ఈ రోజు రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ముందు, మాజీ జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటీషన్ పై విచారణ జరిగింది. హైకోర్టుని కంటైంన్మేంట్ జోన్ గా ప్రకటించాలని, అలాగే రిజిస్టార్ జెనెరల్ మృతి పై దర్యాప్తు జరగాలని, దాఖలు అయిన పిటీషన్ పై, పోయిన వారం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి, పిటీషన్ తరుపు న్యాయవాది కౌంటర్ ఫైల్ చేసేలా, ఈ రోజుకి వాయిదా వేసారు. అయితే ఈ రోజు పిటీషనర్ తరుపు వాదనలు వినిపిస్తూ, జడ్జి రామకృష్ణ ప్రతి రోజు మీడియా ముందు పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారని, ఈ పిటీషన్ కు విచారణ అర్హత లేదని, ఈ వివాదంతో రామకృష్ణతో ఎటువంటి సంబంధం లేదని, అందుకే రామకృష్ణ ఇంప్లీడ్ పిటీషన్ అనుమతి ఇవ్వద్దు అని వాదించారు. ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం, జస్టిస్ ఈశ్వరయ్య కలిపి కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు, ఈ వ్యవహారంతో, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. జడ్జి రామకృష్ణ సస్పెండ్ అయ్యారని, సర్వీస్ రూల్స్ ప్రకారం, మీడియా ముందుకు రాకూడదని వాదించారు.

అలాగే కేంద్రం తరుపు న్యాయవాది, అసలు మాకు ఈ పిటీషన్ తో సంబంధం లేదని వాదనలు వినిపించారు. ఇక రామకృష్ణ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఈ మొత్తం వ్యవహారంలో హైకోర్టు పేరుని దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారని, మాజీ న్యాయముర్తి ఈశ్వరయ్య, ప్రభుత్వం కలిసి కుట్ర చేస్తున్నాయని, దీనికి సంబందించిన ఆడియో టేప్ లు కూడా తమ దగ్గర ఉన్నాయని, అందుకే తాము ఈ పిటీషన్ లో ఇంప్లీడ్ అవ్వాలని అనుకుంటున్నామని అన్నారు. న్యాయవస్థ పేరును కాపాడటానికే, తాము ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అలాగే ఈ మొత్తం వ్యవహారం పై, ఈశ్వరయ్య కుట్ర పై, సుప్రీం కోర్టు, లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. తమకు ఈశ్వరయ్య చేస్తున్న కుట్రను చేదించేందుకే, ఈ ఇంప్లీడ్ పిటీషన్ వేశామని అన్నారు. అందుకే తమ ఇంప్లీడ్ పిటీషన్ ను అనుమతించాలని, హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. దీని పై తీర్పుని హైకోర్టు వాయిదా వేసింది.

విషయం కోర్టులో ఉన్న సరే, ఆంధ్రప్రదేశ్ లో మూడు ముక్కుల రాజధానికి అన్నిటికీ మించి వైజాగ్ వెళ్ళిపోవటానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుంది. ఈ నెల 16న రాజధానుల నిర్మాణానికి శంకుస్థావన కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చాయి. అమరావతిని వదిలేసి, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ భావిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించింది. ఇటీవల ఈ బిల్లుతో పాటు సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. ఆ వెంటనే రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై ఇప్పటికే అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించగా, స్టేటస్ కో ఇస్తూ, మధ్యాంతర ఉత్తర్వులను ఇచ్చింది. రాష్ట్రంలో మధ్యాంతర ఉత్తర్వులు ఇచ్చేనాటికి ఏ పరిస్థితి ఉందొ అవే వరిస్థితులుండాలని ఆదేశించింది.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ను ప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి విశాఖలో ఈ నెల 16న శంకుస్థావన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ కార్య క్రమానికి ప్రత్యక్షంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గాని పాల్గొనివలసిందిగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీని ఆహ్వనించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మోడీ అపాయింట్మెంట్ కోరారని సమాచారం. ఈ విషయమై ప్రధాని కార్యా లయ నంయుక్త కార్యదర్శి వి.శేషాద్రికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఇటీవల లేఖ రాసినట్లు తెలిసింది. ఆ లేఖ ప్రతిని ప్రధాని కార్యాలయ ఓఎస్టీ నంజయ్, ఆర్. భవసర్ కి పంపారు. సీఎంవో కార్యాలయం నుంచి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ రాసిన లేఖను అనుసరించి మూడు రాజధానులకు శంకుస్థావనకు ముహర్తం ఖరారయినట్లు కథనాలు ప్రచారంలోన్నాయి. అయితే ఇప్పటికే అమరావతి శంకుస్థాపన చేసి ప్రధాని, దాన్ని తరలించుకుని పోతుంటే, మౌనంగా ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ప్రధాని ఏమి చేస్తారో ?

రెండు రోజుల క్రితం, ఏబీఎన్ ఛానల్ లో రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య ఆడియో టేప్ ఒకటి ప్రసారం అయిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా మేజిస్ట్రేట్ రామకృష్ణ వ్యవహారంలో, ఈ సంఘటన జరిగింది. ఆ ఛానల్ ప్రసారం చేసిన ఫోన్ సంబాషణలో, ఈశ్వరయ్య ఢిల్లీ జడ్జిల సంగతి చూస్తా అని చెప్పటం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ పై చర్యలు తీసుకోవాలని నేనే లెటర్ రాసాను అని చెప్పటం, అలాగే నిన్ను జగన్ దగ్గరకు తీసుకువెళ్ళి విషయం చూస్తాను అని చెప్పటం, అలాగే మరొక జడ్జిని తిట్టటం లాంటివి వినిపించాయి. అయితే ఆ రోజు ఏబీఎన్ ఛానెల్ ఫోన్ చేస్తే, రామకృష్ణ ఎవరో నాకు తెలియదు, ఆ ఆడియో నాది కాదు అని ఈశ్వరయ్య చెప్పారు. అయితే రెండు రోజుల తరువాత, జస్టిస్ ఈశ్వరయ్య ఈ విషయం పై ప్రెస్ మీట్ పెట్టి, తన పై తిరుగుతున్న ఆడియో టేప్ గురించి, తన పై వస్తున్న వార్తలు గురించి వివరించే ప్రయత్నం చేసారు. ముందుగా ఆయన మాట్లాడుతూ, రామకృష్ణతో జరిగిన ఫోన్ సంభాషణ నిజమే అని ఒప్పుకున్నారు.

అయితే అందులో కొన్ని టాంపరింగ్ చేసి పెట్టారని, ఆయన చెప్పుకొచ్చారు. టాంపెరింగ్ అంటే మిమిక్రీ చేసారా అనే విలేకరులు అడగగా, అవి తనకు తెలియదు అని, ఆడియోలో టాంపరింగ్ అయితే చేసారని, తాను రామకృష్ణతో మాట్లాడింది నిజం అని అన్నారు. అయితే తనకు ఏదో సహాయం చేద్దాం అనే ఉద్దేశం ఉంది తప్ప, తనకు ఎలాంటి ఆలోచనలు లేవని, మీడియా కూడా ఆ దృష్టిలోనే చూడాలని అన్నారు. తాను బీసిల కోసం పోరాటం చేసే వ్యక్తిని అని చెప్పారు. అయితే ఈ సందర్భంలో ఒక విలేఖరి, మరి ఈ ప్రభుత్వంలో అన్నీ ఒకే సామాజికవర్గానికి ఇస్తుంటే ఎందుకు ప్రశ్నించటం లేదు అని అడగగా, ఆ విషయం పై తాను మాట్లాడను అని, ఈ రోజు ఈ విషయం పై మాత్రమే మాట్లాడుతా అని చెప్పి తప్పించుకున్నారు. అలాగే హైకోర్టు సిజే పై రాసిన లేఖ గురించి ప్రశ్నించగా, ఆ విషయం కోర్టులో ఉంది కాబట్టి, అక్కడే మాట్లాడతా అని అన్నారు. మాటిమాటికి బీసిలను ఎందుకు ఇందులోకి తెస్తున్నారు, ఇది మీ వ్యక్తిగత ఫోన్ సంభాషణ కదా అని అడగగా, ఆయన కొన్ని ప్రశ్నలకు ఇబ్బంది పడి, విలేఖరులు సమావేశం అర్ధంతరంగా ముగించి వెళ్ళిపోయారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ వైఖరి ఏమో కానీ, ఏ స్టాండ్ తీసుకోవాలో అర్ధం కాక, ఇదేమి స్టాండ్ అంటూ ప్రశ్నిస్తున్న వారిని వరుస పెట్టి సస్పెండ్ చేసి పడేస్తున్నారు, కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు. గతంలో కన్నా లక్ష్మీ నారాయణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అమరావతి ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ, జగన్ మోహన్ రెడ్డిని ఆపుతుంది అనే నమ్మకం ఉండేది. కానీ సోము వీర్రాజు అధ్యక్షడు అయిన తరువాత, అందరికీ ఆ ఆశలు పోయాయి. దీనికి కారణం లేకపోలేదు. ఒకటి అందరికీ తెలిసిన విషయం, సోము వీర్రాజు జగన్ కు అనుకూలం, చంద్రబాబుకి వ్యతిరేకం. ఆయన మాట్లాడే మాటలు ఇప్పటికే అలాగే ఉంటాయి. రెండోది గవర్నర్ ద్వారా బీజేపీ ఆడిస్తున్న ఆట. వీటి అన్నిటి నేపధ్యంలో, బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించటం. ఒకరు ఏమో, అమరావతికి బీజేపీ అనుకూలం, మూడు రాజధానులు ఎట్టి పరిస్థితిలోనూ మేము ఒప్పుకోం, కేంద్రం జోక్యం చేసుకునే సమయంలో జోక్యం చేసుకుంటుంది అంటారు.

మరొకరు అసలు కేంద్రానికి ఏమి సంబంధం, కేంద్రం జోక్యం చేసుకోదు అంటారు. మరొకరు అమరావతి రైతులకు అన్యాయం జరగకూడదు, మేము పోరాడతాం, కానీ రాయలసీమలో రాజధాని రావాలి అంటారు. ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. దీంతో బీజేపీలోని నేతలు కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే, ఇదేమి విధానం మనకు ఒక విధానం లేదా అనే వాళ్ళని, సస్పెండ్ చేసి పడేస్తున్నారు సోము వీర్రాజు. మొన్న ఓవీ రమణ, అమరావతి పై బీజేపీ వైఖరి అర్ధం కావటం లేదు అన్నారని, అతన్ని సస్పెండ్ చేసారు. ఈ రోజు, వెలగపూడి గోపాలకృష్ణ‌ను సోము వీర్రాజు సస్పెండ్ చేసారు. నిన్న అమరావతి రైతుల వద్దకు వెళ్లి, అమరావతి రైతుల కోసం, బీజేపీ ఏమి చెయ్యలేక పోతుంది, క్షమించండి అంటూ చెప్పుతో కొట్టుకున్నారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేసారు సోము వీర్రాజు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అయితే వస్తుంది, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న జీవీఎల్ ని ఎందుకు సస్పెండ్ చెయ్యటం లేదు ? అసలకే 0.6 శాతం ఓట్లు వచ్చిన పార్టీ, ఇలా సస్పెండ్ చేసుకుంటే పోయే బదులు, బీజేపీ ఒక విధానంతో, ముందుకు రావచ్చుగా ?

Advertisements

Latest Articles

Most Read