రాష్ట్రంలో నేతల భద్రత అంశం రగడగా మారింది. ఇటీవల విపక్ష పార్టీ అయిన తెలుగుదేశం నేతలకు భద్రత తొలగించి ఆ పార్టీ అధినేత చంద్రబాబు భద్రత కుదింపుపై రోజుకొక పంచాయితీ కొనసాగుతుంది. అధికార, విపక్ష నేతల మధ్య ఈ అంశంలో మాటల తూటాలు పేలుతూ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. స్టేట్ సెక్యురిటీ రివ్యూ కమిటీ ఇటీవల నిర్వహించిన సమీక్షలో టీడీపీ హాయాంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారికి భద్రత ఉపసంహరిస్తు నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మంది టీడీపీ నేతలకు పోలీసు శాఖ భద్రతను ఉపసంహరించుకుంది. దీనిపై విపక్ష పార్టీ అయిన తెలుగుదేశం తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తుంది. తమను అంతమొందించడానికే వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనిలో భాగంగానే భద్రత తొలగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. కేవలం రాజకీయ కక్షతో తమకు భద్రత తొలగిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘనా థరెడ్డి, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులతో పాటు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఇప్పటికే భద్రతను తొలగించారు.

security 20022020 2

గడిచిన 20 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్న తమకు భద్రత తొలగించడం ఏంటని ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను మాజీ మంత్రిదేవినేని ఉమా ప్రశ్నిస్తున్నారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని నిలదీసున్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడుకు భద్రతను ప్రభుత్వం కుదించడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం తిరిగి ఆయనకు భద్రతను పునరుద్దరించింది. మరోవైపు చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ భద్రతను రెండుసార్లు కుదిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. జెడ్ కేటగిరి భద్రతను కాస్త వై ప్లస్ కు దాని నుంచి సాధారణ భద్రతకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతంటీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్న నేపథ్యంలో ఆయన భద్రతతో పాటు నేతల భద్రత అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

security 20022020 3

మారుమూల ప్రాంతాల్లో ప్రజలను కలిసేందుకు తాము పర్యటనలు చేయాల్సి ఉంటుందని ఇలాంటి సమయంలో ప్రభుత్వం భద్రత తొలగిస్తే తమకు రక్షణ ఎలా ఉంటుందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రికు న-క్స-లై-ట్లు, ఎర్రచందనం స్మ-గ్ల-ర్ల-తో ప్రాణహాని ఉందని ఆయన భద్రతను ఎలా కుదిస్తారని ప్రభుత్వాన్ని, పోలీసుశాఖను టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. కేంద్రబలగాలభద్రత కలిగి ఉన్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం మరింత భద్రత కల్పించాల్సి ఉంటుందని అలాంటిది కుదింపు ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వైకాపా హయాంలో ప్రతిపక్ష పార్టీ నేతలకు ఏమా త్రం ప్రాణరక్షణ లేదని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ప్రతి పక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలపై అధికారపక్షం నేతలు కూడా దీటుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భద్రతను కుదించలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేయడం కొసమెరుపు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భద్రతలో ఎటువంటి మార్పులు జరుగలేదని, ప్రస్తుతం ఆయనకు జెడ్ ప్లస్ సెక్యురిటీలో భద్రత కల్పిస్తున్నామని ఏపీ డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

మండలి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సెలెక్ట్ కమిటీ వ్యవహారం ఇప్పటి వరకు తెదేపా, వైకాపా మధ్య మాటల యుద్ధం జరుగగా ఇప్పుడు ఉద్యోగుల సమస్యగా మార్చి, వైసీపీ ప్రభుత్వం వ్యూహం మార్చింది. నిబంధనలకు అనుగుణంగా లేదని అసెంబ్లీ కార్యదర్శి సెలెక్ట్ కమిటీకి సంబంధించిన ఫైల్ ను రెండుసార్లు తిప్పి పంపడం చైర్మను ఆగ్రహాన్ని తెప్పించింది. ఒక సభ స్పీకర్ విచక్షణాధికారాన్ని, ఒక అధికారి ఎలా నియంత్రిస్తారు అంటూ, షరీఫ్ ఆగ్రహానికి లోనయ్యారు. తెలుగుదేశం పార్టీ కూడా, ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీసే అవకాసం ఉందని, స్పీకర్ నిర్ణయాన్ని కోర్ట్ లు కూడా కలుగ చేసుకోవు అని, అలాంటిది ప్రభుత్వం, ఇప్పుడు ఒక ఉద్యోగి చేత, సభనే ధిక్కరించే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తున్నారు. సెలెక్ట్ కమిటీ నియమించాలని, సభలో ఇది మేము తీసుకున్న నిర్ణయం అని, చైర్మెన్ చెప్పినా, కార్యదర్శి రెండు సార్లు ఫైల్ వెనక్కు తిప్పి పంపించారు. దీంతో చైర్మన్ షరీఫ్ గవర్నర్‌ను కలిసి అసెంబ్లీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని కోరారు.

నిబంధనల ప్రకారం అసెంబ్లీ కార్యదర్శి వ్యవహరించలేదని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని మండలి చైర్మన్ కోరారు. అయితే ఏకంగా చైర్మెన్ వెళ్లి, తన నిస్సహాయతను, గవర్నర్ కు చెప్పటంతో, అందరూ ఆశ్చర్య పోయారు. ఇది అతి పెద్ద రాజ్యాంగ సంక్షోభం వైపు వెళ్ళే అవకాసం ఉందని, చైర్ నిర్ణయాలు, సుప్రీం కోర్ట్ కు కలుగ చేసుకోదు అని, తన అధికారిని, చైర్మెన్ చెప్పినట్టు నడుచుకోవాల్సిందిగా, గవర్నర్ కోరే అవకాశం ఉందని, వార్తలు వచ్చాయి. గవర్నర్ కనుక ఆ నిర్ణయం తీసుకుంటే, ప్రభుత్వం పరువు పూర్తిగా పోయే అవకాశం ఉంది. అప్పుడు పరిస్థితిని బట్టి, గవర్నర్ మాటను కూడా ధిక్కరించే అవకాశం ప్రభుత్వానికి వస్తుంది. అందుకే వైసీపీ ప్రభుత్వం, దీని పై కౌంటర్ వ్యూహం ముందే రచించింది.

గవర్నర్ మీద ఒత్తిడి తేవటానికి, ఉద్యోగాల సంఘాలను రంగంలోకి దింపింది. మండలి చైర్మన్ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని కోరడం తప్పు అంటూ, ఉద్యోగులు రంగంలోకి దిగారు. అసెంబ్లీ ఉద్యోగుల జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరించడంతో చర్చనీయాంశంగా మారింది. బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ కార్యదర్శి పై శాసన మండలి చైర్మన్ కక్ష సాధింపు దోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ కార్యదర్శి నిబంధనల ప్రకారం నడుచుకున్నారన్నారు. తామంతా అసెంబ్లీ కార్యదర్శికి మద్దతుగా ఉంటామని, అవసరమైతే గవర్నర్ ని కూడా కలుస్తామన్నారు. సెలెక్ట్ కమిటీని నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్నానని చైర్మన్ చెప్పారన్నారు. మోషన్ ఇవ్వకుండా, ఓటింగ్ జరగలేదు. మరి ఎలా సెలెక్ట్ కమిటీని వేస్తారని ప్రశ్నించారు. అయితే ఉద్యోగులు ఇలా రావటం, రాజకీయంగా మాట్లాడటం వెనుక, ప్రభుత్వం వ్యూహం ఉన్నట్టు, గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోకుండా, ఉద్యోగుల ద్వారా ఇలా చెప్పించినట్టు టిడిపి అనుమానిస్తుంది.

అమరావతి రాజధానిలోని భూములను పేదల ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం రెండు వేల నుండి నాలుగు వేల ఎకరాల భూమిని సిద్ధం చేశారు. నవరత్నాల పథకంలో భాగంగా ఇళ్లు లేని పేదవారికి సెంటు భూమి చొప్పున రాష్ట్రంలో 25 లక్షల మంది పేదవారికి ఉగాది నాటికి ఇంటి పట్టాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్రిష్ణా, గుంటూరు జిల్లాలలోని పేదవారందరికి సరిపడ ఇంటి స్థలాల భూమి లేక పోవటంతో రాజధాని ప్రాంతంలోని శాఖమూరు, పెనుమాక, కృష్ణాయపాలెంతో పాటు మరి కొన్ని ప్రాంతాలలో పేదవారి ఇంటి స్థలాల కోసం భూమిని రెవిన్యూ శాఖ గుర్తించింది. రాజధానిలో ఇంటి స్థలం తీసుకోనేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని లబ్ధిదారుల నుండి అంగీకార పత్రం ఇవ్వాలని వారిని కోరుతున్నారు. అయితే విజయవాడలో నివాసముంటున్న తమకు రాజధానిలో ఇంటి స్థలం ఇవ్వటం ఏమి టని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంటి స్థలం రాజధానిలో ఇస్తే కూలీ పనుల కోసం విజయవాడ వెళ్లి రావటానికి చాలా ఖర్చలు అవుతాయన్నారు.

amaravatifarmers 20202020 2

గత టీ.డీ.పీ ప్రభుత్వం కాలంలో తమకు ఇళ్లును కేటాయించారని, ఆ సమయంలో ఇంటికి 25 వేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు ప్రభుత్వానికి చెల్లించామన్నారు. అప్పుడు ఇంటి కోసం అప్పు తెచ్చి ప్రభుత్వానికి డబ్బులు కట్టామని, వాటి గురించి ప్రస్తుత ప్రభుత్వం పట్టించు కోకుండ రాజధానిలో ఇంటి స్థలం ఇస్తామంటే ఉపయోగం ఏమి ఉంటుందని లబ్దిదారులు ప్రశ్నిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం రైతుల నుండి 34 వేల ఎకరాల భూమిని సేకరించింది. ఈ భూములలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ , మంత్రులు, యం. ఎల్.ఏ లు, ఐఎయస్, ఐపియస్, ఉన్నతాధికారులు, ఉద్యోగుల భవనాలను నిర్మిస్తున్నారు. వీటితో పాటు కార్పొరేట్ సంస్థలకు, విద్యా సంస్థ లకు, వైద్యశాలలకు గత ప్రభుత్వం భూములను కూడా కేటాయి చారు. ముఖ్యంగా రహదారులు, పార్కుల నిర్మాణం తో పాటు రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు పాట్లును అభివృద్ది చేసి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది.

amaravatifarmers 20202020 3

అయితే సార్వతిక ఎన్నికలలో వైసిపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని తరలి ంపుతో పాటు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. దీంతో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని 65 రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల అభివృద్ది ,రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చామని రాజ ధాని ప్రాంత ప్రజలు, రైతులు అంటున్నారు. నిన్న కృష్ణాయపాలెంలో, భూములు సర్వే కోసం, వచ్చిన అధికారులను, అక్కడ రైతులు అడ్డుకున్నారు. ఒక పక్క మేము ఇక్కడ ఆందోళన చేస్తుంటే, మా భూములు వేరే వారికి ఇవ్వటం ఏమిటి అని నిలదీసారు. దీంతో, దాదాపుగా 426 పై, 7 సెక్షన్ ల కింద ఈ రోజు కేసులు నమోదు చెయ్యటం సంచలనంగా మారింది.

అమరావతిలో రైతులను, వైసీపీ నేతలు, ఎలా హేళన చేస్తూ ప్రకటనలు చేస్తూ ఉన్నారో చూసాం. అమరావతి రైతులు, బ్రోకర్లుని, వారి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అని, వారు పైడ్ ఆర్టిస్ట్ లు అని, ఇలా ఇష్టం వచ్చినట్టు, అమరావతి రైతుల పై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసారు. ఇక అమరావతిని భ్రమరావతి అని, మరో పక్క ఎడారి అని, మరో పక్క స్మశానం అని, ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలు వింటూ వచ్చాం. ఇదే కోవలో, ఎమ్మెల్యే రోజా, ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమరావతి రైతులు పైడ్ ఆర్టిస్ట్ లు అని, అలాగే మహిళలను ముందు పెట్టి, వెనుక ఉండి హడావిడి చేస్తున్నారు అని, రోజా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే, ఎమ్మెల్యే రోజా, ఈ రోజు అమరావతి ప్రాంతంలో ఉన్న, నీరుకొండ SRM యూనివర్సిటీలో జరుగుతున్న, సమ్మిట్ లో పాల్గొనెందుకు, రోజా ఇక్కడకు వచ్చారు. ఒక పక్క 65 రోజులుగా ఇక్కడ నిరసనలు చేస్తుంటే, కనీసం అమరావతి రైతుల వద్దకు ఒక్కరు కూడా రాలేదు.

roja 20022020 2

రోజా రాకను తెలుసుకొని యూనివర్సిటీ వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. యూనివర్సిటీ ప్రాంతాలు ఉద్రిక్తంగా మారడంతో సమ్మిట్ నుంచి మధ్యలోనే, రోజాను పంపించేసారు పోలీసులు . రోజాను బయటకు రాకుండా అడ్డుకోవాలని యూనివర్సిటీని అన్ని వైపులా రైతులు దిగ్బంధించారు. యూనివర్సిటీ వద్ద రైతులు గ్రామాల నుంచి భారీగా చేరుకుంటుండంతో రోజాను హై సెక్యూరిటీ మధ్య బయటకు తీసుకొచ్చి పోలీసులు పంపించారు. అయితే ఇదే సందర్భంలో, రోజా వాహనంలో కాకుండా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాహనంలో, రోజాను పోలీసులు తరలించారు. అయితే, ఇదే విషయం తెలుసుకున్న రైతులు, రోజాని అడ్డుకున్నారు. నేలపాడు srm యూనివర్సిటీ వద్ద నుండి
గుంటూరు వైపు వెళ్తుండగా పెద పరిమి వద్ద రోజా వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు.

roja 20022020 3

వాహనాన్ని ముందుకు వెళ్లకుండా మహిళలు, రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు జై అమరావతి అని అనాలని, మా పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కోరారు. అయితే రోజా మాత్రం ఇందుకు ససేమీరా అని చెప్పి, కారులో అలాగే కూర్చున్నారు. మేము జై అమరావతి అని చెప్పమంటే, ఆమె ఫోన్ లో వీడియో గేమ్ లు ఆడుకుంటూ, కూర్చున్నారు అని, కనీసం మాతో మాట్లాడటం లేదని రైతులు వాపోతున్నారు. రోజా జై అమరావతి అని చెప్పే దాకా, మేము ఇక్కడ నుంచి వెళ్ళం అని చెప్పారు. పోలీసులు భారీగా చేరుకొని, మహిళలను తోసేసే ప్రయత్నంలో, ఒక మహిళకు తీవ్ర గాయాలు అవ్వటంతో, ఆమెతో కలిసి ర-క్తం కారుతూ ఉన్న కాలుతోనే, రోజా కారు ముందే ధర్నా చేస్తున్నారు. పోలీసులు అందరినీ అక్కడ నుంచి తప్పించి, రోజాని క్షేమంగా పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read