కృష్ణా నదీ తీరంలోని దీవుల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ బాధ్యతలను అంతర్జాతీయ సంస్థ స్టూడియోపాడ్ దక్కించుకుంది. భవానీ ఐలాండ్, శాండ్ ఐలాండ్, ప్లాంటేషన్ ఐలాండ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేయటానికి తగిన ప్రణాళికలతో కూడిన మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేసేందుకు స్టూడియోపాడ్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు నెలల్లో ఈ సంస్థ మాస్టర్ ప్లాన్ అందచేయాల్సి ఉంటుంది.

స్టూడియోపాడ్ అనేది మన దేశానికి చెందిన అంతర్జాతీయ సంస్థ. అయితే, ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు నిర్దేశిస్తుంది. అమెరికా దేశ భాగస్వామ్యంతో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేస్తుంటుంది. కృష్ణా నదిలోని దీవుల అభివృద్ధికి ఏపీటీడీసీ టెండర్లను పిలిచింది. ఈ క్రమంలో అర్హతలు, ప్రామాణికాల ఆధారంగా స్టూడియోపాడ్ ను ఎంపిక చేశారు.

స్టూడియోపాడ్ సంస్థ ఏమేమి చేయాల్సి ఉంటుందన్న దాని పై ఏపీటీడీసీ అధికారులు ఆర్ఎఫ్పీని విడుదల చేశారు. ఈ ఆర్ఎఫ్పీని అధ్యయనం చేసిన స్టూడియోపాడ్ సంస్థ ఏపీటీడీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ముందుగా భవానీ ద్వీపం పై దృష్టిసారిస్తుంది. భవానీ ద్వీపం భౌగోళిక స్వరూపం, కృష్ణానది, శతాబ్దాలనాటి వరదల చరిత్ర వీటన్నింటినీ అధ్యయనం చేసి ఒక నివేదికను అందిస్తుంది. ఈ నివేదిక ప్రకారం భవానీ ద్వీపంలో నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతిపాదనలు తయారుచేస్తుంది.

అన్ని దీవులకు ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. తొలి దశలో పర్యాటకాభివృద్ధి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భవానీ ఐల్యాండ్ కే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇప్పటికే భవానీ ఐల్యాండ్ ను దాదాపుగా రూ. 4 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నారు. భవానీ ద్వీపాన్ని ఓ ఫిలిం సిటీ లాగ అభివృద్ధి చేయటానికి అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్యూటిఫికేషన్ చేపడుతున్నారు. చూడ చక్కటి ఆర్కిటెక్ట్, అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్స్ ఆవిష్క రించే ప్రతిపాదనలు చేయనున్నారు.

వీటితో పాటు భవానీ ద్వీపాన్ని సింగపూర్ లోని సెంతోసా తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సెంతోసాను మించి ఏ విధంగా పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్చన్న దాని పై తగిన ప్రణాలికలను నిర్దేశించనుంది. పర్యాటకం, ఆనందం, ఉత్కంఠ, వినోదం, ఆహ్లాదం, ఆటవిడుపు, ఆహారం వంటి అంశాలతో సుందరీకరించే విధంగా నివేదికలు ఇవ్వనుంది. భవానీ ఐలాండ్ లో ఇప్పటికే అంతార్జాతీయ స్థాయిలో లేజర్ మ్యూజిక్ ఫౌంటెయన్ వంటివి ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

భవానీ ఐలాండ్ పక్కన పెడితే మిగిలిన దీవులైన శాండ్ ఐలాండ్, ప్లాంటేషన్ ఐలాండ్ కు, సంబంధించి వాటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలను నిర్దేశించనుంది.

సరిగ్గా పదేళ్లు... కృష్ణా డెల్లా రైతులకు జూన్ నెలలో సాగు నీరిచ్చి... ఆ నీటి కష్టాలను పక్కకు తోసేస్తుంది "పట్టిసీమ". పదేళ్ల తర్వాత తూర్పు డెల్లా రైతులకు తొలి సారిగా జూన్ నెలలో సాగునీరు అందజేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ నీటిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం విడుదల చేస్తారు.

పట్టిసీమ ద్వారా రోజుకు 2500 క్యూసెక్కుల నీరు కృష్ణా నదిలోకి చేరుతోంది. పట్టిసీమ నుంచి నీరు విడుదల చేయకముందు ఎనిమిది అడుగుల నీటిమట్టం ప్రకాశం బ్యారేజిలో ఉండేది. ఇప్పడు అది ఆదివారం నాటికి 11 అడుగులకు చేరింది. సోమవారానికి ఈ నీటి మట్టం 12 అడుగులకు చేరుతుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

వాస్తవానికి పట్టిసీమ నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణాలోకి తరలించాలన్నది సర్కారు సంకల్పం. ఈ ఏడాది దీన్ని 100 టీఎంసీలకు పెంచాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఎంత ఎక్కువగా నీటిని కృష్ణాలోకి పంపింగ్ చేస్తే అంత మంచిదని జల వనరుల శాఖ చూస్తున్నది. జూలై, ఆగష్టు, సెప్టెంబర్లో గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో లక్షలాది క్యూసెక్కల నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నది. గోదావరికి వరదలు వస్తే పట్టిసీమ ద్వారా మరింత ఎక్కువ నీటిని కృష్ణాకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. తద్వారా ప్రకాశం బ్యారేజిలో నీటిమట్టం అనూహ్యంగా పెరుగుతున్నదని వారి అభిప్రాయంగా ఉన్నది.

నగరానికి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా పేరొందిన బెంజిసర్కిల్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్ రహదారి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్, నేషనల్ హైవే ఆధారిటీ, ట్రాఫిక్ పోలీస్ తదితర శాఖలకు చెందిన అదికారులు నూతనంగా ఆంక్షలను విధించారు.

దీంతో సర్కిల్ వద్ద కొత్త రూప సంతరించుకుంది. ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా తొలుత బెంజిసర్కిల్ నుంచి ఎస్వీఎస్ కళ్యాణ మండపం వరకు ఉన్న గ్రీనరీ ప్రాంతంలో పిల్లర్ల నిర్మాణ పనులను చేపడుతున్నారు.

జాతీయ రహదారి - అవతలి వైపు ఉన్న ఆంజనేయ స్వామి గుడి నుంచి సితార టవర్స్ సమీపంలోని టీ క్యాంటీన్ మధ్యలో ఉన్న గ్రీనరీలో పనులు జరుగుతుండటంతో రెండు రహదారుల మధ్యలో దాదాపు 15 అడుగుల ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు.

వేదిక కళ్యాణ మండపం ఎదురుగా జాతీయ రహదారి పక్కన గతంలో ఉన్న బస్ షెల్లర్ను కూల్చివేశారు. నిత్యం రాత్రి వేళలో ఏర్పాటు చేసే ఫుడ్ కోర్ట్ ను తొలగించారు. టీ కాంటీన్ ఎదురుగా సర్వీసు రోడ్డులో ఉండే డంపర్ బిన్లను కార్పొరేషన్ అధికారులు తొలగించారు. ఆంజనేయ స్వామి గుడి సమీపంలో సితార టవర్స్ ఎదురుగా నూతనంగా స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు.

ట్రాఫిక్ మళ్లింపు
ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బెంజిసర్కిల్ వచ్చే క్రమంలో, వారది, బస్ స్టాండ్ కు వెళ్ళే వాహనాల కొరకు ఏర్పాటు చేసిన ఫ్రీ లెఫ్ట్ మార్గాన్ని ఆంజనేయస్వామి గుడి వెనుక నుంచి వేదిక కళ్యాణ మండపం మీదుగా సర్వీసు రోడు వైపు మళ్లించారు.

ఈ వాహనాలు సితార టవర్స్ సమీపంలో ఉన్న టీ క్యాంటిన్ ఎదురుగా ఉన్న గ్రీనరీ మధ్యలో నుంచి జాతీయ రహదారిలోకి వెళ్ళే విధంగా నూతనంగా మార్గాన్ని ఏర్పాటు చేశారు.

భవానీ ఐలాండ్ లో అంతర్జాతీయ స్థాయిలో లేజర్ షో - మ్యూజికల్ ఫౌంటైన్ ఏర్పాటుకు టెండర్లను టూరిజం డిపార్టుమెంట్ ఖరారు చేసింది. రూ.16 కోట్లతో కూడిన మెగా ప్రాజెక్టును "ప్రీమియం వరల్డ్ సంస్థ" కాంట్రాకు దక్కించుకుంది.

ఈ సంస్థతో త్వరలో టూరిజం డిపార్టుమెంట్ ఎంఓయూ కుదుర్చుకుంటుంది. ఈలోపు ప్రాజెక్టుకు సంబంధించి ద్వీపంలో నిర్వహించాల్సిన విధానానికి ఆర్ఎఫ్ పీని విడుదల చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు రెండు నెలల కిందట రూ.16 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం నిధులను సంబంధిత శాఖకు బదిలీ చేసింది. పనులు ప్రారంభిస్తే రెండు, మూడు నెలల్లోనే కాంట్రాకు సంస్థ పూర్తి చేయాల్సి ఉంది.

అన్నీ అనుకునట్టు జరిగితే, అతి త్వరలోనే, గన్నవరం నుంచి మొదటి ఇంటర్నేషనల్ సర్వీస్ మొదలు కానుంది. నెల రోజుల క్రితం అంతర్జాతీయ హోదా సాధించిన గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌కు విమాన సర్వీసు నడిపేందుకు మార్గం సుగమం అవుతోంది. కేంద్రమంత్రి అశోక్‌ గజపతి రాజు స్వయంగా శ్రద్ధ తీసుకుని, విజయవాడకు ప్రత్యేక సర్వీసు నడిపేలా ఆ దేశ ప్రభుత్వంతో చర్చిస్తున్నారు.

అరబ్‌ ఎమిరేట్స్‌ కూడా దీని పై సుముఖంగానే స్పందించినట్టు సమాచారం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు ఓఎస్డీ అప్పారావు ఇటీవల రాష్ట్ర ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకే్‌ష్ తో భేటీ అయిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు.

శోక్‌ గజపతి రాజు నేతృత్వంలో విమానయాన సంస్థలతో ఏడాదిన్నర క్రితం ఏర్పాటు చేసిన సమావేశంలో అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఓ ప్రైవేటు విమానయాన సంస్థ ఆసక్తి చూపింది. నేడు విజయవాడకు అంతర్జాతీయ స్థాయి రావటంతో దానికి మార్గం సుగమం కానున్నది. కస్టమ్స్ కోసం, ఇప్పిటికే భవనం సిద్ధమైంది. కేంద్రం నుంచి అనుమతే తరువాయి.

అన్నీ అనుకునట్టు జరిగితే, గన్నవరం నుంచి, ఎగిరే మొట్టమొదటి ఇంటర్నేషనల్ సర్వీస్ యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌కు...

More Articles ...

Advertisements

Latest Articles

Most Read