అతి వేగం... పైగా హెల్మెట్ లేదు... విజయవాడ, మొగల్రాజపురం పెట్రోల్ బంక్ దగ్గర KTM బైక్ వేసుకుని, వస్తున్న ఇద్దరూ యువకులు అక్కడికక్కడే మృతి చెందారు....

ఆదివారం తెల్లవారుఝామున నాలుగు గంటల సమయంలో ఓవర్ స్పీడ్ తో వస్తు, డివైడర్ పై వున్న ఎలక్ర్టికల్ పోల్‌తో పాటు ఫోల్‌పై ఫీజు బాక్స్‌కు గట్టిగా గుద్దటంతో, ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు...

బైక్ ఒక చోట ఉంటే, బాడీలు 100 మీటర్ల దూరంలో ఉన్నాయి... విజయవాడ సిటీలో కూడా ఇంత వేగంగా వచ్చి, అది కూడా హెల్మెట్ లేకుండా ఉండటంతో, వారు చనిపోయింది కాక, వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి కుటుంబాల్లో కూడా విషాదఛాయలు మిగిల్చారు...

ఈ ఉదంతంతో అయినా, మరోసారి మన జీవితాలు ఎంత ముఖ్యమో, మన కుటుంబ సభ్యులకి మనం ఎంత అవసరమో గుర్తించి, ఓవర్ స్పీడ్ వెళ్ళకుండా, పోలీస్లు చెప్పినట్టు సిటీలో అయినా సరే హెల్మెట్ వేసుకుందాం..

ॐ ..శరన్నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి ఆదివారం విజయవాడలో అమ్మవారి అలంకారం- *శ్రీ అన్నపూర్ణా దేవి* ॐ

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణ వల్లభే!
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతీ!!

అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది.
అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది.

మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.
ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరిమ్చి, తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. " హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా" అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి దధ్యోదనము, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి.

dasara day 4 2017 2

ॐ ..శరన్నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం విజయవాడలో అమ్మవారి అలంకారం- *శ్రీ స్వర్ణకవచాలంకృతదుర్గాదేవీ* ॐ

మాతర్మే మధుకైటభఘ్ని మహిష 
ప్రాణాపహారోద్యమే
హేలానిర్మిత ధూమ్రలోచనవథే,
హేమాంచ మండార్ధిని!
నిశ్శేషీకృత రక్తబీజ దనుజే| నిత్యే| 
నిశుంభావహే
శుంభధ్వంసిని సంహరాశు దురితం 
దుర్గే- నమస్తేంబికే!!

పూర్వం మాధవవర్మ మహారాజు విజయవాటికాపురిని ధర్మం తప్పక పాలించు సమయాన, రాజ కుమారుని రథ చక్రాలకింద ఓ బాలుడు మరణించగా తన కుమారుడని ఉపేక్షించక మరణశిక్ష విధించిన రాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు పురమందు కొన్ని ఘడియలు కనకవర్షం కురిపించింది. అప్పటినుండి అమ్మ కనకదుర్గ గా కొలవబడుతూ దసరా మహోత్సవంలో స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ గా అలంకరించడం జరుగుతున్నది..అమ్మ దర్శనం.. స్మరణం..పఠనం వల్ల సకల దారిద్ర్యములు నశించును

dasara day 1 2017 2

!!నవరాత్రి పర్వదినములలో రెండవరోజు అమ్మవారి అలంకారము బాలా త్రిపురసుందరీ దేవి.

"హ్రీంకారాసన గర్భితానల శిఖాం
సౌ:క్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం
త్రినేత్రోజ్జ్వలామ్
వందే పుస్తక పాశమంకుశధరాం
స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం
పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్"

శరన్నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజు దుర్గమ్మ బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోతాయి. సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత.

కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. సత్సంతానాన్ని అనుగ్రహించే దేవతగా త్రిపురసుందరీదేవి భక్తుల పూజలందుకుంటోంది. ఈ రోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మ వారి స్వరూపంగా పూజచేసి కొత్త బట్టలు పెట్టాలి. "ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అమ్మవారికి పొంగలి నివేదన చెయ్యాలి. త్రిశతీ పారాయణ చెయ్యాలి.

నైవేద్యం - పొంగలి,తీపిబూంది,శెనగలు.

dasara day 2 2017 2

విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే విస్తరణ పనులకు గురించి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని గురువారం బెంగుళూరు నుండి గన్నవరం విమానాశ్రయూనికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కలెక్టరు బి.లక్ష్మీకాంతం విమానాశ్రయంలో జరుగుతున్న రన్ వే విస్తరణ పనులను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ఉన్న రన్ వేను 3,350 మీటర్లు విస్తరణ చేస్తున్నామని వివరించారు. ఈ విస్తరణతో బోయింగ్ 747 వంటి భారీ స్థాయి విమానాలు రన్వే పై సులభతరంగా దిగేందు వీలుగా అవకాశం ఉంటుందని వివరించారు.

ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ మదుసూదనరావు, కలెక్టరు బి.లక్ష్మీకాంతంతో, పనులు వేగవంతం కావటానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని సీఎం ప్రశ్నించగా.. కొన్ని అంశాలను ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత రన్‌వే ఎండ్‌ పాయింట్‌ నుంచి బుద్దవరం మీదుగా వెళ్ళే రోడ్డును డైవర్షన్‌ చేయాల్సి ఉందని, మంచినీటి పైపులైన్లను మళ్లించాల్సి ఉందని, మేజర్‌ డ్రెయిన్‌ను తరలించాల్సి ఉందని, హైటెన్షన్‌ వైర్లను కూడా మార్చాల్సి ఉందని చెప్పారు. ఇవన్నీ విన్న సీఎం చంద్రబాబు వెంటనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఫోన్లు చేసి విస్తరణకు ప్రతిబంధకంగా ఉన్న అంశాలపై గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది.

సరిగ్గా 11 గంటలకు ఆయన విమానంలో కుప్పం వెళ్ళారు. సీఎం విమానాశ్రయం నుంచి నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడటంతో సంబంధిత శాఖల అధికారులంతా విమానాశ్రయానికి క్యూ కట్టారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో ఎస్‌ఈలు వచ్చారు. అప్పటికే సీఎం వెళ్ళిపోవటంతో ఆయన వచ్చే వరకు వెటరినరీ కళాశాలలో ఉన్న గెస్ట్‌హౌస్‌లో ఉన్నారు. అక్కడే కలెక్టర్‌ లక్ష్మీకాంతం చేయాల్సిన పనులకు సంబంధించి సమీక్ష చేశారు. కుప్పం నుంచి బయలుదేరి నాలుగు గంటలకు సీఎం ఎయిర్‌పోర్టుకు వస్తారని తెలియటంతో వేచి చూశారు. సీఎం వచ్చే గంట ముందు కలెక్టర్‌ విస్తరణ పనులను పరిశీలించారు. సీఎం విమానం దిగిన తర్వాత ఆయనకు ఎదురేగారు.

అధికారులంతా ఒకేసారి రావటంతో సీఎం పెండింగ్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత వారందరితో కలిసి ప్రస్తుత రన్‌వే ఎండింగ్‌ పాయింట్‌కు వెళ్లి విస్తరణ పనులను పరిశీలించారు. పనులను ఇంకా వేగంగా చేపట్టటానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం ఆదేశించారు. ఉదయం సీఎం ఎయిర్‌పోర్టులో రన్‌ వే విస్తరణ పనులపై సమీక్ష చేయంతో సాయంత్రానికి అధికారులంతా అటెన్షన్‌ కావటంతో అప్పటికపుడు పరిష్కారం లభించింది. రెండు నెలల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ఒక్కసారిగా చిక్కుముడి వీడింది.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read