విశాఖలోని వెంకటాపురం పరిధిలో ఏర్పాటయిన దక్షిణ కొరియా కంపెనీ ఎల్జీ పాలిమర్స్ కు విలువ వందల కోట్ల రూపాయల విలువ ఉంటుందని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్మ, జగన్మో హన్ రెడ్డికి లేఖరాసారు. తనకు సానుకూలం కానిపక్షంలో ఈ కంపెనీ యాజమాన్యం ప్రభుత్వాన్ని లిటిగేషను లాగుతుందని ఆయన గుర్తుచేసారు. ప్రభుత్వం కంపెనీ భూములను వెనక్కి తీసుకో వాలని చూస్తే నిరంతరం లిటిగేషన్లోకి లాగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగిన భారీ ప్రమాదానికి సంబంధించి అసలు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈ సంస్థ ఏర్పాటుకు ఎలా అనుమతిచ్చిందని ఆయన ప్రశ్నించారు. 2019 జూన్ లో ఈ యూనిట్ విస్తరణ, కార్యకలాపాలకు ఎపిపిసిటి ఎందుకు అనుమతించిందని ఆయన ప్రశ్నించారు. కాలుష్య నియంత్రణ మండలి ముందుగా రాష్ట్రప్రభుత్వం నుంచి కానీ, లేదా కేంద్ర పర్యావరణ శాఖనుంచి కాని క్లియరెన్సులు తీసుకోలేదని ఆయన తెలిపారు.

అన్నింటికంటే ఇక్కడ స్థాపించిన యూనిట్ అత్యంత కాలుష్యకారకమైనదని, నివాసిత ప్రాంతాలకు అతిసమీపంలో ఉందని చెపుతూ ఎపిపిసిటి ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోను అను మతించకూడదని, అలాగే కార్యకలాపాల విస్తరణకు సైతం క్లియరెన్స్ ఇవ్వడానికి వీలులేదని ఇలాంటి పరిశ్రమలకు ఎపి కాలుష్య నియంత్రణ మండలి ఎలా విస్తరణకు అనుమతిస్తుందని వెల్లడించారు. విశాఖపట్టణం పరిసరాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం ఇదేమీ కొత్తకాదని, సుమారు 30 నుంచి 40 వరకూ ప్రమాదాలు జరిగాయని, అనేక మంది కార్మికులు, పౌరులు విలువైన ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్న శర్మ ఏ ఒక్కరిపైనా ఇప్పటివరకూ జరిగిన విచారణల్లో చర్యలు తీసుకున్న సందర్భాలు లేవన్నారు.

అలాగే రాష్ట్రప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇలాంటి కాలుష్య కారక కంపెనీ ప్రమోటర్లు, అధికారులు కుమ్మక్కయ్యారని భావించాల్సి వస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఆలాగే ఈప్రమోటర్లకు రాజకీయ నాయకులనుంచి మద్దతు లేదని కూడా భావించలేమని, నేతల మద్దతు కూడా పొంది ఉండవచ్చన్నారు. మొదటిదశ లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఎల్జీ పాలిమర్స్ కు నిర భ్యంతర ధృవీకరణ పత్రం (ఎస్ఆసి) జారీచేసారని, అత్యవసర పారిశ్రామిక సంస్థగా గుర్తించి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్లాస్టిక్ ఉత్పత్తిచేసే సంస్థ నిత్యాసవరఉత్పత్తుల తయారీ కేటగిరీలోకి ఎలా వస్తుందో తనకు అర్థం కావడం లేదని ప్రభుత్వంలోని ఒక సీనియర్ ఇందుకు బాధ్యత వహించాల్సిందేనని, ఈ పొరపాటుకు ప్రభుత్వంలోని సీనియర్లదే బాధ్యత అని ఆయన పేర్కొన్నారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఎందరో మహిళలు, పురుషులు, చిన్నపిల్లలు అచేతనంగా పడిపోయి ఉండటాన్ని తాను టివిల్లో ప్రత్యక్షంగా చూసి కలతచెందానన్నారు. ఈ సంఘటన చోటుచేసుకోవడం అత్యంత దుర దృష్టకరమని, కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయనకోరారు.

ప్రధాని మోదీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోరుతూ చంద్రబాబు లేఖ రాసారూ. ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది అని అనంరు. దుర్ఘటనపై మీ సత్వర స్పందనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. సత్వరమే మీరు స్పందించి చేపట్టిన చర్యలు విశ్వాసాన్నిచ్చాయి. గ్యాస్ లీకేజీపై విచారణకు సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయాలి. విషవాయువు విడుదలకు దారితీసిన అంశాలపై దర్యాప్తు చేయించాలి. లీకైన విషవాయువు స్టైరీన్ అని కంపెనీ చెబుతోంది. స్టైరీన్ వాయువుతో పాటు మరికొన్ని వాయువులు ఉన్నాయని భిన్న నివేదికలు ఉన్నాయి. గ్యాస్ లీకేజీపై దర్యాప్తు చేస్తేనే భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం తెలుస్తుంది. దీర్ఘకాలంలో చూపే దుష్ప్రభావాలపై నిశిత దృష్టి సారించాల్సి ఉంది అని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో ఆరు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకు వచ్చారు.

"1.గ్యాస్ లీకేజి వివాదాస్పద అంశంపై విచారణకు సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయడం మరియు విష వాయువుల విడుదలకు దారితీసిన స్థానిక అంశాలపై దర్యాప్తు చేయడం. 2. లీక్ అయిన గ్యాస్ స్టైరీన్ అని కంపెనీ చెబుతుంటే, మరికొన్ని విష వాయువులు కూడా ఉన్నాయనే భిన్న నివేదికలు ఉన్నందున దానిపై దర్యాప్తు చేస్తేనే భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం తెలుస్తుంది. 3. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యంపై దీర్ఘకాలంలో చూపే దుష్ప్రభావాలపై నిశిత దృష్టి సారించాల్సివుంది. వెలువడే విష వాయువులు బాధితులకు శాశ్వత నష్టం చేస్తాయనేది ఇప్పటికే విదితమే. 4. విశాఖపట్నంలో మరియు పరిసరాల్లో గాలి నాణ్యత(ఎయిర్ క్వాలిటి)ని నిశితంగా పరిశీలిస్తేనే ప్రస్తుతం మరియు భవిష్యత్తులో ప్రభావాలను అంచనా వేయగలం.

5.ప్రజల ఆరోగ్యంపై అధ్యయనానికి జాతీయ మరియు అంతర్జాతీయ వైద్య నిపుణులను రంగంలోకి దించి తదనుగుణంగా తక్షణ మరియు దీర్ఘకాలిక వైద్య చర్యలు చేపట్టాలి. బాధితులకు సరైన నష్ట పరిహారం అందించేందుకు ఈ విధమైన అంచనాలే తోడ్పడతాయి. 6. ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులను అందజేయడం ద్వారా, దీర్ఘకాలిక ప్రాతిపదికపై ప్రతి రోగిని నిశితంగా పర్యవేక్షించడం, బాధితుల్లో మీ ప్రయత్నాలపట్ల విశ్వాసం పెంచేందుకు దోహదపడతాయి. వీటన్నింటిపై మీరు దృష్టి సారించి సముచిత చర్యలు చేపట్టాలని అభ్యర్ధిస్తున్నాను. " అంటూ చంద్రబాబు, ప్రధాని మోడీకి లేఖ రాసారు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద ఆర్​ ఆర్ వెంకటాపురం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలంటూ పరిశ్రమ వద్ద ధర్నాకు దిగారు. ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమను తరలించాలని స్థానికులు నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరిని అరెస్టు చేశాక.. మరికొందరు గేటు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. పరిశ్రమ వద్దకు డీజీపీ గౌతమ్ సవాంగ్ చేరుకుని..ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు. పరిశ్రమ చుట్టు పక్కల తాగునీరు కలుషితమైందని...ప్రమాదం తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. కరోనా భయం వల్ల బంధువులు కూడా ఇంటికి రానివ్వడంలేదన్నారు. ఎవరు గట్టిగా మట్లాడినా పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నారన్నారు. సీఎం జగన్ తమ గ్రామంలోకి వచ్చి పరిస్థితిని పరిశీలించాలని కోరారు. ప్రమాద ఘటన పై పరిశ్రమ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

బాధితుల చికిత్సకు డబ్బు చెల్లించాలని కొన్ని ఆస్పత్రులు అడుగుతున్నాయన్నారు. ప్రభుత్వం వేసిన కమిటీ...బాధిత 5 గ్రామాల్లో తిరిగి ప్రజలతో మాట్లాడాలని వారు కోరారు. బాధిత 5 గ్రామాల్ల ఆక్సిజన్ స్థాయి పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణం సహాయచర్యలు చేపట్టకుంటే ఇక్కడకు ఎవరూ రారన్నారు. గ్యాస్ లీక్ ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమన్నారు. ప్రమాదం జరిగినప్పుడు సైరన్ కూడా మోగలేదని స్థానికులు తెలిపారు. కంపెనీలో ఉపాధి పొందుతున్న వారిలో స్థానికేతరులే ఎక్కువగా ఉన్నారన్నారు. వైసీపీ నేతలు, చెప్తున్న మాటలు నమ్మసక్యంగా లేవని అన్నారు. ఇప్పటి వరకు, ఎందుకు కంపెనీ యాజమాన్యం వ్యక్తులను అరెస్ట్ చెయ్యలేదని ప్రశ్నిస్తున్నారు.

ఇక్కడ, గాలి, నీరు అంతా, కలుషితం అయిపోయాయని, రాను రాను, మా పై దీర్ఘకాలికంగా, ఆరోగ్య ఇబ్బందులు వస్తాయని అంటున్నారని, ట్రీట్మెంట్ చేసేసి పంపించి వేస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని చెట్లు కూడా మాడిపోయయని, ఆ గాలి పీల్చిన మాకు, భవిష్యత్తులో ఎన్నో ఇబ్బండులు వస్తాయని అంటున్నారు. ఇవన్నీ అడుగుతుంటే, కోటి ఇచ్చాం, పది కోట్లు ఇస్తాం అని డబ్బులతో లెక్క చెప్తున్నారని, మాకు ఇవేమీ వద్దు అని, కంపెనీని ఇక్కడ నుంచి తరలిస్తాం అని చెప్పాలని, ఇక్కడ నుంచి తరలించాలని వాపోయారు. ఇవన్నీ అడగటానికి వస్తే, మమ్మల్ని అడ్డుకుని, కొంత మందిని అరెస్ట్ చేసారని, కంపెనీ వారితో మాత్రం ముచ్చట్లు, మాకు అరెస్ట్ లా అని వాపోతున్నారు.

విశాఖపట్నంలోని ఎల్​జీ పాలిమర్స్ కంపెనీ వద్ద మరోసారి స్థానికులు ఆందోళన చేపట్టారు. పరిశ్రమ గేటును తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పరిశ్రమ గేటు వద్ద మృతదేహాలతో స్థానికులు ఆందోళన చేస్తున్నారు. పరిశ్రమ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. స్థానికులు గేటు వద్ద ధర్నాకు దిగడంతో డీజీపీ లోపలే ఉండిపోయారు. దాంతో డీజీపీ చుట్టూ రక్షణ వలయంగా పోలీసులు ఏర్పడ్డారు. గ్రామస్థులను నియంత్రించి డీజీపీని పోలీసుల పంపేశారు. పరిశ్రమలోకి రాకుండా స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. సంయమనం పాటించాలని స్థానికులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. పరిశ్రమ పరిసరాల్లో పరిస్థితిని సీపీ మీనా పర్యవేక్షిస్తున్నారు.

నేతలు, అధికారులు పరిశ్రమను చూసి వెళ్లిపోతున్నారు తప్ప..ఎవరూ బాధిత గ్రామాల్లోకి రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత 5 గ్రామాల ప్రజల బాగోగులు చూడటం లేదన్న వారు...కనీసం తమకు ఆహారం, తాగునీరు కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ప్రజాప్రతినిధులు వచ్చి 5 గ్రామాల కష్టాలు వినాలని కోరారు. పరిశ్రమను మూసివేస్తామని యాజమాన్యం ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేశారు. పరిశ్రమ యజమానులను వెంటనే అరెస్టు చేయాలన్నారు. తమ ఆగ్రహం చల్లారేందుకు మాత్రమే ఈ కమిటీ వేశారని వారు పేర్కొన్నారు. ఆ కమిటీలో ఉన్న అధికారులు సాంకేతిక నిపుణులు కాదన్నారు. కంపెనీ మూసివేత ప్రకటన వస్తేనే స్థానికులు శాంతిస్తారన్నారు. 5 బాధిత గ్రామాల్లో వైద్యశిబిరాలు కూడా ఏర్పాటు చేయలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisements

Latest Articles

Most Read