విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దుర్గ గుడి దగ్గర ఫ్లై-ఓవర్ నిర్మాణంతో అటు వైపు ట్రాఫిక్ కష్టాలు కొంచెం తగ్గే అవకాసం ఉంది. బందర్ రోడ్డు విస్తరణ తరువాత, అటు వైపు కూడా ఉపసమనం వచ్చే అవకాసం ఉంది. ఎటు పోయి, ఇప్పుడు సమస్య అంతా రామవరప్పాడు నుంచి నిడమానూరు వరకు. ఈ మార్గం గన్నవరం ఎయిర్ పోర్ట్ వైపు ఉండటం, సిటీ ఎక్కువగా ఇటు వైపు పెరగటం, విద్యా సంస్థలు, ఆఫీసులు ఎక్కువగా రావటంతో, ఈ రోడ్డులో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. సాయంత్రం వేళ నిడమానూరు నుంచి రామవరప్పాడు రింగ్ రావటానికి, దాదపుగా 30-45 నిమషాల సమయం పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారాలు ఆలోచిస్తుంది ప్రభుత్వం.

రామవరప్పాడు నుంచి నిడమానూరు వరకు అదనంగా రోడ్డును ఇరు వైపులా విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు పేర్కొ న్నారు. ఈ విస్తరణకు సబంధించి త్వరలోనే సర్వే చేయాలన్నారు.

బెంజి సర్కిల్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు పెద్ద ఫ్లై-ఓవర్ నిర్మించాలన్న ప్రతిపాదన ఉందన్నారు. ఇప్పడిప్పుడే ఇది అమలయ్యే పరిస్థితి లేదు కాబట్టి, రామవరప్పాడు నుంచి రోడు విస్తరణ జరుగుతుందని తెలిపారు. రామవరప్పాడు నుంచి నిడమానూరు మార్గంలో మెట్రో మార్గం కూడా రానున్నందున ఫ్లై-ఓవర్ సాధ్యం కాని పరిస్థితి ఉందని కలెక్టర్ బాబు పేర్కొ న్నారు.

Page 2545 of 2545

Advertisements

Latest Articles

Most Read