒకటి, వైసీపీ పార్టీలోనే కాదు, తెలుగుదేశం పార్టీతో పాటు, రాష్ట్రం అంతటా, కలకలం రేపుతోంది. రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి రావాలి అని కోరుకుంటున్నా అంటూ, విజయవాడకు చెందిన ఆ నేత చేసిన ట్వీట్ కలకలం రేపింది. అయితే కొద్ది సేపటికే ఆ ట్వీట్ డెలీట్ చేసారు, ఆ నేత. అయితే, అప్పటికే ఆ ట్వీట్ వైరల్ అయిపొయింది. స్క్రీన్ షాట్ కూడా, న్యూస్ ఛానెల్స్ తో వచ్చేయటంతో, ఆయన డెలీట్ చేసినా, ఆ ట్వీట్ స్క్రీన్ షాట్, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపొయింది. దీంతో వైసీపీలో ఎవరిని చూసినా, ఈ ట్వీట్ పైనే, చర్చించుకుంటున్నారు. ఆ నేత చాలా కీలకమైన నేత కావటం, పార్టీ అధినాయకత్వంతో, మంచి సంబంధాలు కలిగి ఉండటంతో, ఆయన చేసిన ట్వీట్ చూసి, పార్టీలో ఏదో జరుగుతుంది అనే చర్చ, వైసీపీ నాయకుల్లో, వైసీపీ కార్యకర్తల్లో వ్యక్తం అవుతుంది. ఈ నేత ట్వీట్ చేస్తే, అది వార్తల్లో కూడా ప్రముఖంగా చెప్తూ ఉంటారు.

ఇప్పుడు ఈ మహిళా ముఖ్యమంత్రి పోస్ట్ కు, న్యూస్ చానల్స్ లో వచ్చింది. దీంతో ఆ మహిళా ముఖ్యమంత్రి ఎవరు, మరి ఇప్పుడున్న జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి, అనే విషయం పై పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే, దీనికి ఊతం ఇస్తూ, గత పది రోజులుగా తెలుగుదేశం నేతలు చేస్తున్న ఆరోపణలు కూడా చర్చకు వస్తున్నాయి. రస్ అల్ ఖైమా దేశం, త్వరలోనే జగన్ ను అరెస్ట్ చేస్తుందని, ఇప్పటికే ఈ విషయంలో కేంద్రం కూడా పర్మిషన్ ఇచ్చింది అని, దుబాయ్ తో పాటు, కొన్ని అరబ్ దేశాలకు, కేంద్రం పర్మిషన్ ఇచ్చిన గజెట్ చూపిస్తూ తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అక్కడ ఇదే కేసులో, సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జనవరిలో, కేంద్రం ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఎవరిని అయినా అరెస్ట్ చేసే అవకాసం ఉంటుందని ఆరోపిస్తుంది.

రస్ అల్ ఖైమాని మోసం చేసిన కేసులో, ఇప్పటికే నిమ్మగడ్డ అరెస్ట్ అయితే, త్వరలోనే జగన్ కూడా అరెస్ట్ అవుతారు అంటూ, టిడిపి ప్రచారం చేస్తుంది. దీంతో, ఒక పక్క ఈ ఆరోపణలు, మరో పక్క కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులు, ఇప్పుడు పార్టీలో ఉన్న కీలక నేత, అధిష్టానానికి దగ్గరగా ఉండే నేత, ఇలా మహిళా ముఖ్యమంత్రి అంటూ ట్వీట్ పెట్టటంతో, వైసీపీ క్యాడర్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇక వైసీపీ పార్టీ కూడా, ఈ ఆరోపణల పై, అస్సలు స్పందించక పోవటం, ఆ ప్రచారాన్ని ఖండించక పోవటంతో కూడా తికమక పడుతుంది వైసీపీ క్యాడర్. మరో పక్క కొంత మంది అమితమైన ఉత్సాహం ఉన్న వాళ్ళు, ఆ మహిళా ముఖ్యమంత్రి ఎవరూ అంటూ, రకరకాల పేర్లు చెప్తూ, అభిప్రాయాలు చెప్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read