అమరావతికి ఎయిర్ పోర్ట్ అంటే ఎలా ఉండాలి ? గన్నవరం ఎయిర్ పోర్ట్, ఆ రాజధాని ఠీవి చూపించే విధంగా సిద్ధం అయ్యింది.

అమరావతి సంస్కృతి ఉట్టి పడేలా, ఇంటీరియర్ రెడీ అయిపోతుంది. కొండపల్లి బొమ్మలు, కలంకారీ కళతో కూడిన అలంకరణ లోపలి ఇంటీరియర్ పనులు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. 16 చెక్‌ఇన్‌ కౌంటర్లు, బ్యాగేజీ కన్వేయర్‌ బెల్ట్‌లు, బ్యాగేజీ క్లైమ్‌ కరౌజల్స్‌, అధునాతన సీసీ కెమెరాలతో భద్రత, 300 కార్లను ఒకేసారి నిలిపేందుకు పార్కింగ్‌ వంటివి, నూతన టెర్మినల్‌లో అందుబాటులోనికి రానున్నాయి.

ఈ వీడియో చూడండి, మన గన్నవరం ఎయిర్ పోర్టేనా అని మీరు ఆశ్చర్యపోతారు అంటే అతిశయోక్తి కాదు..

Read more: మన రాజధాని ఎయిర్ పోర్టు ఎంత అందంగా ఉందో చూడండి

విజయవాడ నగరానికి నూతన శోభ రానున్నది. ప్రధాన రహదారులు మెరిసిపోయేలా కార్పొరేషన్ ఆధ్వర్యంలో విద్యుద్దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. రామవరప్పాడు నుంచి సిద్దార్ధ మెడికల్ కళాశాల వరకుగల వాకింగ్ ట్రాకుల్లో పైలెట్ ప్రాజెక్టుగా కార్పొరేషన్ అధికారులు విద్యుద్దీపాలు నిన్న రాత్రి ఏర్పాటు చేశారు. విద్యుద్దీపాల అలంకరణ ఎలా ఉంది, ఇంకా మెరుగుపడటానికి ఏమి చెయ్యాలి అనేది, ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా తెలుసుకున్నారు.

నగర ప్రధాన రహదారుల్లో విద్యుద్దీపాలంకరణను ఏర్పాటుచేయాలని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ(సీఆర్డీఏ) నిర్ణయించి. ఆ బాధ్యతలను నగర కార్పొరేషన్ కు అప్పగించింది. గన్నవరం విమానాశ్రయం నుంచి పవిత్ర సంగమం వరకు విద్యుద్దీపాలను ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనలో భాగంగా రామవరప్పాడు నుంచి సిద్దార్ధ మెడికల్ కళాశాల వరకు రోడ్లకు ఇరువైపులా వాకింగ్ ట్రాకుల్లోని చెట్ల కింద ఫోకస్ లైట్లను ఏర్పాటుచేశారు.

నెలన్నర క్రితం ఇలాంటి ట్రయల్ను ఏర్పాటుచేసిన అధికారులు మరోమారు గ్రీనరీలోని చెట్ల వద్ద ఈ ఏర్చాటు చేశారు. ఈ ట్రయల్లో ఎదురయ్యే సమస్యలను గమనించి మరుసటి ప్రతిపాదనను అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

నగర ప్రధాన రహదారులలో ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం నుంచి రామవరప్పాడు, రామవరప్పాడు నుంచి బెంజిసర్కిల్ వరకు, బెంజిసర్కిల్ నుంచి పోలీసు కంట్రోల్ రూం వరకు, బెంజిసర్కిల్ నుంచి ప్రకాశం బ్యారేజి వరకు, పోలీసు కంట్రోల్ రూం నుంచి పవిత్ర సంగమం వరకు ఇదే తరహాలో రోడ్లకు ఇరువైపులా విద్యుద్దీపాలను ఏర్పాటు చేసేందుకు సీఆర్డీఏ నిర్ణయించింది.

vijayawada lighting 2002017 2

vijayawada lighting 2002017 3

vijayawada lighting 2002017 4

vijayawada lighting 2002017 5

vijayawada lighting 2002017 6

vijayawada lighting 2002017 7

vijayawada lighting 2002017 8

స్వర్గీయ నందమూరి తారక రామారావు 21వ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం ఎన్టీఆర్ ట్రస్తు ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. విజయవాడలో సిద్దార్థ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మ్యూజియంను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ నెల 18 నుంచి 25 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మ్యూజియంలోకి ప్రజలను అనుమతిస్తారు.

ఇందులో ఎన్టీఆర్ కు సంబంధించి వివిధ చిత్రాలను ఆకర్షణీయంగా ఏర్పాటుచేశారు. ప్రతిరోజూ సాంస్కృతిక కార్య క్రమాలు, ఎన్టీఆర్ పాటలు, ప్రముఖుల జ్ఞాపకాలు, సాహిత్య గోష్టి తదితర కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

గన్నవరం విమానాశ్రయం సుంచి రాజస్తాన్ రాజధాని జైపూర్ కు మార్చి నుంచి విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. బెంగళూరు మీదుగా జైపూర్ కు రోజువారి విమాన సర్వీస్ సడిపేందుకు ఎయిర్ కోస్తా సంస్థ ముందుకొచ్చింది.

ఈ ఏడాది మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభంకాసున్న ఈ విమాన సర్వీసుకు సంబంధించిన ప్రయాణ షెడ్యూల్ ఎయిర్ కోస్టా విడుదల చేసింది. ఈ విమాన సర్వీసు ఉదయం 7 గంటలకు గస్నవరం నుంచి బయల్దేరి 8 గంటలకు బెంగుళూరు చేరుకుంటుంది. ఆర్థ గంట విరామం తర్వాత అక్కడి నుండి బయల్దేరి 10.40కు జైపూర్ చేరుకుంటుంది.

తిరిగి సాయంత్రం 6.20కు జైపూర్ నుంచి బయల్దేరి రాత్రి 8.25కు బెంగళూరుకు, అక్కడి నుంచి 8.45కు బయల్దేరి రాత్రి 9.40కు గన్నవరం ఎయిర్పోర్టు చేరుకుంటుంది.

దేశీయంగా విమాన సర్వీసులు నడిపేందుకు ఇప్పటికే పౌర విమానయాన సంస్థ నుంచి అనుమతులు పొందిన ఎయిర్ కోస్టా మరిన్ని విమాన సర్వీసులు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. గన్నవరం ఎయిర్పోర్టులో నూతన టెర్మినల్ ప్రారంభంతో కొత్త విమాన సర్వీస్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.

నగదు రహిత లావాదేవీల్లో నిత్యావసరాలను తెచుకున్నఓ నిరుపేద మహిళకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వీక్లీ మెగా బంపర్ డ్రాలో రూ.లక్ష నగదు బహుమతి లభించింది.

నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో కేంద్రం అమలు చేస్తున్న డీజీధన్ లక్కీ డ్రాలో విజయవాడ వాసికి రూ. లక్ష బహుమతి దక్కింది. కలెక్టరేట్లో వీసీ నిర్వహిస్తున్న కలెక్టర్ బాబు ఈ విషయాన్ని ప్రకటించారు. విజయవాడ పరిధిలోని చుట్టగుంట రేషన్ దుకాణంలో ఈ నెల 6వ తేదీన, చుట్టగుంటకు చెందిన బుద్దాని రమణమ్మ రూ.66.75 విలువ చేసే రేషన్ సరకులను నగదు రహితంగా క్యాష్ లెస్ ( ఆధార్ ఆధారిత చెల్లింప విధానం) ద్వారా కోనుగోలు చేసింది. రూ. లక్ష బహుమతిని, వెంటనే రమణమ్మ పేరుతో ఉన్న బ్యాంకు అకౌంట్ నెంబర్ ను ఆధార్ తో గుర్తించి తక్షణం రూ.లక్షను ఆమె ఖాతాలో జమ చేశారు.

సోమవారం నిర్వహించిన డ్రాలో రమణమ్మకు రూ. లక్ష లభించిన విషయాన్ని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బహుమతి పొందిన రమణమ్మను విజయవాడ అర్బన్ తహసీల్లార్ కార్యాలయం నుంచి వీసీ ద్వారా అధికారులకు పరిచయం చేశారు. కలెక్టర్ ని చూసి, ఉద్వేగానికి లోనై, కంట తడిపెడుతూ తన జీవితంలో ఇది మరిచిపోలేని రోజని, నగదు రహిత విధానం ద్వారా చెల్లించినందుకు తనకు క్యాష్ అవారు రావటం పట్ల హర్షం వ్యక్తం చేసింది రమణమ్మ. కలెక్టర్ బాబు, ఈ డబ్బుతో ఏం చేస్తావని ప్రశ్నించగా, ఆమె రూ. లక్షను తన పిల్లల పేరున ఫిక్సిడ్ డిపాజిట్ చేయనున్నట్టు చెప్పారు.

రమణమ్మ చుట్టుగుంటలోని కాల్వకట్ట వెంబడి కుటుంబంతో కలిసి నివసిస్తుంది. భర్త నారాయణరావు మొదట్లో కూలికి వెళ్ళేవాడు. ప్రస్తుతం సైకిల్ మీద బట్టలు విక్రయిస్తుంటాడు. రమణమ్మ సొంతంగా ఒక మిషన్ కొనుక్కుని ఇంట్లోనే బట్టలు కుడుతూ ఉపాధి పొందుతోంది. తన ఇద్దరు పిల్లలు భవాని, జయంత్లను ప్రైవేటు స్కూల్లో చదివిస్తోంది.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read