విజయవాడ నగరంలోని రివర్ ఫ్రంట్, కాలువలు పర్యాటక ప్రాంతాలుగానే కాదు, ఇక ఉంచి వాణిజ్య ప్రాంతాలుగా మారనున్నాయి. విజయవాడ నగరంలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి పై ముఖ్యమంత్రి చంద్రబాబు, సమీక్ష నిర్వచించారు. ముఖ్యమంత్రికి, సంబంధింత కన్సల్లెంట్లు ప్రజెంటేషన్ అందించారు. ముఖ్యమంత్రి, ఈ ప్రణాళిక పరిశీలించి, మరిన్ని మార్పులతో రావాలని సూచించారు. ముఖ్యంగా, నగరంలో అధ్వాన స్థితిలో ఉన్న కాలువల పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.

దుర్గగుడి, నది తీరంలోని ఘాట్లు, నది చెంతనే ఉన్నకాలువలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాలన్నింటిని ఆకట్టుకునేలా ప్రణాళికలు రూపొందించారు. మిక్స్ డెవలప్మెంట్ అప్రోచ్ పేరిట ఈ ప్రాజెక్ట్నుఅభివృద్ధిచేస్తారు. ఇందులో బిజినెస్ హోటల్, కన్వెనన్ సెంటర్, సర్వీస్ అపార్ట్ మెంట్లు, మల్టీప్లెక్స్, ఫుడ్ కోర్ట్లు, సెంట్రల్ పార్క్, గ్రీనరీ, పైవంతెనలు, సైకిల్ ట్రాక్లు, వాకింగ్ ట్రాక్లు ఉంటాయి. అలాగే అంతర్గత జలరవాణా మార్గాల్ని కూడా అభివృద్ధి పరుస్తారు. మరిన్నిఅంశాలు జోడించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు.

ప్రస్తుతం ఇచ్చిన ప్రణాళికలు, డిజైన్ల పై అంతగా సంతృప్తి వ్యక్తం చేయని సీఎం తాను సూచించిన విధంగా మెరుగైన ప్రణాళికలు ఆకృతులతో రావాలని ఆదేశించారు.

vijayawada river front 09022017 2

vijayawada river front 09022017 3

vijayawada river front 09022017 4

vijayawada river front 09022017 5

భారీ సినీ తారాగణం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రికెట్ తారలు అమరావతి ప్రజలను అలరించనున్నారు. మార్చి 20 నుంచి 26వ తేదీ వరకు ఈ (సీసీఎల్) సెలబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

క్రికెట్ అభిమానులతో పాటు, సినీ అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు కాబోతున్న క్రికెట్ పండుగకు ఇందిరా గాందీ స్టేడియం వేదిక కానుంది. కార్యక్రమ నిర్వహణ బాధ్యత "విబ్రీ మీడియా"కు అప్పగించారు. క్రికెట్ పండుగను రాజకీయాలకు అతీతంగా అత్యంత ప్రతిషాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వెండితెర అగ్రతారలు, క్రికెట్ తారలు పాలుపంచుకోనున్నారు. ఆ తారలతో అగ్రిమెంటు పనులు కూడా దాదాపు పూర్తయినట్లే. ఎవరెవరు పాల్గొంటున్నారన్న విషయాన్ని మాత్రం అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

రాజకీయాలతో వేడెక్కిన విజయవాడను కొద్ది రోజులు ఆ వాతావరణానికి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో, ప్రజలకు పూర్తి స్థాయి వినోదం పంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇంతవరకు ఏ సినీ క్రికెట్ లీగ్ లో పాల్గొనని మహేష్ బాబును తీసుకువచ్చేందుకు నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

మహేష్ బాబుతో పాటు జూనియర్ ఎన్టీయార్ ను కూడా లీగ్ కు ఆహ్వానిస్తున్నటుగా తెలుస్తోంది. ఇపుడు ఈ ఇద్దరు అగ్ర హీరోలను కార్యక్రమానికి తీసుకువచ్చి జనాలకు వినోదం, ఆనందం పంచాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

నాగారున, వెంకటేశ్, శ్రీకాంత్, అఖిల్, తరుణ్. నితిన్, సచిన్, గిల్క్రిస్ట్, పాంటింగ్, కలిస్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి క్రికెట్ తారలు క్రికెట్ లీగ్ లో సిక్లర్ల రికారులను బద్దలు కొట్టనున్నారు. వీరితోపాటు మరికొందరు సినీతారలు, క్రికెట్ ఆటగాళ్లు పాల్గొంటారు. క్రికెట్ గ్రూపలకు అంబాసిడరుగా కొందరు హీరోయిను విచ్చేసి సినీ ప్రేక్షకులను అలరించనున్నారు.

రామవరప్పాడు రింగ్ లో, కొత్తగా పెట్టిన ట్రాఫిక్ ఆంక్షలతో, వాహనదారులు కొంత ఇబ్బంది పడుతున్నారు... ట్రాఫిక్ నియంత్రించే క్రమంలో, విజయవాడ పోలీస్, రామవరప్పాడు రింగ్ లో కొన్ని మార్పులు చేసారు...

ఏలూరు రోడ్డు మార్గం నుంచి విజయవాడ వచ్చే వాహనచోదకులు రామవరప్పాడు రింగ్ చేరుకోగానే బాబూజగజ్జీవన్రామ్ విగ్రహం ముందు నుంచి జాతీయరహదారి పైకి రావటం కుదరదు. అక్కడ బారీకేడ్లు పెట్టడంతో బాబూజగజ్జీవన్రామ్ విగ్రహం వెనుక నుంచి ఇన్హోటల్ మీదుగా రామవరప్పాడు వైపు వెళ్లి శుభం కల్యాణ మండపం వద్ద గల సర్కిల్ నుంచి యూటర్న్ తీసుకుని తిరిగి రామవరప్పాడు రింగ్ చేరుకుని అక్కడ నుంచి బెంజిసర్కిల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. దీని వల్ల ఏలూరు రోడ్డు నుంచి, ఆటోనగర్, బందర్ రోడ్డు వెళ్ళే rtc బస్సులు కూడా, శుభం కల్యాణమండపం దాకా వచ్చి, యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది.

ప్రసాదంపాడు, రామవరప్పాడు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు గన్నవరం వైపు వెళ్లాలంటే శుభం కల్యాణమండపం వద్దకు వచ్చి యూటర్న్ తీసుకుని గన్నవరం వైపు వెళ్లాల్సి ఉంది. రామవరప్పాడు రింగ్ దగ్గర యూటర్న్ తీసుకోవటం కుదరదు.

ఇన్నర్ రింగ్ రోడ్డు పై నుంచి వచ్చే వాహనాలు, బెంజిసర్కిల్ వైపు వెళ్ళాలి అంటే, శుభం కల్యాణమండపం దగ్గరే యూటర్స్ తీసుకుని బెంజిసర్కిల్ వైపుకు రావాల్సి ఉంది.

అటు రింగ్ రోడ్డు, ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు రెండు వైపుల నుంచి వచ్చే వాహనాలు శుభం కల్యాణ మండపం వద్ద యూటర్స్ తీసుకుని, బెంజిసర్కిల్ వైపుకు వెళ్లేలా చర్యలు తీసుకోవడంతో రామవరప్పాడు ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నిబంధనల వల్ల ప్రజలు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయం పునరాలోచించాలని, వాహనచోదకులు కోరుతున్నారు. మొత్తం తీసేవేయలేని పక్షంలో, కనీసం ఏలూరు రోడ్డు వైపు నుంచి వచ్చే వాహనాలను బెంజిసర్కిల్ వైపు వెళ్ళడానికి పాత విధానంలో అనుమతిస్తే కొంతమేర సమస్య పరిష్కారం అవుతుందని వాహనచోదకులు, అభిప్రాయ పడుతున్నారు.

ప్రకాశం బ్యారేజీ, విజయవాడ - గుంటూరును కలిపే ఈ వారధి, మంచి టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, స్యుసైడ్ స్పాట్ కూడా... నిత్యం ఎన్నో సమస్యలతో సతమతవుతూ, జీవితాలని ముందుకు తీసుకువెళ్ళాలేక, ప్రజలు ఇక్కడకు వచ్చి, ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చూసాం...

ప్రకాశం బ్యారేజీ మీద జన సంచారం ఎక్కువే, ఆయనా సరే, ఎవరన్నా ఆత్మహత్య చేసుకునేందుకు కృష్ణా నదిలో దూకితే, ఎప్పుడో కొన్ని సందర్భాలలో తప్ప, ప్రజలు రక్షించే పని చెయ్యరు, కనీసం పోలీస్కు కూడా సమాచారం ఇవ్వరు... ఎవడు ఎట్లా పొతే మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో, ఇలాంటి వారిని కాపాడడమే తన పని అన్నట్లుగా ఓ హెడ్‌ కానిస్టేబుల్‌. ప్రకాశం బ్యారేజీ పై, నిత్యం అలెర్ట్ గా ఉంటూ, ఇప్పటి వరకు సుమారు 100 మంది ప్రాణాలను కాపాడారు ఈయన.

ఈయన పేరు, బండ్ల నాగేశ్వరరావు. తాడేపల్లి పోలీస్‌ స్టేషన్లో హెడ్‌ కానిస్టేబుల్. ప్రకాశం బ్యారేజీపై ఔట్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్నారు. ఔట్‌పోస్టు కు మాత్రమే, ఆయన విధులు పరిమితం చేసుకోవచ్చు... కాని, ఆయన మానవతా కోణంతో, ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారిని కాపాడతారు. ఔట్‌పోస్టు లో మాత్రమే కూర్చోకుండా, బ్యారేజీపై తిరుగుతుంటారు. ఏ వ్యక్తిపై అనుమానం కలిగినా వారిని నీడలా వెంటాడుతుంటారు. వారు ఆత్మహత్య చేసుకునేందుకు నీటిలో దూకే ప్రయత్నంలో ఉండగానే వెనుక నుంచి వారిని గట్టిగా పట్టుకుంటారు. అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్ళి ఇంట్లో వారికి ఫోన్‌ చేసి కనుక్కుంటారు. వారిని నయానో, భయానో ఔట్‌పోస్టులోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కౌన్సెలింగ్‌ ఇస్తారు.

ఈ విధంగా ఇప్పటి వరకు సుమారు 100 మంది వరకు కాపాడి ఉంటాడని అంచనా. నీటిలో దూకిన నలుగురైదుగురిని కూడా కాపాడాడు. ఆయన పనితీరు, సమర్థతను గుర్తించిన అర్బన్‌ ఎస్పీ త్రిపాఠీ ఆదివారం తన కార్యాలయానికి పిలిపించుకుని రూ.2 వేల నగదు రివార్డు అందించి అభినందించారు.

ప్లాట్-ఫాం పై సైబర్ కేఫ్... అందరికీ అందుబాటులో బడ్జెట్ హోటల్... రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు వినోదాన్నిఅందించేందుకు మల్టీప్లెక్స్.... ఇది విజయవాడ రైల్వేస్టేషన్ భవిష్యత్తు రూపం. ప్రయాణికుల నుంచి ప్రముఖుల వరకు అందరితోనూ పెదవి విరుపులను చూస్తున్న బెజవాడ స్టేషన్ మహా సుందరాతి సుందరంగా తయారు కానుంది. కార్పొరేట్ రైలు నిలయంగా మారనుంది. ఇందుకు సంబంధించిన అడుగులు ఈ నెల ఎనిమిదో తేదీన ముందుకు పడనున్నాయి.

రైల్వేస్టేషన్లలో నాణ్యత ప్రమాణాలతో మౌలిక వసతుల కల్పించడంతో పాటు ప్లాట్-ఫాంను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ స్టేషన్ ఆధునీకరించడం ద్వారా వాణిజ్య కార్యకలపాతో పాటు అదనపు ఆదాయం సమకూరే విధంగా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. రైల్వేస్టేషన్ ఆధునీకరించడంలో భాగంగా వాణిజ్య కార్యకలపాలకు అనువుగా హోటల్స్, మల్టీప్లెక్స్, షాపింగ్ మాల్స్ ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏడు ప్లాట్‌ఫారాలపై విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఒకటో, ఆరు నంబర్‌ ప్లాట్‌ఫారాలపై మాత్రమే విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు ఉన్నాయి. రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం ఇస్తున్న ఫ్రీ వైఫై కొంత సమయానికే పరిమితం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులందరికీ ఇంటర్నెట్‌ను 24/7 అందుబాటులో ఉండేలా చేయడానికి సైబర్‌ కేఫ్‌లను నెలకొల్పుతారు.

ఒకవేళ రైలు రెండు, మూడు గంటలు ఆలస్యమైతే, ప్రయాణికులకు బోరు కొట్టకుండా వినోదాన్ని అందించడానికి మల్టీప్లెక్స్‌లను నిర్మిస్తారు. ఇప్పటికే పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌లో వై స్కీన్స్‌ పేరుతో రెండు మల్టీప్లెక్స్‌ స్ర్కీన్స్‌ ఉన్నాయి. త్వరలో ఈ మల్టీస్ర్కీన్స్‌ విజయవాడ రైల్వేస్టేషన్‌లో అడుగుపెట్టబోతున్నాయి

విజయవాడ రైల్వేస్టేషన్ 1888లో ప్రారంభించారు. మన దేశం నాలుగు దిక్కులను కలిపే ఏకైక రైల్వే జంక్షన్ ఇది. ఈ రైల్వేస్టేషన్ రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉంది. సుమారు పదెకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న విజయవాడ రైల్వేస్టేషన్‌లో మొత్తం పది ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషన్ మీదుగా రోజు 375 పైగా ప్యాసింజర్, ఎక్ష్ప్రెస్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో పాటు మరో 150 పైగా సరకు రవాణా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజూ కనీసం లక్షమంది ప్రయాణీకులు సేషన్ కు వస్తుంటారు. ప్రతి రోజు విజయవాడ రైల్వేస్టేషన్ కు రూ.70 లక్షల ఆదాయం లభిస్తుంది.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read