ఎన్నో ఏళ్లుగా తన పూర్వీకుల నుంచి నిర్వహిస్తున్న మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులను కాజేయడానికి కుట్ర జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఇటీవల చీకటి జీవోలను తీసుకువచ్చి దొడ్డిదారిన చైర్మను నియమించారని కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ మాజీ చైర్మన్ పూసపాటి అశోకగజపతిరాజు ఆరోపించారు. విజయనగరంలోని తన బంగ్లాలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా నడుస్తున్న విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి, ఆస్తులను కబ్బా చేసేందుకు పన్నుతున్న కుట్రలను ప్రజలు తిప్పి కొట్టడం ఖాయమన్నారు. మాన్సాస్ ట్రస్టు కింద దేశవ్యాప్తంగా 105 ఆలయాలు ఉండగా ప్రస్తుత చైర్మన్ సంచితా తన తండ్రి ఆనంద గజపతిరాజుతో విడిపోయిన 21 ఏళ్లలో ఏ ఒక్క ఆలయం తరుపున పండుగలకు హాజరుకాలేదన్నారు.

తండ్రి బతికి ఉన్నంత వరకూ చూడటానికి రాని వ్యక్తి చనిపోయిన తరువాత వచ్చి మధ్యలోనే వెళ్లిపోయిన సంచిత ఇప్పుడు తండ్రి పేరు చెప్పుకుని మాన్సాస్ చైర్మన్ ఎలా అయ్యారో ఆమె విజ్ఞతకే విడిచిపెట్టామన్నారు. మాన్సాస్ ట్రస్టుకు సంబంధించి కోర్టుకు వెళ్లామని, తమకు ఫేవర్‌గా తీర్పు వచ్చి మళ్లీ తానే మాన్సాస్ చైర్మన్ అవ్వొచ్చునని చెప్పారు. వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని ప్రతిపక్ష నాయకులు, చైర్మనను కోరుతున్నానన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వాడే పదజాలం సోషల్ మీడియాలో విన్నానని, అసహ్యంగా ఉన్న ఆ పదజాలాన్ని తాము మాట్లాడలే మన్నారు. కార్యక్రమంలో టీడీపీ విజయనగరం ఇన్ చార్జి పూసపాటి అదితీ గజపతిరాజు పాల్గొన్నారు.

మీడియా గొంతు నొక్కుతూ, నిరాధార కధనాల పేరుతో, కేసులు పెట్టే అవకాసంతో ఇచ్చిన జీవో 2430 పై, నిన్న ప్రభుత్వం హడావిడిగా ప్రకటన విడుదల చేసింది. ఈ జీవో పై గతంలో హైకోర్ట్ లో కొంత మంది కేసు వేసారు, అయితే తదుపరి విచారణలకు సదరు పార్టీ రాకపోవటంతో, హైకోర్ట్ ఈ కేసులో ప్రభుత్వ తరుపు వాదన మాత్రమే పరిగణలోకి తీసుకుని, కొన్ని సలహాలు ఇస్తూ, కేసును డిస్పోజ్ చేసింది. అయితే మూడు నెలల క్రిందట హైకోర్ట్ ఇచ్చిన ఈ ఆదేశాల పై, తమకు అంకులమైనవి తీసుకుంటూ, ప్రభుత్వం నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. మూడు నెలల క్రిందట ఆదేశాలు ఇచ్చినా, హైకోర్ట్ ప్రతి నిన్న అందింది అని, అందుకే నిన్న ఉత్తర్వులు ఇచ్చినట్టు ప్రభుత్వం చెప్తుంది. జీవతో 2430ని హైకోర్ట్ పరిగణలోకి తీసుకోలేదని, ప్రభుత్వం జీవో ద్వారా అసత్యమైన, నిరాధారమైన వార్త కథనాలపై ఆయా ప్రభుత్వ శాఖలకు చట్టప్రకారం రీజాయిండర్లు విడుదల చేసేందుకు, అవసరమైతే కేసులు నమోదు చేయడానికి హైకోర్ట్ అవకాశం కల్పించింది అంటూ ఆ ప్రకటనలో తెలిపారు.

జీవో నెంబరు 2430 ప్రకారం వార్తా కథనాలు, ప్రసారాల పై ప్రభుత్వం ఎటువంటి చర్యలైనా ఆయా న్యాయస్థానాలు, వాటి పరిధికి లోబడి తగు విచారణ జరిపేందుకు ప్రభుత్వానికి హైకోర్టు స్వేచ్ఛను కల్పించిందని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ జీవో 2430 కేవలం క్రిమినల్ చర్యలకు ఉద్దేశించింది కాదని సమాచార పౌరసంబంధాల శాఖ కార్యదర్శి కోర్టుకు తన ప్రమాణపత్రంలో వివరించారు. దీనిద్వారా సమాచార సేకరణకు అనుమతి నిరాకరించడం, పత్రికా ప్రసారం, ప్రచురణ, పంపిణీ స్వేచ్చలకు భంగం కలిగించే ఉద్దేశం లేదని ప్రభుత్వం కోర్టుకు స్పష్టం చేసింది. నైతిక విలువలతో కూడిన బాధ్యతాయుతమైన వార్తా కథనాల ప్రచురణ కోసమే ఈ జీవో ఉద్దేశించబడిందని కోర్టుకు వివరించారు. ప్రెస్ కౌన్సిల్ నిబంధనల మేరకు వార్తలను ప్రచురించడం సముచితమని హైకోర్ట్ అభిప్రాయ పడింది. అయితే ప్రభుత్వం, తమకు కావలసిందే చెప్పుకుంది అని, కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో చాలా విషయాలు ఉన్నాయని మీడియా వర్గాలు చెప్తున్నాయి.

ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళాల్సి ఉండగా, పర్యటన చివరి నిమిషంలో రద్దు అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి, గన్నవరం వెళ్ళటానికి, ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యారు, ట్రాఫిక్ కూడా క్లియర్ చేసి పెట్టారు, అయితే, లాస్ట్ మినిట్ లో, ఢిల్లీలో అమిత్ షా అపాయింట్మెంట్ రద్దు చెయ్యటంతో, జగన్ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది. అమిత్ షాతో, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి భేటీ కావాల్సి ఉంది. ఈ రోజు రాత్రికి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. అయితే తుఫాను నేపధ్యంలో, అమిత్ షా బిజీ గా ఉంటారని, అందుకే అపాయింట్మెంట్ రద్దు అయ్యిందని, త్వరలోనీ మళ్ళీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి, పిలుస్తామని, హోం శాఖ వర్గాలు చెప్పాయి. అయితే వైసీపీ నేతలు మాత్రం, ఈ పరిణామంతో ఊపిరి పీల్చుకున్నారు. జగన్ ఢిల్లీ వెళ్ళిన తరువాత, ఈ విషయం తెలిసి ఉంటే, పరువు పోయేది అని, ఇప్పటికే రెండు సార్లు, జగన్ ఢిల్లీ వెళ్లి, అమిత్ షా ని కలవకుండా, వెనక్కు తిరిగి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా అలా జరిగితే, ప్రతిపక్షాలు గోల చేసేవి అని, ముందే తెలిసి మంచి పని అయ్యింది అని వైసీపీ భావిస్తుంది.

మరో పక్క, జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ రద్దు అయిన వెంటనే, ఆయన తన నివాసంలో, విజయసాయి రెడ్డి, మంత్రి కొడాలి నాని, అలాగే మరో మంత్రి బాలినేనితో జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలో ఉన్న తన క్యాంప్ ఆఫీస్ లో జగన్ వారితో భేటీ అయ్యారు. ఢిల్లీ టూర్ రద్దు అవ్వగానే, జగన్ వారితో భేటీ కావటం, ఆసక్తిగా మారింది. గంటకు పైగా ఈ సమావేశం జరుగుతుంది. వరుసుగా రాష్ట్ర ప్రభుత్వానికీ తగులుతున్న ఎదురు దెబ్బలు, డాక్టర్ సుధాకర్ కేసు, ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ కేసు, అలాగే రంగులు కేసు పై సుప్రీం కోర్టుకు వెళ్ళటం, అన్ని వైపుల నుంచి వస్తున్న ఇబ్బందులు, ప్రతిపక్షలాకు గట్టిగా బదులు ఇవ్వటం, వంటి అంశాల పి చర్చిస్తున్నారని, ఈ భేటీ అనంతరం, కీలకమైన ప్రెస్ మీట్ కూడా, కొడాలి నాని కాని, విజయసాయి రెడ్డి కాని అడ్డ్రెస్ చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, వరుసుగా కోర్టుల్లో పడుతున్న మొట్టికాయలు చూసి, రాష్ట్ర ప్రభుత్వ లీగల్ టీం పై, ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వానికి, ఈ లీగల్ టీం వల్ల, అన్నీ ఇబ్బందులు వస్తున్నాయి, ఈ లీగల్ టీంలో సరైన సమర్ధత ఉన్న వాళ్ళు లేరని, ఈ రోజు ఒక జాతీయ పత్రికలో కూడా కధనం వచ్చిన నేపధ్యంలో, వైసీపీ పార్టీలో సీనియర్ మంత్రులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే, సుప్రీం కోర్ట్ లో వేసిన ఒక పిటీషన్ విషయంలో, మరోసారి, ఈ లీగల్ టీం డొల్లతనం బయట పడింది. రాష్ట్ర ప్రభుత్వ పరువుతో పాటుగా, రాష్ట్రం పరువు కూడా ఢిల్లీ లెవెల్ లో పోయింది. నిమ్మగడ్డ కేసు విషయం, జగన్ మోహన్ రెడ్డి ఎంత పర్సనల్ గా తీసుకున్నారో అందరికీ తెలిసిందే. డీ అంటే డీ అంటూ, నిమ్మగడ్డ విషయంలో ముందుకు వెళ్తున్నారు. హైకోర్ట్ లో వ్యతిరేక తీర్పు వచ్చినా సరే, సుప్రీం కోర్ట్ లో తేల్చుకుంటాను అంటూ, జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం, హైకోర్టు ఇచ్చిన తీర్పుని, సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేసింది.

అయితే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో, ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ లో అన్నీ తప్పులే ఉన్నాయి. ఆ తప్పులు చూసి, సుప్రీం కోర్టులో ఉన్న లాయర్లు ముక్కున వేలు వేసుకున్నారు. నిమ్మగడ్డ కేసులో వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ లో, వాద, ప్రతి వాదులుగా, రెండు చోట్లా రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టటం పై అందరూ ఆశ్చర్య పోతున్నారు. కనీసం పరిజ్ఞానం కూడా లేదా అని, న్యాయ నిపుణులు, విస్మయం వ్యక్తం చేసారు. దీంతో పిటీషన్ లో తప్పులు ఉన్నాయని తెలుసుకున్న ప్రభుత్వం, పిటీషన్ ను వెనక్కు తీసుకుని, తప్పులు సరి చేసి, మరో పిటీషన్ దాఖలు చెయ్యటానికి రెడీ అయ్యింది. అలాగే దీంతో పాటుగా మరో 3 స్పెషల్ లీవ్ పిటీషన్లు కూడా దాఖలు చెయ్యనున్నారు. అయితే ఈ విషయం జగన్ మోహన్ రెడ్డికి తెలియటంతో, ఆగ్రహం వ్యక్తం చేసారని, తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read