సంక్రాంతికి విజయవాడ నగరవాసులని అలరించిన ఏవియేషన్ షో మర్చిపోక ముందే, ఇప్పుడు మరో ఈవెంట్ నగర వాసులని అలరించనుంది. ఫిబ్రవరి 4న నగరంలోని పన్నమి, భవానీ ఘాట్లలో నేవీ ఆపరేషనల్ డెమో నిర్వహించటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బాబుఎ తెలిపారు.

కలెక్టర్ మాట్లాడుతూ నూతన రాజధాని అమరావతిలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు, యువతను భాగస్వాములను చేసి వారిలో దేశ రక్షణకు సంబంధించిన ఉద్యోగాలకై స్పూర్తి నింపేందుకు ఎయిర్ షో వంటి అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 4న నేవీ ఆపరేషనల్ డెమో నిర్వహించడం జరుగుతుందన్నారు.

ప్రదర్శనలో చేతక్ హెలీకాప్టర్లతో యుద్ధ విన్యాసాలు, టెర్రరిస్ట్ల దాడులు ఎదుర్కొనే పద్ధతులు, ప్రమాదాల్లో చిక్కుకున్నవారిని రక్షించే విన్యాసాలు ఈ ప్రదర్శనలో వుంటాయని వివరించారు. అదే విధంగా విద్యారులకు నేవీలో ప్రవేశానికి కావలసిన కెరీర్ గైడెన్స్లతో పాటు భారత దేశానికి నేవీ అందిస్తున్న సేవలను ప్రత్యేక స్టాల్స్ ద్వారా ప్రదర్శనల్లో ఉంచుతున్నట్లు తెలిపారు. స్కైడైవింగ్ వంటి విన్యా సాలు ఉంటాయని చెప్పారు.

ఫిబ్రవరి 2, 3 తేదీల్లో రిహార్సల్స్ నిర్వహిస్తామని, ఫిబ్రవరి 4వ తేదీన నిర్వహించే ఆపరేషనల్ డెమోను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నేవెల్ కమాండర్ ఇన్ చీఫ్ ప్రారంభిస్తారన్నారు. ఈ డెమోకు ప్రవేశం ఉచితమని సుమారు మూడు నుండి నాలుగు లక్షల మంది ప్రదర్శనను తిలకించేలా ఏర్పాట్ల చేశామన్నారు. ఫిబ్రవరి 5న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత నావెల్ బ్యాండ్ ప్రదర్శిస్తారన్నారు. ఈ ప్రదర్శనలో మ్యూజిక్ ఆఫీసర్ తో పాటు 35మంది సైలర్లు సభ్యులుగా ఉంటారన్నారు.

విజయవాడలో ఉన్న ఏకైక స్టేడియం అయిన, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి అంతర్జాతీయ స్థాయిలో హంగులు సమకూరనున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగిన చరిత్ర ఉన్న స్టేడియం, గత కొన్ని సంవత్సరాలు గా నిర్లక్షానికి గురైంది. అమరావతిలో నేషనల్ గేమ్స్ కు ఆంధ్రప్రదేశ్ బిడ్ వేసిన నేపధ్యంలో, స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దనున్నారు.

ఇందుకుగాను, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ తర్వాత, ఈనెల 27వ తేదీ నుంచి ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించటం జరగదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండ్యన్ ప్రకటించారు. దాదాపు రెండు నెలల పాటు స్టేడియంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ స్థాయి స్టేడియాలకు ధీటుగా తీర్చిదిద్దేలా పనులు చేస్తున్నట్లు వెల్లడించారు.

మార్చిలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లేదా సినీ తారల క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు తగినట్లుగా అభివృద్ధి పనులు ఉంటాయని తెలిపారు.

CCL-సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో, మార్చ్ 2వ వారంలో, సినీ ఆర్టిస్ట్ లు, క్రికెట్ ర్లు కలిసి, రెండు రోజుల పాటు మ్యాచ్లు ఆడనున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఈ మ్యాచ్లు ఆడనున్నారు. ఈ మ్యాచ్లకి, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, ఆడమ్ గిల్-క్రిస్ట్, వెస్ట్ ఇండీస్ మాజీ ఆటగాడు బ్రియాన్ లారా, టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, తెలుగు సినీ ఇండస్ట్రీ హీరోలు, హీరోయిన్ లు రానున్నట్టు సమాచారం.

ప్రతి సంవత్సరం, జనవరి 26న కాళ్ళు చేతులు కట్టుకుని, కృష్ణా నదిలో ఈదుతూ, ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న విజయవాడ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ లంకె ఉమామహేశ్వరరావు, ఈ సారి కూడా జనవరి 26కు, గిన్నిస్‌ రికార్డు సాధించాలి అని, ఇవాళ కృష్ణా నదిలో సాధన చేస్తూ, గుండెపోటుతో మృతి చెందారు.

కాళ్లకు గోనె సంచులు కట్టుకుని ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు ఈది గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకోవాలి అనే సంకల్పంతో, కొద్దిరోజులుగా కృష్ణా నదిలో కఠోర సాధన చేస్తున్నారు. ఈరోజు ఉదయం కృష్ణా నదిలో కాళ్లకు గోనె సంచులు కట్టుకుని ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు ఈత సాధన చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో నీరసించి పోయారు. తోటి ఈతగాళ్లు ఆయన్ని ఒడ్డుకు తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.

ఉమామహేశ్వరరావు స్వస్థలం గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరు. పోలీసు ఉద్యోగం రాకముందు కృష్ణానది కాల్వలో ఈత కొట్టడం ఆయన అభిరుచి. 1994లో ఎస్పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన ఆయన పాల్వంచ, విజయవాడ, దుర్గగుడి, అసెంబ్లీ, సచివాలయం తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. కాళ్లు, చేతులు కట్టుకుని కృష్ణా నదిలో ఈత కొట్టడం ద్వారా ఇప్పటికే అనేక జాతీయస్థాయి అవార్డులు సొంతం చేసుకున్నారు. లిమ్కాబుక్‌ ఆప్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఉమామహేశ్వరరావు పేరు నమోదైంది.

Read more: కృష్ణా నదిలో గిన్నిస్‌ రికార్డు సాధన చేస్తూ, గుండెపోటుతో మృతి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఈ నెల 30న విజయవాడ, తిరుపతికి రానున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా మొక్కు చెల్లించుకోవడానికి విజయవాడ, తిరుపతికి కేసిఆర్ వస్తున్నారు. శ్రీవారికి రూ.5 కోట్ల కానుక‌లు చెల్లిస్తారు. 14.9 కిలోల సాలిగ్రామ హారాన్ని, 4.650 కిలోల ఐదు పేటల కంఠాభరణాన్ని కెసిఆర్ తిరుమల వచ్చి స్వయంగా స్వామివారికి వాటిని బహుకరిస్తారు.

విజయవాడ కనకదుర్గ అమ్మవారికి 15 గ్రాములతో ముక్కుపుడక మొక్కు కుడా కెసిఆర్ బహుకరిస్తారు.

ఈ నెల 30వ తేదీ ఉదయం తిరుమల చేరుకొని, స్వామి వారిని దర్శించుకుని, కానుకలు సమర్పిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి, విజయవాడ చేరుకొని, దుర్గమ్మ దర్శనం చేసుకుని, మొక్కు తీర్చుకుంటారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుని కలుస్తారు.

కనకదుర్గ గుడి టోల్ గేటు నుంచి కుమ్మరిపాలెం సెంటరు వరకు రోడ్డును మరమ్మతులు చేస్తున్న దృష్యా 10 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 10 రోజుల పాటు ఎటువంటి వాహనాల రాకపోకలను అనుమతించరని తెలిపారు.

మళ్లింపులు ఇలా
విధ్యధరపురం, ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే ప్రయాణికులు, వాహనచోదకులు బి.ఆర్.పి. రోడ్డు, వి.జి. చౌక్, చిట్టినగర్, సొరంగం మీదుగా వెళ్లాలి. వయా ఎర్రకట్ల, సొరంగం ద్వారా, వయా వై.వి.రావు ఎస్టేట్, పాల ఫ్యాక్టరీ పైవంతెన, సితార కూడలి మీదుగా విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం వైపు వెళ్లాలి.

గోల్లపూడి వైపు నుంచి ప్రయాణికులు, పాదచారులు సితార, పైవంతెన, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, వి.జి. చౌక్, పంజా సెంటరు, పశ్చిమ బుకింగ్, లో బ్రిడ్జి మీదుగా చేరుకో వాలి

గోల్లపూడి నుంచి పైవంతెన, వై.వి.రావు ఎస్టేట్,పైపుల రోడ్డు మీదుగా బి.ఆర్.టి.ఎస్ రోడ్డు చేరుకోవాలి.

ఈ ట్రాఫిక్ మళ్లింపులు 10 రోజులు ఉంటాయని. ప్రజలు వీటిని గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read