విభ‌జ‌న గాయాలు నిలువెల్లా బాధిస్తుంటే చంద్ర‌బాబునాయుడు నాయ‌క‌త్వంలో ఆంధ్రప్రదేశ్ ప‌డిలేచిన కెర‌ట‌మై ఎగిసింది. అభివృద్ధి-సంక్షేమాల‌లో దేశానికే ఆద‌ర్శంగా నిలిచి అగ్ర‌స్థానం అందుకుంది. అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా, ప‌ద‌వీకాంక్ష‌తో త‌ప్పుడు హామీలు ఇస్తూ, ప్ర‌భుత్వంపై అవాస్త‌వాల‌ను ప్ర‌చారం చేస్తూ, చంద్ర‌బాబు పాల‌న‌పై విషం చిమ్ముతూ ప్ర‌జ‌ల్ని న‌మ్మించి న‌వ్యాంధ్ర పాల‌నాప‌గ్గాలు చేప‌ట్టారు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి. న‌ర‌న‌రాన టిడిపి పై విద్వేషం నింపుకున్న జ‌గ‌న్ త‌న క‌క్ష‌నంతా తొమ్మిది నెల‌ల పాల‌న‌లో తీర్చుకుంటు, పరిపాలనను వదిలేసారు. అమ‌రావ‌తి పేరు వినిపించినా, క‌నిపించినా విషం చిమ్ముతున్నారు. న‌వ‌ర‌త్నాలంటూ న‌య‌వంచ‌న చేస్తూనే వున్నారు. అభివృద్ధిలో అగ్ర‌గామిగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని అథఃపాతాళంలోకి తొక్కేశారు. 5 ఏళ్ళ పాటు ప్రజల కోసమే అహర్నిశలు కష్టపడిన చంద్రబాబు, ఇప్పుడు 9 నెలలు తరువాత, మళ్ళీ ప్రజల కోసమే బయలుదేరారు. జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ‌ పాల‌నపై ప్ర‌జల్ని చైత‌న్యం చేసేందుకే తెలుగుదేశం పార్టీ చేప‌ట్టింది ప్ర‌జాచైత‌న్య‌యాత్ర‌.

45 రోజుల పాటు ప్రజల మధ్యే ఉంటూ, ప్రజల కష్టాలు తెలుసుకుని, ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి, ప్రతిపక్ష పాత్ర పోషించటానికి, 70 ఏళ్ళ వయసులో చంద్రబాబు సిద్ధం అయ్యారు. తెలుగుదేశం పార్టీ, న‌వ‌మాసాలు-న‌వ మోసాలు అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తుంది. ఇవి ఆ 9 మోసాలు. 1.వెన‌క‌బ‌డిన త‌ర‌గతుల‌కు వెన్నుపోటు, మూడు వేల కోట్లకు పైగా బీసీల నిధుల్ని మ‌ళ్లింపు, బీసీల‌కు ఆద‌ర‌ణ ప‌థ‌కం దూరం , కులానికో కార్పొరేష‌న్ అనే హామీపై దాట‌వేత. 2. ముస్లింల ఉనికికే ముప్పు, CAA, NRCల‌కు వైకాపా మ‌ద్ద‌తుతో ముస్లింల‌కు తీర‌ని న‌ష్టం, రంజాన్ తోఫా కానుక‌లు ర‌ద్దు, మండ‌లి చైర్మ‌న్ ష‌రీఫ్‌ని మ‌తంపేరుతో తిట్టిన వైకాపా మంత్రులు, జ‌గ‌న్‌ని అల్లాతో పోల్చుతూ ప్ర‌వ‌క్త‌ని కించ‌ప‌ర్చిన‌ వైకాపా నేత‌లు, మైనార్టీ కార్పొరేషన్ నుండి 442 కోట్లు మ‌ళ్లింపు

3. పింఛ‌న్ల న‌య‌వంచ‌న, పింఛ‌ను సొమ్ము వెయ్యి పెంచుతామ‌ని 750 త‌గ్గింపు, అమ‌లుకు నోచుకోని పింఛ‌ను అర్హ‌త 60 ఏళ్ల హామీ, రాష్ర్ట‌వ్యాప్తంగా 13 ల‌క్ష‌ల‌కు పైగా పింఛ‌న్లు కోత‌. 4. వ్య‌వ‌సాయం ..ఏదీ సాయం? చంద్ర‌బాబు చేసిన రుణ‌మాఫీ విడ‌త‌లు ర‌ద్దు, అప్పుల‌బాధ‌తో 270 మంది రైతుల ఆత్మ‌హ‌త్య‌, 12500 రైతుభ‌రోసా అంటూ 7,500 చెల్లింపు 5.ఉసూరుమంటున్న ఉద్యోగులు, సీపీఎస్ ర‌ద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చి క‌మిటీల‌తో కాల‌యాప‌న‌, ఆర్టీసీ విలీనం పేరుతో సిబ్బంది ప్ర‌యోజ‌నాల కోత , నాలుగు విడ‌త‌ల డీఏ బ‌కాయిలు ఇంకా పెండింగ్‌, ఉపాధ్యాయుల‌కు బ‌దిలీల‌కు నో చాన్స్‌, పీఆర్సీ వేయ‌కుండా జాప్యం 5. మ‌ద్యం లంచాల‌కు నైవేద్యం, ద‌శ‌ల‌వారీ మ‌ద్య‌నిషేధమంటూనే విచ్చల‌విడి అమ్మ‌కాలు, బాటిల్‌కి 50, కేసుకు 150 చొప్పున‌ లిక్క‌ర్‌లో 3 వేల కోట్లు లంచాలు, మ‌ద్యం తయారీ కంపెనీల 1600 కోట్లు ఎగ‌వేత‌, రేటు రెండింత‌లు కావ‌డంతో పెరిగిపోతున్న సారా వంట‌లు

6.ఇళ్లు నిల్లు, చంద్ర‌బాబు క‌ట్టించిన ఇళ్లూ కేటాయించ‌కుండా ర‌ద్దు చేసిన జ‌గ‌న్‌, 9 నెల‌ల్లో ఒక్క కొత్త గృహం మంజూరు చేయ‌ని ప్ర‌భుత్వం, రివ‌ర్స్ టెండ‌రింగ్ పేరుతో నాసిర‌కం ఇళ్ల నిర్మాణాలు. 7.యువ‌త‌కు ఏదీ చేయూత‌?, నిరుద్యోగ భృతి ర‌ద్దు, ఉద్యోగాలు క‌ల్పిస్తున్న కంపెనీలను త‌రిమివేత‌, వాలంటీర్ల పేరుతో 4 ల‌క్ష‌ల మంది వైకాపా కార్య‌క‌ర్త‌ల‌కు చోటు, స‌చివాల‌య ఉద్యోగాల ప‌రీక్ష పేప‌ర్ ఒక్కోటి 10 ల‌క్ష‌ల‌కు అమ్మేసి 20 ల‌క్ష‌ల మందికి మోసం. 8. ఇసుక‌లో కోట్లు, వైకాపా నేత‌ల క‌నుస‌న్న‌ల్లో ఇసుక రీచ్‌లు.., ఒక్కో రీచ్ ద్వారా నెల‌కు కోట్లు కొల్ల‌గొడుతున్న నేత‌లు, ఇసుక‌దందాలో మంత్రులు, స్పీక‌ర్‌.

అంతరించిపోయిన రాబందులు...జగన్ బందువుల రూపంలో మళ్లీ వచ్చాయని, ఆ రాబందులు ఎంపీ విజయసాయిరెడ్డి ఆద్వర్యంలో విశాఖలోని విలువైన భూముల్ని కజ్జా చేస్తున్నాయని టీడీపీ ఎమ్మల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ....విశాఖలో పర్యటించిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీకి వైసీపీ నేతలు చేస్తున్న కజ్జాలు, రౌడీయిజాలు కమిటి దృష్టికి వచ్చాయి. విశాఖలోని భూములపై ప్రేమతోనే జగన్ పాలన సాగిస్తున్నారు. అందుకే నాడు విజయమ్మ విశాఖలో ఓడిపోతుందని తెలిసి కూడా జగన్ సొంత జిల్లా అయిన కడప నుంచి పోటీ చేయించకుండా విశాఖ నుంచి పోటీ చేయించారు. విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా వాసి అయినా.. అక్కణ క్షణం గడపకుండా విశాఖలోనే తిష్ట వేశారు. కన్నతల్లిపై, సొంత జిల్లాపై కంటే జగన్, విజయసాయిరెడ్డిలు విశాఖ భూమలుపై ప్రేమ చూపిస్తున్నారు. ఎక్జుక్యూటివ్ క్యాపిటల్ పేరుతో అక్కడ భూములు దోచుకునేందుకు సిద్దమయ్యారు. విశాఖపై జగన్ కి నిజంగా ప్రేమ ఉంటే లులు, అదానీ డేటా సెంటర్లు వెళ్లిపోతుంటే ఎందుకు ఆపలేదు. భావనపాడు ను ప్రాజెక్టును ఎందుకు నిలిపివేశారు. ఉత్తరాంధ్ర సుజలా స్రవంతికి ఎందుకు నిధులు కేటాయించలేదు. కేంద్రం వెనుకబడిని జిల్లాలకు ఇవ్వాల్సిన బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వమని కేంద్రాన్ని వైసీపీ ఎంపీలు ఒక్క రోజైనా అడిగారా?

విశాఖను ఐటి హబ్ గా మార్చేందుకు నాడు చంద్రబాబు నాయుడు రూ. 180 కోట్లతో మిలీనియం టవర్ నిర్మిస్తే ...ఇప్పుడు జగన్ అమరావతి నుంచి అక్కడకు సచివాలయం తరలిచేందుకు దానిలో కంపెనీలను వెళ్లగొట్టి అక్కడ యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. పాదయాత్రలో విశాఖ జిల్లాలోని పెందుర్తి సభలో ల్యాండ్ పూలింగ్ తాను వ్యతిరేమన్న జగన్ నేడు 6,200 ఎకరాల ల్యాండ్ పూలింగ్ సేకరణకు ఆదేశాలు ఎందుకు జారీ చేశారు.? దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లే నష్టపోతారు. బిల్డ్ ఏపీ పేరుతో విశాఖలోని 4 వేల ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మకానికి సిద్దం చేసిన జగన్ మరో వైపు ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల నుంచి 6 వేల ఎకరాలను లాక్కోవటం విడ్డూరంగా ఉంది. కూడా విశాఖలో అమ్మిన భూముల ద్వరా వుడాకు ఆదాయం వస్తుందని మళ్లీ దానికి ప్రజల నుంచే జగన్ పన్నలు కట్టిస్తారు వైసీపీ నేతలు విలువైన ప్రభుత్వ, ప్రవేట్ భూములు కబ్జా చేస్తున్నారని విశాఖ ప్రజలు కూడా చెప్పారు. దానిపై టీడీపీ జ్యడిషియల్ ఎంక్వైరీ వేయమంటే ప్రభుత్వాం ఇప్పటి వరకు ముందుకు రాలేదు. దీన్న బట్టే అక్కడ వైసీపీ నేతలు భూ కజ్జటాలకు పాల్పడ్డారని స్పష్టంగా అర్ధమవుతోంది.

విజయసాయిరెడ్డి అల్లుడి సన్నిహితుడు అరవిందో పార్మ గొలుసు కట్టు కంపెనీల కోసం బూములు కాజేస్తున్నారు. పాదయాత్రలో తగరపు వలస జూట్ మిల్లును తెరిపిస్తానన్న జగన్... నేడు ఆ యాజమాన్యాన్ని బెదిరింపులకు గురిచేసి ఆస్థలం కాజేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తేున్నారు. సిరిపురం జంక్షన్ లో వేల కోట్ల విలువైన అక్కడి క్రైస్తవ మిషనరీల భూములు కొట్టేసి స్టార్ హోటల్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆనందపురంలో మండలంతో ఉన్న రాజుల భూమి 50 ఎకరాలు కూడా కొట్టేసేందుకు ఫ్రణాళకిలు రూపొందించారు. వాల్తేరు, దసపల్లా భూములు కొట్టయటమే కాకుండా ఆశ్రమ స్ధలాలు కూడా వదలంటం లేదు. విజయసారెడ్డి కుదిరేతే నయానా, లేకుంటే బయనా అన్న పార్ములాతో విజయసాయిరెడ్డి భూమలు కబ్జా చేస్తున్నరు. నేషనల్ హైవే సమీనంపలో వెంకోజిపాలెంలో 1955 సంవత్సరం నుంచి ఉన్న దయానందా స్వామీజీ ఆశ్రమానికి 9 ఎకరాల భూములున్నాయి. వాటి విలువల ప్రస్తుతం రూ. 450 కోట్లు ఇప్పటికే విశాఖ ఎంపీ ఆశ్రమం పడమరవైపు కొన్ని భూములు ఆక్రమించి నిర్మాణాలు చేసేందుకు సిద్డపడ్డారు. దేవాదాయ శాఖ మంత్రి, మంత్రి అవంతి, ద్రోణంరాజ్ శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే లు ఆశ్రమ భూమిని ప్రవేట్ ట్రస్ట్కు కు అప్పగించమని లేఖ రాశాంరటే వైసీపీ అవినీతి ఏ రేంజ్ లో ఉందో అర్దమవుతోంది. పోలీసు ఉన్నతాధికారులతో ప్రభుత్వ పెద్దలు ఆ ఆశ్రమ నిర్వాహకులను బెదిరిస్తున్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే అమరావతి, విశాఖలోని భూ కజ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని, రాజ్యాంగ పరంగా తనకు సంక్రమించిన హక్కుని ప్రతిపక్షంపై, ప్రజలపై రాజకీయ కక్షసాధింపులకు ఉపయోగిస్తున్నారని, వేధింపులే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్నాడని టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 14ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి, సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడికి భద్రత తగ్గించడం కూడా జగన్ కక్షసాధింపుల్లో భాగమేనని రామయ్య తెలిపారు. అలిపిరి ఘటనలో 26 క్లైమోర్ మైన్స్ పెట్టి చంద్రబాబుపై దాడికి పాల్పడ్డారని, ఆనాటి నుంచి కేంద్ర్ర ప్రభుత్వం ఆయనకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ భద్రతను కూడా కొనసాగిస్తోందన్నారు. జగన్ ముఖ్యమంత్రయ్యాక, చంద్రబాబు భద్రతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారని, అతి కీలకమైన అంశాన్ని కూడా తన రాజకీయ అవసరాలకు వాడుకోవాలని జగన్ చూస్తున్నాడని వర్ల ఆక్షేపించారు. 146మంది సిబ్బందితో కొనసాగుతున్న చంద్రబాబు భద్రతను 67 మందికి తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే, సీఎం ఆలోచనల వెనుక కుట్రకోణం దాగి ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు.

చంద్రబాబుకి భద్రత తగ్గించడం ద్వారా ఆయన్ని ఏమీ చేయాలని చూస్తున్నారో జగన్ చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు. సీఎం వ్యవహారశైలి ఎంతమాత్రం సరియైనది కాదని, చంద్రబాబు భద్రత విషయంలో జగన్ తన రాజకీయ క్రీనీడను చొప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ కు ఉన్న జడ్ కేటగిరి భద్రతను కూడా తగ్గించి, వై స్థాయికి తీసుకురావడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వ రాజకీయ విధానమేంటో, చంద్రబాబుకి, లోకేశ్ కు భద్రతను తగ్గించడం ద్వారా ఏ విధమైన ఆలోచనలు చేస్తోందో చెప్పాలని రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు రాజకీయ ప్రత్యర్థులు, ఎర్రచందనం స్మగ్లర్లు, కొన్ని అసాంఘిక శక్తుల నుంచి చంద్రబాబునాయుడికి ప్రమాదం పొంచి ఉన్న తరుణంలో, ఇటువంటి నిర్ణయం ఎంతమాత్రం సమంజసం కాదని వర్ల స్పష్టంచేశారు. భద్రత తగ్గింపు చర్యల ద్వారా ముఖ్యమంత్రి జగన్ తన మనసులో ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో చెప్పాలని, ఇంటిలిజెన్స్ వ్యవస్థకు ఎలాంటి ఆదేశాలు ఇస్తున్నారో బహిర్గతం చేయాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. విశాఖలో ఎన్నికలకు ముందు ఒక ఎమ్మెల్యేను నక్సలైట్లు కాల్చిచంపిన ఘటనను ప్రజలెవరూ మరిచిపోలేదన్నారు. ప్రస్తుతం తీసుకున్న చర్యల ద్వారా జగన్ ఆలోచనా విధానం ఏస్థాయిలో ఉందో జనం కూడా ఆలోచించాలని వర్ల తెలిపారు.

వ్యవస్థలపై, సిద్ధాంతాలపై నమ్మకం లేకుండా, కోర్టులంటే భయంలేకుండా ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి, రాచరికపోకడలతో, నియంతృత్వ విధానాలు అవలంభిస్తున్నాడని రామయ్య దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పరిపాలనలో రాజ్యాంగ బద్ధంగానే పాలించాలనే విషయాన్ని జగన్ గుర్తించాలని, ప్రతి చర్య, ప్రతివిధానం కూడా న్యాయబద్ధంగానే జరగాలని స్పష్టంచేశారు. చంద్రబాబుకి, లోకేశ్ కు భద్రత తగ్గించడమనేది జగన్ తీసుకున్న నిర్ణయమేనని, ఆయనతో పాటు, ఆయనపార్టీకి కూడా ఇందులో ప్రమేయముందని వర్ల తేల్చిచెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకవైపు టీడీపీనేతలను బెదిరిస్తూ, మీసాలు తిప్పుతుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష సభ్యుల భద్రతను తగ్గిస్తూండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. చంద్రబాబు, లోకేశ్ ల భద్రతను వెంటనే పునరుద్ధరించాలని, అలా చేయకుంటే జరిగే సంఘటనలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి ఉంటుందని వర్ల స్పష్టంచేశారు. ప్రతిపక్ష నేత భద్రతతోనే ప్రభుత్వం ఎందుకు ఆటలాడుతోందని, అతికీలకమైన వ్యక్తి భద్రత అంశంలో ఇటువంటి చర్యలు సరికాదని వర్ల తెలిపారు. సెక్యూరిటీ అంశంపై తామేమీ ఆందోళన చెందడంలేదని, ప్రభుత్వ చర్యలు చూస్తుంటే తమకు పలు అనుమానాలు కలుగుతున్నాయని, జగన్ చర్యల వెనుక ఏదో దురుద్దేశం ఉందనిపిస్తోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వర్ల అభిప్రాయపడ్డారు.

గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ఖ్యాతిని , అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపచేస్తే, జగన్ ముఖ్యమంత్రయ్యాక ఏపీని అంతర్జాతీయ నేరస్తుల అడ్డాగా మార్చాడని, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ముఖ్యమైన జైల్ మేట్ లందరూ పలు ప్రదేశాల్లో తలదాచుకున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మల్యే బొండా ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ కు చెందిన సంస్థల్లో పెట్టుబడిపెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియాలో తలదాచుకున్నాడని, 2008లో వాన్ పిక్ పోర్ట్ నిర్మాణం పేరుతో రస్ అల్ ఖైమా సంస్థను నమ్మించి వారివద్ద సొమ్ము కాజేశాడని, అలా వచ్చిన సొమ్మునే జగన్ సంస్థల్లోకి ప్రసాద్ మళ్లించాడన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం విదేశీ పెట్టుబడిదారులను మోసగించిన వారిపై కఠినచర్యలుంటాయన్నారు. తన తండ్రి వై.ఎస్ ముఖ్యమంతిగా ఉన్న సమయంలో అనేక కుంభకోణాలు వెలుగుచూశాయని, వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొన్ని నెలలు జైలుకి కూడా వెళ్లొచ్చాడన్నారు. వాటిలో అతి కీలకమైనది 16 – 05 - 2012న సీబీఐ నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్ట్ చేయడమేనని, ఆనాడు సీబీఐ తన నివేదికలో రస్ అల్ ఖైమాను ఎలా మోసగించారు... వాన్ పిక్ పేరుతో కొట్టేసిన సొమ్ముని ఎటునుంచి ఎటు మళ్లించారనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు.

ఈ కేసులో ఏ1 జగన్మోహన్ రెడ్డయితే, ఏ2 విజయసాయి రెడ్డి, ఏ3 నిమ్మగడ్డ ప్రసాద్, ఏ4 మోపిదేవి వెంకటరమణ, ఏ5 ధర్మాన ప్రసాదరావు, ఏ6 బ్రహ్మనందరెడ్డి (ఐఆర్ఎస్), ఏ7 మన్మోహన్ సింగ్ (మాజీ ఐఏఎస్), ఏ8 ఎమ్ శామ్యేల్, ఏ9 నిమ్మగడ్డ ప్రకాశ్, ఏ10 వాన్ పిక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ11గా జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్, ఏ12 భారతి సిమెంట్స్, ఏ13 కార్మెల్ ఏషియా, ఏ14 సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్స్ (జగన్ బినామీ కంపెనీ), లు ఉన్నట్టు బొండా పేర్కొన్నారు. వాన్ పిక్ పోర్ట్స్ లో రస్ అల్ ఖైమావారు ఆనాడు రూ. 845కోట్లు పెట్టుబడిగా పెట్టడం జరిగిందని, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇష్టానుసారం ఒప్పందాలు చేసేసి, నిధులు రాబట్టుకోవడానికి చూశారని, రస్ అల్ ఖైమానుంచి నిధులు రప్పించడానికి నిమ్మగడ్డ ప్రసాద్ కంపెనీ పనిచేసిందన్నారు. సూట్ కేస్ కంపెనీలను ఎలా సృష్టించారు.. వాటిద్వారా జగన్ సంస్థల్లోకి అక్రమ సంపాదన ఎలా వచ్చిపడిందనేది సీబీఐ తన నివేదికల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. షైన్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టర్స్ కంపెనీ, శతాబ్లి ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్, ఆర్టిలిజన్ బయో ఇన్నోవేషన్ లిమిటెడ్, డెల్టా సెగ్జమ్ ప్రైవేట్ లిమిటెడ్, కీర్తి ఎలక్ట్రో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాక్ నెట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇంగోరఫ్ షిన్ ఇన్ వెస్ట్ మెంట్ లిమిటెడ్, మూన్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీలన్నీ కూడా పబ్లిక్ లో లేవని, మొత్తం సూట్ కేస్ కంపెనీలేనని బొండా స్పష్టంచేశారు.

వాన్ పిక్ పోర్ట్ కోసం రస్ అల్ ఖైమావారిని మభ్యపెట్టి డబ్బులు రాబట్టుకొని, ఆ సొమ్ముని భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్స్, తదితర కంపెనీల్లోకి మళ్లించి, అడ్డగోలుగా దోచేశారన్నారు. తమనుమోసం చేయడంతో రస్ అల్ ఖైమా వారు 2013లోనే ఆనాటి ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగిందన్నారు. భారత్ లో మరీ ముఖ్యంగా ఏపీలో తమకు జరిగిన మోసంపై రస్ అల్ ఖైమా కంపెనీ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించిందని ఉమా తెలిపారు. గల్ఫ్ టైమ్స్ అనే పత్రిక ఫిబ్రవరిలో ఒకవార్తను ప్రచురించిందని, అంతర్జాతీయంగా తమను మోసగించిన వారిని తక్షణమే తమకు అప్పగించాలని కోరుతూ, భారతదేశ ప్రధానికి కూడా లేఖ రాశారని, ఇదే అంశంపై కేంద్ర్రప్రభుత్వంలోకూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని టీడీపీనేత పేర్కొన్నారు. ఆనాడు కేసుల్లో ఉన్న వ్యక్తి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండటంతో, కేంద్రం సంకట స్థితిలో పడిందని, రస్ అల్ ఖైమా కోరినట్లుగా ముద్దాయిలను అప్పగించకపోతే, అంతర్జాతీయ న్యాయస్థానాల ముందు తాము దోషిగా నిలబడాల్సి వస్తుందన్న ఆలోచనలో కేంద్రం ఉందన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ ఐరోపా పర్యటనకు వెళ్లడంతో సెర్బియా లో ఆయన్ని అరెస్ట్ చేయడంతో, వైసీపీ ఎంపీలంతా, కేంద్రమంత్రి జైశంకర్ ను కలిసి, నిమ్మగడ్డను విడిపించాలని గట్టిగా ఒత్తిడి చేయడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన జై శంకర్ , సెర్బియాలోని అధికారులతో మాట్లాడాక ఆయనకు వాస్తవాలు బోధపడ్డాయన్నారు. గల్ఫ్ లో చట్టాల ప్రకారం ఆయన్ని విడుదలచేయడం సాధ్యం కాదని చెప్పడంతో, మంత్రి జైశంకర్, వైసీపీ ఎంపీలను పిలిచి చీవాట్లు పెట్టడం జరిగిందని, ఈ వ్యవహారమంతా గత జూలైలో జరిగితే, ఇప్పటికీ నిమ్మగడ్డను విడిపించడం కోసం ముఖ్యమంత్రి జగన్, ఢిల్లీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడన్నారు.

జగన్మోహన్ రెడ్డి మోసాలగురించి దావోస్ లో పెట్టుబడుల సదస్సులో కూడా చర్చ జరిగిందని, సీబీఐ తన అభియోగపత్రంలో పేర్కొన్న 14మంది (కంపెనీలతో సహా) ఇప్పటికిప్పుడు దేశం దాటితే తిరిగొచ్చే పరిస్థితులు లేవని, అందుకే జగన్ సహా, ఇతర నిందితులంతా తాడేపల్లి టూ ఢిల్లీ, ఢిల్లీ టూ తాడేపల్లి కి మాత్రమే పరిమితమయ్యారని, దేశం దాటి వెళ్లే సాహసం ఎవరూ చేయడంలేదని బొండా దెప్పి పొడిచారు. అందులో భాగంగానే సౌదీ, దుబాయ్ , దావోస్ లలో జరిగిన పెట్టుబడుల సదస్సుకి రాష్ట్రం నుంచి ఎవరూ హాజరవ్వలేదన్నారు. నిమ్మగడ్డ జీవితం ఐరోపాకే అంకితమైందని, అతను అప్రూవర్ గా మారాడన్న వార్తలు వస్తున్నాయని, అదేగానీ నిజమైతే, తరువాత ఐరోపా బాట పట్టాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డే అవుతాడన్నారు. 2008లో జగన్ చేసిన పాపం, ఇప్పుడు ఆయన్ని పట్టి పీడిస్తోందని, చేసిన పాపం ముఖ్యమంత్రిని నిత్యం వెంటాడుతోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ వ్యవహారం అంతర్జాతీయస్థాయిలో బయటకు పొక్కడంతో, జగన్ అవినీతి కీర్తి ఖండాంతరాలు దాటడంతో, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడంలేదని ఉమా స్పష్టంచేశారు. అంతర్జాతీయ మీడియా జగన్ అవినీతిపై కథనాలు ముద్రించినా, ఆయన స్పందించడంలేదని, నిమ్మగడ్డ అరెస్ట్ పై అందరూ తేలుకుట్టిన దొంగల్లా ఎందుకున్నారో, ఛార్జ్ షీట్లలో పేర్లున్నవారే చెప్పాలని బొండా డిమాండ్ చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానాలు జగన్ ఒకరాష్ర్టానికి ముఖ్యమంత్రా, మంత్రులా అనేది చూడవని, కావాలంటే 14మంది నిందితుల్లో ఎవరైనా ఒకరుదేశందాటి వెళ్లిరావచ్చని ఉమా సూచించారు. రస్ అల్ ఖైమా సౌదీ అరేబియాలో చేసినఫిర్యాదు ప్రకారం 14మందిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామా అని ఆదేశ పోలీసులు ఎదురుచూస్తున్నారన్నారు. నిమ్మగడ్డ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు కాబట్టి, మిగిలిన ఏ1 నుంచి ఏ13 వరకు ఏ ఒక్కరైనా సరే దేశం దాటి చూపిస్తే వారి పరిస్థితి ఏమిటో రాష్ట్రప్రజలందరికీ అర్థమవుతుందన్నారు.

Advertisements

Latest Articles

Most Read