రాజకీయాల్లో ఉంటే, పక్క పార్టీ వాళ్ళని గౌరవించే రోజులు చూసిన వాళ్ళు, ఇప్పుడు పక్క పార్టీ వాళ్ళు అంటే ద్వేషం నింపే రాజకీయం చూసి అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ద్వేషుల వల్ల సమాజం విడిపోయింది. కేవలం ఇలా ద్వేషం నింపి, మన వర్గం, వేరే వర్గం అని చూస్తూనే, రాజకీయాల్లో మనుగడ ఉంటుంది అనుకుంటున్నారో ఏమో. ఇలాంటి రాజకీయం రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. గత 20, 30 ఏళ్ళుగా, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చూసిన వారు, రాజశేఖర్ రెడ్డి , చంద్రబాబు పెద్ద శత్రువులు అనుకుంటున్నారు. వారి రాజకీయం అలా నడిచింది. కానీ ఎంత రాజకీయ వైరం ఉన్నా, ఇద్దరూ మనుషులుగానే ప్రవర్తించే వారు. చంద్రబాబు సహనం గురించి వేరే చెప్పేది ఉంది. కానీ రాజశేఖర్ రెడ్డి ఒకటి రెండు సార్లు మాటలు అదుపు తప్పినా, అసెంబ్లీ సాక్షిగా నీ తల్లి కడుపున ఎందుకు పుట్టావ్ అని అన్నా, తరువాత తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పే వారు. చంద్రబాబుని వెన్నుపోటు దారుడు అన్నా, రాజశేఖర్ రెడ్డిని ఫ్యాక్షనిస్ట్ ని వీళ్ళు అన్నా, అది రాజకీయ విమర్శల వరుకే పరిమితం, వ్యక్తిగతంగా గౌరవించుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు కేవలం ద్వేషం మీదే నడుస్తుంది. ఆ ద్వేషం నింపటం ఎక్కడ వరకు వచ్చింది అంటే, చివరకు పుట్టిన రోజు నాడు కూడా, ఆ వ్యక్తి పై, సమాజంలో ద్వేషం నింపే ప్రయత్నం జరుగుతుంది.

reddy 20042021 2

ఇది చేసింది సాక్షాత్తు ఒక ఎంపీ. ఒక ఎంపీ ఈ దేశంలో ఎంతో గౌరవంగా ఉండాల్సిన వ్యక్తి, ఇలాంటి పనులు చేస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పుట్టిన రోజు. తెలుగు జాతికి ఆయన సేవలు తలుచుకుంటూ, నలు మూలల నుంచి ఆయనకు విషెస్ చేస్తున్నారు. కేంద్ర మంత్రుల దగ్గర నుంచి, మాజీ ప్రధానుల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. చివరకు జగన్ మోహన్ రెడ్డి కూడా తెలిపారు. అయితే విజయసాయి రెడ్డి మాత్రం, విషం నింపే ట్వీట్ వేస్తూ, చంద్రబాబుని 420తో సంబోధిస్తూ, హుందా తనం లేకుండా, మురికిగా ట్వీట్ చేసారు. నిజానికి చంద్రబాబు మీద ఒక్క 420 కేసు కూడా లేదు. విజయసాయి రెడ్డి అఫిడవిట్ చూసుకుంటే, ఆయన అఫిడవిట్ మొదటి పేజీలోనే మూడు 420 కేసులు ఉన్నాయి. ఇంకా 30 పేజీలు  మిగిలే ఉన్నాయి. చంద్రబాబు తిరిగి, ఇదే మాట అంటే, విజయసాయి రెడ్డి, మొఖం ఎక్కడ పెట్టుకుంటారు ? చంద్రబాబు అంటే ఇష్టం లేకపోతే, కాం గా ఉండవచ్చు కదా, ఇలా ఆయన పుట్టిన రోజు నాడు పై, ఈ విషం కక్కటం ఎందుకు ? ఆయన ఎంపీ అనే విషయం కూడా మర్చిపోయారా ? ఇప్పటికైనా విజయసాయి రెడ్డి, ఇలాంటి పనులు మానుకోవాలని, కోరుకుందాం.

రాష్ట్రంలో రావణరాక్షసపాలన సాగుతోందని, పథకాలు పేర్లుమార్చి ఆర్భాటంగా ప్రకటిస్తున్న ప్రభుత్వం, ఫీజు రీయింబర్స్ మెంట్ కు జగనన్న విద్యాదీవెన అంటూ పేరుమార్చిన సర్కారు, ఉన్నతవిద్యనభ్యసించే విద్యార్థులఫీజులు కళాశాలలకు చెల్లించడం లేదని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టంచేశారు. సోమవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఒక ఇంట్లో చదువుకునేపిల్లలు, ఇద్దరు ముగ్గురుంటే, ఈ ప్రభుత్వం ఒక్కరికే అరకొరగా ఫీజులు చెల్లిస్తోందని, రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సంఖ్యకుప్రభుత్వ చెల్లింపుల కు ఏమాత్రం పొంతనలేదని బుచ్చయ్య చెప్పారు. ద్విచక్ర, త్రిచక్ర, నాలుగుచక్రాల వాహనాలున్నా, విద్యుత్ వాడకం 300యూనిట్లు దాటినా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులను ప్రభుత్వం నిలిపివే స్తోందన్నారు. కేంద్రప్రభుత్వం విద్యార్థులకు చెల్లించే చెల్లింపులు 50శాతంవరకు ఉంటే, ఈప్రభుత్వం అంతా తానే చెల్లిస్తున్నట్లు చెప్పుకుంటోందన్నారు. తాడేపల్లి సౌధం నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, భారతి సమక్షంలో విద్యార్థులుసహా, అన్నివర్గాల వారిని దోచుకునే ప్రక్రియ కొనసాగుతోందని ప్రజలంతా అనుకుంటున్నారని టీడీపీ నేత స్పష్టంచేశారు. ప్రతిదానిలో కమీషన్లు తీసుకుం టూ, ప్రతిశాఖలో తనవాళ్లనునియమించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి దోపిడీని నిరాటంకంగా కొనసాగిస్తున్నా డన్నారు. విద్యార్థులకు మెస్ ఫీజులు, హాస్టల్ ఫీజులు చెల్లించడంలేదని, విదేశాల్లో చదువుకుంటున్నవారికి రూపాయికూడా చెల్లించకపోవడంతో వారంతా దిక్కుతో చని స్థితిలోఉన్నారని గోరంట్ల వెల్లడించారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా విద్యారంగానికి కేటాయింపులు చేయకుండా, గతప్రభుత్వం చెల్లింపులు చేయలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆన్ గోయింగ్ స్కీములకు చెల్లింపులు అనేవి ఆర్థికసంవత్సరం ఆరంభంలో చెల్లి స్తుంటారని, 2019 మేలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఇంతవరకు విద్యార్థులకు పూర్తిగా హాస్టల్ ఫీజులు, బోధనా రుసుములు చెల్లించలేదన్నారు. భోజ న కాంట్రాక్టర్లకుచెల్లింపులు చేయకపోవడంతో విద్యార్థు లు అర్థాకలితో అలమటిస్తున్నారన్నారు.

14వ, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎన్ఆర్ ఈజీఎస్ నిధులను పంచాయతీలకు కేటాయించకుండా, పంచాయతీ రాజ్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యంచేసిందన్నారు. ఆ శాఖ మంత్రి దొంగఓట్లు వేయించుకునే పనిలో తీరిక లేకుండాఉంటే, గ్రామపంచాయతీల్లో సెక్రటరీలు, వీఆర్వోలు విద్యుత్ బకాయిలుకూడా చెల్లించలేక బావురుమంటున్నారని చౌదరి వివరించారు. పంచాయ తీలకు దక్కాల్సిన ఎన్ఆర్ ఈజీఎస్ నిధులు ఈప్రభు త్వం పక్కదారి పట్టించిందని, దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు బయటకువస్తాయని గోరంట్ల డిమాండ్ చేశారు. గ్రామాల్లో అభివృద్ధిపనులు చేయడానికి ఎవరూ ముందుకురాని పరిస్థితిని ఈ ప్రభు త్వం కల్పించిందన్నారు. సీఎఫ్ఎంఎస్ విధానంతో గ్రా మాల అభివృద్ధిని అటకెక్కించిన జగన్ ప్రభుత్వం, ఇళ్ల స్థలాలు, సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలంటూ ప్రజలను మరింతదోపిడీ చేస్తోందన్నారు. ఇళ్లస్థలాల పేరుతో వైసీపీనేతలు, కార్యకర్తలు దోచుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం, ఎక్కడాకూడా పేదలు, సామాన్యు లకు ఉపయోగపడేవిధంగా స్థలాలనుకేటాయించలేక పోయిందన్నారు. ఒక్కచోట కూడా నీటివసతి, రోడ్డు వసతి కల్పించడంగానీ, ఇళ్లనిర్మాణంచేయడం గానీ జరగలేదన్నారు. ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇస్తుంద నిచెప్పిన పాలకులు, సిగ్గులేకుంగా గతప్రభుత్వంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులేస్తోందని బుచ్చ య్య మండిపడ్డారు. టిడ్కోఇళ్లను లబ్ధిదారులకు కేటాయించని ముఖ్యమంత్రి వాటికి పార్టీరంగులేసి తనబొమ్మను, తనతండ్రి బొమ్మలను వేసుకుంటున్నా డన్నారు.

గ్రామాల్లో పనులుచేస్తే బిల్లులు చెల్లించరన్న భయంతో వైసీపీవారే ఎటువంటి పనులుచేయడానికి ముందుకురావడంలేదన్నారు. రాజమండ్రి చుట్టుపక్క లున్న పల్లెల్లోనివారికి ఇసుక లభించడంలేదని, విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో అక్కడున్న ఇసుకను విశాఖకు లారీలు,లారీలు తరలిస్తున్నారన్నారు. కొవ్వూరు ప్రాంతంనుంచి కొన్నివేల ట్రక్కుల ఇసుక సజ్జల ఆధ్వర్యంలో ఇతరప్రాంతాలకు తరలిపోతోందన్నా రు. ఈ ప్రభుత్వంలో జరుగుతన్న అధ్వాన్న, ఆటవిక, అరాచక పాలనతో ప్రజలంతా ఈసురోమంటూ ఏడుస్తు న్నారన్నారు. పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందు కు రావడంలేదని, ఉన్నపరిశ్రమలు ఈరోజా ..రేపా అన్నట్లుగా తరలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. అధికారజులుం, ప్రభుత్వదోపిడీతో ఏపీలోని పరిశ్రమల న్నీ తెలంగాణకు తరలిపోతున్నాయన్నారు. ఒకచేత్తో రూపాయిఇస్తూ, మరోచేత్తోప్రజలనుంచి 10రూపాయలు లాగేసుకుంటున్న దోపిడీ ప్రభుత్వం దేశంలో జగన్ ప్రభుత్వం ఒక్కటేనని బుచ్చయ్య చౌదరి తేల్చిచెప్పారు. మద్యం అమ్మకాలను వైసీపీనేతలకు ఆదాయవనరుగా మార్చారని, మద్యపాన నిషేధం పేరుతో గ్రామాల్లో సారాయిని ఏరులైపారిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలన్నారు. తనపార్టీ నాయకులు, కార్యకర్తలను గ్రామాలపైకి వదిలి, ముఖ్యమంత్రి అక్రమ మద్యం, సారాయి వ్యాపారాలను చేయిస్తున్నాడన్నారు. ప్రతిగ్రామం సారాయి డెన్ గా మారిందన్నారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ప్రశ్నించేవారిని, ప్రతిపక్షాలను అడ్డుకుంటూ, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాడని గోరంట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు.

రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల చరిత్రలో నేటి దినం అత్యంత దురదృష్టకరమని, కరోనాపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉద్యోగులసంక్షేమాన్ని గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరమని టీడీపీ ఎమ్మెల్సీ పీ. అశోక్ బాబు వాపోయారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కరోనాతో ఇప్పటికే సచివాలయంలో నలుగురు ఉద్యోగులు చనిపోయారని, ఇద్దరు ఉపాధ్యాయలుకూడా మరణించారని, ఇక వైద్యులు, నర్సులైతే మొదటిదశలోనే చాలామంది చనిపోయారని అశోక్ బాబు తెలిపారు. చనిపోతున్నాకూడా ప్రాణాలను లెక్కచేయకుండా ఫ్రంట్ లైన్ వారియర్లైన పారిశుధ్యకార్మికులు, వైద్యులు, నర్సులు, ఇతరేతరవిభాగాలకు చెందిన వారు పనిచేస్తేనే తొలిదశ కరోనాను చాలావరకు నియంత్రిం చడం జరిగిందని అశోక్ బాబు చెప్పారు. దాదాపు ఏపీలో 100కులోపు కరోనా కేసులు నమోదవ్వడం జరిగిందన్నారు. తరువాత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయబట్టే, రెండోదశకరోనావ్యాప్తిలో రాష్ట్రం, అటూ ఇటూగా మహారాష్ట్రతో పోటీపడుతోందన్నారు. కరోనా నియంత్రణలో ఉద్యోగులే ప్రధానపాత్ర వహించారని, వైద్యవిభాగంతోపాటు, ప్రభుత్వ పాలనాయంత్రాంగం కూడా ప్రధానభూమిక పోషించిందని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశాన్ని (వర్క్ ఎట్ హోమ్) గతప్రభుత్వమే కల్పించిందని, 80శాతం ఉద్యోగులకు అలాంటి అవకాశాన్ని కల్పించవచ్చన్నారు. రెండోదశ కరోనాను నియంత్రించడంతోపాటు, ఉద్యోగులంతా విధిగా పనిచేస్తేనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడవచ్చ న్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియదుగానీ, దేశంలో అవసరమైన చోట పరీక్షలు రద్దుచేయడం, లాక్ డౌన్ అమలుచేయడం, రాత్రి కర్ఫ్యూ విథించడం వంటి నిర్ణయాలను అనేక ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయన్నారు. సమాజం కోసం ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న అశోక్ బాబు, ఆసుపత్రుల్లో పడకలకొరత, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలున్న విషయాన్ని గుర్తించాలన్నారు.

ఇతరరాష్ట్రాలతో పోలిస్తే కొంతలో కొంత ఏపీలో ఆక్సిజన్ కొరత 50శాతం మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వఉద్యోగులు కరోనాతో ఆసుపత్రుల్లో చేరితే, వారిని చేర్చుకోవడంలేదని, బెడ్లు (పడకలు) కూడా దొరకడంలేదన్నారు. ప్రభుత్వఉద్యోగు లకు కరోనా వచ్చాక హాడావుడిచేసేబదులు, వారికి ఆ సమస్య రాకముందే ప్రభుత్వంచర్యలు తీసుకుంటే మంచిదని అశోక్ బాబు హితవుపలికారు. ప్రభుత్వపథకాలు అమలుకావాలన్నా, ప్రజలకు సేవలు అందాలన్నా, రెండోదశ కరోనాను నియంత్రించాలన్నా, అన్నిరకాల ఉద్యోగులు పనిచేస్తేనే అవి సాధ్యమవు తాయన్నారు. మున్సిపల్ , వైద్యారోగ్య శాఖలతోపాటు పోలీస్, రెవెన్యూ శాఖల ఉద్యోగులు విధిగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కోవిడ్ వ్యాక్సిన్లు పంపిణీచేయాలంటే కేవలం అది ఒక్క వైద్యశాఖతోనే సాధ్యంకాదన్నారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయాలంటే, అన్నిశాఖలు సమన్వయంగా పనిచేయాలన్నారు. వైద్యులు, నర్సులకు మాత్రమే పీపీఈ కిట్లు అందిస్తే సరిపోదని, అన్నిశాఖల విభాగాధిపతులు, వారికింద పనిచేసే నాలుగోతరగతి ఉద్యోగులవిషయంలో కూడా అన్నిజాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని టీడీపీఎమ్మెల్సీ స్పష్టంచేశారు. సచివాలయంలో నలుగురు ఉద్యోగులు, కొన్నిచోట్ల ఉపాధ్యాయులు మరణించినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోందన్నారు.

ప్రాణం అన్నింటికంటే ముఖ్యమైనదని, ఉద్యోగులు, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వంపైనే ఉందన్నారు. సచివాలయంలో పనిచేసే ఉద్యోగులతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే వారందరికీ ఇంటినుంచి పనిచేసే అవకాశం కల్పించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. రాష్ట్రఉద్యోగుల సంఘం అధ్యక్షుడే కరోనాతో ఆసుపత్రిలోచేరాడన్నారు. ఉద్యోగులను రెండోశ్రేణి పౌరులుగా చూడకుండా, వారికి ఇంటినుంచి పనిచేసే అవకాశం కల్పించాలని, అలాచేస్తే నే ప్రభుత్వ పనితీరు ప్రజలకు చేరుతుందన్నారు. పరిపాలనను మరింత సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వానికి ఉంటే, వెంటనే ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశాన్ని కల్పించాలన్నారు. అలానే చనిపోయినఉద్యోగులు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు. కరోనాతో మరణించినప్పుడు ఫ్రంట్ లైన్ వారియర్లకు వర్తించే ప్రయోజనాలనే ఇతర ఉద్యోగులకు కూడా ప్రభుత్వం వర్తింపచేయాలని అశోక్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తిరుపతి ఉపఎన్నికల్లో దొంగ ఓట్లర్ల ఉదంతంపై కేంద్ర ఎన్నికల సంఘానికి 22 పేజీల సుధీర్ఘ లేఖ రాసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. బోగస్ ఓటర్లపై తెలుగుదేశం అనేక పిర్యాదులు ఇచ్చినప్పటికీ ఎన్నికల సంఘం క్షేత్ర స్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 2019 పోలింగ్ తో పోల్చితే ఏప్రిల్ 17, 2021 న జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎందుకు తగ్గింది? తిరుపతి పార్లమెంటు పరిధిలోని తిరుపతి అసెంబ్లీ సెగ్మెంటులో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. బయట వ్యక్తుల ప్రభావంతో అసలు ఓటర్లు పోలింగ్ లో పాల్గొనలేకపోయారు. నకిలీ ఈ.పి.ఐ.సి కార్డులతో వందల మంది బయట వ్యక్తులు వాహనాలలో తిరుపతిలో ప్రవేశించారు. ఫేక్ ఓటర్లకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను జత చేసిన చంద్రబాబు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడిన ఆడియో టేప్ ను లేఖకు జత చేసిన చంద్రబాబు. దొంగ ఓటర్ దారులు వాలంటీర్ల సహాయంతో ఎలక్టోరల్ పోటో ఐడెంటిటీ కార్డుల (ఈపిఐసీ) ద్వారా దొంగ ఓట్లు వేశారు. ఏప్రిల్ 15 వ తారీఖు ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుపతి పార్లమెంటు పరిధిలోనే ఉండి ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివ ప్రసాద్, మాచర్ల ఎమ్మెల్యే ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడ్డారు.

పోలింగ్ రోజైన 17 వ తారీఖు 250 వాహనాలను వెనక్కు పంపామని డిజీపీ స్వయంగా చెప్పారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు దొంగ ఓటర్లను రెడ్ హేడెండ్ పట్టుకున్నారు. స్థానిక ఎన్నికల అధికారులకు పిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగుల నుండి, 80 సంవత్సరాలు పైబడిన వృద్దుల నుండి పోస్టల్ బ్యాలెట్లను వైసీపీ నాయకులు బలవంతంగా లాక్కున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ప్రజల విశ్వాసాన్ని పటిష్టపరిచేందుకు తిరుపతి అసంబ్లీ సెగ్మెంటులో రీ-పోలింగ్ నిర్వహించండి. అధికార వైకాపా తప్పా అన్ని ప్రతిపక్ష పార్టీలు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంటులో రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read