విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ వచ్చే ఆగస్ట్ 15న ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగస్ట్ 15 నాటికి అన్ని పనులు పూర్తయ్యి, ఫ్లైఓవర్ ప్రారంభించాలని, డెడ్ లైన్, మిస్ అవ్వకూడదని ఆదేశించారు. కృష్ణానది దృష్టిలో ఉంచుకొని కుమ్మరిపాలెం జంక్షన్ నుంచి గుడి ద్వారం వరకు, అర్జున వీధి, ప్రకాశం బ్యారేజీ, బందరు కాలువలను కలుపుకుంటూ సుందరీకరణ చేపట్టాలని, దీనికి ప్రసిద్ధ ఆర్కిటెక్టుల సహకారం తీసుకోవాలని చెప్పారు. అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.

అలాగే విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్ దగ్గర నిర్మించ తలపెట్టిన ఫ్లైఓవర్ డిజైన్లు ముఖ్యమంత్రి పరిశీలించారు. విజయవాడలో బెంజ్ సర్కిల్ అత్యంత ముఖ్యకూడలి అని, బెంజ్ సర్కిల్ సహజ అందం చెదిరిపోకుండా ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలన్నారు. కూడలిలోని 5 రోడ్లను కలిపేలా ఫ్లైఓవర్ నిర్మాణం జరిగాలని అభిప్రాయపడ్డారు. అందుకు తగ్గ డిజైన్లు తయారుచేయాలని అధికారులకు సూచించారు. విజయవాడ మచిలీపట్నం రహదారి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

వాహనం వెళుతుంటే.. వెలుగును తగ్గించుకుంటాయి... రోడ్డు నిర్మానుష్యంగా ఉంటే ఆరిపోతాయి... చీకటిలో మనుషులు వస్తుంటే వాటంతటవే వెలుగుతాయి... సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ వీధిలైట్లు బెజవాడ నగరంలో తొలిసారిగా ఏర్పాటు కానున్నాయి. వాహనాలు, సెన్స్టర్లతో పనిచేసే ఈ ఎల్ఈడీ దీపాలు త్వరలో బందర్ రోడ్డులో వెలగనున్నాయి. ఇక్కడ విజయవంతమైతే నగరం మొత్తం సెన్బర్ వీధి దీపాలతో నింపుతారు. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టినట్లు నగరపాలక సంస్థ అధికారులు చెప్పారు.

విజయవాడను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దటానికి అనేక నూతన అధునాతన ప్రాజెక్టులను అమలు చేయటానికి, నగరపాలక సంస్థ ప్రయత్నాలు చేస్తుంది.

బెంగళూరుకు చెందిన సిస్కో సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. కంట్రోల్ రూం నుంచి బెంజిసర్కిల్ వరకు 50 దీపాలను ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్నారు. పీవీపీ మాల్లో దీని కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. గోల్డెన్ మైల్ ప్రాజెక్టుకు బెంగళూరుకు చెందిన సిస్కో సంస్థ సాంకేతిక ఆర్థిక సహకారం అందిస్తోంది. మొత్తం ఈప్రాజెక్టు వ్యయం రూ. 7.91 కోట్లుగా నిర్ధారించారు. దీనిలో సిస్కో రూ. 3.81 కోట్ల భరిస్తోంది. దీనికి సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. మిగిలిన రూ.4.10 కోట్ల విజయవాడ నగరపాలక సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. వీఎంసీ ఇప్పటికే రూ.62 లక్షలు ఇచ్చింది.

గోల్డెన్ మైల్ ప్రాజెక్టు కింద సిసి కెమెరాలు, సెన్సార్‌లు నగరం అంతా ఏర్పాటు చేయటం ద్వారా నగర ప్రజలు నగరంలో ట్రాఫిక్, వాతావరణ సమాచారం, హ్యుమిడిటి, ఉష్ణోగ్రత, లొకేషన్ వంటి సమాచారం ప్రజలు తెలుసుకోగలరు. నగరంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి వీడియో సర్వైవలెన్స్ ఆపరేషన్ ద్వారా సమాచారం తెలుసుకోవటమే కాకుండా ఆన్‌లైన్ పేమెంట్స్, ఆన్‌లైన్ ట్యాక్సెస్, థియేటర్స్ సమాచారం తెలుసకోవచ్చు. అత్యవసర పరిస్థితులలో అధికార యంత్రాంగాన్ని సంప్రదించే సదుపాయం కూడా ఇందులో ఉంటుండి.

గోల్డెన్ మైల్ ప్రాజెక్టులో భాగంగా బందరు రోడ్డులో పూర్తిస్థాయిలో వైఫై అందుబాటులోకి తెస్తారు. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పటికే దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఐజీఎం క్రీడా మైదానం, పీవీపీ మాల్ తదితర ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది.

ప్రజా రక్షణ ఏ విధంగా ఉండాలనే దాని పై ప్రణాళికలు రూపొందిస్తున్నారు

స్మారు ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత భాగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ట్రాఫిక్ జాం అయినా వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందుతుంది. దీంతో ట్రాఫిక్ మళ్లింపు చేపడతారు. ప్రస్తుతం యూటర్స్ల తీరు మార్చారు.

ఎంజీ రోడ్డులో కియోస్క్లు ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా బస్సు, రైల్వే, సినిమా టిక్కెటు నమోదు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఇవి ఇంకా ఏర్పాటు చేయలేదు

నగరంలో డిజిటల్ తరగతుల నిర్వహణకు నగరపాలక సంస్థలను ఎంపిక చేశారు. డిజిటల్ తరగతులను ఏర్పాటు చేస్తున్నారు.

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరానికి సంబంధించిన వివరాలతో సిటీ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఒక ఏజెన్సీకి అప్పగించారు.

ప్రత్యేకంగా డేటా కేంద్రాన్ని నిర్వహించాల్సి ఉంది. దీన్ని పీవీపీ మాల్ వద్ద ఏర్పాటు చేశారు.

 విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఆటోలో పర్యటిస్తూ దుర్గా ఫైఓవర్ నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. ఆయన నందిగామ నుంచి విజయవాడకు కారులో బయలుదేరారు. దుర్గగుడి వద్ద కారు దిగి, ఆటో ఎక్కి ఫైఓవర్ నిర్మాణ పనులను పరిశీలిస్తూ దుర్గా ఘాట్ హెడ్ వాటర్ వర్క్స్ వద్ద తదితర ప్రాంతాలలో చేపట్టిన నిర్మాణ పనుల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు.

అలాగే ఆ రూట్ లో నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందులను ఎంపి నాని గమనించారు. స్థానికంగా ఉన్న ప్రజలను అడిగి వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా దుర్గగుడి పై వంతెన పనులను పూర్తి చేసి ఇబ్బందులు తొలగిస్తామని చెప్పారు. ఎంపి నాని ఆటోలో ప్రయాణించడాన్ని చూసిన ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ పటిష్టమవుతోంది. విజయవాడలో ప్రయోగాత్మకంగా "మహిళా రక్షక్" బృందాలు ఏర్పాటయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతులను టార్గెట్ చేసి ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడేవారి భరతం పట్టనున్నాయి. ప్రేమ పేరుతో కళాశాల విద్యార్థినులను ఏమార్చి వలలో వేసుకుని లైంగిక చర్యలకు పాల్పడటం, చైన్ స్నాచింగ్‌లకు తెగబడటం, ప్రలోభాలకు గురైన యువతల నుంచి నగదు, బంగారం దోచుకోవడం వంటి ఆకృత్యాలకు పాల్పడే వారి పట్ల ఇక ‘మహిళా రక్షక్’ సింహస్వప్నం కానుంది.

విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌లోని అన్ని పోలీస్టేషన్ల నుంచి ఎంపిక చేసిన మహిళా కానిస్టేబుళ్ళతో మహిళా రక్షక్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో 50 మంది ఉంటారు. విజయవాడ నగరంలోని 18 మార్గాల్లో 64 ప్రదేశాలను పోలీసు అధికారులు గుర్తించారు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు, పార్కులు, బస్ స్టాప్‌లు ఇతర బహిరంగ ప్రదేశాలను గుర్తించారు. ఎంపిక చేసిన మహిళా కానిస్టేబుళ్ళు యూనిఫారంలో కాకుండా సివిల్ డ్రెస్‌లో ఆయా ప్రాంతాల్లో సంచరిస్తుంటారు.

ముఖ్యంగా కళాశాలలు, ఆర్‌టిసి బస్టాండు, సిటీ బస్టాడు, షేర్‌ ఆటోల్లో ప్రయాణించేటప్పుడు, జన సంచారం లేని ప్రాంతాలు, సినిమా హాళ్లు, మాల్స్‌, ఫుడ్‌కోర్టులు, మహిళలు ఒంటరిగా ఉన్న ప్రదేశాలు, బిఆర్‌టిఎస్‌ రోడ్డు, పాయకాపురం, పడవులరేవు సెంటరు, వీధి లైట్లు తక్కువగా ఉన్న ప్రదేశాలు, కార్యాలయాల నుండి మహిళలు తిరిగి ఇళ్లకు వెళ్లే సమయాల్లో వేధింపులకు గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ బృందాల్లో పనిచేసే మహిళా కానిసేబుల్లు బాడీ వార్న్‌, పెన్‌కెమెరా, చెంపపిన్ను కెమెరా వంటివి ధరించి బస్టాపుల్లో నిలబడి ఉంటారు. ఆకతాయిల కదలికలు, వారి ప్రవర్తన, వారి చూపులను బట్టి వారిని అదుపులోకి తీసుకుంటారు

ఎవరైనా మహిళలు, యువతుల పట్ల ఈవ్‌టీంగ్‌కు పాల్పడినా.. ప్రేమ పేరుతో ప్రలోభపరిచేందుకు ప్రయత్నించినా.. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అల్లరి చేస్తున్నా.. స్నాచింగ్‌లు, దాడులు వంటి కార్యకలాపాలకు ఉపక్రమించినా.. అక్కడే ఉండే మహిళా రక్షక్ కానిస్టేబుళ్ళు నిందితులను పట్టుకుని సమీపంలోని పోలీస్టేషన్‌లో అప్పగిస్తారు. పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచే ముందు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను పిలిపించి కౌనె్సలింగ్ నిర్వహిస్తారు. తొలిసారే కదా అని వదిలేది లేదు. అప్పటికప్పుడే వారిపై సస్పెక్ట్ షీటు తెరుస్తారు. ఇక వారి దైనందిన కార్యకలాపాలు, దిన చర్యలపై నిఘా ఉంచి పోలీసులు అనుసరిస్తూ ఉంటారు.

మొదటి సారి పట్టుబడిన నిందితుడు రెండోసారి కూడా దొరికితే.. వెంటనే వారిపై నిర్భయ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతారు. ఈవ్‌టీజర్లు, మహిళలు, యువతులను మోసం చేసే అపరిచితులకు కష్టకాలం మొదలవుతుంది. బెజవాడలో కళాశాలల వద్ద బీటు వేసి అమాయక విద్యార్థినులను వలలో వేసుకుని వారిని లైంగికంగా, బంగారం, నగదు పరంగా దోచుకుని వేధింపులకు పాల్పడిన ముఠా ఆకృత్యాలు ఇటీవల కాలంలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. విజయవాడ నగరంలో మహిళలకు అండదండగా నిలిచేందుకు మహిళా రక్షక్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్ తెలిపారు. భద్రతకు భరోసా కల్పిస్తూనే వెన్నంటి నిలిచే అభయహస్తంగా అభివర్ణించారు.

విజయవాడ కు చెందిన సుప్రసిద్ధ విద్యా సంస్థ 'మాంటిస్సోరీ మహిళా కళాశాల' కరస్పాండెంట్ డాక్టర్ వి.కోటేశ్వరమ్మ గారికి, 2017 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది.

మాంటిస్సోరినే ఇంటిపేరుగా మార్చుకున్న కోటేశ్వరమ్మ ఎన్నో విద్యాసంస్థలు స్థాపించి, మహిళా విద్య కోసం ఎంతో కృషిచేశారు. ఆమెను అందరూ ఆదర్శ మహిళ కోటేశ్వరమ్మ అని పిలుచుకుంటారు. ప్రతికూల వాతావరణంలో పాఠశాలను ప్రారంభించి, ఎందరో మహిళలకు దర్శంగా నిలిచారు.

ఎన్నో కష్టాలు పడి విద్యా సంస్థలను నెలకొల్పి, ఆడపిల్లల చదువుకోసం అవిరళ కృషి చేసిన కోటేశ్వరమ్మ గారిని కేంద్రం గుర్తిచటం, విజయవాడ కే కాదు, మన రాష్ట్రానికే గర్వ కారణం.

2015 లో కోటేశ్వరమ్మ గారి విశిష్ట సేవలకు, గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించారు.

2013లో మిస్ అమెరికా నీనా దావులూరి, కోటేశ్వరమ్మ గారి మనవరాలు (కూతురి కూతురు).

More Articles ...

Advertisements

Latest Articles

Most Read