జగన్ మోహన్ రెడ్డి, కేసిఆర్ మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. పోయిన సార్వత్రిక ఎన్నికల్లో, జగన్ గెలుపు కోసం, కేసీఆర్ అన్ని రకాల సహాయాలు చేసారనే పేరు కూడా ఉంది. ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి వచ్చిన కొత్తలో, జగన్, కేసీఆర్ తెగ కులుసుకునే వారు. కలిసిన ప్రతి సారి, ఏపికి ఏది వచ్చేది కాదు కానీ, తెలంగాణాకు మాత్రం ఏదో ఒక లాభం చేకురేలా నిర్ణయాలు వచ్చాయి. ఏమైందో ఏమో కానీ, గత ఏడాది, ఏడాదిన్నర కాలంగా, జగన్, కేసీఆర్ కలుసుకుంది లేదు. ముఖ్యంగా ఏపి చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల విషయంలో, కేసిఆర్ గరంగరంగా ఉన్నారు. రెండు రాష్ట్రాలు కేసులు కూడా వేసుకున్నాయి. అయితే ఇప్పుడు కేసీఆర్, జగన్ ను కాదని, కర్నాటక ముఖ్యమంత్రి యాడ్యురప్పను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఆర్డీఎస్ విషయంలో కేసీఆర్ అభ్యంతరం చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తుంగభద్ర మీద ఉండి, తెలంగాణా, ఆంధ్ర, కర్ణాటక వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. అయితే తెలంగాణాకు రావాల్సిన నీటి వాటా రాకపోగా, ఆర్డీఎస్ కి సమాంతరంగా మరో కాలువ తవ్వటం కోసం ఏపి తీసుకున్న నిర్ణయం పై కేసిఆర్ ఆగ్రహంగా ఉన్నారు. అందుకే యాడ్యురప్పను కలిసి, జగన్ చేస్తున్న పనులకు బ్రేక్ వేయాలని చూస్తున్నారు. మరి పక్క రాష్ట్రాలు పేచీలు పెడితే, జగన్ మోహన్ రెడ్డి, దీన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్తారో చూడాలి.

చంద్రబాబుని ఎలా అయినా అరెస్ట్ చేయాలనే తలంపుతో ఉన్న జగన్  మోహన్ రెడ్డి ప్రభుత్వం, గత రెండేళ్ళ నుంచి చేయని ప్రయత్నం లేదు. అయితే చంద్రబాబు పై అవినీతి మారక , తమ మీడియా ద్వారా వేయగలుగుతున్నారు కానీ, ఆయన మీద అవినీతి మాత్రం నిరూపించలేకపొతున్నారు. అయితే అమరావతి విషయంలో అసైన్డ్ భూములు లాక్కున్నారు అంటూ, ఒక జీవో చూపించి, దాని పై చంద్రబాబు, నారాయణ పై కేసు పెట్టారు. ఇప్పుడు ఇదే జీవో పై, మాజీ ఎంపీ హర్షకుమార్, ఇలాంటి జీవోతోనే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితుల భూములు లక్కుందని, ఇళ్ళ స్థలాల పేరుతో అరాచకం చేసారని, సిఐడికి ఫిర్యాదు చేసారు. చంద్రబాబుది తప్పు అయితే, జగన్ ది ఇంకా పెద్ద తప్పు అని, జగన్‌, బొత్స, ధర్మానలకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని అన్నారు. అమరావతి కోసం మేము స్వచ్చందంగా ఇచ్చామని రైతులు చెప్తున్నారని, ఇక్కడ అలా కాదని, వందలాది మంది దళితుల దగ్గర భూములు లాక్కున్నారని, అందుకే వీరి పై కేసులు పెట్టాలని,హ హర్ష కుమార్ సిఐడిని డిమాండ్ చేస్తూ, లేఖ రాసారు. మరి, సిఐడి ఏమి చేస్తుందో మరి ?

భారత దేశంలో క-రో-నా విలయతాండవం చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విపరీతంగా కేసులు వస్తున్నాయి. రోజుకి పది వేల కేసులు వరుకు వస్తున్నాయి. వైరస్ వేగంగా, ఎప్పటి కంటే బాగా స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా పిల్లలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. పాజిటివిటీ రేటు రాష్ట్రంలో 20 శాతం పైగా ఉంది. ముఖ్యంగా నెల్లూరు లాంటి జిల్లాలో, 40 శాతం పైన పాజిటివిటీ రేటు ఉంది. అయితే ఇవన్నీ చూస్తున్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక నియంత్రణలు ప్రజల మీద ఇంపోజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే, ముఖ్యంగా పిల్లలు క-రో-నా బారిన విపరీతంగా పడటంతో, పదవ తరగతి పరీక్షలు రద్దు చేయటం, వాయిదా వేయటం చేసారు. అయితే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, యదావిధిగా పరీక్షలు ఉంటాయని చెప్తుంది.  పదవ తరగతి, ఇంటర్ కలిపి, 15 లక్షల వరకు పిల్లలు ఉంటారు. వీరందరూ, పరీక్షలు రాయటనికి బయటకు వస్తే, ఈ సమయంలో ఎంత ముప్పో ప్రభుత్వానికి తెలియదా ? ఎందుకు జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో ఇంత పట్టుదలగా ఉన్నారో అర్ధం కావటం లేదు. ఇప్పటికైనా మళ్ళీ సమీక్ష చేసి, పరీక్షలు రద్దు చేయక పొతే, ఇది అతి పెద్ద తప్పుగా మారక మానదు. ప్రభుత్వం అర్ధం చేసుకుంటుంది ఏమో చూద్దాం.

తిరుపతి ఉప ఎన్నిక అనేది, మన దేశ ప్రజాస్వామ్యాన్ని చూసి నవ్వుకునేలా చేసింది. ఎన్నికల ప్రక్రియ అంటే అపహాస్యం అయ్యేలా చేసింది. నవ్వులుపాలు అయ్యేలా చేసింది. అయినా స్పందించాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు మౌనంగా ఉండిపోయాయి. కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా, చోద్యం చూస్తూ ఉండి పోయారు. తిరుపతి ఉప ఎన్నిక జరిగిన రోజు, ఎన్ని వీడియో దొంగ ఓట్లకు సంబంధించి వచ్చాయో అందరూ చూసారు. ముఖ్యంగా ఒక మంత్రికి సంబంధించిన కళ్యాణమండపంలో వారిని దించటం వీడియోల రూపంలో బయటకు వచ్చింది. ఇలా అనేక వీడియోలు బయటకు వచ్చాయి. ఎన్ని దొంగ ఓట్లు పడ్డాయో తెలియదు కానీ, దొంగ ఓట్లు అయితే విపరీతంగా పడ్డాయని చూసిన వారికి అర్ధం అవుతుంది. ఈ తతంగం పై ప్రతిపక్ష పార్టీలు, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసాయి. ఎన్నిక రద్దు చేయాలని కోరాయి. అయితే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. వారు ఇక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారి, మైక్రో అబ్సర్వర్, సీఈసి ఇచ్చే నివేదికల పైన ఆధార పడి నిర్ణయం తీసుకుంటారు. ఈ పాటికే వారు రిపోర్ట్ ఇచ్చే ఉంటారు. అయితే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవటంతో, ఇక ఈసీ ఎన్నిక రద్దు పై ఎలాంటి నిర్ణయం తీసుకోదు అనే వాతవరణమే ఉంది. అందుకే కాబోలు రాజకీయ పార్టీలు, ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాయి.

Advertisements

Latest Articles

Most Read