టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తయిన ఇళ్లను 13నెలలైనా పేదలకు స్వాధీనం చేయకుండా వైసిపి వేధించడం గర్హనీయం. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా మోకాలడ్డడాన్ని ఖండిస్తున్నాం. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వర్ట్యువల్ యాజిటేషన్స్ తో అయినా వైసిపి ప్రభుత్వం కళ్లు తెరవాలి. వెంటనే లబ్దిదారులకు ఇళ్లు స్వాధీనం చేయాలి, పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలి. టిడిపి 5ఏళ్ల పాలనలో రూ50వేల కోట్లతో 25.57లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ‘‘హవుసింగ్ ఫర్ ఆల్’’ పథకాన్ని సద్వినియోగం చేసింది. పట్టణాల్లో 6లక్షల ఇళ్లు, గ్రామాల్లో 19.57లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. కట్టిన ఇళ్ళ జియో ట్యాగింగ్ లో, ఆధార్ సీడింగ్ ద్వారా చెల్లింపుల్లో, దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచింది. గ్రామాల్లో రూ 12,145కోట్లతో 9,94,222 ఇళ్ళ నిర్మాణం పూర్తి చేశాం. లక్షలాది ఇళ్లకు ‘‘సామూహిక గృహ ప్రవేశాలు’’ జరపడం దేశానికే నమూనా అయ్యింది. దసరా పండుగ సందర్భంగా 2లక్షల ఇళ్లు, సంక్రాంతికి 4లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు జరిపారు. ‘‘పేదల పండుగ’’లాగా ఇళ్ళ నిర్మాణం టిడిపి హయాంలో చేపట్టాం. 101 పట్టణాలు, నగరాల్లో అఫర్డబుల్ హవుసింగ్ ప్రోగ్రామ్(ఎహెచ్ పి) కింద 5.24లక్షల ఇళ్లు, బెనిఫిసియరీ లెడ్ కనస్ట్రక్షన్(బిఎల్ సి) కింద 2లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం.

గ్రామీణప్రాంతాల్లో 4రెట్లు, పట్టణాల్లో 7రెట్లు యూనిట్ కాస్ట్ పెంచాం. గ్రామాల్లో యూనిట్ కాస్ట్ రూ70వేల నుంచి రూ 2,90,000కు పెంచాం. 2017-18లో 3లక్షల ఇళ్లు, 2018-19లో 3,30,000 ఇళ్లు నిర్మించాం. రూ1,174కోట్లతో 9,10,000 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేశాం. 13నెలల వైసిపి పాలనలో 13జిల్లాలలో హవుసింగ్ కార్యక్రమాలన్నీ నిలిపేయడం బాధాకరం. టిడిపి నిర్మించిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలకు ఇవ్వడంపై ఆ కేంద్రాల్లో ఉన్నవాళ్లే, టిడిపి ఇంతబాగా ఇళ్లు నిర్మించిందంటూ సెల్ఫీ వీడియోలు తీసి మీడియాకు పంపడం తెలిసిందే. వైసిపి మేనిఫెస్టోలో 5ఏళ్లలో 25లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఏడాదికి 5లక్షల ఇళ్లు నిర్మించాల్సి వుండగా అందులో పదోవంతు కూడా కట్టలేదు. తొలి ఏడాది హవుసింగ్ బడ్జెట్ రూ3,617కోట్లలో ఖర్చు చేసింది అతి స్వల్పం. రెండవ ఏడాది బడ్జెట్ రూ 3,691 కోట్లలో పదో వంతు కూడా ఖర్చు చేస్తారన్న నమ్మకం లేదు. ఉచితంగా ఇళ్లు అందజేస్తామని జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని గాలికి వదిలేశారు. ఈ 13నెలల్లో ఎంతమందికి ఉచితంగా ఇళ్లు అందజేశారు..? పట్టణాల్లో ఉచిత ఇళ్లు ఇస్తామన్న హామీలో భాగంగా ఎంతమంది టిడ్కో లబ్దిదారుల డిపాజిట్లు వెనక్కి ఇచ్చారు..?

ఇళ్ల నిర్మాణం గాలికి వదిలేశారు, ఇళ్లస్థలాల్లో భారీ స్కామ్ లకు పాల్పడ్డారు. ప్రతి నియోజకవర్గంలో రూ వందల కోట్ల కుంభకోణాలు చేశారు. ఎకరం రూ5లక్షలు పలికే భూమిని రూ 50లక్షలకు ప్రభుత్వంతో కొనిపించి, ఆ మొత్తాన్ని వైసిపి నాయకులే జేబుల్లో వేసుకున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో, పల్లపు భూముల్లో, స్మశానంలో, అడవుల్లో ఇళ్లస్థలాలు ఇవ్వడమేంటని ప్రజలే నిలదీస్తున్నారు. ఊరికి దూరంగా స్థలాల్లో ఇళ్లు ఎలా కట్టుకుంటామని నిగ్గదీస్తున్నారు. మడ అడవుల్లో ఎవరైనా ఇళ్లు కట్టుకుంటారా..? 16అడుగుల పల్లపు ప్రాంతం ఆవభూముల్లో ఇళ్లు ఎవరైనా కడతారా..? తూర్పు గోదావరి జిల్లా ఆవభూముల్లోనే రూ400కోట్ల స్కామ్ చేశారు. ఎకరం రూ7లక్షల విలువైన భూమిని రూ70లక్షలకు కొనిపించారు. పల్లపు భూములు మెరకపేరుతో మళ్లీ ప్రజాధనం దుర్వినియోగం చేశారు. మెరకలోనే రూ1,560కోట్ల కుంభకోణం చేశారు. ఇంటి పట్టా కావాలంటే రూ 30వేలు, రూ60వేలు, రూ లక్షా 10వేలు ఇవ్వాలంటూ, దూరాన్ని బట్టి బలవంతపు వసూళ్లకు వైసిపి నాయకులు తెగబడ్డారు. ఇళ్ల స్థలాల కొనుగోళ్లకు విడుదల చేసిన రూ8వేల కోట్లలో రూ5వేల కోట్లు స్వాహా చేశారు. టిడిపి హయాంలో కట్టిన ఇళ్లు పేదలకు స్వాధీనం చేయకుండా, పెండింగ్ బిల్లులు లబ్దిదారులకు చెల్లించకుండా, వైసిపి నాయకుల జేబులు నింపేందుకే ‘‘సెంటు పట్టాల’’ పేరుతో ఇళ్లస్థలాల అవినీతి కుంభకోణాలకు తెరదీశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి నిర్మాణం పూర్తయిన ఇళ్లను పేదల స్వాధీనం చేయాలి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించి, మిగిలిన ఇళ్లు కూడా శరవేగంగా పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు, శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత

రాష్ట్రంలో క-రో-నా కట్టులు తెంచు కుంటోంది. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఈ రోజు అందిన సమాచారాన్ని అనుసరించి క-రో-నా పాజిటివ్ కేసులు ఏపిలో 1,322 ఒక్క రోజు వ్యవధిలో నమోదయ్యాయి. అమ్మో క-రో-నా అనే రీతిలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యగా రోజుకో రికార్డు అన్నట్లుగా పెరిగిపోతుంది. ఇదే రీతిలో రాష్ట్రంలో క-రో-నా పాజిటివ్ మరణాలు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రం లో కరోనా ప్రభావంతో మృతి చెందిన వారి సంఖ్య మొత్తంగా 239 కి చేరుకుంది. ఈ రోజు ఉదయానికి రాష్ట్రంలో కొత్తగా స్థానికంగా ఉన్నవారిలోను, పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారితో కలిపి 1,322 మంది కొత్తగా పాజిటివ్ లక్షణాలు గుర్తించారు. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటినను అనుసరించి రాష్ట్రంలో ఇప్పటివరకు 20 వేల 19 మందిలో వైరస్ పాజిటివ్ కేసులు గుర్తించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,322 క-రో-నా పాజిటివ్ కేసులను గుర్తించారు.

వాటిలో రాష్ట్రంలో స్థానికంగా ఉండే వారిలో 1263 మందిలో పాజిటివ్ కేసులు గుర్తించారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 56 మందిలో, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరిలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 3 గుర్తించారు. రాష్ట్రంలో నివాసముంటున్న వారిలో కొత్తగా గుర్తించిన పాజిటివ్ కేసుల్లో అనంతపురంలో 142, చిత్తూరులో 120, తూర్పు గోదావరి జిల్లాలో 171, గుంటూరులో 197, కడపలో 96, కృష్ణాలో 55, కర్నూలులో 136, నెల్లూరులో 41, ప్రకాశంలో 38, శ్రీకాకుళంలో 36, విశాఖపట్టణంలో 101, విజయనగరంలో 24, పశ్చిమ గోదావరిలో 106 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని స్థానికుల్లో మొత్తంగా 17,365 మందిలో పాజిటివ్ కేసులు గుర్తించారు.

108 అంబులెన్స్ ల కుంభకోణం గురించి, మొదటిగా బయట పెట్టింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ. ఆయన లేఖ రాస్తూ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయంలో కుదుర్చుకున్న ఒప్పందంలో, అంబులెన్స్ ల నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంది, అయినా ఆ ఒప్పందం ఇంకా అమలులో ఉండగానే, వాళ్ళని కాదని, ఇప్పుడు ఎక్కువ రేటుకు అరబిందో ఫౌండేషన్ కి, గతం కంటే, ఎక్కువ రేటుకి ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. అరబిందో ఫౌండేషన్, విజయసాయి రెడ్డి అల్లుడిది కాబట్టి, దీని పై తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఆ లేఖ తరువాత, తెలుగుదేశం పార్టీ దీన్ని మరింత ముందుకు తీసుకు వెళ్ళింది. టిడిపి నేత పట్టాభి మరిన్ని ఆధారాలు చూపించటంతో, 108 స్కాం బయట పడింది. అన్నిటికీ విరుచుకు పడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పటి వరకు దీని పై సమాధానం చెప్పలేక పోయింది. అయితే, ఈ స్కాంని బయట పెట్టిన బీజేపీ ఇప్పుడు మరో బాంబు పేల్చుతూ, రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తుంది.

1088 అంబులెన్స్ ప్రారంభం చేసాం అంటూ, రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేసి, ఊరేగింపు చేసి, రోడ్డు మీద ట్రాఫ్ఫిక్ ఆపేసి, చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడే 108 కనిపెట్టాం అనే విధంగా, వైసీపీ హడావిడి చేసింది. అయితే ఈ 1088 వాహనాలు కొత్తవి కాదనే వాదన కూడా ఉంది. పాట అంబులెన్స్ లకు కూడా కొత్త రంగులు వేసారని, కావాలంటే ఎక్కడైనా పాత రంగులలో అంబులెన్స్ లేవు అంటూ వాదించే వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు బీజేపీ మరో విషయం చెప్తుంది. ఈ వాహనాల కొనుగోలుకు నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్ట్ లో భాగంగా, కేంద్ర ప్రభుత్వం 70 శాతం న్దిహులు ఇచ్చిందని, రాష్ట్ర వాట నామమాత్రం అని బీజేపీ నేతలు చెప్తున్నారు. కేంద్రం డబ్బులు ఇస్తే, అదేదో కుటుంబ వ్యవహారం అన్నట్టు, వైఎస్ఆర్ బొమ్మ కూడా వేసుకున్నారని, కేంద్ర ఇచ్చిన డబ్బులతో కొన్న అంబులెన్స్ ల పై, ప్రధాని బొమ్మ వెయ్యాలని, బీజేపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

సర్వేపల్లి రాధాకృష్ణన్, శంకర్ దయాల్ శర్మ, రామ్ మనోహర్ లోహియా, ఉమేష్ గుప్తా వంటి ఉద్దండుల కూర్చున్న రాజ్యసభలో... ప్రశ్నించే విధంగా జీవితం గడుపుతున్న ఏ2 విజయసాయిరెడ్డి సభ్యునిగా ఉండటం రాష్ర్ట ప్రజల దౌర్బాగ్యమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఆదివారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుడూ.. ఏ2 అంటే విజయసాయిరెడ్డి అని దేశ ప్రజలందరికి తెలుసు. ఆయన తన కంట్లో దూలం ఉంచుకుని ఎదుటి వారి కల్లలో నలకను వెతకటం సిగ్గుచేటు. విజయసాయిరెడ్డి జీవితమే అవినీతి మయం. లాంబ్రెక్టా స్కూటర్ మీద తిరిగే విజయసాయిరెడ్డి జగన్ పంచన చేరి ఏ2 గా రూపాంతరమెత్తాక కోట్లకు పడగలెత్తారు. 11 చార్జిసీట్లతో రూ. 43 వేల కోట్లు ఏ1,ఏ2 మీద సీబీఐ అభియోగం మోపింది. ఈ కేసుల్లో విచారణ పూర్తయితే విజయసాయిరెడ్డి రాజస్యసభలో ఉంటారో, సెంట్రల్ జైళ్లో ఉంటారో ఆయనకే తెలియదు. అలాంటి వ్యక్తి చంద్రబాబును విమర్శించటం సిగ్గుచేటు. చంద్రబాబు ఏం చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారని విజయసాయిరెడ్డి అంటున్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటి, రింగ్ రోడ్డు నిర్మించింది, సైబారాద్ నగరం నిర్మించి వేలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడు కాదా?

బిల్ గేట్స్ ని హైదారాబాద్ కి తీసుకువచ్చి సామాన్య సర్పంచ్ పక్కన కూర్పచోపెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు . తాను రాష్ర్టపతి అవ్వడానికి కారణం చంద్రబాబే అని అబ్దుల్ కలాం తన పుస్తకాల్లో రాశారు. దేశంలో ప్రతిపక్షాలన్నింటి ఏకం చేసింది చంద్రబాబు కాదా? చంద్రబాబు గురించి ప్రశ్నించే నైతిక జీవితమా విజయసాయిరెడ్డిది? విజయసాయిరెడ్డి పుట్టినరోజు సందర్బంగా విశాఖలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలతో రాష్ర్టంలోని ఫించన్ లబ్డిదారులకు ఒక నెల పింఛన్ ఇవ్వొచ్చు. ఏం సేవ చేశారని విజయసాయిరెడ్డికి ప్లెక్సీలు కట్ట్టారో అర్దం కావటం లేదు. సూట్ కేసు కంపెనీలు సృష్టించినందుకు, విశాఖలో స్థలాలు కొట్టేసినందుకా ప్లెక్సీలు కట్టింది. విజయసాయిరెడ్డి విశాఖలో ఒక ప్రత్యేక అవినీతి చరిత్ర సృష్టించుకున్నారు. అంబులెన్స్ కుంభకోణంలో రూ. 307 కోట్లు కొట్టేశారు. దాని గురించి కనీసం ఇక్క ట్వీట్ కూడా విజయసాయిరెడ్డి ఎందుకు చేయలేదు. ఎన్టీఆర్ కి భారతతర్న చంద్రబాబు ఎందుకు ఇప్పించలేకపోయారని విజయసాయిరెడ్డి అంటున్నారు.

కృష్ణా జిల్లాకి ఎన్టీ ఆర్ పేరు పెడతానని గతంలో జగన్ అన్నారు. కానీ ముఖ్యమంత్రి అయి 14 నెలలు గడిచినా పేరెందుకు పెట్టలేదో విజయసాయిరెడ్డి చెప్పాలి? జగన్ కి తెలియకుండా బెంగులూరు లో విజయసాయిరెడ్డి కూడబెట్టిన ఆస్తుల చిట్టా పైల్ సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ కి ఇఛ్చారు. దానికి భయపడి విజయసాయిరెడ్డి ఈ మద్య 25 రోజులు ఎవరకి కనపడకుండా దాక్కున్నారు. జగన్ కేసుల్లో విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారుతారన్న భయంతో జగన్ , తన లెక్కచూపని జగన్ కొట్టేస్తారన్న భయంతో విజయసాయిరెడ్డి ఉన్నారు. విజయసాయిరెడ్డిన మించిన అబద్దాల కోరు. దొంగ ఆడిటర్, ఎవరూ లేరు. విజయసాయిరెడ్డికి చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అలాంటి వ్యక్తి చంద్రబాబును విమర్శించటం సిగ్గుచేటని వర్ల రామయ్య విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు.

Advertisements

Latest Articles

Most Read