గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీ మహనాడు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా, రాష్ట్రంలో, దేశంలో జరుగుతున్న పరిస్థితులు చర్చించుకుంటూ ముందుకు వెళ్లారు. అయితే ఇదే సందర్భంలో సొంత పార్టీలో జరుగుతున్న విషయాలు, కార్యకర్తల వాయిస్ వినిపించారు ముగ్గురు నేతలు. చంద్రబాబు ముందే అన్ని విషయాలు కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా, పిఆర్. మోహన్, చినరాజప్ప, గౌతు శిరీష, జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలతో అందరూ ఏకీభావించారు. నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, " మనం 2014 నుంచి 2019 వరకు చేసిన అభివృద్ధి చెప్పుకోవటంలో ఫెయిల్ అయ్యాం. పార్టీని బుత్ లెవెల్ వరకు, బలోపేతం చెయ్యాలి అని ఆనాడు చంద్రబాబు గారు చెప్తే, ఎవరూ పట్టించుకోలేదు. ఎంత మంది నేతలు పార్టీని విడిచి వెళ్ళినా క్యాడర్ లాగే ఉంది. వెళ్ళిన వారు అడ్డ్రెస్ లేకుండా పోయారు. కనీస గుర్తింపు లేకుండా పక్కన పడేసారు. ఓడిపోయిన తరువాత టిడిపిలో చాలా మంది నేతలు సైలెంట్ గా ఉన్నారు"

"అలా ఉండటం కరెక్ట్ కాదు. అందరూ కలిసి, పార్టీ పటిష్టతకు పని చెయ్యాలి. చంద్రబాబు గారు ఇవన్నీ గమనించి, పని చేసే వాళ్ళనే గుర్తించాలి. కార్యకర్తల పై పెడుతున్న కేసులను, నాయకులుగా అందరం అండగా నిలవాలి" అని చినరాజప్ప అన్నారు". ఇక జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, " కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా, అప్పుల్లో ఉన్నా, కేసులు పెడుతున్నా అలాగే నిలబడి పోరాడుతున్నారని అన్నారు. ఎవరైనా పార్టీని వీడి వెళ్ళుతున్నారు అంటే, అది మీ నాయకత్వం గుర్తించకే అని, అది తెలిసిన రోజున మళ్ళీ వెనక్కు వస్తారు అని అన్నారు. ఇక గౌతు శిరీష మాట్లాడుతూ, " కార్యకర్తల మాటగా చెప్తున్నా అని :పార్టీని వీడుతున్న నాయకులను మళ్లీ పార్టీలో చేర్చుకోవద్దని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం" అని అన్నారు. మాజీ శాప్ చైర్మెన్ పిఆర్. మోహన్ మాట్లాడుతూ, చంద్రబాబుని ముంచుంది కొంత మంది అధికారులు అంటూ, నలుగురు పేర్లు చెప్పారు. సరైన ఫీడ్ బ్యాక్ ఇవ్వకుండా, కార్యకర్తలని కలవనివ్వకుండా వాళ్ళే మొత్తం చేసారని, చంద్రబాబు ఇలాంటివి గుర్తించి, వారిని దూరం పెట్టాలని అన్నారు.

విశాఖపట్నం డాక్టర్ సుధాకర్, తనకు వైద్యం సరిగ్గా అందటం లేదు అని చెప్పి, రాష్ట్ర హైకోర్ట్ లో ఒక పిటీషన్ దాఖలు చేసారు. ఆయన తరుపు నయ్యవాదులు, ఈ రోజు ఆ పిటీషన్ ని, ఈ రోజు హైకోర్ట్ లో దాఖలు చేసారు. విశాఖపట్నంలో, ప్రస్తుతం ఉన్న మానిసిక వైద్యశాలలో తనకు వైద్యం సరిగ్గా అందటం లేదని, తనకు కోర్ట్ పర్యవేక్షణలో వైద్యం అందించేలా ప్రైవేటు హాస్పిటల్ కు కాని, లేదా ఇతర హాస్పిటల్ కు కాని, తరలించాలని ఆయన ఆ పిటీషన లో తెలిపారు. దీంతో పాటుగా, అక్కడ వైద్యులు ఇచ్చిన, టాబ్లెట్స్ వల్ల తనకు సైడ్ ఎఫెక్ట్స్ రావటంతో పాటుగా, వివిధ రకాల ఇబ్బందులు వస్తున్నాయని ఆయన వివరించారు. డాక్టర్లు ఇస్తున్న టాబ్లెట్లు సంబంధించి, అన్ని వివరాలు ఆయన ఆ పిటీషన్ లో కోర్ట్ కు తెలిపారు. ప్రభుత్వం తన పై కుట్ర పూరితంగా వ్యవహరిస్తుంది అనే అనుమానాన్ని, ఆందోళనను వ్యక్త పరిచారు.

దీంతో పాటుగా తగిన చర్యలు తీసుకోవాలని, రెస్పాండెంట్ గా విశాఖపట్నం పోలీస్ కమీషనర్ తో పాటుగా, ఇతర ఉన్నతాధికారులని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వైద్య ప్రినిసిపల్ సెక్రటరీని, డీజీపీని, విశాఖ మానసిక హాస్పిటల్ సూపర్ ఇంటన్డెంట్ ని ఆయన, ఇందులో చేర్చారు. తాను కోరుకున్న హాస్పిటల్ కు కాని, లేదా కోర్ట్ పర్యవేక్షణలో వేరే హాస్పిటల్ కు కాని , పంపాలని కోరారు. తనకు ఎటువంటి, మానిసిక ఇబ్బంది లేదని, ఆ పిటీషన్ లో పేర్కుంటూ, ఈ టాబ్లెట్స్ వాడటం వలన, తన శరీరంలో వస్తున్న అనేక ఇబ్బందులు, ఎదుర్కుంటున్నానాని, మోతాదుకు మించి, అనవసర టాబ్లెట్స్ ఇస్తున్నారని, కోర్టుకు చెప్తూ, తన బాధ చెప్పుకున్నారు. ఈ పిటీషన్ పై, రేపు విచారణకు వచ్చే అవకాసం ఉంది.

గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, నాకు 25 కి 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యెక హోదా తీసుకువచ్చి, మీ ముందు పెడతా అంటూ మీటింగుల్లో చెప్పారు. ప్రజలు ఆ మాటలు నమ్మారు. మోడీ నుంచి ప్రత్యెక హోదా తీసుకురావటం చంద్రబాబు వల్ల కాలేదు, జగన్ మోహన్ రెడ్డి అయితే, కేంద్రం మెడలు వంచి, ప్రత్యేక హోదా తీసుకు వస్తారని, భావించిన ప్రజలు, 25 కాకపోయినా, 22 ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించారు. అలాగే రాజ్యసభలో కూడా వైసీపీకి బలం బాగానే ఉంది. అయితే, గెలిచిన కొత్తలో, ప్రత్యెక హోదా గురించి మాట్లాడిన జగన్, మళ్ళీ ఏడాది తరువాత, ప్రత్యెక హోదా గురించి మాట్లాడారు. గెలిచిన కొత్తలో, ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి, అమిత్ షాని కలిసిన తరువాత, మీడియా ప్రత్యెక హోదా గురించి అడగగా, కేంద్రాన్ని ఇప్పుడు ప్రత్యెక హోదా గురించి అడిగే అవకాసం లేదు, మనం ప్లీజ్ సార్ ప్లీజ్ మాకు హోదా ఇవ్వండి, అని కేంద్రాన్ని అడగటం తప్ప ఏమి చేయ్యలేం అని జగన్ అన్నారు.

కేంద్రం మెడలు వంచి ప్రత్యెక హోదా తీసుకు వస్తాను అని చెప్పిన జగన్, ప్లీజ్ సార్ ప్లీజ్ అని హోదా గురించి అడుగుతూనే ఉండాలి అని చెప్పటంతో, అందరూ ఆశ్చర్యపోయారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తరువాత ఒక మాట చెప్పి, ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. అయితే అప్పటి నుంచి ప్రత్యెక హోదా విషయం మర్చిపోయారు. మీడియాలో కాని, సోషల్ మీడియాలో కాని, ప్రతిపక్షాలు కాని, గుర్తు చేస్తున్నా, ఏ నాడు దాని గురించి పట్టించుకోలేదు. అయితే, ఈ రోజు మళ్ళీ ప్రత్యెక హోదా పై స్పందించారు. తన పాలన పూర్తీ అయ్యి, ఏడాది అవుతున్న సందర్భంలో, ఈ రోజు జరిగిన సమీక్షలో, ప్రత్యెక హోదా పై స్పందించారు. కేంద్రం ప్రత్యెక హోదా ఇవ్వలేదు, ఇచ్చి ఉంటే ఎన్ని కంపెనీలు వచ్చేవి, కేంద్రానికి ఇప్పుడు మన అవసరం లేదు, అవసరం వస్తుంది, అప్పుడు ఒత్తిడి తెచ్చి హోదా తెస్తాం, ఇప్పటికి ప్రత్యెక హోదాకి దూరంగా ఉన్నాం కాని, ఏదో ఒక రోజు హోదా వస్తుంది అని జగన్ అన్నారు.

రేపటికి జగన్ మొహన్ రెడ్డి, గద్దెనెక్కి ఏడాది అవుతుంది. అంటే 365 రోజులు. ఈ 365 రోజుల్లో, 70 సార్లు, అంటే 70 రోజులు కోర్టుల చేత మొట్టికాయలు తిన్నారు అంటే, ప్రభుత్వ పాలన ఎలా ఉందో, ప్రభుత్వంలో ఉన్న వారికి ఎంత అవగహన ఉందో, చట్టాలు అంటే ఎంత అవగాహన ఉందో అర్ధం అవుతుంది. అయితే 70 సార్లు తమని కోర్ట్ అనవసరంగా విమర్శిస్తుంది అని చూస్తున్నారే కానే, జరుగుతున్న తప్పులు మాత్రం తెలుసుకోవటం లేదు. పదే పదే అవే తప్పులు చేస్తూ ఉండటంతో, ఏకంగా చీఫ్ సెక్రటరీ పైనే, కోర్ట్ ధిక్కరణ దాకా వెళ్ళారు. దీంతో కోర్టు తమని, తమ అధినేతను టార్గెట్ చేసింది అంటూ, ఏకంగా కోర్టు పైనే బూతులు తిట్టే స్థాయికి వైసీపీ కార్యకర్తలు వెళ్ళిపోయారు. కోర్టు ఏదో చంద్రబాబు చెప్తేనే చేస్తుంది అంటూ, కొత్త భాష్యం చెప్తున్నారు. కోర్టు ఏదైనా, చట్టంలో ఏమి ఉందో అది చూసి జడ్జిమెంట్ ఇస్తుంది.

ఎక్కడైనా ప్రభుత్వ భవనాలకు, తమ పార్టీ జెండా రంగులు వేసుకుంటారా ? ప్రభుత్వ భవనాలు అందరికీ సంబంధించినవి, ఒక పార్టీవి కాదు కదా. మరి ఇలాంటి పనులు, చెయ్యవద్దు అని చెప్పినా, పదే పదే చెప్తుంటే కోర్ట్ ఏమి చేస్తుంది ? హైకోర్ట్ ఒక్కటే కాదు కదా, సుప్రీం కోర్ట్ కూడా అదే చెప్పింది కదా. ఇక ఇంగ్లీష్ మీడియం, కోర్ట్ ఏమి చెప్తుంది, నిర్బంధంగా ఇంగ్లీష్ మీడియం ఎందుకు, విద్యా హక్కు చట్టం ప్రకారం, తెలుగు మీడియం ఉండాలి, ఆప్షన్స్ ఇవ్వండి అని చెప్పింది. ఆప్షన్స్ ఇవ్వటానికి, ప్రభుత్వానికి బాధ ఏమిటి ? ఇక డాక్టర్ సుధాకర్ విషయం, వీడియోల్లో స్పష్టంగా పోలీసులు ప్రవర్తించిన తీరు, మాస్కులు అడిగినందుకు సస్పెండ్ ఇవ్వన్నీ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో తేడా ఉంది. విశాఖ పోలీసులు పైనే ఆరోపణలు రావటంతో, సిబిఐకి ఇచ్చారు. ఏ తప్పు చెయ్యనప్పుడు, ఎందుకు భయం ?

ఇక అమరావతిలో ఆడవాళ్ళ పై దాడులు, 144 సెక్షన్ పెట్టి, పోలీసు కవాతులు చేసారు, ఇలా ఎందుకు చేస్తున్నారు అని కోర్ట్ అడిగింది. ఇందులో తప్పు ఏముంది ? మడ అడవులు నరికేస్తుంటే, కోర్ట్ చూస్తూ కూర్చోదు కదా ? 33 వేల ఎకారాలు ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుంటే, కోర్ట్ చూస్తూ కూర్చోదు కదా. అందులోను సీఆర్డీఏ చట్టం ఉంది. ఎల్జీ పాలిమర్స్ లో, గ్యాస్ లీక్ విషయంలో, అందరికీ అనుమానాలు ఉన్నాయి కదా, అదే కోర్ట్ అడిగింది. కరోనా సమయంలో ట్రాక్టర్ ర్యాలీ చేసి, కాళ్ళ మీద పూలు చల్లించుకుంటుంటే, కోర్ట్ నోటీసులు ఇవ్వదా ? ఒక ప్రతిపక్ష నాయకుడుకి, 151 సీఆర్పీసీ నోటీసు, ఏ సందర్భంలో ఇవ్వాలో తెలియదా ? ఉపాధి హామీ నిధులు దారి మళ్లిస్తే, కోర్ట్ అడగడా ? సొంత బాబాయి కేసు సిబిఐకి ఇవ్వమని మీరే కోరారు కదా ? ఒక వర్గం ఆఫీసర్లని అకారణంగా టార్గెట్ చేస్తే, కోర్ట్ కల్పించుకుంటుంది కదా. ఇలాంటివి అనేకం ఉన్నాయి. చేస్తున్న తప్పులు సరి చేసుకోకుండా, చంద్రబాబు మీద, కోర్టుల మీద నెపం నెట్టి తప్పించుకుంటే ఎలా. తప్పు తెలుసుకుని, ముందుకు వెళ్తే, ప్రభుత్వాన్ని ఎవరు ఏమి అంటారు ?

Advertisements

Latest Articles

Most Read