అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకని, రేపు (మార్చి 8 బుధవారం) విజయవాడ మహిళలకు గుర్తుండిపోయేలా పోలీస్ కమీషనర్ గౌతం సవాంగ్ వినూత్నంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నగరంలోని మహిళలు, యువతలకు ఈవ్ టీజర్ల నుంచి రక్షణ కల్పించడానికి మహిళా రక్షక్లను రంగంలోకి చింపారు. తాజాగా ఇప్పుడు వారి కోసం ఆఫర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళలకు ఆటోలో ఉచిత ప్రయాణంతో పాటు, విజయవాడలోని క్లాత్‌ షోరూమ్‌లలో 20 శాతం డిస్కౌంట్‌ ఆఫర్ ఇవ్వాలని ఆదేశించారు.

ఆటోలో ఉచిత ప్రయాణానికి సంబంధించి ఆయా పోలీస్ స్టేషన్ సీఐలు తమ పరిధిలో గల ఆటో యూనియన్ నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో రోజుకు ఎన్ని ఆటోలు తిరుగుతాయో అవన్నీ బుధవారం మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించాలి. వారి నుంచి డబ్బులు వసూలు చేయకూడదు. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్ల సీఐలు ఈ విధంగా ఆటో యూనియన్లను ఒప్పించారు. ఈ సదుపాయం మహిళా దినోత్సవం రోజు మాత్రమే.

ఆటోల్లో ఉచిత ప్రయాణమే కాకుండా వస్తాల కొనుగోలు పైనా భారీ డిస్కౌంట్లు ఇచ్చేలా పోలీసులు ఆయా వ్యాపారులను ఒప్పించారు. నగరంలోని మహాత్మాగాంధీ రోడు, కారల్ మార్క్స్ రోడ్డు, వస్త్రాలత లో ఎన్నో బట్టల షాపులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిలో ఎలాంటి వస్త్రాలు కొనుగోలు చేసినా 10 నుంచి 20 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా ఏర్పాటు చేశారు. వాస్తవానికి 25 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వాలని పోలీసులు, వ్యాపార వర్గాలను కోరారు. వాళ్లు మాత్రం 10 నుంచి 20శాతం వరకు ఇవ్వడానికి అంగీకరించారు. వస్త్రలతతో పాటు అన్ని ప్రముఖ, మధ్యతరగతి షాపుల్లోనూ ఈ డిస్కౌంటు మహిళలకు దక్కుతాయి.

కంకిపాడులోని వస్త్ర వ్యాపారులు మాత్రం మరో అడుగు ముందుకేశారు. మహిళలు బుధవారం కోనుగోలు చేసే వస్త్రాల పై 50 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు.

బందర్ రోడ్డులో ఉన్న పీవీపీ మాల్ లో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నుంచి ఓ ప్రత్యేకత కనిపించనున్నది. ఇప్పటి వరకు ఇక్కడికి వెళ్లిన వాహనాలన్నీ (పురుషులు, మహిళలు) కలిపి పార్కింగ్ చేయించేవారు. ఇక నుంచి మహిళలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని కేటాయిస్తున్నారు. దీనికి పింక్ పార్కింగ్ అని నామకరణం చేశారు. అలాగే ఆ మాల్లో ఉన్న షాపుల్లో ఎలాంటి వస్తువు కొనుగోలు చేసినా రేపు (మార్చి 8 బుధవారం) 50 శాతం డిస్కౌంట్ ఇస్తారని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.

మహిళలకు ప్రత్యేక ఎల్‌ఎల్‌ఆర్‌ మేళా
మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న విజయవాడ ఉపరవాణా కమిషనర్‌ కార్యాలయంలో మహిళలకు ప్రత్యేక ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాను నిర్వహిస్తున్నట్లు ఉపరవాణా కమిషనర్‌ ఇ.మీరాప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన‌వారు దీనికి అర్హులు. ఎల్‌ఎల్‌ఆర్‌ కావాల్సిన వారు వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. www.aptransport.org లేదా మీసేవ కేంద్రంలో 8వ తేదీ మహిళల ప్రత్యేక ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాకు స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఉపరవాణా కమిషనర్‌ కార్యాలయంలో స్పాట్‌ స్లాట్‌ బుకింగ్‌ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోటారు సైకిల్‌ లేదా కారు ఒక్కదానికి రూ.260, మోటారుసైకిల్‌, కారు రెండింటికి అయితే రూ.410లు రుసుము చెల్లించాలి. మధ్యవర్తులను ఆశ్రయించకుండా మహిళలు నేరుగా ఎల్‌ఎల్‌ఆర్‌ మేళాకు హాజరు కావాలని కోరారు.

విజయవాడ నగరానికి మణిహారంగా నిర్మిస్తున్న 'కనకదుర్గ ఫ్లై ఓవర్‌' పనులు దూసుకెళ్తున్నాయి... ముఖ్యమంత్రి నిర్దేశించిన టార్గెట్ ప్రకారం ఆగష్టు 15 నాటికి, ఫ్లై-ఓవర్ మొదలవ్వాలి అనే లక్షంతో పనులు సాగుతున్నాయి. 'సోమా కనస్ట్రక్షన్‌' కంపెనీ ఈ పనులను చేపట్టింది. విజయవాడ నగరంలో రూ.447.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్‌ పనులకు 2015 డిసెంబరులో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన చేశారు. 2.55 కిలోమీటర్లు.. 51 పిల్లర్లు పెట్రోలు బంకు నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వరకు 2.55 కిలోమీటర్ల పొడవునా ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఫ్లై ఓవర్, రోడ్డు పోర్షన్, అప్రోచ్, సైడ్‌ డ్రెయిన్స్, సబ్‌వే అప్రోచ్‌ పనులు సాగుతున్నాయి. భవానీపురం క్యాస్టింగ్‌ డిపోలో స్లాబ్‌ పనులు జరుగుతున్నాయి.

ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణం 90 శాతం పూర్తయింది. మరో వైపు సెగ్మెంట్ల నిర్మాణం చేపడుతున్నారు. పిల్లర్ల పై వీటిని అమర్చే పనులు మరో పది రోజుల్లోగా చేపట్టనున్నారు. ఒకసారి ప్రారంభమైతే. ఇక ఎక్కడ ఆగవు. చకచకా వీటిని పిల్లర్లపై నెల రోజుల్లో అమర్చేస్తారు. దుర్గగుడి వద్ద కృష్ణానదిలో నిర్మిస్తున్న మినీ బ్రిడ్డి నిర్మాణం సైతం పూర్తయింది.

పనుల పురుగోతి..

  • ఫ్లై-ఓవర్ కోసం 47 స్తంభాలు వేయాల్సి ఉంది. ఇప్పటికి 32 సిద్ధమయ్యాయి.
  • స్తంభాల కోసం భూమిలో 417 పునాదులను (పైల్స్) వేయాల్సి ఉంది. వీటిలో ఇప్పటికే 408 పూర్తయ్యాయి.
  • దుర్లగుడి వద్ద వేస్తున్న 260 మీటర్ల చిన్న వంతెన నిర్మాణం 95 శాతం పూర్తయింది.
  • కృష్ణలంక వద్ద ఏర్పాటు చేస్తున్న అండర్ పాస్ పై నుంచి, కింద నుంచి మరో పది రోజుల్లో రాకపోకలు ప్రారంభించనున్నారు.
  • పైవంతెనపై ఆరు లేన్ల రహదారి వస్తున్నందున 24 మీటర్ల వెడల్పు ఉండబోతోంది.
  • కింద నాలుగు లేన్ల రహదారి నిర్మాణం చివరి దశకు చేరుకుంటోంది.
  • ఒక్కో పిల్లర్ కు మధ్యలో 35 మీటర్ల దూరం ఉంటుందిక్కడ ఈ పిల్లర్ల మధ్యలో 30 సెగ్మెంట్ల ముక్కలను అమరుస్తారు. దీనికి తగ్గట్టుగా పిల్లర్లను అత్యంత పటిష్టంగా నిర్మించారు.

ఈ క్రింది వీడియో చూడండి, ఎంత అద్భుతంగా, నిర్మిస్తున్నారో...

కార్పొరెట్ వైద్యంతో ప్రపంచం కమర్షియల్ అయిపోయిన ఈ రోజుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేసేందుకు ఎవరు ముందుకొస్తారు? కానీ ఇక్కడ వైద్యం ఉచితం. 18 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసేందుకు డాక్టర్లు ముందుకొస్తున్నారు. విజయవాడ ఆంధ్రా ఆసుపత్రుల్లో ఈ గుండె ఆపరేషన్లు జరగనున్నాయి. ఇందు కోసం ఇంగ్లాండ్ వైద్యులు విజయవాడ వస్తున్నారు. గత రెండు సంవత్సరాల్లో, 80 ఉచిత గుండె ఆపరేషన్లు చేసిన ఆంధ్రా హాస్పిటల్స్, ఈ నెలలో, 100 ఉచిత గుండె ఆపరేషన్లు చెయ్యటానికి సిద్ధం అయ్యింది. విజయవాడ ఆంధ్ర ఆసుపత్రి సౌజన్యంతో హీలింగ్‌ లిటిల్‌హార్ట్స్‌ యూకే సంస్థ వైద్య బృందం ఆధ్వర్యంలో ఈ ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తారు.

ఈ ఆపరేషన్లు మార్చ్ 19 నుంచి 25 వరకు జరుగుతాయి. గుండె వైద్యం పూర్తిగా ఫ్రీ. ఆపరేషన్ తరువాత పూర్తిగా కోలుకునేవరకు ఫ్రీ గా చూస్తారు. మందులు కూడా ఫ్రీ గా ఇస్తారు.

ఉచిత ఆపరేషన్లు చేసుకోవాలి అనుకునే వారు, ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. మార్చ్ 7 నుంచి మార్చ్ 9 వ తేది వరకు, రిజిస్టర్ చేసుకుంటారు.. అన్ని టెస్ట్ లు చేసి, ఆపరేషన్ అవసరం అనుకుంటే, మార్చ్ 19 నుంచి 25 మధ్య ఉచితంగా ఆపరేషన్ చేస్తారు.

మరిన్ని వివరాలకు, విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ లో కాని, లేకపోతే 0866-2575999 ఫోన్ నెంబర్ లో సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

జిల్లా కలెక్టర్ బాబు.ఎ కు అరుదైన గౌరవం దక్కనుంది. ఈ నెల 6వ తేదీ సోమవారం న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్-2017 లో భాగంగా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్.ఐ.ఎఫ్), సహకారంతో రాష్ట్రపతి భవన్ లో జిల్లా కలెక్టర్ బాబు.ఎ కీలక ఉపన్యాసాన్ని చేయనున్నారు.

ఆధార్ తో ఆధారిత ప్రజా పంపిణీ, ఉపాధి హామీ వేతనాల పంపిణీ జన్ ధన్ ఆధార్ మొబైల్(జామ్) బెసిడ్ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ, ఆధార్ ఆధారిత ఎరువుల పంపిణీలో లబ్దిదారుని ఖాతాకు సబ్పీడీ నేరుగా జమచేయటం, ఆధార్ పే వంటి వాటిని దేశంలోనే తొలిసారిగా కృష్ణా జిల్లాలోనే ప్రయోగాత్మకంగా విజయవంతంచేసి దేశవ్యాప్తంగా అమలుకు పునాదివేసిన జిల్లా కలెక్టర్ బాబు.ఎ.ను ప్రత్యేకంగా ఆహ్వానించింది.

కృష్ణాజిల్లా పథకాల అమలుతో నగదు రహిత లావాదేవీలు, జిల్లా వ్యాప్తంగా 35 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. జిల్లా కలెక్టరు బాబు.ఎ. చేయనున్న ప్రసంగంలో జిల్లాలో విజయవతంగా అమలు జరుగుతున్న నగదు రహిత లావాదేవీల అనుభవాలను వివరించనున్నారు. దేశంలో ఏ ఐ.ఎ.ఎస్ అధికారికి దక్కని గౌరవం జిల్లా కలెక్టర్ బాబు.ఎ కు దక్కనుంది.

ఈయన కృష్ణా జిలా కలెక్టర్, అహ్మద్ బాబు... జిల్లా మేజిస్ట్రేట్ హోదా... జిల్లా మొత్తానికి, ప్రభుత్వ ఉద్యోగులను శాసించే ఐఏఎస్ ఆఫీసర్.... ఈయన కోరుకుంటే, ఏ పని అయినా క్షణాల్లో అయిపోతుంది... అయినా ఈయన ఎప్పుడు రూల్స్ తప్పరు... సామాన్యులు లాగే, రూల్స్ ఫాలో అవుతూ పర్సనల్ పనులు చేసుకుంటారు... దీనికి మరొక ఉదాహరణ, నిన్న విజయవాడ రవాణా శాఖ కార్యాలయంలో, స్వయంగా తన కారు నడుపుకుంటూ వెళ్ళి డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవటం....

విషయంలోకి వెళ్తే, కృష్ణా కలెక్టర్ బాబు గురువారం రవాణా శాఖ కార్యాలయంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమీషనర్ చేతులు మీదుగా డ్రైవింగ్ లైసెన్స్ అందుకున్నారు. కింది స్థాయి సిబ్బందికి రూల్స్ నిర్దేశించే కలెక్టర్, లైసెన్స్ కోసం రూల్ పాటించారు. స్వయంగా సొంత కారు నడుపుకుంటూ రవాణా శాఖ కార్యాలయానికి వచ్చారు.

కలెక్టర్ స్వయంగా రవాణా శాఖ కార్యలయానికి రావటంతో, డీటీసీ మీరా ప్రసాద్ ఎదురేగి ఆహ్వానం పలికారు. రవాణా శాఖ పరంగా చేపట్టాల్సిన ప్రక్రియ అంతటనీ కలెక్టర్ స్వయంగా నిర్వహించారు. ఆ తర్వాత వెంటనే పీవీసీ కార్డ్ డైవింగ్ లైసెన్స్ ప్రింట్ తీసి కలెక్టర్ బాబుకు డీటీసీ అందజేశారు.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read