ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు అంశంలో మరోక కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార పక్షమైన వైకాపా అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులను అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించుకోగా, మండలిలో సెలెక్టు కమిటీకి పంపిస్తూ కౌన్సిల్ చైర్మన్ ఎంఏ షరీఫ్ తన విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి శాసన మండలిని రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న మండలి ఛైర్మన్ అకస్మాత్తుగా మంగళవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందతో భేటీ అయి,పలు కీలక అంశాలపై చర్చించటం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఈ భేటీ సరికొత్త ఊహాగానాలకు తెరతీసిందనటంలో ఎలాంటి సందేహం లేదు. శాసన మండలి రద్దు చేసేందుకు ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా వ్యవహరించకుండా, నియమాలను ఉల్లంఘిస్తుందని చైర్మన్ షరీఫ్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన ప్రభుత్వం కేంద్రం నిర్ణయం తీసుకోక ముందే, రదైనట్లుగా వ్యవహరిస్తోందని తెలిపారు.

sharif 19022020 2

ఇదే సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై మండలిలో జరిగిన చర్చ అనంతర పరిణామాలలో తన విచక్షణాధికారాలతో సెలెక్టు కమిటీకి పంపిన విషయాన్ని గవర్నర్‌కు ఛైర్మన్ షరీఫ్ వివరించారు. ఈ అంశంలో ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు సెలెక్టు కమిటీ ఏర్పాటు కాకుండా తన ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మనీ బిల్లులకు, సాధారణ బిల్లులకు వ్యత్యాసం ఉంటుందని ఈ రెండు బిల్లులు మనీ బిల్లులు కావన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి షరీఫ్ తెచ్చారు. మనీ బిల్లులకు వర్తించే నిబంధనలను ఈ బిల్లులకు సాకుగా చూపుతూ మండలి కార్యదర్శి వెనక్కి పంపటం జరిగిందని, ఇది పూర్తిగా సభా గౌరవాన్ని మంటగలపటమేనని చెప్పారు. కమిటీల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికి రెండుసార్లు తాను ఆదేశాలు ఇవ్వటం జరిగిందని, అయితే మండలి కార్యదర్శి వీటిని వెనక్కి తిప్పి పంపారని గవర్నరు ఫిర్యాదు చేశారు.

sharif 19022020 3

మండలి కార్యదర్శితో పాటుగా, మరో అధికారి పై కూడా, మండలి చైర్మెన్, గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. తేదీలతో సహా వీళ్ళు చేసిన పనిని, సవివరంగా గవర్నర్ కు వివరించి, వారిని వెంటనే సస్పెండ్ చెయ్యాలి అంటూ, చైర్మెన్ కోరటం సంచలనంగా మారింది. ఇప్పుడు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది, ఆసక్తికరంగా మారింది. ఈ అంశాలన్నింటిని సానుకూలంగా విన్న తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మండలి ఛైర్మన్ షరీఫ్ అకస్మాత్తుగా గవర్నర్ బిశ్వభూషణ్ భేటీ కావటం రాజకీయ కాకను పెంచింది. ఇదే సమయంలో మండలి రద్దు అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీతోపాటు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కూడా వ్యతిరేకిస్తుండటంతో భవిష్యత్ పరిణామాలు ఏవిధంగా ఉంటాయోనన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.

ఐటి శాఖ పంచనామాల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాడి, వేడి వాతారణాన్ని సృష్టిస్తుంది. ఇటీవల ఐటి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో దాడులు నిర్వహించింది. దీంతో పాటు దేశంలో వివిధ చోట్ల దాడులు జరిగాయి. ఈ దాడులకు సంబంధించి వివిధ ప్రాంతాలో ఆర్థిక లావాదేవీలు డొల్ల కంపెనీల పేరిట సాగినట్లు గుర్తించినట్లు ఐటి శాఖ అధికారికంగా పత్రికా ప్రకటన చేసింది. తాము దాడులు జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిలో, మూడు ఇన్ఫ్రా కంపెనీలు, ఒక ప్రముఖ వ్యక్తి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఉన్నట్లుగా వెల్లడించింది. దీంతో అధికార వైకాంగ్రెస్ నాయకులు, ఆ మూడు కంపెనీలు అనేది వదిలేసి, కేవలం చంద్రబాబు పీఎస్ అని పట్టుకుని, తెలుగుదేశం నేతల పై విష ప్రచారం చేసారు. 2 వేల కోట్లు చంద్రబాబు పీఎస్ ఇంట్లోనే దొరికాయి అంటూ, తప్పుడు ప్రచారం చేసారు. ఈ క్రమంలో వారి ఆరోపణలు అభూత కల్పనలని చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో కేవలం రూ.2.63 లక్షలు నగదు, 12 తులాల బంగారం గుర్తించి వదిలేసారంటూ, ఐటి శాఖ పంచనామా నివేదిక బయట పడింది.

అది ఐటి శాఖ విడుదల చేసిన పంచనామా కావటంతో, వైసీపీకి ఒక రోజు సౌండ్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తామంటూ తెలుగుదేశం నాయకులు బొండా ఉమా, బుచ్చయ్యచౌదరి.యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమాలు అధికార పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అధికార పార్టీ మంత్రులు బొత్సా సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాద్, అనిల్‌కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలినాని తప్పుడు ప్రచారం చేసారని, అక్కడ జరిగింది 3 ఇన్ఫ్రా కంపెనీల మీద అయితే, చంద్రబాబు మీద అంటూ తప్పుడు ప్రచారం చేసారని అన్నారు. అయితే పెండ్యాల శ్రీనివాసు ఐటి పంపిన పంచనామాతో టిడిపి ఎదురు దాడి చెయ్యటంతో, వైసీపీకి ఏమి చెయ్యాలో అర్ధం కాక, తాము ప్రజల్లో చులకన అవుతామని గ్రహించి, మరో డ్రామాతో ముందుకు వచ్చింది.

కడపలో ఎవరో ఏవీ సుబ్బారెడ్డి అనే కాంట్రాక్టర్ మీద జరిగిన ఐటి దాడుల పంచనామా రిపోర్ట్ చూపించి, ఇది శ్రీనివాస్ పంచనామా రిపోర్ట్ అని, గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసింది. వేల డాక్యుమెంట్లు సీజ్ చేసారని, ఇక చంద్రబాబు పని అయిపొయింది అంటూ, మరో ప్రచారానికి తెర లేపింది. అయితే అందులో కూడా డబ్బు, నగలు తరిగి ఇచ్చేసినట్టు ఉంది. ఎక్కడా రెండు వేల కోట్లు అనే విషయం లేదు. సహజంగా కంపెనీల మీద దాడి చేసిన సమయంలో, కొన్ని డాక్యుమెంట్ లు సీజ్ చేస్తారు. అవి అన్నీ వెరిఫై చేసుకుని వదిలి పెడతారు. అయినా, ఈ ఏవీ సుబ్బారెడ్డి అనే కాంట్రాక్టర్ కు, చంద్రబాబుకి ఏమి సంబంధం అని, ముందు ఆ రెండు వేల కోట్లు విషయం తేల్చిండి అంటూ టిడిపి అడిగిన ప్రశ్నకు, ఒక అబద్ధానికి, పది అబద్ధాలు ఆడి, అదే నిజం అని నమ్మించే ప్రయత్నంలో బొక్క బోర్లా పడుతుంది వైసీపీ. అయినా రెండు వేల కోట్లు చంద్రబాబు వద్ద దొరికితే, ప్రాధాన్ మోడీ, హోం మంత్రి అమిత్ షా చూస్తూ కూర్చుంటారా ?

రాష్ట్ర సచివాలయం నుంచి విజిలెన్స్ కార్యాలయాల తరలింపునకు సంబంధించి జీవో నంబరు 13ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై త్రిసభ్య ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ముగిశాయి. దీనిపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. "ప్రభుత్వ ఉత్తర్వు అంటే దానిలో పూర్తి వివరాలు ఉండాలి. వేరే దానితో కలిపి చదవాల్సిన అవసరం ఉండకూడదు. విజిలెన్స్ కార్యాలయం తరలింపు జీవో రూపకల్పనలో మీరు ఆ విధమైన మార్గదర్శకాలు పాటించారు? నోట్ ఫైల్ నేరుగా ముఖ్యమంత్రి ఎలా ఇస్తారు" అని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం అడ్వకేట్ జనరలను ప్రశ్నించింది. రాజధాని పరిధిలోని తాళ్ళాయపాలెం గ్రామానికి చెందిన కొండేపాటి గిరిధర్ అనే రైతు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. జీవోలో అన్ని విషయాలు నేరుగా ప్రస్తావించాలని ఎంఎస్ గిల్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఇంద్రనీల్ బాబు ధర్మాసనం ముందు ఉదాహరించారు. దానిపై ధర్మాసనం స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. తొలుత అడ్వకేట్ జనరల్ శ్రీరాం వాదిస్తూ విజిలెన్స్ కార్యాలయం సాధారణ పరిపాలనా విభాగంలో అంతర్భాగం కాదని, దానిని ప్రాంతానికి తరలించటం వల్ల ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలుగదని పేర్కొన్నారు. .

సచివాలయంలో చాలినంత జాగా లేనందువల్లనే ఆ కార్యాలయాన్ని కర్నూలుకు మార్చాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారు ? ఏ కారణాలతో వచ్చారు, ఆ ప్రాసెస్ అంతా ఇవ్వండి అని హైకోర్ట్ అడిగిన ప్రశ్నకు, ముఖ్యమంత్రికి కూడా జీవో పాస్ చేసే అధికారం ఉంటుంది చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే, జీవో ఇచ్చారు అని చెప్పటంతో, ఇది సరైన వాదన కాదని, తేలి పోయింది అనే అభిప్రాయం కలుగుతుంది. మరో పక్క, జీవోలో పాలనాపరమైన కారణాలు అని పేర్కొన్నారని, వాటిని ఎందుకు ప్రస్తావించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. నోట్ ఫైల్ పై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సంతకం లేకపోవటం, ఎవరు ప్రతిపాదించినది ప్రస్తావన లేకపోవటం, జీవోలో కారణాల గురించి వివరించకపోవటం, డైరెక్ట్ గా సియం చెప్పారు అని చెప్పటం తదితర కారణాల వల్ల ప్రభుత్వ చర్య దురుద్దేశపూరితంగా ఉందన్న అనుమానానికి ఆస్కారం ఏర్పడుతుందని పిటీషనర్ తరపు న్యాయవాది ఇంద్రనీల్ పేర్కొన్నారు.

విజిలెన్స్ కార్యాలయం తరలించటం వల్ల అత్యంత ప్రధానమైన సచివాలయ కార్యకలాపాలలో పారదర్శకత లోపించే ప్రమాదముందని ఆయనన్నారు. స్థలాభావంతో కార్యాలయాల్ని కర్నూలుకు తరలిస్తున్నట్లు నోట్‌ఫైల్స్‌లో ప్రస్తావించలేదన్నారు. కర్నూలుకు కార్యాలయాల తరలింపు విషయంలో, ఆ శాఖ నుంచి ఏ ప్రతిపాదన లేకుండానే, ముఖ్యమంత్రి ఫైల్‌ను ముందుకు పంపినట్లు తెలుస్తుందని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. ఎక్కడైనా స్థలం సరి పోక పొతే, దగ్గరలే వేరేది చూస్తాం కాని, ఎక్కడో కర్నూల్ కు వెళ్ళటం ఏమిటని కోర్ట్ ప్రశ్నించింది. మరో పక్క ఈ విషయాల పై ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వం ముఖ్య పర్సన్‌.. కానీ మౌనంగా ఉంటోందని కోర్ట్ కేంద్రం పై వ్యాఖ్యానించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసులో విచారణ ముగిసినట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.

నారా చంద్రబాబు నాయుడు అంటే, ఈ దేశంలోనే తెలియని వారు ఉండరు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 10 ఏళ్ళకు పైగా ప్రతిపక్ష నేతగా, దేశంలో కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటులో కీలక వ్యక్తిగా, రాష్ట్రపతులను నియమించిన కీలక వ్యక్తిగా, ఇలా అనేక విధాలుగా చంద్రబాబు అంటే దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. గతంలో నక్సల్స్ పై, అలాగే ఎర్ర చందనం మాఫియా పై, ఆయన చేసిన పోరాటానికి ఫలితంగా, ఆయన పై నక్సల్స్ దాడి జరగటం, చెయ్యి ఫ్రాక్చర్ అవ్వటం, ఇవన్నీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి చంద్రబాబుకు జెడ్ ప్లస్ క్యాటగరీ బద్రత కలిపిస్తుంది కేంద్రం ప్రభుత్వం. కేంద్రంలో పార్టీలు మారినా, కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, అయానతో రాజకీయ వైరం ఉన్నా సరే, ఈ బద్రత కొనసాగుతూనే ఉంది. మొన్నటి మొన్న బీజేపీతో అంత పోరాటం చేసినా, మొన్న చేసిన బద్రతా రివ్యూలో, చాలా మందికి జెడ్ ప్లస్ తీసారు కాని, చంద్రబాబుకు మాత్రం కేంద్రం జెడ్ ప్లస్ బద్రత తియ్యలేదు అంటూ, చంద్రబాబుకు బద్రత ఎంతటి కీలక విషయం అనేది ఇక్కడ అర్ధం అవుతుంది.

అయితే ఇంతటి కీలక విషయంలో, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం చూపిస్తున్న అశ్రద్ద పై, తెలుగుదేశం పార్టీ మండి పడుతుంది. వారం రోజుల క్రితం రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజి నుంచి చంద్రబాబు పర్సనల్ సెక్రటరీకి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ ప్రకారం, చంద్రబాబు బద్రతను, 58కి తగ్గించినట్టు ఉంది. గతంలో చంద్రబాబుకి జెడ్ ప్లస్ సెక్యూరిటీలో భాగంగా, 160 మంది సిబ్బంది బద్రతగా ఉండే వారు. అయితే, ఇప్పుడు తాజగా నిఘా ఐజి పంపించిన లేఖలో, 58కి తగ్గించినట్టు ఉంది. రాష్ట్రంలోని ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతను సమీక్షించామని, ఎల్లోబుక్‌ను అనుసరించి చంద్రబాబు రక్షణ సిబ్బంది సంఖ్యను 58కి పెట్టినట్టు ఆ లేఖలో రాసారు. అయితే, దీని పై తెలుగుదేశం పార్టీ మండి పడింది.

అయితే గతంలో జగన్ ప్రభుత్వం రాగానే, ఇలాగే చెయ్యటంతో, చంద్రబాబు హైకోర్ట్ కు వెళ్లి, అదే బద్రత తెచ్చుకున్నారు. అయితే, ఇప్పుడు మళ్ళీ తగ్గించటం పై టిడిపి భగ్గు మంటుంది. చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర పేరుతొ, ప్రజల్లోకి వెళ్తున్నారని, ఇప్పుడు జరగరానిది ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నించింది. అయితే దీని పై, పెద్ద రచ్చ అవ్వటంతో, డీజీపీ కార్యాలయం స్పందించింది. చంద్రబాబుకి ఎలాంటి బద్రత తగ్గించలేదని, 183 మందితో భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం పేర్కొంది. ఇక్కడ 135 మంది, హైదరాబాద్ లో 48 మందితో బద్రత ఇస్తున్నట్టు చెప్పింది. అయితే టిడిపి మాత్రం, ఇది తప్పుడు సమాచారం అని, కేవలం 58 మంది అని వాళ్ళ ఇంటలిజెన్స్ లేఖ ఉంటే, డీజీపీ కార్యాలయం మాత్రం తప్పుడు సమాచారం ఇచ్చింది అంటూ టిడిపి అంటుంది. ఏది ఎలా ఉన్నా, ఇలా ఒక ప్రముఖ వ్యక్తి బద్రత పై, ఇంటలిజెన్స్ ఒక మాట, డీజీపీ కార్యాలయం మరో మాట చెప్పటం పై, టిడిపి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది.

Advertisements

Latest Articles

Most Read