విజయవాడ నగర పాలక సంస్థ, డీప్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలో ప్రతి నెల మొదటి ఆదివారం నిర్వహిస్తున్నహ్యపీ సండే కార్యక్రమానికి బందరు రోడ్డులోని ఇందిరా గాంధీ గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంతో పాటు, ఇక నుంచి BRTSరోడ్డు కూడా సిద్ధం చేసినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు.

హ్యపీ సండేకు విశేష స్పందన రావడంతో ప్రజల సౌకర్యార్ధం రెండు వేదికలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హ్యపీ సండే కార్యకమానికి నగరంలో ప్రజాదరణ పెరగటమే కాకుండా ప్రజలకు ఆరోగ్యాన్ని సైతం అందిస్తుందని పేర్కొ న్నారు. ఫిబ్రవరి 5వ తేదీన జరిగే హ్యపీసండే కార్యక్రమం రెండు వేదికల్లో జరుగుతాయి అని పేర్కున్నారు. సంప్రదాయ, సమకాలీక జానపద, గ్రామీణ క్రీడలైనటువంటి తొక్కుడు బిళ్ళ, చెమ్మచెక్క పులిమేక, డప్పు, కోలాటం, భరతనాట్యం, కూచిపూడి వంటి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

చంద్రబాబు తపన అభినందనీయం.. నవ్యాంధ్రకు భవ్యమైన భవిష్యత్తు.. "బెజవాడ చాలా మారింది. అమరావతి అభివృద్ధికి చేపట్టిన ప్రణాళిక బాగుంది. అభివృద్ధి, పెట్టుబడుల కోసం చంద్రబాబు తపన అభినందనీయం" అంటూ పలువురు ప్రముఖులు ప్రశంసించారు. విజయవాడలో ఇటీవల జరిగిన ఎయిర్‌షోలో పాల్గొన్న విదేశీ వియానయాన రంగ ప్రముఖులు పలువురు దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు.

"చంద్రబాబు ముందు చూపుతో చేస్తున్న అభివృద్ధి కారణంగా ఏపీ నుంచి విదేశాలకు వలసలు ఆగిపోతాయి. ఇప్పటికే విదేశాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి" అని సింగపూర్‌కు చెందిన నార్డిక్‌ ఏవియేషన్‌ క్యాపిటల్‌ కంపెనీ (ఎయిర్‌క్రాప్ట్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్సింగ్‌) వైస్‌ ప్రెసిడెంట్‌ బ్రూనో అభిప్రాయపడ్డారు. విజయవాడలో రోడ్లు బాగున్నాయని, మహాత్మాగాంధీ రోడ్డులో విభిన్నమైన షాపులు ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. ఆంధ్రా వంటకాలు చాలా నచ్చాయని లేఖలో రాశారు. "విజయవాడలో నా రెండు రోజుల పర్యటన ఎన్నో మంచి అనుభూతులను మిగిల్చింది. రానున్న రోజుల్లో భవ్యమైన ఆంధ్రప్రదేశ్‌ సాక్షాత్కారమవుతుందనడంలో సందేహం లేదు" అని బ్రూనో అభిప్రాయపడ్డారు.

ప్రపంచంలోని పలు దేశాల రాజధానులను విహంగ వీక్షణంలో చూసిన కెప్టెన్‌ జైసింగ్‌ రాసిన లేఖలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. "గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందు విమానం నుంచి చూస్తే విజయవాడ దేదీప్యమానంగా విద్యుతకాంతులతో వెలిగిపోతూ కనిపించింది. గతంలో కూడా విజయవాడకు విమానాలు నడుపుతూ వచ్చాను. ఈసారి మాత్రం అభివృద్ధి చెందిన విజయవాడ కనిపించింది" అని జైసింగ్‌ తన లేఖలో తెలిపారు. విజయవాడ నగరం గురించి తన సతీమణికి చెబుతుండగా... కారు డ్రైవర్‌ జోక్యం చేసుకొని "విభజన తర్వాత, చంద్రబాబు సీఎం అయ్యాక విజయవాడ రూపురేఖలు మారిపోయాయి. ఈ రోడ్లు, లైట్లు ఆయన వచ్చిన తర్వాత వేసినవే" అని చెప్పారని లేఖలో ప్రస్తావించారు. రెండున్నరేళ్లలోనే పెట్టుబడిదారులను ఆకట్టుకోవడమే కాకుండా... హైదరాబాద్‌కు విజయవాడ దీటుగా నిలుస్తోందని జైసింగ్‌ ప్రశంసించారు.

కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో జాతీయ రహదారిపై లిక్విడ్‌ ఆక్సిజ‌న్ గ్యాస్ తో వెళ్తున్న ట్యాంక‌ర్ ప్ర‌మాదానికి గురైంది. వెనుక నుంచి వ‌స్తున్న వాహ‌నం ఢీకొట్ట‌డంతో వెనుక ప్రాంతంలో చిన్న రంద్రం ప‌డింది. దాని గుండా ట్యాంక‌ర్ నుంచి భారీ స్థాయిలో లిక్విడ్ ఆక్సిజ‌న్ గ్యాస్ పొగ రూపంలో భ‌య‌ట‌కు రావ‌డంతో రోడ్డంతా మెఘాల మాదిరి పొగ అలుముకుంది. లిక్విడ్‌ ఆక్సిజన్‌ లీక్‌ కావడాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే వాహనాన్ని రోడ్డుపక‍్కన ఆపేశాడు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, వాట‌ర్ తో క్లియ‌ర్ చేస్తున్నారు. స‌హ‌జంగా ఉండేవాయువు కావ‌డంతో పెద్ద‌గా ప్ర‌మాదం లేదు. ఆ దారిలో వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్ళిస్తున్నారు. ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరగకుండా ఫైర్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

విజయవాడలో తొలిసారి నేవీ షో జరగనుంది. ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో పన్నమి, భవానీ ఘాట్లలో నేవీ విన్యాసాలను నిర్వహించేందుకు విశాఖపట్నం నుంచి నగరానికి వచ్చిన నావికాదళం సిబ్బందితో పన్నమి ఘాట్ సందడి సందడిగా మారింది.

విన్యాసాల సమయమిదే.
ఫిబ్రవరి 2:
పన్నమిఘాట్ వద్ద సాయంత్రం 4 గంటలకు విన్యాసాలు ప్రారంభం కానున్నాయి.
చేతక్, జెమినీ, జెట్ స్కీ, పారా సెయిలింగ్ ప్రదర్శన, ఆయిల్ రిగ్గు ధ్వంసం, జల క్రీడలు, హెలికాప్టర్ల నుంచి సిబ్బంది దిగుతూ విన్యాసాలు, సూర్యాస్తమయ విన్యాసాలు చేస్తారు.

ఫిబ్రవరి 3:
సాయంత్రం 4 గంటలకు పన్నమిఘాట్ వద్ద నావికా దళం చీఫ్ వైస్ అడ్మిరల్ ఎ.కె.జైన్ పర్యవేక్షణలో విన్యాసాలు జరగనున్నాయి. మొదటి రోజున జరిగే విన్యాసాలు తిరిగి ప్రదర్శిస్తారు. గంటన్నర పాటు విన్యాసాలు ఉంటాయి

ఫిబ్రవరి 4:
ముఖ్యమంత్రి చంద్రబాబు, నావికా దళానికి చెందిన అత్యున్నత అధికారుల సమక్షంలో సాయంత్రం 4 గంటలకు విన్యాసాలు జరుగుతాయి. రెండున్నర గంటల పాటు విన్యాసాలు, అతిథుల ప్రసంగాలు ఉంటాయి. బాణా సంచా కాల్చటంతో విన్యాసాలు ముగుస్తాయి.

ఫిబ్రవరి 5:
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేవీ బ్యాండ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు బ్యాండ్ ప్రదర్శిస్తారు. 36 మంది నిపుణులైన నావికా సిబ్బంది పాల్గుంటారు.

అద్భుత విన్యాసాలకు కృష్ణాతీరం మరోసారి వేదిక కాబోతుంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో తొలిసారిగా ఇటీవల నిర్వహించిన వైమానిక విన్యాసాలు ప్రజలనుంచి విశేష ఆదరణ లభించింది. ప్రజలకు ఎంటర్టైన్మెంట్గా ప్రతి నెలా ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అందులో భాగంగా ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో పన్నమి, భవానీ ఘాట్లలో నేవీ విన్యాసాలను నిర్వహించేందుకు విశాఖపట్నం నుంచి నగరానికి వచ్చిన నావికాదళం సిబ్బందితో పన్నమి ఘాట్ సందడి సందడిగా మారింది.

విన్యాసాలలో ఉపయోగించే సెయిలింగ్ బోట్లను తమ వెంట తెచ్చుకున్న నేవీ బెటాలియన్ కృష్ణా నదిలో టైల్ రన్ నిర్వహించుకుంటున్నారు. ఫిబ్రవరి 2, 3 తేదీలలో ముందుగా రిహార్సిల్స్ చేసుకుంటారు. నేవీ విన్యాసాలను తిలకించేందుకు వచ్చే సందర్శకుల కోసం పున్నమి ఘాట్లో 10 ఫుడ్ కోర్టులను పర్యాటక శాఖ సిద్ధం చేసింది.

రెండు రోజులపాటు జరిగే రిహార్సిల్స్ అనంతరం 4వ తేదీన జరిగే విన్యాసాలు కీలకమైనవిగా నిలుస్తాయి. హెలీకాప్టర్ సహాయంతో నది పైకి దిగి ఆపదలో ఉన్న వారిని రక్షించే విధానాన్ని తెలియచేస్తారు. నదిలో తేలియాడే తెరచాప పడవలు, హెలీకాప్టర్ నుంచి తాళ్ల సహాయంతో నదిలోకి దిగి ఆపదలో ఉన్నవారిని రక్షించటం వంటి అనేక విన్యాసాలతో కనులవిందు చేయనున్నారు.

ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన నేవీ బ్యాండ్ ఫిబ్రవరి 5వ తేదీన తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. వివిధ రకాల వాయిద్యాలతో వీనుల విందుగా వినసొంపైన సంగీతంతో ఏర్పాటు చేసే ఈ బ్యాండ్లో 36 మంది పాల్గొంటారు.

యువతను నావికాదళం వైపు ఆకర్షించేందుకు ఈ విన్యాసాలు దోహదపడతాయి. అలాగే నావికాదళం అందించే సేవలు యువతలో స్పూర్తిని కలిగించేలా ఉంటాయని నేవీ అధికారి తెలిపారు. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్సు లో యువతకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని, తాము నిర్వహించనున్న విన్యాసాలు భారత నావికాదళం గొప్పదనాన్ని తెలియచేస్తాయని అధికారి చెప్పారు.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read