ప్రకాశం బ్యారేజీ మరమ్మతుల నిమిత్తం అర్ధరాత్రి నుంచి ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భద్రత నిపుణుల ప్రత్యేక కమిటి సూచనల మేరకు ప్రకాశం బ్యారేజీ గేట్లు మరమత్తులు చేయులాని నిర్ణయించారు. దీంతో ఈనెల 17వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు బ్యారేజ్ వైపు గుంటూరు నుంచి వచ్చే వాహనాలు, విజయవాడ వైపు నుంచి వెళ్ళే వాహనాలకు అనుమతి లేదు. దీంతో సచివాలయానికి యానికి వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నయ మార్గాలు పోలీసులు సూచించారు.

హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి, సితారా సెంటర్, చిట్టినగర్, విజి చౌక్, పంజా సెంటర్ లో బ్రిడ్డి, ప్రకాశం విగ్రహం, పోలీసు కంట్రోల్ రూము, రాఘవయ్య పార్కు సెంటర్, NH-65, కనకదుర్గ వారధి, తాడేపల్లి పాత టోల్గేటు, ఎన్ టి ఆర్ కట్ట, రైల్వే అండర్ పాస్, స్ర్కూ బ్రిడ్డి, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గుహలు, పెనుమాక, కృష్ణయ్యపాలెం, మందడం గ్రామం, మల్టిపురం జంక్షన్, వెలగపూడి మీదుగా వెళ్ళాలి.

లేదా, చిట్టినగర్, విజి చౌక్, బ్రాహ్మణ వీధి, బొడ్డు బొమ్మ, వినాయక టెంపుల్, సీతమ్మ వారి పాదాలు, NH-65, కనకదుర్గ వారధి, తాడేపల్లి పాత టోల్గేటు, ఎన్ టి ఆర్ కట్ట, రైల్వే అండర్ పాస్, స్ర్కూ బ్రిడ్డి, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గుహలు, పెనుమాక, కృష్ణయ్యపాలెం, మందడం గ్రామం, మల్టిపురం జంక్షన్, వెలగపూడి మీదుగా వెళాలి.

అదే విధంగా కుమ్మరిపాలెం నుంచి ఘాట్ రోడ్డు మీదుగా వచ్చే వాహనాలు, పి ఎస్ ఆర్ విగ్రహం, బొడ్డు బొమ్మ, వినాయక టెంపుల్, సీతమ్మవారి పాదాలు, ఎన్ హెచ్-65, వారధి, తాడేపల్లి, ఎన్టీఆర్ కట్ట తదితర మార్గాల ద్వారా సచివాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది.

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి వచ్చే వాహనాలు రామవరప్పాడు రింగ్, బెంజ్ సర్కిల్, స్ర్కూబ్రిడ్డి, వారధి మీదుగా, వారధి నుంచి వెలగపూడి వెళ్లేందుకు ఉండవల్లి సెంటర్, డాన్ బాస్కో స్కూల్ జంక్షన్, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, వెలగపూడి వెళ్లాల్సి ఉంటుంది.

నగర ప్రజలు, ట్రాఫిక్ మళ్లింపులు గుర్తించి సహకరించాలని పోలీసులు కోరారు.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కన్నుమూశారు. ఆయన మృతిపట్లు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. నెహ్రూ 1983, 1985, 1989, 1994, 2009లో ఎమ్మెల్యేగా నెహ్రూ గెలుపొందారు. బెజవాడ రాజకీయాల్లో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. ఒక్క కంకిపాడు నుంచే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నెహ్రూ గెలిచారు. విజయవాడ తూర్పు నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

తెలుగుదేశం పార్టీలోకి తిరిగి చేరిన సందర్భంగా, దేవినేని నెహ్రూ అన్న మాటలు, అందరూ గుర్తు చేసుకుంటున్నారు... ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుని, ఇందుకేనేమో ఆ రోజు నెహ్రు గారు అలా మాట్లాడింది అని తలుచుకుని బాధ పడుతున్నారు.

ఇవి దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలోకి తిరిగి చేరిన సందర్భంగా గుణదల బిషప్‌ గ్రాసీ హైస్కూల్‌లో జరిగిన బహిరంగ సభలో అన్న మాటలు:

‘రాజకీయంగా టీడీపీలో పుట్టాను. ఎన్టీఆర్‌ నాకు రాజకీయ బిక్ష పెట్టారు. చనిపోయినా టీడీపీ జెండా కప్పుకునే చనిపోతా. ఈ కోరిక తీరడానికే మళ్ళీ పార్టీలోకి చేరానేమో అనిపిస్తోంది. 23 ఏళ్ళ వయసులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచా. నాకు ఇప్పుడు 62 ఏళ్ళు. టీడీపీ జెండాతోనే చనిపోతా’ మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అన్నారు. ఈ సందర్భంగా గుణదల బిషప్‌ గ్రాసీ హైస్కూల్‌లో జరిగిన బహిరంగ సభలో నెహ్రూ ఉద్వేగ పూరితమైన ప్రసంగం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'ఎన్టీఆర్‌ ఆరోగ్య రక్ష' కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉంటున్న తెలుగు ఎన్నారై.. ప్రవాస తెలుగువారికి అన్నివిధాలా అండదండగా నిలుస్తున్న ఏపీఎన్నార్టీ సమన్వయకర్త (సౌత్‌వెస్ట్‌-యునైటెడ్‌ స్టేట్స్‌).. మాధవి మేడి తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా పెదపులిపాకలోని ప్రజలందరికీ ఈ పథకం కింద ఆరోగ్యబీమా చేయించడానికి ముందుకొచ్చారు. ఈ స్కీంలో చేరేందుకు ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.1200 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. గ్రామంలో ప్రజలకు నూరుశాతం ఇన్స్యూరెన్స్ ప్రీమియంను చెల్లించేందుకు ఏడాదికి రూ.2లక్షల వరకూ ఖర్చవుతుందని ఆమె తెలిపారు.

గత ఏడాది మే నెలలో.. గుండెపోటుతో మరణం అంచుల దాకా వెళ్లిన తన తండ్రి వైద్యుల నైపుణ్యం, సంరక్షణచర్యలతో కోలుకున్నారని, అలాంటి వైద్య సంరక్షణే గ్రామంలోని అందరికీ అందజేయాలని తాను భావించానని మాధవి మేడి తెలిపారు. అందుకు మార్గం ఆరోగ్యబీమాయే కాబట్టి ఊరందరికీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చేయిస్తున్నట్టు చెప్పారు. దీనిపై తొలుత తాను ఏపీఎన్నార్టీ సీఈవో రవికుమార్‌ వేమూరుతో చర్చించానని ఆమె వివరించారు. తన చర్యతో విదేశాల్లో ఉంటున్న ప్రవాస తెలుగువారంతా తమతమ సొంత ఊళ్లలోని ప్రజలందరికీ ఆరోగ్యబీమా చేయించేలా ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నట్టు ఆమె తెలిపారు.

కాగా.. ఏపీఎన్నార్టీ సీఈవో రవి వేమూరు మాట్లాడుతూ.. ఏపీలోనే కాక, భారతదేశంలోనే 100 శాతం ప్రజలు ప్రభుత్వ ప్రాయోజిత ఆరోగ్యబీమా కలిగి ఉన్న గ్రామంగా పెదపులిపాక చరిత్ర సృష్టించిందన్నారు. ప్రజలందరికీ కనీస ఆహారం, నీరు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వంటి లక్ష్యాలను సాధించేందుకు ఏపీఎన్నార్టీ కృషి చేస్తోందని చెప్పారు. విదేశాల్లో ప్రతి పౌరుడికీ ఇవి తప్పనిసరిగా అందుబాటులో ఉంటాయని.. మనదేశంలోనూ అలా అందరికీ అందుబాటులోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక, జన్మభూమి రుణం తీర్చుకుంటున్న మాధవి మేడి ఏపీఎన్నార్టీలోనూ చురుగ్గా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

 కృష్ణాజిల్లా సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవినేని నెహ్రూ సోమవారం ఉదయం కన్నుమూశారు.

కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

కనకదుర్గ గుడివద్ద నిర్మిస్తున్న ప్లై ఓవర్ పనులు తుదిదశకు చేరుకున్నాయని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అన్నారు. శనివారం కలెక్టర్ కుమ్మరిపాలెంవద్ద ఫైఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దశలువారీగా జరిగిన పనుల్లో భాగంగా తుదిగా వింగ్స్, స్పైన్స్ బిగింపు పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

మొదటి దశ పనుల్లో భాగంగా పైల్స్, పిల్ల‌ర్ల నిర్మాణం, తరువాత ఫిల్లర్ క్యాప్స్ నిర్మాణం జరిగిందని చివరిదశ పనులు ప్రారంభం అయ్యాయన్నారు. చివరిదశ పనుల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు విధించటం జరిగిందని, నాలుగునెలల్లో ఫ్లైఓవర్ ప్రయాణీకులకు అందుబాటులోనికి వస్తుందన్నారు. ఫ్లైఓవర్ పనుల్లో భాగస్వాములు అయిన ప్రతిఒక్కరికీ కలెక్టర్ బాబు.ఎ అభినందనలు తెలిపారు.

kanakadurga flyover udpate 16042017 2

kanakadurga flyover udpate 16042017 3

kanakadurga flyover udpate 16042017 4

More Articles ...

Advertisements

Latest Articles

Most Read