ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డుల పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది. ఆ రోడ్డు ఈ రోడ్డు అని లేదు. నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు దాదాపుగా అన్నీ ఇలాగే ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల వారు నరకం చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని వాపోతున్నారు. ఇక మరో పక్క రాష్ట్రంలో రోడ్డుల అభివృద్ది పేరుతొ ప్రభుత్వం సెస్ బాదుడు బాదుతుంది. అయినా రోడ్డులు పరిస్థితిలో మార్పు లేదు. రోడ్డుల మీద ప్రయాణాలు చేయాలి అంటేనే, కూసాలు కదిలిపోతున్నాయి. కొత్త రోడ్డుల సంగతి తరువాత, ముందు ఉన్న రోడ్డులు బాగు చేయండని ప్రజలు కోరుకుంటున్నారు. అంతే కాదు, ఈ రోజు ఒక పత్రికలో ఒక వార్తా వచ్చింది. నిన్న అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. సహజంగా ఎమ్మెల్యేలు అందరూ అదే రోజు తమ ఊరికి వెళ్ళిపోతారు. అయితే ఈ రోడ్డుల్లో, రాత్రి సమయంలో ప్రయాణం చేయలేం అని, ఉదయం వెళ్దామని అనేక మంది ఎమ్మెల్యేలు చెప్పినట్టు, వార్త వచ్చింది. ఇది రాష్ట్రంలో రోడ్డుల పరిస్థితి. అయితే ఈ రోడ్డుల పరిస్థితి పై బీజేపీ ఆందోళన చేస్తాం అంటూ ఈ రోజు కొన్ని చోట్ల ఆందోళన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డులను అధ్వానంగా చేసిందని, వెంటనే రోడ్డులను బాగు చేయాలనీ, ఈ రోడ్డులు బాగు చేయటానికి టెండర్లు పిలిచినా, ఎవరూ ముందుకు రావటం లేదు అంటూ, బీజేపీ నిరసన తెలిపింది.

road 05122020 2

అయితే ఈ ఆందోళన కృష్ణా జిల్లా మైలవరంలో కొద్దిగా ఉద్రిక్తతకు దారి తీసింది. మైలవరం మండలం వెల్వడం గ్రామంలో బీజేపీ ఆందోళన నిర్వహించింది. వెల్వడం - నూజివీడు రోడ్డు సరిగ్గా లేదు అంటూ, రోడ్డు పై కూర్చుని బీజేపీ నేతలు ఆందోళన చేసారు. అయితే ఎలాంటి అనుమతి తీసుకోకుండా, ఆందోళన చేస్తున్నారని, ఈ నిరసనకు అనుమతి లేదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటూ, పోలీసులు వచ్చి అభ్యంతరం చెప్పారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అక్కడే ఉన్న మైలవరం ఎస్ఐ, కేంద్రంలో అధికారంలో ఉంది మీరే కదా, కేంద్రంతో చెప్పి, రోడ్డులు బాగుచేయించవచ్చు కదా అంటూ, వ్యాఖ్యలు చేసారు. దీంతో బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఆ మాటలు చెప్పటానికి నువ్వు ఎవరు అంటూ, ఎస్‌ఐ పై బీజేపీ నేతలు ధ్వజమేట్టారు. ఎస్ఐ క్షమాపణ చెప్పాలి అంటూ నినాదాలు చేసారు. దీంతో ఈ వివాదం పెద్దది అవుతుందని గ్రహించి, రంగంలోకి దిగిన సిఐ, నేతలతో మాట్లాడి, పరిస్థితి చక్క దిద్దారు.

అంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చలు జరుగుతున్న తీరు పై పలువురు అభ్యంతరం చెప్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకునే వీడియోలు, అసెంబ్లీలో వేసుకుని, సంబర పడుతున్న అధికార పక్షం తీరు పై, అభ్యంతరం వ్యక్తం అవుతుంది. కోట్లు ఖర్చు చేసి అసెంబ్లీ నడుపుతూ ఉంటారని, అలాంటి చోట ప్రజా సమస్యలు కాకుండా, వ్యక్తిగత అజెండాను అమలు చేయటం పై, అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఈ కోవలోనే గుజరాతీ కంపెనీ అముల్ కు, రాష్ట్రంలో పాల సేకరణ ఇవ్వటం గురించి అసెంబ్లీలో జరిగిన చర్చలో, హెరిటేజ్ పై వ్యాఖ్యలు చేసింది అధికార పక్షం. జగన్ మోహన్ రెడ్డి అయితే, ఏకంగా ఓక ప్రెజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉంటే షేర్ రేటు పెరుగుతుంది అని, లేకపోతే తగ్గిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే అసెంబ్లీలో అంటే చెప్పారని అనుకోవచ్చు. అది తీసుకుని వచ్చి ఏపి సియం సోషల్ మీడియా హ్యాండ్లెస్ లో వేసారు. దీంతో అందరూ ఆశ్చర్య పోయారు. అసలు హెరిటేజ్ అనే ఒక సంస్థ గురించి చర్చించి, దాని గురించి అసెంబ్లీలో చర్చ చేయటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. హెరిటేజ్ కి 12 రాష్ట్రాల్లో మార్కెట్ ఉంది. 11 రాష్ట్రాల్లో పాల సేకరణ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో సేకరణ మహా అయితే ఒక 10 శాతం ఉంటుంది. అది రేపటి నుంచి ప్రజలు తక్కువ రేటు అని ఇవ్వకపోతే, వేరే రాష్ట్రాల్లో వ్యాపారం పెంచుకుంటారు.

heritage 05122020 2

హెరిటేజ్ కి పోయేది ఏమి ఉండదు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 20కు పైగా సహకార డైరీలు ఉన్నాయి. వాటికి, మాత్రం చాలా నష్టం జారిగే అవకాసం ఉంది. ఇది ఇలా ఉంటే, అసెంబ్లీలో జగన్ చేసిన ఆరోపణల పై హెరిటేజ్ ఘాటుగా స్పందించింది. హెరిటేజ్ అనేది స్టాక్ మార్కెట్ లో లిస్టు అయిన కంపెనీ అని, గత 25 ఏళ్ళుగా హెరిటేజ్ కంపెనీ అంచెలు అంచెలుగా ఎదుగుతూ వచ్చిందని, స్టాక్ మార్కెట్ లో పెరగటం, తగ్గటం అనేది, కంపెనీ పని తీరుతో పాటుగా, పెట్టుబడిదారుల నమ్మకం పై, మారుతూ ఉంటుందని, దీనికి అధికారంలో ఉండటానికి సంబంధం లేదని తెలుసుకోవాలని తెలిపింది. షేర్ వేల్యూ రిగ్గింగ్ అనేది జరగదని, అది స్టాక్ మార్కెట్ నియంత్రణలో ఉండే అంశం అని, తెలుసుకోవాలని పేర్కొంది. అడ్డగోలుగా తమ షేర్ వేల్యూ పెంచుకోవలానే ఆలోచన తాము ఎప్పుడూ చేయం అని, విలువలతో ఇన్నాళ్ళు మార్కెట్ లో ఉన్నాం అని, మీ రాజకీయాల కోసం తమ పై , ఇలాంటి ఆరోపణలు చేయవద్దు అని కోరింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తీసుకుంటున్న ఒంటెద్దు పోకడలతో, రాజ్యాంగ సంస్థలకు, ప్రభుత్వానికి మధ్య రోజు రోజుకీ గ్యాప్ ఎక్కువ పెరిగిపోతుంది. శాసనమండలి పై కానీ, కోర్టు ల పై కానీ, ఎన్నికల కమిషన్ పై కానీ వైసీపీ వ్యవహరిస్తున్న తీరు, చాలా అభ్యంతరకరంగా మారుతుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య వైరం రచ్చకు ఎక్కింది. ఇది ఇప్పటికే కోర్టుల వరకు వెళ్ళింది. సుప్రీం కోర్టులో, ఇదే విషయం పై రాష్ట్ర ప్రభుత్వానికి మూడు సార్లు ఎదురు దెబ్బ తగిలింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు రావటం లేదు. హైకోర్టు మాట వినటం లేదు, సుప్రీం కోర్టు చెప్పినా అదే తీరు కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ పై, రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం కోరటం, రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలతో కలిసి, వారి అభిప్రాయం తీసుకుని, మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపటం, అదే విధంగా వివిధ రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షలు చేయటం, అన్నీ క్రోడీకరించి, ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రొసీడింగ్స్ ఇచ్చి, హైకోర్టుకు తెలపటం జరిగింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు ఒప్పుకోవటం లేదు. ఇక మరో పక్క, అన్ని జిల్లాల కలెక్టర్లతో సంప్రదించాలి, వీడియో కాన్ఫరెన్స్ చేసుకోవాలి అని చెప్పినా, ప్రభుత్వం వైపు నుంచి అనుమతి ఇవ్వటం లేదు.

governor 05122020 2

ఇక అలాగే మంత్రి కొడాలి నాని, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ పై, వాడు వీడు అంటూ కామెంట్స్ చేయటంతో, ఈ విషయం పై ఇప్పటికే గవర్నర్ కు ఫిర్యాదు చేసారు, ఎన్నికల కమీషనర్. ఇవన్నీ జరుగుతూ ఉండగానే, ప్రభుత్వం హైకోర్టులో ఎన్నికలు జరపటానికి వీలు లేదని అఫిడవిట్ వేసింది. అయితే హైకోర్టులో ఉండగానే, ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో చేసిన తీర్మానంతో అందరూ అవాక్కయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణ పై కుదరదు అంటూ నిన్న ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీని పై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సీరియస్ అయ్యారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌కు ఈ విషయం పై ఫిర్యాదు చేసారు. ప్రభుత్వం చేసిన తీర్మానం రాజ్యంగ విరుద్ధం అని, ఆర్టికల్ 243కే ప్రకారం, ఎన్నికల కమీషన్ అధికారాలు ఎవరూ తీసేయలేరని, ప్రభుత్వ సమ్మతితోనే ఎన్నికలు నిర్వహించాలని తీర్మానం చేయటం, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం అని పేర్కొన్నారు. ఆ ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించాలని పేర్కొనారు. ఈ విషయం పై సుప్రీం కోర్టు న్యాయనిపుణులను అభిప్రాయం కూడా తీసుకుని, ఇలాంటి వాటిని తిరస్కరించాలని నిమ్మగడ్డ , గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. మరి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తెసుకుంటారో చూడాలి.

రవాణా శాఖా మంత్రి పేర్ని నాని పై గత వారం, ఒక చిన్న పాటి అటాక్ జరిగిన విషయం తెలిసిందే. మంత్రి తల్లి గత వారం చనిపోయారు. ఆయన తల్లి కర్మ కాండ గత వారం జరిగింది. ఆ కార్యక్రమంలో ఒక వ్యక్తి వచ్చి, ఒక తాపీ తీసుకుని, మంత్రి పై అటాక్ చేసారు. అయితే మంత్రి పై హ-త్యా-య-త్నం అంటూ వార్తలు రావటంతో, వెంటనే పోలీసులు, అతను తాగి ఉన్నాడని చెప్పారు. కొన్ని వార్తా చానెల్స్ లో, మంత్రి పై అటాక్ చేసిన వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడు అని, తాపీ మేస్త్రి అని, ఇసుక లేక పనులు లేక పోవటంతో, సహనం కోల్పోయి ఇలా చేసాడని చెప్పారు. అయితే తెలుగుదేశం నేతలు కూడా ఇవే ఆరోపణలు చేసారు. స్థానిక నేత అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇవే వ్యాఖ్యలు చేసారు. దీంతో కేసు మళ్ళీ ట్విస్ట్ అయ్యింది. అటాక్ చేసిన వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త అని, రవీంద్ర అనుచరుడు అంటూ ప్రచారం చేసారు. ఇంకేముంది, ఇది కాస్తా మళ్ళీ రాజకీయ టర్న్ తీసుకుంది. ఇంతటితో అయిపోలేదు. మళ్ళీ పోలీసులు మంత్రి రవీంద్రను టార్గెట్ చేసారు. అసలు మీకు ఆ సమాచారం ఎలా తెలుసు అంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాకు పూర్తి సమాచారం చెప్పాలి అంటూ, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు నోటీసు ఇచ్చారు. ఆయన దానికి సమాధానం ఇస్తూ, రిటెన్ గా పంపించారు.

perni 05122020 2

అయితే రెండు రోజులు క్రిందట పోలీసులు రవీంద్ర ఇంటికి వచ్చి, ఆయన స్టేషన్ కు రావాల్సిందిగా కోరారు. అసలు ఇందులో తనను ఎందుకు ఇరికిస్తున్నారని, మీడియాలో వచ్చింది చెప్పినా, ఇప్పటికే రిటెన్ గా ఇచ్చినా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ, రవీంద్ర పోలీసులు పై ఫైర్ అయ్యారు. తరువాత వస్తానని చెప్పటంతో, పోలీసులు వెళ్ళిపోయారు. అయితే ఈ వ్యవహారం ఇలా జరుగుతూ ఉండగానే, ఈ రోజు నారా లోకేష్ ఒక ట్వీట్ చేసారు. అటాక్ చేసిన వ్యక్తి మంత్రి తల్లి కర్మ కాండలో పాల్గున్న ఫోటోలు విడుదల చేసారు. దానికి సంబందించిన ఒక వార్త కూడా లోకేష్ ట్వీట్ చేసారు. ఆ ఫోటోలలో కేవలం పది మంది లోపే ఉన్నారు. మరి అతను తెలుగుదేశం వ్యక్తి అయితే, మంత్రి పక్కన ఎందుకు తిరుగుతున్నాడని, పోలీసులు, అనుచరులు ఎందుకు ఊరుకున్నారు అనేది ప్రశ్న. లోకేష్ కూడా ఇదే విషయం చెప్తూ, ఇది ఒక డ్రామాగా ట్వీట్ చేసారు. అనవసరంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను టార్గెట్ చేయటం ఆపి, ఇకనైనా ఈ నాటకం బయట పెట్టాలని లోకేష్ ట్వీట్ చేసారు. మరి ఈ విషయం పై, పేర్ని నాని ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read