ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని, హైకోర్టు అభిప్రాయ పడింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించటం లేదని, ఈ నేపధ్యంలో రోజు వారీ కార్యక్రమాలు చేయటంలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి, ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టుని ఆశ్రయించింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చెయ్యల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలు చేయటంతో, ఆ కౌంటర్ ని పరిశీలించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ తీరు పైన తీవ్ర స్థాయిలో మండి పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ గా ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేకపోయినా తొలగించారు. తొలగించిన వ్యక్తిని న్యాయబద్ధంగా మళ్ళీ హైకోర్టు తిరిగి పదవిలో పెట్టింది. అలా తిరిగి పదవిలోకి వచ్చిన వ్యక్తిని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సహకరించటం లేదని, హైకోర్టు చాలా స్పష్టంగా వ్యాఖ్యానించింది. ఈ వైఖరి సరి కాదని హైకోర్టు చెప్పింది. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని, కానీ రాజ్యాంగ బద్ధ సంస్థలు మాత్రమే అలాగే ఉంటాయని, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అలాంటిదే అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ రాజ్యాంగబద్ధ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉంటుందని, రాజ్యాంగాబద్ధ సంస్థలను కాపడుకున్నప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందనే విషయం గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు హితవు పలికింది.

kanakaraj 03112020 2

ఇక ఎన్నికల కమిషన్ కు సంబంధించి, తమ అవసరాలు ఏమిటి అనేవి సమగ్రమైన నివేదికను, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని, ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో నిమ్మగడ్డను తొలగించి , రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన జస్టిస్ కనకరాజ్ అని వ్యక్తి పై కూడా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ కనకరాజ్ కు సంబంధించి, ఆయన తరుపున చేసిన న్యాయ ఖర్చు కానీ, ఇతర లీగల్ ఖర్చు కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి చెల్లింపులు జరపకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ, ఎలక్షన్ కమిషన్ ఈ విషయం పై ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. తన న్యాయ పరమైన హక్కుల కోసం జస్టిస్ కనకరాజ్ చేసిన ఖర్చులు, అలాగే ఆయన నివాసానికి ఇతర ఖర్చులకు, అతని వ్యక్తిగతమైనవిగా భావించాలని, దీనికి ఎన్నికల కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదని, హైకోర్ట్ తెలిపింది. వీటి అన్నిటి పై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో జస్టిస్ కనకరాజ్ ఎన్నికల కమీషనర్ హోదాలో చూపిస్తున్న ఖర్చులు ఏమి, రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి చెల్లించాల్సిన పని ఉండదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో, ఈ తరానికి గుర్తుండిపోయేది, కళ్ళ ముందు ఇప్పటికీ కనిపిస్తూ ఉండేది, రాష్ట్ర విభజన నాటి పరిణామాలు, దాని తరువాత వచ్చిన విభజన హామీలు, పార్లమెంట్, రాజ్యసభలో చర్చ, ఆ తరువాత బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాకు పాతర వేయటం, ఇప్పుడు పోలవరం, అమరావతి కూడా ఆగిపోయే పరిస్థితి రావటం. ఈ మొత్తం అంశాలను దగ్గరుండి, మొదటి నుంచి సాక్షి మాత్రమే కాకుండా, ఒక విధంగా బాధ్యతగల స్థానంలో ఉన్న 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ , ఈ మొత్తం వ్యవహారం పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్‌కే సింగ్‌ పోర్ర్టెయిట్స్‌ ఆఫ్‌ పవర్‌ అనే ఒక పుస్తకం రాసారు. ఈ పుస్తకంలో అనేక అనేక అంశాలు ప్రస్తావించారు. అందులో మన రాష్ట్రానికి సంబందించిన అంశాలు, రాష్ట్ర విభజన నాటి పరిణామాలు, ప్రత్యేక హోదా. ఎన్‌కే సింగ్ తన పుస్తకంలో విభజన నాటి అంశాలు ప్రస్తావిస్తూ, అప్పట్లో తాను రాజ్యసభ సభ్యుడిగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, విభజన బిల్లు పాస్ అయ్యే సమయంలో, ఎంతో భావేద్వాగానికి గురైన అంశాలను గుర్తు చేసారు. అయితే ఆ సమయంలో రాష్ట్ర విభజన బిల్లు, ఫైనాన్షియల్‌ మెమోరాండం లేకుండా ప్రవేశ పెట్టారని, ఇది సరైన పద్దతి కాదని అప్పుడే అనుకున్నామని అన్నారు. ఈ విభజన బిల్లు పెట్టటమే ఒక విచిత్రమైన అంశం అని అన్నారు. అయితే ఆ సమయంలో వెంకయ్య నాయుడు చాలా చొరవ తీసుకుని, ప్రతి అంశం పై పరిశీలించి, తన వాదనలు వినిపించారని, గుర్తు చేసారు.

nksingh 02112020 2

ఇక ప్రత్యేక హోదా గురించి కూడా అయన అనేక వ్యాఖ్యలు చేసారు. ఆనాటి ప్రధాని రాజ్యసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించారని చెప్పుకొచ్చారు. అయితే, తదనంతర పరిణామాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యెక హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెప్పిందని, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగానే, ఆయన బీజేపీ నుంచి దూరం అయ్యి, ఎన్డీఏ నుంచి తప్పుకున్నారని అన్నారు. తన సొంత రాష్ట్రం బీహార్ కూడా ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా కోరుకుంటున్నా, ఇప్పటికీ ఆ కల నెరవేరలేదని అన్నారు. బీహార్ కు ప్రత్యెక హోదా వచ్చే అవకాశాలు లేవని, కేంద్ర ప్రభుత్వాలు చెప్తూ వస్తున్నాయని అన్నారు. ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అది కేంద్రం ఇష్టం అని, 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వద్దు అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కానీ, 14వ ఆర్ధిక సంఘం ఎక్కడా ఆ మాట చెప్పలేదని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రత్యేక హోదా అనేది ప్రజల మనసుల్లో ఉంటూనే ఉందని, ఆ హామీ ప్రజలకు గుర్తుందని, అందుకే ఇప్పటికీ రాజకీయ నాయకులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారని అన్నారు. ఆ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, సుప్రీం కోర్టులో వాదించే అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‍, బీజేపీ నేత, న్యాయవాది అయిన అశ్వినీ ఉపాధ్యాయకు , జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం పై సంచలన లేఖ రాసారు. ఆ లేఖలో స్పష్టంగా జగన్ మోహన్ రెడ్డి చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు రాసిన లేఖ, అదే విధంగా ఆ లేఖను తరువాత మీడియాకు ఇచ్చి, బహిర్గతం చేయటం, కచ్చితంగా ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది అని తెలిపారు. అంతె కాకుండా, ఈ లేఖ బయటకు విడుదల చేసిన సమయం చూస్తే అనేక అనుమానాలకు తావు ఇచ్చే విధంగా ఉందని ఆయన లేఖలో తెలిపారు. సుప్రీం కోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, ఏదైతే ప్రజాప్రతినిధుల పై ఉన్నటు వంటి కేసులు పై త్వరతిగతిన విచారణ జరపాలి అంటూ, ఆదేశాలు జరీ చేసినటు వంటి నేపధ్యంలో, జగన్ ఈ లేఖ రాయటం, దాన్ని బహిర్గతం చేయటం అనుమానాస్పదంగా ఉందని అన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ, 16.9.2020న ఈ యొక్క ప్రజా ప్రతినిధులకు సంబందించిన తీర్పు ఇస్తే, ఆ తరువాత 6.10.2020లో జగన్ మోహన్ రెడ్డి, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు లేఖ రాయటం, ఆ తరువాత ఆయన ప్రధాన సలహాదారు అయిన అజయ్ కల్లం రెడ్డి, 10.10.2020లో ఈ లేఖను బహిర్గతం చేస్తూ విలేఖరుల సమావేశం పెట్టటం, ఇవన్నీ చూస్తుంటే, కచితంగా అనుమానాలకు దారి తీస్తున్నాయని అన్నారు.

attorney general 02112020 2

ప్రైమాఫసి కింద అంటే ప్రాధమిక ఆధారాల కింద చుస్తే, ఇవన్నీ కూడా కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని అన్నారు. అయినా కూడా ఇవన్నీ చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా దృష్టిలో ఉన్నాయని, ఆయనకు కూడా ఈ లేఖ వచ్చింది, అలాగే మీడియాకు విడుదల చేసిన విషయం తెలుసు కాబట్టి, దీని పై నేను ప్రత్యేకంగా కోర్టు ధిక్కారణ కింద కేసు పెట్టాలని అనుమతి ఇవ్వాల్సిన పని లేదు అంటూ ఈ లేఖలో స్పష్టం చేసారు. అశ్వినీ ఉపాధ్యాయ అనే వ్యక్తి , బీజేపీ నేత సీనియర్ లాయర్. ప్రజాప్రతినిధులలో నేర చరిత్ర ఉన్న వ్యక్తుల పై ఆయన గత కొంత కాలంగా పోరాటం చేస్తున్నారు. ఆయనే జగన్ రాసిన లేఖ, దాన్ని బహిరంగ పరచటం పై, కోర్టు ధిక్కారణ కింద కేసు నమోదు చేయటానికి అనుమతి ఇవ్వాలి అంటూ, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‍కు గతంలో లేఖ రాసారు. ఆ లేఖకు , అటార్నీ జనరల్ స్పందించి, ఈ వ్యాఖ్యలు చేసారు. అలాగే ఈ లేఖలో జగన్ పై ఉన్న 31 కేసులు అంశాన్ని కూడా సుప్రీం కోర్టు అటార్నీ జనరల్ ప్రస్తావించారు. సుప్రీం కోర్టు అటార్నీ జనరల్ అంటే కేంద్రం తరుపున, సుప్రీంలో వాదిస్తారు. ఆయన కూడా, ఇలా రాయటం చూస్తుంటే, కేంద్రం కూడా ఈ విషయంలో, ఏమి చేయలేదనే సంకేతాలు వస్తున్నాయి.

జగన మోహన్ రెడ్డి బాబాయ్, వై-ఎస్ వి-వే-క హ-త్య కేసును, హైకోర్టు ఆదేశాల ప్రకారం సిబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. వై-ఎస్ వి-వే-క కూతురు సునీత, తమకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పై నమ్మకం లేదు అంటూ, ఒక 15 మంది అనుమానితుల పేర్లు చెప్పి, హైకోర్టులో అఫిడవిట్ వేసింది. అయితే ఎన్నికల ముందు వరకు సిబిఐ విచారణ కావాలని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, తరువాత ఆ పిటీషన్ ను వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తరువాత, హైకోర్టు ఈ కేసు సిబిఐకి ఇస్తూ నిర్ణయం తీసుకోవటం, సిబిఐ మొదటి విడతగా దాదాపుగా 20 రోజులు పులివెందులలో విచారణ చేయటం, చాలా మంది అనుమానితులతో విచరణ జరపటం తెలిసిందే. రెండు దఫా విచారణ మొదలైన తరువాత, సిబిఐ టీంలో వారికి వైరస్ సోకటంతో, విచారణ స్లో అయ్యింది. మళ్ళీ విచారణ మొదలు పెట్టిన సిబిఐ, విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే సిబిఐ ఈ రోజు మరోసారి హైకోర్టు తలుపులు తట్టింది. ఈ కేసుకు సంబంధించి, తమ వద్ద ఉన్న పూర్తి వివరాలు తమకు ఇవ్వాల్సిందిగా, పులివెందుల మేజిస్ట్రేట్ ను సిబిఐ కోరింది. ముఖ్యంగా కీలకమైన పోస్ట్ మార్టం రిపోర్టు, ఫోరన్సిక్ రిపోర్ట్, ఆ నాటి పోలీస్ రిపోర్ట్ లాంటివి విచారణలో కీలకం అవుతాయి కాబట్టి, ఆ వివరాలు ఇవ్వాల్సిందిగా సిబిఐ పులివెందుల మేజిస్ట్రేట్ ను కోరింది.

cbi 02112020 2

అయితే తమకు ఉన్నత న్యాయస్థానం నుంచి కానీ, ఎవరి నుంచి కూడా, ఈ వివరాలు అన్నీ సిబిఐకి ఇవ్వాల్సిందిగా ఎలాంటి ఆదేశాలు లేవని, అందుకే ఇవి సిబిఐకి ఇవ్వటం కుదరదు అని పులివెందుల మేజిస్ట్రేట్, ఆ రిపోర్ట్ లు అన్నీ సిబిఐకి ఇవ్వటానికి నిరాకించారు. దీంతో, సిబిఐ ఈ విషయం పై, హైకోర్టు తలుపులు తట్టింది. పులివెందుల మేజిస్ట్రేట్ నుంచి తమకు ఈ రిపోర్ట్ లు అన్నీ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని, ఈ రిపోర్టులు ఇవ్వకపోవటం వల్ల తమ విచారణకు ఆటంకం కలుగుతుందని, సిబిఐ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణకు రాగా, సంబధిత న్యాయమూర్తి ఈ రోజు సెలవులో ఉండటంతో, ఈ కేసు వచ్చే వారానికి వాయిదా పడింది. అయితే వచ్చే వారం ఈ పిటీషన్ పై హైకోర్టు ఆదేశాలు ఇస్తుందా, లేక కౌంటర్ దాఖలు చేయమని కోరుతుందా అనే విషయం పై ఆసక్తి నెలకొంది. విచారణ అధికారులకు సమాచారం ఇవ్వాలి కాబట్టి, కోర్టుని మొత్తం రికార్డులు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చే అవకాశాలే ఎక్కవు ఉన్నయని అంటున్నారు. ఇప్పటి వరకు విచారణకు సంబంధించి, సిబిఐ అధికారులు ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసారు.

Advertisements

Latest Articles

Most Read