దశాబ్దాల కల సాకారం కాబోతోంది. బెజవాడ శిగలోకి బిగ్ ఐటీ ఇండస్ట్రీ రాబోతోంది. సాఫ్ట్ వేర్, హార్డ్వేర్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన హెచ్సీఎల్ సంస్థ కేసరపల్లి దగ్గరలోని ఏపీఐఐసీ సెజ్ భూములలో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర ఐటీ శాఖతో ప్రాధమిక అవగాహనకు వచ్చిన హెచ్-సీ-ఎల్, ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో గేట్-వే హోటలో లో, ఆవగాహన ఒప్పందం కుదుర్చుకొనేందుకు సన్నద్ధమైంది. హెచ్ సీఎల్ ఆధిపతి శివ నాడర్ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ ఈ మేరకు ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు.

ఇదీ ప్రయోజనం..
హెచ్-సీ-ఎల్ సంస్థ రాజధానిలో రూ.500 కోట్ల పెటుబడులు పెట్టనున్నది. ఫలితంగా 5000 మందికి ఉపాధి ఆవకాశాలు కల్పిస్తుంది. ఇందు కోసం పరిశోధన ఆభివృద్ధి ప్రయోగశాల(ఆర్ ఆం డీ ల్యాబ్) ఏర్పాటు చేస్తుంది. అమరావతిలోనూ మరో ఐదు వేల మంది సామర్థ్యం కలిగిన మరో బీపీఓను తరువాత దశలో ఏర్పాటు చేయనుంది.

అంతేకాదూ ఐటీ ఆధారిత సేవలు కూడా అందిస్తుంది. దీంతో పాటు ఐటీ నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థను ఏర్పాటు చేసి, ఏటా కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన 35 వేల మంది విద్యారులకు ఉపాధి ఆవకాశాలు అందిపుచ్చుకునేలా శిక్షణ ఇస్తుంది. తన కార్యకలాపాల కోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలో సంస్థను ఏర్పాటు చేయనున్నది. ఆప్పటి వరకూ విజయవాడ మేధా టవర్స్ లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు హెచ్-సీ-ఎల్ సిదమైంది.

హెచ్-సీ-ఎ రాకతో బెజవాడ ఐటీ శోభను సంతరించుకుంటోంది. ఇప్పటికే కేసరపల్లి దగ్గర మేధా టవర్స్ లో కొన్ని చిన్న చిన్న ఐటీ కంపెనీలు పని చేస్తున్నాయి. కొద్ది రోజుల కిందట జవహర్ ఆటోనగర్ లో తొమ్మిది మధ్య తరహా ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ క్రమంలో బెజవాడకు ఓ బిగ్ ఐటీ ఇండస్త్రీ వస్తే బాగుంటుందన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇన్నాళ్ళకు హెచ్సీఎల్ రూపంలో ఆ కల తీరబోతోంది. త్వరలో మరిన్ని ఐటీ కంపెనీలు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టనున్నాయి.

రాష్ట్రంలో ఎయిర్ ఇండియా నాలుగు కొత్త విమాన సర్వీసులు నడపనుంది. ఒక్క బుధవారం మినహా మిగిలిన అన్ని రోజులు ఈ కొత్త విమాన సర్వీసులు నడుస్తాయి.

కొత్త సర్వీసుల వివరాలు :
1) వైజాగ్ లో ఉదయం 06.30 గంటలకు బయలుదేరే AI 9527 విమాన సర్వీసు విజయవాడ మీదుగా ఉదయం 09.00 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి AI 9528 సర్వీసు విమానం ఉదయం 09:25 గంటలకు తిరుపతిలో బయలుదేరి విజయవాడ మీదుగా ఉదయం 11 గంటల 55 నిమిషాలకు వైజాగ్ చేరుకుంటుంది.
2) వైజాగ్ లో మధ్యాహ్నం 12.40 గంటలకు బయలుదేరే AI 9533 విమాన సర్వీసు భువనేశ్వర్ కు మధ్యాహ్నం 01.05 గంటలకు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 02.30 గంటలకు భువనేశ్వర్ లో బయలుదేరి మధ్యాహ్నం 03.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది.

3) వైజాగ్ లో సాయంత్రం 04.35 గంటలకు బయలుదేరే AI 9535 విమాన సర్వీసు రాయ్ పూర్ కు సాయంత్రం 06.00 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 06.25 గంటలకు రాయ్ పూర్ నుంచి బయలుదేరి రాత్రి 08.00 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది.
4) వైజాగ్ లో ఉదయం 10.45 కు బయలుదేరే AI 9537 విమాన సర్వీసు విజయవాడ మీదుగా మధ్యాహ్నం 01.10 గంటలకు హైద్రాబాద్ చేరుకుంటుంది. ఈ సర్వీసు ఒక్క బుధవారం మాత్రమే నడపుతారు.

 

విజయవాడ నగరాన్ని మెట్రోపాలిటన్ ప్రాంతంగా గుర్తిస్తూ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. మెట్రో రైలు ప్రాజెక్టు రావాలంటే ఆ నగరానికి మెట్రో హోదా తప్పనిసరి. ఈ దృష్ట్యా నగరపాలక సంస్థ పాలక మండలి విజయవాడతో పాటు శివారు ప్రాంతాల్ని కలుపుతూ మెట్రో నగరంగా మారుస్తూ గతంలోనే తీర్మానం చేసింది. ఆ తీర్మానానికి కొనసాగింపుగా ఇవాళ పట్టణాభివృద్ధి శాఖ ఈ ప్రాంతాన్ని మెట్రోపాలిటన్ గా గుర్తిస్తూ 104జీవో జారీచేసింది. పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. విజయవాద సహా 19 గ్రామాలను కలిపి మెట్రోపాలిటన్ ఏరియాగా తీర్మానం చేసారు.

విజయవాడ వంటి 59 డివిజనులు ఉన్న నగరం పరిధిలోకి మెట్రో రైల్ ప్రాజెక్టు రాదు. ఇప్పటికే విజయవాడ పరిధి దాటిపోయింది. ఏ నగరంలో మెట్రో పనులు ప్రారంభించాలన్నా ఆ ప్రాంతం మెట్రోపాలిటన్ ఏరియాగా ఉండాల్సి ఉంటుంది. మెట్రోపాలిటన్ ఏరియా వేరు. మెట్రోపాలిటన్ సిటీ వేరు. మెట్రోపాలిటన్ ఏరియా అంటే, భవిష్యత్తులో విలీనానికి అవకాశం ఉన్న ప్రాంతాలుగానే చెప్పకోవాల్సి ఉంటుంది. మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభించటానికి వీలు కల్పిస్నూ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించి 10 లక్షల జనాభా విధిగా కలిగి ఉండాల్సిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ విజయవాడను మెట్రోపాలిటన్ ఏరియాగా ప్రకటించటంతో కధ సుఖాంతమొంది.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కూడా త్వరలో విజయవాడను మెట్రోపాలిటన్ గా నోటిఫై చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయితే అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుంది. తాజా ఉత్తర్వులతో మెట్రో రైలు పనులకు మార్గం సుగమం అయిందని అమరావతి మెట్రో రైలు కార్పొరేష‌న్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు.

కేవలం మెట్రో రైలు నిర్మాణం చేపట్టబోయె గ్రామాలను మాత్రమే మెట్రోపాలిటన్ ఏరియాగా గుర్తించారు. అలా గుర్తించిన గ్రామాలను విజయవాడ కార్పొరేషన్ లో విలీనం చేయడానికి జీఓ ఏమీ విడుదల చేయలేదు. మరి ఈ గ్రామాలు, విజయవాడ కార్పొరేషన్ లో విలీనం చేస్తారో లేదో, చూడాలి.

ఇవి మెట్రోపాలిటన్ ఏరియాలో కలిసే గ్రామాలు
గన్నవరం వైపు: రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికెపాడు, నిడమానూరు, దొనె ఆత్కూరు, గూడవల్లి, కేసరపల్లి, బుద్దవరం, గన్నవరం
పెనమలూరు వైపు: కానూరు, పోరంకి, తాడిగడప, యనమలకుదురు, పెనమలూరు
గొల్లపూడి వైపు: జక్కంపూడి, గొల్లపూడి
నూజివీడు వైపు: నున్న, పాతపాడు, అంబాపురం

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పచ్చదనం, సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మహానగరాన్ని అత్యంత ఆధునికంగా, సకల సౌకర్యాలతో పచ్చదనం, జలకళ(బ్లూ-గ్రీన్) ఉట్టిపడేవిధంగా అద్భుతంగా నిర్మించాలన్న ధృడ సంకల్పంతో ఉన్నారు.

అందులో భాగంగానే విజయవాడలో పచ్చికబయళ్లు, మోండో గడ్డి, మొక్కల పెంపకం, నడక దారుల నిర్మాణం వంటి సుందరీకరణ పనులు ఆకట్టుకుంటున్నాయి. గన్నవరం వెళ్ళే రహదారి ఎంతో ఆహ్లదకరంగా పచ్చదనం పరుస్తూ, స్వాగతం పలుకుతుంది. రకరకాల పూల మొక్కలు, పచ్చని చెట్లతో హైవే కళకళలాడుతోంది.

ఈ వీడియో చూడండి, రాజధాని రోడ్డులు ఏ రేంజ్ లో ఉన్నాయో, ఎంత అందంగా ఉందో..

ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన ఇంద్రకీలాద్రిపై కొలువైన క‌న‌క‌దుర్గమ్మ ఆలయంలో అష్టలక్ష్మిల ముందు బుధ‌వారం ఉద‌యం అరుదైన నక్షత్రతాబేలు కనిపించింది. నిత్య పంచహారతుల వెండి సామాగ్రిని కడుగుతుండగా పూలకుండీల చాటున తాబేలు సిబ్బందికు కనిపించింది. దీంతో వెంటనే ఆలయ సిబ్బంది ఈ స‌మాచారాన్ని దుర్గ‌గుడి ఈవో సూర్యకుమారి దృష్టికి తీసుకువెళ్ళారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ సహజంగా దట్టమైన అటవీ ప్రాంతాలలో ఎండుటాకుల మద్య మట్టిలో జీవించే అరుదైన నక్షత్ర తాబేలును మహాలక్ష్మీ స్వరూపంగా కొలుస్తారన్నారు. అలాంటి అరుదైన ఈ వన్యప్రాణి దుర్గ‌మ్మ సన్నిధిలో అష్టలక్ష్ముల వద్ద దర్శనమీయడం శుభసంకేతమని అన్నారు. దీనిని ఏ విధంగా సంరక్షించాలనేది నిపుణులను సంప్రదిస్తామని తెలిపారు.

ఇంద్రకీలాద్రి కొండప్రాంతం నుండి ఈ తాబేలు జారిపడి వుంటుందని అక్కడి ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. శ్రీలక్ష్మీనారాయణ స్వరూపంగా భక్తులు కొలిచే అరుదైన కూర్మం అమ్మవారి సన్నిధిలో దర్శనమీయడం అదృష్టం అని, అమ్మవారి దర్శనంతో పాటు కూర్మదర్శనం అవ‌డం త‌మ పూర్వజన్మ సుకృతమని దివ్యదర్శనము పధకము ద్వారా విజయనగరం జిల్లా నుండి వచ్చిన యాత్రికులు త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read