ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్న అమరావతిని, మూడు ముక్కల రాజధానులు చేస్తూ, ఒక ముక్క వైజాగ్, ఒక ముక్క కర్నూల్, ఒక ముక్క అమరావతి అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, దానికి సంబంధించి బిల్లులను ఆమోదించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బిల్లుల పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. గత నెల రోజులకు పైగానే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు ముక్కల రాజధాని బిల్లుల పై, హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఇప్పటికే రైతుల తరుపున, ఇతర పిటీషనర్ల తరుపున వాదనలను హైకోర్టు వింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు సీనియర్ లాయర్,దుష్యంత్‌ దవే ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన వాదనలు వినిపిస్తూ, రాజధాని నిర్ణయం విషయం అనేది రాష్ట్ర శాసనసభకు సంబందించిన నిర్ణయం అని చెప్పారు. ఇందులో పార్లమెంట్ కు సంబంధం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం నిర్ణయాదికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని అన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలి, ఎన్ని రాజధానులు ఉండాలి అనేది రాష్ట్రం ఇష్టం అని, మూడు రాజధానులు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని పిటీషనర్ లు చెప్పటం కరెక్ట్ కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూల్, శాసన రాజధానిగా అమరావతిని నిర్ణయం తీసుకుందని అన్నారు. అయితే ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న హైకోర్టు, ఒక మౌలికమైన ప్రశ్న అడగటంతో, రాష్ట్ర ప్రభుత్వ డొల్లతనం బయట పడింది.

hc 09122020 2

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును రాష్ట్రప్రతి, అమరావతిలో నోటిఫై చేసారు కదా, ఇప్పుడు మళ్ళీ దాన్ని న్యాయ రాజధాని పేరుతో కర్నూల్ తరలించే హక్కు మీకు ఎక్కడిది అంటూ, హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఇక్కడ ప్రభుత్వ వైఖరి బయట పడింది. కర్నూల్ లో హైకోర్టు అనేది కేవలం ప్రతిపాదన మాత్రమే అని, దీనికి సంబంధించి చర్యలు ఏమి ప్రారంభించలేదని చెప్పింది. అయితే దీనికి బదులు ఇస్తూ, ఒక పక్క చట్టం చేసి, కేవలం ప్రతిపాదన అని అలా అంటారు అంటూ హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ అంశం పై ప్రతిపక్షం తెలుగుదేశం భగ్గు మంటుంది. కర్నూల్ ప్రజలను మభ్య పెట్టటం కోసమే, ఈ రాజధాని డ్రామా ఆడారని, కర్నూల్ కి హైకోర్టు మార్చటం అయ్యే పని కాదు అని తెలిసినా, కేవలం వైజాగ్ భూములు పై కన్ను వేసి, ఇటు కర్నూల్ ప్రజలను, అమరావతి ప్రజలను మభ్య పెడుతూ, వైజాగ్ భూములు పై కన్ను వేసారంటూ తమ అధికార సోషల్ మీడియాలో తెలుగుదేశం విమర్శించింది.

ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ముఖ్య నేతగా, మాజీ ఎమ్మెల్యేగా పేరున్న విశాఖపట్నం నేత విష్ణుకుమార్ రాజు స్టైల్ వేరు. ఒక పక్క బీజేపీ నేతలు అందరూ జగన్ మోహన్ రెడ్డి పై, ఆయన ప్రభుత్వం పై ఏదో మొహమాటు పడుతూ కంమెంట్లు చేస్తూ, ఎక్కువగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తుంటే, విష్ణుకుమార్ రాజు మాత్రం, అధికారంలో ఉన్న వైసీపీ చేస్తున్న అరాచకాల పై, జగన్ మోహన్ రెడ్డి పాలనా వైఖరి పై తనదైన శైలిలో కౌంటర్ లు ఇస్తూ ఉంటారు. గత నెల రోజులుగా విష్ణుకుమార్ రాజు తరుచు మీడియా ముందుకు వచ్చి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా వైజాగ్ లో అధికార పార్టీ చేస్తున్న అరాచకం పై, అలాగే శనివారం వస్తే చాలు, ఏదోఒకటి కూల్చివేయటం పై విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, వైజాగ్ లో శనివారం, ఆదివారం కూడా పని చేసే కోర్టులు పెట్టాలని కోరారు. ఇది ఇలా ఉండగా, ఈ రోజు విష్ణుకుమార్ రాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ రోజు విష్ణుకుమార్ రాజు, తన నియోజకవర్గంలో పర్యటించారు. పేదలకు ఇళ్లు ఇవ్వటం లేదు అంటూ నిరసన కార్యక్రమం చేసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, జగన్ మొహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. నియంత, ఉత్తర కొరియా అధ్యక్ష్యుడు కిం తో జగన్ ని పోల్చారు. అంతే కాదు, ఆంధ్రా కిం జగన్ మొహన్ రెడ్డి అంటూ, తీవ్ర స్థాయిలో విమర్శించారు.

vishnu 09122020 2

జగన్ మోహన్ రెడ్డి, ప్రజల కష్టాలు తెలుసుకోవటం లేదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గతంలో, రెండున్నర ఏళ్ళ తరువాత మంత్రులను మార్చేస్తాం అని చెప్పారని, అయితే రెండేళ్ళలో ముఖ్యమంత్రి మారిపోయే అవకాసం ఉంది అంటూ బాంబు పేల్చారు. అలా జరిగితే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఒక మహిళకు ఎలా అవకాసం ఇచ్చారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా మొదటి మహిళా ముఖ్యమంత్రి వచ్చే అవకాసం ఉందని, సంచలన వ్యాఖ్యలు చేసారు. తదుపరి సియంగా, జగన్ సతీమణి భారతి రెడ్డి అవుతారని ఆయన వ్యాఖ్యలు చేస్తూ, అలా చేస్తే ప్రజలు కూడా సంతోషిస్తారని, మహిళలకు ప్రజల కష్టాలు ఎక్కువ తెలుస్తాయని, ఆవిడైనా ప్రజలను ఆదుకుంటారని అన్నారు. ఎన్నో సమస్యలు ఆమె పరిష్కరిస్తారని అన్నారు. పేదలకు నిర్మించిన ఇళ్లు కూడా ఇవ్వకుండా, వేదిస్తున్నారని, ప్రజలు వివిధ కష్టాలు పడుతున్నాయని, తొందర్లోనే జగన్ దిగిపోయి, మహిళా సియాం వస్తారని చెప్తూ, విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యల పై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గారు ఏమంటారో.

ఏలూరులో ప్రజలు ఇబ్బందులు పడుతూ హాస్పిటల్ పాలు అవుతన్న సంఘటన జరిగి, ఇప్పటికి మూడు రోజులు అయినా, ఆ జబ్బు ఏమిటో, ఎందుకు వస్తుందో, అసలు ఏమి జరుగుతుందో, ప్రభుత్వం చెప్పలేక పోతుంది. నీళ్ళు బాగున్నాయి అంటారు, డ్రైనేజి వ్యవస్థ బాగుంది అంటారు, అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది అంటారు, కానీ కారణం ఏమిటో మాత్రం చెప్పలేక పోతున్నారు. కొన్ని ప్రభుత్వ అనుకూల చానల్స్ ఒక అడుగు ముందుకు వేసి, ఏమి లేదు, ఇది మాస్ హిస్టీరియా అని తెల్చేసాయి. అంటే ప్రజలే ఒకరిని చూసి ఒకరు, ఇలా ఫిట్స్ వచ్చి పడిపోతున్నారని చెప్తున్నాయి. అయితే ఇప్పటికీ కారణం ఏమిటో తెలియకపోవటం, అలాగే రోజు రోజుకీ బాధితులు పెరిగిపోతూ ఉండటం, ఒక మరణం కూడా సంభవించటంతో, డబ్ల్యూహెచ్ఓ కూడా రంగంలో దిగింది. డబ్ల్యూహెచ్ఓ నుంచి డాక్టర్ భవాని అనే ప్రతినిధి, ఏలూరు వచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందతున్న వారి దగ్గరకు వెళ్లి వివరాలు సేకరించారు. అలాగే అక్కడ ఉన్న అధికారులు, కలెక్టర్, వైద్య అధికారులతో సమీక్ష చేసారు. కేసులు వివరాలు, ప్రజలు ఏ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటి వరకు చేసిన రిపోర్ట్స్ ఏమిటి, వాటి ఫలితాలు ఏమిటి అనేదాని పై పూర్తిగా సమీక్ష చేసారు.

eluru 07122020 2

నీళ్ళలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పటంతో, కూరగాయల్ని కూడా టెస్ట్ చేయాలని ఆమె ఆదేశించారు. అంతే కాదు, వస్తున్నా పేషెంట్ల పై కూడా కొన్ని రకాల టెస్ట్ లు చేయాలనీ సూచించారు. ఏలూరు మొత్తం ఫాగింగ్ చేయాలని, గవర్నమెంట్ హాస్పిటల్ లో న్యూరాలజిస్ట్‌ను పెట్టాలని ఆదేశించారు. ఇక మరో పక్క మూడు రోజులు అయినా ఈ వ్యాధి తగ్గలేదు. మూడో రోజు కూడా వంద మందికి పైగా హాస్పిటల్ లో చేరారు. మొత్తంగా ఇప్పటి వరకు 450 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటికే ఎయిమ్స్ నుంచి కూడా ఒక బృందం వచ్చింది. అయితే ఇప్పుడ ఢిల్లీ నుంచి కేంద్రం ఒక బృందాన్ని పంపిస్తుంది. ఇక మరో పక్క ఈ ఘటన నేషనల్ మీడియాలోనే కాదు, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయ్యింది. అయితే డాక్టర్లు మాత్రం, నీటి కాలుష్యం వల్లనే ఇలా జరిగిందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ, నీటిలో ఎక్కవగా బ్లీచింగ్ ఏమైనా కలిసిందా అనే దాని పై కూడా ఆరా తీస్తున్నారు. బ్లీచింగ్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే, ఇలాంటి లక్ష్యణాలు ఉండే అవకాసం ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయం పై ఇప్పటికీ క్లారిటీ లేదు. మొత్తం మిస్టరీగానే ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రొసీడింగ్స్ ఇవ్వగా, ఎన్నికలు జరపకూడదు అంటూ ప్రభుత్వం హైకోర్టులలో పిటీషన్ వేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ఈసి తీసుకున్న నిర్ణయం పై స్టే ఇవ్వాలని, క-రో-నా నేపధ్యంలో ఎన్నికలు జరపటం సాధ్య పడదు అని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ పిటీషన్ పై హైకోర్టు లో విచారణకు వచ్చింది. అటు ఎన్నికల కమిషన్ తరుపు వాదనలు, ఇటు వైపు ప్రభుత్వం తరుపు వాదనలు కూడా హైకోర్టు వింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్నికల ప్రక్రియ నిలిపి వేయటం సాధ్యం కాదని హైకోర్టు తెలిపింది. దీంతో పాటుగా స్టే ఇవ్వటం కూడా సాధ్యం కాదని తెలిపింది. ఈ నెల 14వ తేదీకి కేసుని వాయిదా వేస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎన్నికలు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో , నిర్వహించటం సాధ్యం కాదని, క-రో-నా వల్ల చాలా కేసులు వచ్చాయని, చాలా మంది మరణించారు అని, అలాగే రెవిన్యు, పోలీసులు యంత్రాంగం కూడా బిజీ గా ఉన్నారని, కోర్టులో వాదనలు వినిపించారు. అలాగే ఉద్యోగులు కూడా ఎక్కువ మంది వైరస్ బారిన పడి , ఇబ్బందులు పడుతున్నారని కోర్టుకు తెలిపింది.

hc 08122020 2

ప్రభుత్వం వైపు నుంచి వాదనలు విన్న తరువాత, ఎన్నికల కమిషన్ వైపు నుంచి అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయాన్ని కోర్టుకు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ఆయన ప్రస్తావించారు. ఎన్నికల కమిషన్ ఒకసారి తేదీలు ప్రకటించిన తరువాత, అందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవటం, రాష్ట్ర ప్రభుత్వానికి తగదు అని, రాజ్యాంగా బద్ధ సంస్థ, పైగా స్వయం ప్రతిపక్తి కలిగిన సంస్థ విధుల్లో జోక్యం చేసుకోవటం ప్రభుత్వానికి తగదు అని, ప్రభుత్వం జోక్యం కుదరదు అని తెలిపారు. అలాగే బీహార్, కేరళ, రాజస్తాన్ హైకోర్టులు స్థానిక సంస్థలు నిర్వహించాలని ఇచ్చిన తీర్పులను హైకోర్టు ముందు పెట్టారు. హైదరాబాద్ జీహెచ్ఏంసి ఎన్నికల్లో, బీహార ఎన్నికలు, ఉప ఎన్నికలు అన్నీ జరుగుతున్నాయని, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. అలాగే సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆరోగ్య అధికారులు అందరినీ సంప్రదించి, ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పటంతో, హైకోర్టు కూడా ఈ వాదనకు ఒప్పుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్నికలు వాయిదా వేయటం కుదరదు అని చెప్పింది.

Advertisements

Latest Articles

Most Read