సుప్రీం కోర్టు జస్టిస్ పై, అలాగే హైకోర్టు జస్టిస్ ల పై ఆరోపణలు చేస్తూ, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు లేఖ రాసి, తరువాత ఆ లేఖను మీడియాకు విడుదల చేసి, న్యాయమూర్తులను అల్లరి చేసిన విషయం పై, దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి, జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు వచ్చాయి. అయితే దీని పై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుంది అనే విషయం పై అందరికీ సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే నెల రోజులు అయిపోవటంతో, అసలు సుప్రీం కోర్టు ఈ విషయం పై స్పందిస్తుందా లేదా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఇక మరో పక్క, జగన్ రాసిన లేఖ, దాన్ని మీడియాకు విడుదల చేయటం తప్పుబడుతూ, కొంత మంది సుప్రీం కోర్టులో పిటీషన్ లు కూడా వేసారు. అయితే ఇప్పటి వరకు దీని పై సుప్రీం కోర్టు నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఇప్పుడు ఈ మూడు పిటీషన్ల పై విచారణ చేయనున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ నెల 16న జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలు అయిన మూడు పిటీషన్ల పై విచారణ జరగబోతుంది. జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ రవీంద్ర భట్ జడ్జిలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ మూడు పిటీషన్లు వస్తున్నాయి. వీరు ఈ మూడు పిటీషన్లను విచారణ చేయనున్నారు. జడ్జిల పై ఆరోపణలు చేస్తూ వారిని అల్లరి చేయటం, అలాగే ఆ లేఖను బహిర్గతం చేయటం పై కూడా ఈ మూడు పిటీషన్లు దాఖలు అయ్యాయి. పిటీషన్ వేసిన వారు న్యాయవాదులు. జీఎస్ మణి, ప్రదీప్ కుమార్, సునీల్ కుమార్ సింగ్ అనే ముగ్గురూ వేరు వేరు పిటీషన్లు వేసారు.

sc 06112020 2

యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కూడా మరో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్లు ఈ నెల 16న విచారణకు రాబోతున్నాయి. ఈ పిటీషన్ లో ప్రధానంగా, జగన్ మోహన్ రెడ్డిని సియం పదవి నుంచి తొలగించాలని, ఆయన రాజ్యాంగా హద్దులు మీరారని, ఆ స్థానంలో ఉండటానికి అనర్హుడని వారు తెలిపారు. అలాగే మరో పిటీషన్ లో, షోకాజ్ నోటీస్ ఇవ్వాలని, కోర్టు ధిక్కరణ నోటీస్ ఇవ్వాలని కూడా పిటీషన్ లో పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు కోసం, ఆధారాలు లేకుండా విషం చిమ్మారని, భవిష్యత్తులో ఎవరూ ఇలా చేయకుండా, సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని కూడా మరొక పిటీషన్ లో కోరారు. దేశ అత్యున్నత న్యాయస్థానం యొక్క ప్రతిష్టను జగన్ మోహన్ రెడ్డి దిగజార్చే ప్రయత్నం చేసారని, వివక్షపూరితంగా అవినీతి ఆరోపణలు చేయటం రాజ్యాంగానికి కూడా విరుద్ధం అని తెలిపారు. మరో పక్క, ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ, రెండు సార్లు అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌కు లేఖ రాసి, జగన్ పై కోర్టు ధిక్కరణ కేసు పెట్టటానికి అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. అయితే మొదటి సారి ఇది చీఫ్ జస్టిస్ పరిధిలో ఉందని సమాధనం చెప్పిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, క-రో-నాలో దేశంలోనే రెండో స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. చిన్న రాష్ట్రం అయినా, అంతర్జాతీయ విమానాశ్రయాలు, మెట్రో సిటీలు లేకపోయినా, అతలాకుతలం చేసింది. అయితే ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది. ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంటుంది. ఒక్కోటి అన్ లాక్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఏది చేయకూడదో అదే చేసారు. స్కూల్స్ తెరుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. గత నాలుగు రోజులుగా వస్తున్న సంఖ్య చూసి విశ్లేషకులు షాక్ అవుతున్నా, ప్రభుత్వం మాత్రం, ఇది కేవలం ఒక్క శాతం మాత్రమే కదా అంటుంది. అంతే కాదు, అవి అంతకు ముందు ఉన్న కేసులు, ఇప్పుడు వచ్చినవి కావు అంటుంది. అంతకు ముందు వచ్చినా, ఇప్పుడు వచ్చిన వారు స్కూల్స్ కి వస్తుంటే, వేరే వారికి అంటుతుంది కదా ? గత నాలుగు రోజులుగా, 829 మంది ఉపాధ్యాయులు, 575 మంది పిల్లలు క-రో-నా బారిన పాడ్డారు. ఇంకా కొన్ని చోట్ల మధ్యన భోజనం వడ్డించే వారికి, వండే వారికి కూడా వైరస్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి. అధికారికంగానే ఇంత ఫిగర్ అంటే, అనధికారికంగా ఇంకా ఎక్కువ ఉంటుందని కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి. దీనికి ఉదాహరణగా, విద్యాశాఖ విడుదల చేసే లెక్కలకు, క్షేత్రస్థాయిలో వచ్చే లెక్కలకు చాలా తేడా ఉందని చెప్తున్నారు. ఈ జిల్లా, ఆ జిల్లా అని లేకుండా, అన్ని జిల్లాల్లో ఈ సంఖ్య నమోదు అవుతుంది. ఈ రోజు ఈ సంఖ్య పెరిగే అవకాసం ఉంది.

ap 06112020 2

అయితే పిల్లల విషయంలో రిస్క్ వద్దని, వెంటనే స్కూల్స్ మూసేయాలని , వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల విషయంలో కరోనా అని చెప్తున్న ప్రభుత్వం, ఇన్నాళ్ళు స్కూల్స్ లేకుండానే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు ఇంత హడావిడి అని ప్రశ్నిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో స్కూల్స్ తెరవలేదని గుర్తు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి మాత్రం స్కూల్స్ కొనసాగుతాయి అనే విధంగానే స్పందిస్తున్నారు. విద్యా సంవత్సరం నష్టపోతారని, అందుకే పెడుతున్నామని, ఇప్పుడు వచ్చేవి అన్నీ, ఇది వరుకే వైరస్ సోకిన వారని, ఇవి కూడా చాలా తక్కువ కేసులు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, ప్రభుత్వం అందరి దగ్గర ఒక ఫారం పై సంతకం చేపించుకుంటుంది. ఆ ఫారంలో, ఒక వేళ వైరస్ సోకినా మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఉంది. దీని పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి కదా, ఇంత రిస్క్ అనుకున్నప్పుడు, ఎందుకు పిల్లల పై ఈ భారం అని వాపోతున్నాయి. అయితే ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు వెళ్ళేలా కనిపించటం లేదు. సెకండ్ వేవ్ వస్తే, పరిస్థితి చేయి దాటిపోతే, అప్పుడు మేల్కొని కూడా లాభం ఉండదని, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త ఇసుక పాలసీ వస్తుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయంలో ఇసుక ఫ్రీగా ఇచ్చే వారు. కేవలం రవాణా చార్జీలు పెట్టుకుంటే సరి పోయేది. ట్రాక్టర్ 1500, లారీ 4 వేలుకు ఇసుక దొరికేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, కొత్త ఇసుక పాలసీ తెచ్చారు. అప్పటి నుంచి అటు నిర్మాణాలు చేసే వారికి, ఇటు పనులు చేసుకునే వారికి, ఇసుక దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇసుక రేటు కూడా నాలుగు అయుదు రెట్లు పెరిగింది. అయితే కొత్త పాలసీ కాబట్టి కొంత సమయం పడుతుందని భావించినా, 18 నెలలు అయినా అవే కష్టాలు. దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావటంతో, కొత్త ఇసుక పాలసీ కోసం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారు. ఈ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ కొత్త ఇసుక పాలసీ రిపోర్ట్ ని, ఈ రోజు జరిగిన క్యాబినెట్ ముందు పెట్టింది. క్యాబినెట్ ఆ రిపోర్ట్ ని ఆమోదించింది. దీంతో కొత్త ఇసుక పాలసీ త్వరలోనే, అందుబాటులోకి రానుంది. అయితే ఈ కొత్త ఇసుక పాలసీ పై కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్రంలోని ఇసుక రీచ్ లు అన్నీ ఒక సంస్థకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ముందుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ ఇసుక రీచ్ లు నిర్వహణ బాధ్యతలు అప్ప చెప్పాలని, ఒకవేళ కేంద్ర సంస్థలు ముందుకు రాకపోతే, పేరు గాంచిన ప్రైవేటు సంస్థలకు ఓపెన్ టెండర్ ద్వారా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

sand 05112020 2

అయితే ఇక్కడే అందరికీ అనుమానాలు వస్తున్నాయి. ఇలా ఒకే సంస్థకు ఇస్తే, అవినీతిని అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు రాకపోతే, ప్రముఖ కంపెనీకి మొత్తం ఇసుక రీచ్ లు ఇచ్చేస్తాం అని చెప్పటంలోనే గోల్ మాల్ ఉందని తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఇది ప్రజలకు మేలు చేసే నిర్ణయం కాదని, ఒక బడా కాంట్రాక్టర్ కు కట్టబెట్టే నిర్ణయం అని, దీని వెనుక దోచుకునే కుట్ర ఉంది అంటూ తెలుగుదేశం నేత బొండా ఉమా ఆరోపిస్తున్నారు. మేము గత నెల రోజులగా ఆరోపిస్తున్నట్టే, ఒకే ప్రైవేటు సంస్థకు ఇసుక అప్పచేప్తున్నారని, ఆ ఒక్కరు ఎవరో అందరికీ తెలుసు అని విమర్శించారు. గతంలో రెడ్డి అండ్ కంపెనీ ఇసుకను దోచేస్తే, ఇప్పుడు శేఖర్ రెడ్డి అనే ఇసుకమాఫియా కింగ్ కు రాష్ట్రంలోని ఇసుకను గంపగుత్తగా అప్పగించబోతున్నారని బొండా ఉమా ఆరోపించారు. ఏపీలో ఏపీఎండీసీ సంస్థ ఉందని, ఈ ప్రభుత్వానికి నిజంగా మేలుచేయాలన్న చిత్తశుద్ధే ఉంటే, ఇసుకసరఫరా బాధ్యతను ఆసంస్థకు ఎందుకు అప్పగించడంలేదని, ఉచిత ఇసుక విధానాన్ని ఎందుకు అమలుచేయడంలేదని బొండా ఉమా ప్రభుత్వాన్ని నిలదీశారు.

అది 2017వ సంవత్సరం. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు దగ్గర ఒక ప్రై-వే-టు ట్రా-వె-ల్స్ బస్సు ఘో-ర ప్ర-మా-దా-ని-కి గురయ్యింది. 9 మంది ప్రా-ణా-లు కూడా కోల్పోయారు. దీంతో అప్పట్లో ఇది రాజకీయంగా కూడా ర-చ్చ అయ్యింది. అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, ఆ రోజు మధ్యానమే హైదరాబాద్ నుంచి వచ్చారు. నేరుగా మృ-త-దే-హా-లు ఉన్న హాస్పిటల్ కు వెళ్ళారు. అయితే అక్కడ నుంచి నేరుగా పో-స్ట్ మా-ర్టం గదిలోకి వెళ్ళిపోయారు. అక్కడ డాక్టర్ ల దగ్గర ఉన్న నివేదికలు లా-క్కు-న్నా-రు. సార్, ఇది మీకు సంబంధించింది కాదు, మీకు వేరే ఇస్తాను అని చెప్పినా, వినకుండా లా-క్కు-న్నా-రు. అక్కడే ఉన్న అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు. మీరు అంటే చాలా గౌరవం ఉంది, మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అంటూ, జగన్ చేతిలోని పేపర్స్ తిరిగి లా-క్కు-న్నా-రు. దీంతో జగన్ భ-గ్గు-మ-న్నా-రు. నిన్ను జైలుకి తీసుకుపోతా అంటూ కలెక్టర్ అహ్మద్ బాబు పై చేసిన సీన్, ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. జగన్ తో పాటుగా, మిగతా నేతలు కూడా కలెక్టర్ తో పాటు, అక్కడ ఉన్న డాక్టర్స్ పై ప్రవర్తించిన తీరు అందరికీ గుర్తుంది. తరువాత దీని పై కేసు నమోదు అయ్యింది. కేసు కొట్టేయాలని అప్పట్లోనే జగన్ హైకోర్టుకు వెళ్ళినా, కోర్టు ఒప్పుకోలేదు. అయితే అప్పట్లో, ఇప్పటి లాగా క-క్ష రాజకీయాలు లేవు కాబట్టి, అప్పటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. పోలీసులు కూడా ఎందుకు వచ్చింది అనుకున్నారో ఏమో, అప్పట్లో కూడా ఈ కేసు విషయంలో, సరిగ్గా ముందుకు వెళ్ళలేదు. ఈ కేసులో ఏ1గా ఉన్న జగన్ కు నోటీసులు కానీ, విచారణ కానీ, స్టేషన్ బెయిల్ కానీ, కోర్టులో హాజరు పరచటం కానీ ఏది జరగలేదు. జగన్ మినహా మిగతావారికి నోటీసులు ఇచ్చారు, కొంత మంది సాక్ష్యులను విచారణ చేసారు.

collector 05112020 2

అలాగే అప్పటి వీడియో ఆధారాలు సేకరించారు. అయితే కీలకమైన కలెక్టర్ అహ్మద్ బాబు స్టేట్మెంట్ మాత్రం నమోదు చేయలేదు. ఆయన అందుబాటులో లేరని రాసారు. తరువాత పాదయాత్రలో జగన్ ఉన్నారు కాబట్టి, నోటీసులు ఇవ్వలేక పోయాం అని రికార్డులలో రాసారు. ఇక తరువాత ఈ కేసు ప్రజాప్రతినిధుల పై ఉన్న కేసులకు సంబంధించి ప్రత్యెక కోర్టుకు చేరుకుంది. అయితే ఈ కేసు చూసిన కోర్ట్ విస్తుపోయింది. ఏ1 గా ఉన్న వారికి నోటీస్ ఇవ్వకుండా, విచారణ లేకుండా, స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా, చార్జ్ షీట్ ఎలా వేసారు అంటూ, ప్రశ్నించటంతో, చార్జ్ షీట్ వెనక్కు తీసుకున్నారు. అయితే ఈ లోపు జగన్ అధికారంలోకి వచ్చారు. తరువాత నుంచి సీన్ మారిపోయింది. ఆ ఫిర్యాదు రాజకీయ ఒత్తిళ్ళతో చేసింది, వీడియోకి కంప్లైంట్ కి సంబంధం లేకుండా ఉంది, అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభిప్రాయం తీసుకున్నారు. మి-స్టే-క్ ఆ-ఫ్ ఫ్యా-క్ట్ అంటూ కేసుని తేల్చేసారు. ఇదే విషయం చెప్పి, నందిగామ ఇన్స్పెక్టర్ డీఎస్పీకి లేఖ రాసారు. జగన్ ఎవరినీ ఏమి అనలేదు అని, అధికారుల పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కేవలం డ్రైవర్ మద్యం తాగారా లేదా ని తెలుసుకోవటానికే వచ్చారని రాసారు. డీఎస్పీ కూడా అనుమతి ఇవ్వటంతో, ఇదే విషయాన్ని ఆగష్టు 28న కోర్టుకు చెప్పి, కేసు క్లోజ్ చేసారు. మరి ఆ రోజు నిజంగా జగన్ మంచి ఉద్దేశంతోనే చేసారా అంటే, ఏమో, ఇక అధికారులు చెప్పిన తరువాత ఏమి చేస్తాం. 

Advertisements

Latest Articles

Most Read