స్వచ్ఛ సర్వేక్షణ్-2O17లో భాగంగా స్వచ్ఛ బెజవాడను సాధించి నగరాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు నగరపాలక సంస్థ అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నగరంలో స్వచ్ఛత కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరవాసులను చైతన్యవంతం చేసేందుకు వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఈ కృషిలో భాగంగానే చెస్ లో ప్రముఖ అంతర్జాతీయ క్రీడాకారిణి, పద్మశ్రీ కోనేరు హాంపిని "స్వచ్ఛ బెజవాడ" కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు.

బెజవాడను దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిపేందుకు కమిషనర్ వీరపాండియన్ తీసుకున్న చర్యల్లో భాగంగా విజయవాడ బ్రాండ్ అంబాసిడర్ గా నగరవాసిగా ఉన్న పద్మశ్రీ కోనేరు హాంపిని ఎంపికచేశారు. స్వచ్ఛత యాప్ ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ముందుగా నగర స్వచ్చత పై హాంపి ప్రసంగం ఉంటుంది. ఆ తరువాత సర్వే నిర్వహిస్తారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా స్వచ్ఛ బెజవాడకు బ్రాండ్ అంబాసిడర్ గా సేవలందించేందుకు అంగీకరించిన కోనేరు హాంపిని నగర మేయర్ కోనేరు శ్రీధర్ సోమవారం తన ఛాంబర్లో జరిగిన సమావేశంలో అభినందనలు తెలియజేశారు. ఆమెను శాలువతో సత్కరించి, జ్ఞాపికను అంద జేశారు.

కోనేరు హంపీ మాట్లాడుతూ, నగర ప్రజల సహాకారం ఉంటేనే నగరాన్ని స్వచ్చ బెజవాడగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. నగరవాసులందరూ సహాకారించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట విభజన అనంతరం అమరావతిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహోరాత్రులు శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో కీలక నగరంగా, తాత్కాలిక రాజధానిగా ఉన్న విజయవాడ నగరం గతం కంటే ఎంతో అభివృద్ధిని సాధించిందని ఆమె గుర్తు చేశారు. ప్రధమస్థానం వచ్చేందుకు ఇప్పడు జరుగుతోన్న ప్రయత్నంలో తాను శక్తివంచన లేకుండా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

విజయవాడ నగర ప్రజలకు మునిసిపల్ కమీషనర్ విన్నపం:

గౌరవనీయులైన విజయవాడ నగర ప్రజలారా!

మన విజయవాడ నగరాన్ని దేశంలో మొట్ట మొదటి స్ధానంలో నిలబెట్టడం కోసం 2 నిమిషముల సమయం కేటాయించండి.

మీ మొబైల్ ఫోను నుండి 1969 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వండి. వెంటనే స్వచ్ఛ (భారత్) సర్వేక్షణ్ నుండి ఫొను వస్తుంది.
ముందుగా మన ఆరాధ్య హిందీ నటుడు అమితాబ్ గారి సందేశం వస్తుంది.
తర్వాత మీ భాష ఎంపిక చేసుకోమని అడుగుతారు మీ ఆప్షన్ ఇవ్వండి.
మన నగర పిను కోడ్ 520001 టైపు చేసి ఆప్షన్ ఇవ్వండి.
స్వచ్ఛ సర్వేక్షణ్ నుండి వచ్చిన ఫోన్ కాల్ లో మిమ్ములను 6 ప్రశ్నలు ఒక దాని తర్వాత ఒకటిగా అడుగుతారు
ప్రతి ప్రశ్నకు మీ ఆప్షన్ ఇవ్వవడానికి వీలుగా మీ ఫోన్ లౌడ్ స్పీకర్ పెట్టుకోండి.
స్వచ్ఛ సర్వేక్షణ్ వారి ప్రశ్నలకు మన స్వచ్ఛ విజయవాడ లోని పరిశుభ్ర పరిసరాలు, మార్కెట్ ప్రాంతాలు, మీ చుట్టుపక్కల చెత్త కుండీల ఏర్పాటు పై గత సంవత్సర కాలంగా విజయవాడ వాసులు చేసిన కృషి పై మీ అభిప్రాయాన్ని తెలుపండి.

స్వచ్ఛ విజయవాడ మనది…. మనందరిది… రండి…

ఇట్లు ,
కమీషనర్,
విజయవాడ నగర పాలక సంస్థ

ప్రశ్నలు ఇవే...ఈ సర్వే లో పాల్గొని మన విజయవాడ ను మొదటి స్థానంలో నిలబెడదాం,స్వచ్చ విజయవాడ సాధన లో పాలుపంచుకుందాం.

vij swatch survey 16012017

విజయవాడ నగరంలో ఆదివారం జరగనున్న మారథాన్ పరుగును పురస్కరించుకుని ఈ పరుగులో పాల్గొనే ఔత్సాహికులకు, క్రీడాకారులకు ఈ మారధాన్ పరుగు నిర్వహించే మార్గంలో ప్రయాణించే వాహనదారులకు, నగర ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

బందరు రోడ్డుపై వెటర్నరీ జంక్షన్ నుండి డిసిపి బంగ్లా, రాఘవయ్య పార్క్, ఆర్టిసి వై జంక్షన్, పోలీస్ కంట్రోల్ రూం, ప్లైఓవర్, కార్పస్ వంతెన, సీతమ్మవారి పాదాలు, ప్రకాశం బ్యారేజీ వరకు రోడ్డుకు ఇరు వైపులా ఉదయం 4 గంటల నుండి 10 గంటల వరకు ఎటువంటి ట్రాఫిక్ అనుమతించరు.

బెంజిసర్కిల్ నుండి వన్ టౌన్ వైపు
బెంజిసర్కిల్, నిర్మలా కాన్వెంట్ జంక్షన్, పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు, శిఖామణి సెంటర్, రెడ్ సర్కిల్, సివిల్ కోర్టులు, రాజగోపాలాచారి వీధి, చల్లపల్లి బంగా, రైల్వేస్టేషన్, ప్రకాశం బొమ్మ, గద్దబొమ్మ కాళేశ్వరరావు మార్కెట్

వన్ టౌన్ నుంచి బెంజిసర్కిల్ వైపు
లోబ్రిడ్డి, ప్రకాశం బొమ్మ, పాత ప్రభుత్వ హాస్పటల్, ఏలూరు లాకులు, అలంకార్ సెంటర్, లెనిన్ సెంటర్, ఏలూరు రోడ్డు, చుట్టగుంట, నైస్ బార్ జంక్షన్, మధు గార్డెన్స్, సిద్దార్ధ కళాశాల జంక్షన్, మదర్ థెరిస్సా జంక్షన్, పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు, నిర్మలా కాన్వెంట్ జంక్షన్

బస్టాండ్ నుండి బెంజిసర్కిల్ వైపు
బెంజిసర్కిల్, స్ర్కూబ్రిడ్డి, నేషనల్ హైవే, కృష్ణలంక పోలీస్ స్టేషన్, బస్లాండ్ మరియు అదే విధంగా వెనుకకు వెళ్లవలెను.

బస్టాండ్ నుండి కృష్ణలంక వైపు
బెంజిసర్కిల్, నిర్మలా కాన్వెంట్ జంక్షన్ నుండి పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డు మీదుగా ఏలూరు రోడ్డు చేరుకోవాలి

నందిగామ వైపు
నందిగావు మరియు జగ్గయ్యపేటకు వెళ్లే ఆర్టిసి బస్ సర్వీసులన్నీ ఉదయం 4 గంటల నుండి 10 గంటల వరకు, ఆర్టిసి బస్టాండ్ నుండి కాక తుమ్మలపల్లి కళాక్షేత్రం, కాళేశ్వరరావు మార్కెట్ నుండి నడుస్తాయి.

ఈ సంక్రాంతికి విజయవాడ నగర వాసులను కనువిందు చెయ్యనున్న ఎయిర్ షో కోసం, ఎయిర్ క్రాఫ్ట్స్ గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్నాయి. విదేశాల నుంచి వచ్చిన పైలట్స్, ఇవాళ గన్నవరం ఎయిర్ పోర్ట్ లో రిహర్సల్స్ చేసారు.

జనవరి 12న సాయంత్రం 4 గంటలకు పున్నమి, భవానీ ఘాట్‌లో నాలుగు విమానాలతో ప్రదర్శన ప్రారంభం అవుతుంది. 13, 14 తేదీల్లో ఉదయం 11.30 గంటల నుంచి 11.45 గంటల వరకూ, సాయంత్రం 4.30 గంటల నుంచి 4.45 గంటల వరకూ ప్రదర్శనలు కనువిందు చేస్తాయి.

దీనికి 500లకు పైగా వివిధ స్థాయి డెలిగేట్స్ హాజరుకానున్నారన్నారు. కేంద్ర పౌర విమానశాఖ మంత్రి పి.అశోక్ గజపతిరాజు ఈ సమ్మిట్ ప్రారంభిస్తారు, ముఖ్య అతిధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు.

air show reharsels 09012017 2

విజయవాడ నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాల ప్రక్రియను మెరుగుపర్చేందుకు సాంకేతికతను జోడించి వేగంగా చెత్తను తరలించేందుకు స్మార్ట్ డంపర్ బిన్ విధానానికి అధికారులు శ్రీకారం చుట్టారు. నగరంలోని లయోలా కళాశాల రహదారి వెంట పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఇది విజయవంతమైతే నగరంలోని 59 డివిజన్లకు విస్త స్తారు. ఈ విధానంతో చెత్త సేకరణ, తరలింపు సులభతరంగా మారుతుందని భావించిన ఉన్నతాధికారులు ఆయా స్మార్ట్ డంపర్ బిన్ విధానాన్ని ప్రయోగాత్మకంగా నగరంలోని తూర్పు నియోజకవర్గంలోని లయోలా కళాశాల ప్రాంతంలో ప్రారంభించారు.

ఇవి ఎలా పని చేస్తాయి అంటే..
ఈ స్మార్ట్ డంపర్ బిన్ లను భూమిలోపల అమర్చుతున్నారు. దీంతో ఇది పైకి అంతగా కనిపించదు. దానికి సెన్సారింగ్ విధానం అనుసంధానం చేస్తారు. దీంతో చెత్త నిండిన తదుపరి ప్రత్యేక నియంత్రణ, సెన్సారింగ్ విధానంలో అధికారులకు SMS అందుతుంది. సామాచారం అందుకున్న వారు, ఈ మేరకు సిబ్బందిని అప్రమత్తం చేసి, బిన్ను ఖాళీచేసి చెత్తను వాహనంలో తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారు.

ముందుగా 10 అడుగుల పొడవు గల గొయ్యి తీసి, అందులో ప్రత్యేకంగా రూపొందించిన డంపర్ బిన్ ఉంచుతారు. లోపాలకి వెళ్ళగా, బయటకి 4 అడుగుల్లో బిన్ ఉంటుంది. తర్వాత మూడు వైపులా ప్రత్యేకంగా గోడలు అమర్చుతారు. టైల్స్ సైతం అమర్చి అత్యంత సుందరంగాను, దుర్వాసన వెలువడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా స్మార్ట్ డంపర్ బిన్ 1.5 టన్నుల వరకు చెత్త నింపేందుకు అవకాశం ఉండగా, అందుకు అనువుగా ప్రత్యేకంగా ఒక్కొక్క బిన్లో పాలీప్రాపిలిన్ డర్పల్ బ్యాగులను అమర్చుతారు. ఆయా బ్యాగులను చిన్నపాటి తాడుతో పకడ్బందీగా కట్టి ఉంచుతారు. చెత్తను తరలించే సందర్భంగా స్మార్ట్ బిన్ లోని బ్యాగులను తొలగించి నేరుగా వాహనంలోకి దిగుమతి చేస్తారు. ఆ పై తిరిగి బ్యాగును బిన్ లో అమర్చేలా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం భూమిలోపల ఉండడంతో చెత్త అధికమై రహదార్లపై పడడం, కుక్కలు, పందులు వంటివి అక్కడకు రావడం లాంటివి జరగవని అధికారులు పేర్కొంటున్నారు.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read