గత మూడు రోజులుగా ఇబ్రహీంపట్నంలోని పవిత్రసంగమం వద్ద జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు , అదే విధంగా అమరావతి మ్యూజిక్, డాన్స్ ఫెస్టివల్ సంధ్రభంగా, కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన హాట్ ఎయిర్ బలూన్స్ , ప్యారాచూట్స్ ప్రదర్శన ఆకట్టుకుంది.

అమరావతిలో, కృష్ణా నది తీరాన, ప్రజలను పర్యాటకంగా ఆకట్టుకుంటానికి త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి. విశాఖలో జరిగిన CII సమ్మిట్ లో, కొన్ని కంపెనీలతో ప్రభుత్వం ఇందుకు గాను, అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

పోలీసుశాఖను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ ఎన్.సాంబశివరావు వెల్లడించారు. గురువారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో ఆధునికీరించిన విజయవాడ పోలీస్ వెబ్ సైట్, విజయవాడ పోలీస్ పేస్-బుక్ పేజీని ఆయన ప్రారంభించారు.

పోలీసు సేవలను సులువగా పొందేందుకు వీలుగా విజయవాడ పోలీస్ వెబ్ సైట్ ఆధునికీకరించినట్లు తెలిపారు. వెబ్ సైట్, పేస్-బుక్ పేజీల ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుతున్నామన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌శాఖ ప్రజలకు మరింత చేరువ అవుతుందన్నారు. ఆధునికరించిన వెబ్‌సైట్‌ సాంకేతికంగా ఎంతో సులువుగా ఉంటుందన్నారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా పోలీసు సేవలను అంటే పోలీస్‌స్టేషన్‌ ఎక్కడ ఉంది? ఎఫ్‌ఐఆర్‌ స్థితి, పాస్‌పోర్టు వెరిఫికేషన్‌, ఫిర్యాదుల స్థితి సులువుగా పొందవచ్చన్నారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా విజయవాడ పోలీసులు ‘వన్‌ ఐడియా కెన్‌ ఛేంజ్‌ విజయవాడ’ అనే నినాదంతో ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు.

విజయవాడ పోలీస్ వెబ్ సైట్: www.vijayawadapolice.ap.gov.in

విజయవాడ పేస్-బుక్ పేజ్: https://www.facebook.com/VjaCityPolice/

బెంజిసర్కిల్ వద్ద నిర్మించబోతున్న ఫ్లైఓవర్ ను ఇంటిగ్రేటెడ్ ఫ్లైఓవర్ గా మార్పు చేయడానికి సర్కారు నిర్ణయించింది. ఫ్లైఓవర్ ను చూసి అంతా అబ్బురపడేలా డిజైన్ లో మార్పులకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు అందాయి. కాంట్రాక్టు సంస్థ దిలీప్ బిల్డ్ కాన్ ఇప్పటికే మట్టి నమూనాల విశ్లేషణ కోసం ఆరు చోట్ల శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్ పంపింది. నివేదిక వచ్చాక పనులు చేపట్టే అవకాశమున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిజైన్ లో మార్పులు చేపట్టాలని సూచించారు.

విజయవాడ నగరంలో అత్యంత రద్దీగల ప్రాంతం బెంజిసర్కిల్, ఈ కూడలి మీదుగా జాతీయ రహదారి 16 (చెన్నై- కోల్కతా) వెళుతుంది. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే భారీ వాహనాలు ఈ కూడలి దాటాల్సిందే. కనీసం 80 నుంచి 90 వేల వాహనాలు ఇక్కడ తిరుగుతాయి అని అంచనా. ఇదే కూడలికి బందరు నుంచి వచ్చే రహదారి కలుస్తుంది. దీంతో అక్కడ నిత్యం ట్రాఫిక్ కష్టాలే. ఈ కూడలి దాటాలంటే కనీసం 30 నిమిషాలు పడుతుంది. అమరావతి రాజధాని కావటం, భవిషత్తు అవసరాలు పరిగణలోకి తీసుకుని, అక్కడ ఫైఓవర్ నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది.

అమరావతికి ముఖ ద్వారంగా, ఫ్లైఓవర్ నిర్మాణం
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంగా విజయవాడ గుర్తింపు పొందడం, జనాభా పెరగడం, భవిష్యత్తులో మహా నగరంగా విస్తరించనున్న నేపథ్యంలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ఫైఓవర్ నగరానికి ఓ మణిహారంగా ఉండేలా నిర్మించాలని ప్రభుత్వ భావిస్తోంది. అందువల్లే డిజైన్లను మార్చడానికి సిద్ధమైంది. అనతర్జాతీయ స్థాయిలో డిజైన్ ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం తన నిర్ణయాన్ని వెల్లడించారు.

బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ఎంత దూరం ఉండాలన్న దానిపై ఇప్పటికి రెండుసార్లు మార్పులు జరిగాయి. మొదట్లో 200 మీటర్లుగా నిర్ణయించిన ఫ్లైఓవర్‌ను ఆ తర్వాత 600 మీటర్లకు పొడిగించారు. ఎంపీ కేశినేని నాని కృషితో మరో 800 మీటర్లకు పొడిగించారు. దీంతో మొత్తం 1.4 కిలోమీటర్ల మేర బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సంబంధించి నూతన డిజైన్‌ రూపొందించాల్సి ఉంది.

మహిళా పార్లమెంట్ కు వచ్చే సందర్శకులు ఆకట్టుకోవడం కోసం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ ను, పవిత్ర సంగమం ప్రాంతాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిదారు. పవిత్ర సంగమానికి చేరుకునే ముందు ఇబ్రహీంపట్నం ఈ రింగు సర్కిల్ స్వాగతం పలకనుంది.

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి పవిత్ర సంగమానికి వచ్చే వరకు కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటి, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.

nwp lighting 10022017 2

nwp lighting 10022017 3

nwp lighting 10022017 4

nwp lighting 10022017 5

nwp lighting 10022017 6

nwp lighting 10022017 7

nwp lighting 10022017 8

nwp lighting 10022017 9

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నూత‌న రాజ‌ధానిలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు, పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌కు అనుస‌రిస్తున్న వినూత్న ప‌థ‌కాల‌లో భాగంగా ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ (హెచ్‌సీఎల్‌) టెక్నాల‌జీస్ లిమిటెడ్‌కు చెందిన ఆరుగురు స‌భ్యుల‌తో కూడిన అత్యున్న‌త బృందం బుధ‌వారం విజ‌య‌వాడ మొగ‌ల్రాజ‌పురంలోని ప‌ర్వ‌త‌నేని బ్ర‌హ్మ‌య్య సిద్ధార్థ క‌ళాశాల‌ను సంద‌ర్శించింది. ఈ సంద‌ర్భంగా సంబంధిత సంస్థ త‌మ శాఖ‌ను త్వ‌ర‌లో విజ‌య‌వాడ‌లో స్థాపించేందుకు సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలించిన‌ట్లు క‌ళాశాల ప్రిన్సిప‌ల్ డాక్ట‌ర్ మేకా ర‌మేష్ తెలిపారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌వాస తెలుగు వ్య‌వ‌హారాలు, పెట్టుబ‌డులు సంఘం ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి డాక్ట‌ర్ వేమూరి ర‌వికిర‌ణ్ ఆధ్వ‌ర్యంలో హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ ఉపాద్య‌క్షుడు గ‌ణేష్‌కుమార్‌, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ రామ‌చంద్ర‌న్‌, అసోసియేట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ నిహాల్ అహ్మ‌ద్‌, సీనియ‌ర్ మేనేజ‌ర్లు శ్రీవేంక‌టేష్‌, రామ‌కృష్ణ‌న్ రాజ‌గోపాల‌న్‌, రాజమురుగన్ క‌ళాశాల‌ను సంద‌ర్శించి వాణిజ్య శాస్త్రంలో డిగ్రీ ప‌ట్ట‌భ‌ద్రులైన విద్యార్థుల‌కు త్వ‌ర‌లో బ్యాంకింగ్ రంగంలో బి.పి.ఓ. సేవ‌లు అందించేందుకు 1000 మంది ఉద్యోగుల‌కు స‌రిప‌డా కార్యాల‌యం ల‌భ్య‌త గురించి ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్శ‌న‌లో భాగంగా క‌ళాశాల డైరెక్ట‌ర్ వేమూరి బాబూరావు, డీన్ డాక్ట‌ర్ రాజేష్ సి. జంపాల పాల్గొని క‌ళాశాల ప్ర‌త్యేక‌త‌ల‌ను, విద్యార్థుల ప్ర‌తిభా, నైపుణ్యాల‌ను బృంద స‌భ్యుల‌కు వివ‌రించారు. అనంత‌రం బృంద స‌భ్యులు విద్యార్థుల‌తో స్వ‌యంగా సంభాషించి వారి భావ‌ప్ర‌క‌ట‌న నైపుణ్యాన్ని, విష‌య ప‌రిజ్ఞానాన్ని తెలుసుకొని అభినందించారు. బి.బి.ఎ. ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థుల బృందం ఉదిత్‌, ప్ర‌ణ‌య్ ప‌ట్వారీ, ప్రేక్ష‌గొలేచా స్థాపించిన అంకుర సంస్థ ద్వారా త్వ‌ర‌లో నిర్వ‌హిస్తున్న అమ‌రావ‌తి మోడ‌ల్ యునైటెడ్ నేష‌న్స్ ప్రాజెక్టును బృందంస‌భ్యులు ప్ర‌త్యేకంగా అభినందించారు.

బృంద‌స‌భ్యుల వెంట కామ‌ర్స్ విభాగాధిప‌తి నారాయ‌ణ‌రావు, బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాధిప‌తి ర‌మేష్‌చంద్ర‌, క‌ళాశాల ఉపాధి అధికారి కావూరి శ్రీధ‌ర్ త‌దిత‌రులు పాల్గొని క‌ళాశాల విశిష్ట‌త‌ను వివ‌రించారు.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read